అబిద్ హుస్సేన్
అబిద్ హుస్సేన్ | |
---|---|
జననం | |
మరణం | 2012 జూన్ 21 | (వయసు 85)
వృత్తి | ఆర్థికవేత్త, పౌర సేవకుడు, దౌత్యవేత్త |
జీవిత భాగస్వామి | త్రిలోక్ కర్కి |
పురస్కారాలు | పద్మభూషణ్ (1988) |
అబిద్ హుస్సేన్ (26 డిసెంబరు 1926 – 21 జూన్ 2012) తెలంగాణకు చెందిన భారతీయ ఆర్థికవేత్త, పౌర సేవకుడు, దౌత్యవేత్త. 1990 నుండి 1992 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో భారత రాయబారిగా, 1985 నుండి 1990 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేశాడు.
జననం
[మార్చు]అబిద్ 1926, డిసెంబరు 26న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. 1942లో నిజాం కళాశాలలో చదువుకున్నాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]అబిద్ కు "సైనో-ఇండియన్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్" (1977) రచయిత్రి త్రిలోక్ కర్కితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు: సుహైల్ హసన్, విశాఖ హుస్సేన్, రానా హసన్. అబిద్ సోదరుడు నటుడు, మిమిక్రీ కళాకారుడు ఇర్షాద్ పంజాతన్, జర్మన్ చలనచిత్రం డెర్ షుహ్ డెస్ మనిటులో నటించాడు.
వృత్తిజీవితం
[మార్చు]అబిద్ 1990 నుండి 1992 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు భారతదేశ దౌత్యవేత్తగా పనిచేశాడు.[2] ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యునిగా వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 1985 నుండి 1990 వరకు భారతదేశం ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా కూడా ఉన్నాడు.[3] యుఎస్‌లో భారత రాయబారిగా, అనేక మంది ప్రముఖ ముస్లిం-భారత నాయకులలో ఒకరిగా ఉన్నాడు.
అబిద్ ను 1988లో పద్మభూషణ్‌తో సత్కరించారు. 1980ల నుండి భారతదేశ ఆర్థిక, వాణిజ్య సంస్కరణల్లో ముందంజలో ఉన్నాడు.[4] వాణిజ్య విధాన సంస్కరణలకై భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు ముఖ్యమైన కమిటీలకు అధ్యక్షత వహించాడు; ప్రాజెక్ట్ ఎగుమతులు; సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం సిఎస్ఐఆర్ రివ్యూ కమిటీ; భారత ప్రభుత్వ టెక్స్‌టైల్ పాలసీ; క్యాపిటల్ మార్కెట్ అభివృద్ధి; చిన్న తరహా పరిశ్రమ. వీటిలో, వాణిజ్య విధాన సంస్కరణపై అబిద్ హుస్సేన్ కమిటీ నివేదిక, చిన్న తరహా పరిశ్రమలపై అబిద్ హుస్సేన్ కమిటీ నివేదిక భారతదేశ ఆర్థిక సంస్కరణల్లో మైలురాళ్లుగా పరిగణించబడ్డాయి.
పౌర సమాజంలో చురుకైన సభ్యుడు, ప్రపంచీకరణ, ఇంటర్నెట్ సెన్సార్‌షిప్, లింగ సమస్యలు, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, సాంస్కృతిక సాపేక్షవాదంతో సహా అనేక రకాల సమస్యలపై సమకాలీన చర్చలకు సహకరించాడు.[5][6][7][8][9][10]
అవార్డులు
[మార్చు]హుస్సేన్ అందించిన విశేష సేవలకుగాను 1988లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించారు.[11]
మరణం
[మార్చు]అబిద్ 2012, జూన్ 21న లండన్ లో గుండెపోటు కారణంగా మరణించాడు.[12]
మూలాలు
[మార్చు]- ↑ "Peers lavish praise on Abid Hussain". The Hindu. 9 July 2012.
- ↑ "Ambassadors of India to the United States". Indian Embassy. Retrieved 22 June 2012.
- ↑ "7th Five Year Plan". Government of India. Retrieved 22 June 2012.
- ↑ "Padma Bhushan Awardees". Government of India. Archived from the original on 18 December 2012. Retrieved 22 June 2012.
- ↑ "A Conversation with the Special Rapporteur on freedom of opinion and expression, September 1999". Archived from the original on 2007-09-27. Retrieved 2021-12-30.
- ↑ Abid Hussain Archived 31 ఆగస్టు 2009 at the Wayback Machine ICEC.
- ↑ Globalisation unstoppable: Abid Hussain By Our Special Correspondent, The Hindu, 28 January 2005.
- ↑ India and US should clear the air through talks, says Abid Hussain Rediff.com, 4 July 1998.
- ↑ `Time to assess globalisation dispassionately' The Hindu, Business Line, 23 December 2002.
- ↑ Libya Denies India Atom Link The New York Times, 11 October 1991."Dr. Abid Hussain, India's Ambassador to the United States, had .."
- ↑ "Abid Hussain passes away". The Hindu. 21 June 2012.
- ↑ "Abid Hussain, former Indian ambassador to US, dies in London". The Times of India. 21 June 2012.
బయటి లింకులు
[మార్చు]- "Breaking all barriers". 2013-01-25. Archived from the original on 25 January 2013. Retrieved 5 August 2010.