అరికెల నర్సారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరికెల నర్సారెడ్డి

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2016
నియోజకవర్గం నిజామాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 1965
నిజామాబాదు, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ,భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు గంగారాం రెడ్డి, గంగమ్మ
జీవిత భాగస్వామి గంగాదేవి
వృత్తి రాజకీయ నాయకుడు

అరికెల నర్సారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో తెలుగుదేశం పార్టీ తరపున శాసనమండలి సభ్యుడిగా పని చేశాడు. [1]

రాజకీయ జీవితం[మార్చు]

అరికెల నర్సారెడ్డి తెలుగుదేశం పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2009లో నిజామాబాదు పట్టణ నియోజకవర్గం నుండి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలంగాణ వాదానికి మద్దతుగా రాజీనామా చేయడంతో 2010లో జరిగిన ఉప ఎన్నికలలో నర్సారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] అరికెల నర్సారెడ్డి 2016లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు.

అరికెల నర్సారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[3][4] ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి 2023 జులై 2న ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 May 2015). "అలిగిన అరికెల నర్సారెడ్డి". Retrieved 13 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. CEO Telangana (2009). "Arikela Narsareddy Affidavit" (PDF). Archived from the original (PDF) on 13 June 2022. Retrieved 13 June 2022.
  3. Sakshi (30 March 2019). "టీఆర్‌ఎస్‌లో చేరిన అరికెల నర్సారెడ్డి". Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.
  4. 10TV (29 March 2019). "కాంగ్రెస్ పార్టీ కి మరో ఝలక్ : కారెక్కిన అరికెల నర్సారెడ్డి" (in telugu). Archived from the original on 13 June 2022. Retrieved 13 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. A. B. P. Desam (2 July 2023). "కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.