అవిభక్త కవలలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవిభక్త కవలలు
ప్రత్యేకతMedical genetics Edit this on Wikidata
"సియామీస్ ట్విన్స్"గా పరిచితులైన చాంగ్, ఎంగ్ బంకర్

అవిభక్త కవలలు అనగా గర్భంలో శరీరభాగాలు కలసిపోయి జన్మించిన ఏకరూప కవలలు.[1] ఈ అరుదైన జన్మము సుమారు 49,000 నుండి 1,89,000 మందిలో ఒకరికి సంభవించే అవకాశం ఉంది. ఈ సంఘటనలు అధికంగా ఆగ్నేయాసియా, ఆఫ్రికా, బ్రెజిల్లో ఎక్కువగా సంభవిస్తుంటాయి.[2] సుమారు జన్మించిన వారిలో సగం మంది జివించి ఉండి జంటలుగానే ఉండి తమ జీవితాలను కొనసాగిస్తుంటారు. ఈ పరిస్థితి ఆడపిల్లలకు తరచుగా వచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటనలు జరిగే నిష్పత్తి బాలికలలు 3:1 లో ఉంటుంది.[2]

ఈ అవిభక్త కవలల గూర్చి వివరించడానికి రెండు విరుద్ధ సిద్ధాంత మూలాలున్నాయి. పాత సిద్ధాంతం ప్రకారం ఫలదీకరణ చెందిన అండం పాక్షికంగా విడిపోయి విచ్ఛిన్నం చెందుట వలన ఈ విధమైన సంఘటనలు జరుగుతాయని తెలుపుతుంది. రెండవ సిద్ధాంతం సంలీన సిద్ధాంతం ఇది అందరిచే అమోదించబడింది. దీని ప్రకారం ఫలదీకరణం చెందిన అండం పూర్తిగా విడిపోతుంది కానీ మూల కణాలు (సజాతీయ కణాల కొరకు అన్వేషించేవి) అదే విధమైన మూల కణాలను రెండవ కవల నుండి కనుగొన్నప్పుడు ఆ కవలలు అతుక్కుపోతారు. ఈ కవలలకు ఉమ్మడిగా పరాయువు, మావి, అమ్నియోటిక్ శాక్ ఉంటాయి.[3]

అతి ప్రముఖమైన అవిభక్త కవలలు థాయిలాండ్ కు చెందిన చాంగ్, ఎంగ్ బంకర్ (1811–1874). వీరు థాయిలాండ్ లోని సిలాంలో జన్మించారు. వారు "పి.టి.బర్నమ్" సర్కస్ లో పనిచేస్తూండేవారు. అనేక సంవత్సరాలు ఆ సర్కస్ తో పాటు కొనసాగారు. వారు "సియామీస్ ట్విన్స్"గా సుపరిచితులైనారు. వారు మొండెం, మాంసం, మృదులాస్థి, కాలేయాలు కలసి జన్మించారు. ప్రస్తుతం అయితే వారిని విడదీయగలిగేవారు.[4] కానీ వారి గుర్తింపు కారణంగా "సియామీస్ ట్విన్స్" అనే పదం "అవిభక్త కవలలు" అనే దానికి పర్యాయపదమైనది.[5]

అవిభక్త కవలలలో రకాలు

[మార్చు]

అవిభక్త కవలలు సాధారణంగా వారి శరీర భాగాలి కలసే విధానం ఆధారంగా వర్గీకరింపబడ్డారు. సాధారణంగా:

  • థారకో-ఓంఫలోఫగస్ (28% మంది) :[6] రెండు శరీరాల ఛాతీ భాగం పైనుండి క్రింది వరకు కలుపబడతారు. వీరు సాధారణంగా గుండె, కాలేయం లేదా జీర్ణవ్యవస్థలో భాగాలను పంచుకోబడతారు.[7]
  • థోరాకోపగస్ (18.5%) :[6] రెండు శరీరాలు ఛాతీ ఎగువ భాగం నుండి బొడ్డు వరకు కలిసి ఉంటారు.[7]
  • ఓంఫలోపగస్ (10%) :[6] రెండు శరీరాలు పొత్తికడుపు వద్ద కలసి ఉంటాయి. వీరు కాలేయం, జీర్ణవ్యవస్థ, డయాఫ్రం, యితర భాగాలను కలసి పంచుకుంటారు.[7]
  • పారాసైటిక్ కవలలు (10%) :[6] ఇద్దరిలో ఒకరు చిన్నగా ఎదిగి ఉండి రెండవవారిపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు.
  • క్రానియోపాగస్ ట్విన్స్ (6%) :[6] వీరు కపాలం కలసి యుంటారు. కానీ వివిధ శరీరాలను కలసి ఉంటారు. వీరి కపాలాలు ఒక తల వెనుక భాగానికి రెండవ తల ముందు భాగానికి కలసి ఉంటాయి. ముఖాలు వేరుగా ఉంటాయి.[7]

విడదీత

[మార్చు]

అవిభక్త కవలలను విడదేసే శస్త్రచికిత్స వారిలో శరీర భాగాలు కలిసే విధానం బట్టి సాధారణం నుండి కఠినంగా ఉంటుంది. అనేక కేసులలో ప్రమాదకరంగా ప్రాణాపాయ స్థితికి చేరుకొనే అవకాశం ఎక్కువగా ఉంది. తల కలసి ఉన్న అనేక కేసులలో శస్త్ర చికిత్స ఫలితంగా ఒకరు మరణించవచ్చు లేదా ఇద్దరూ మరణించవచ్చు. అందువల్ల శస్త్ర చికిత్స నీతి ప్రకారం వారిని విడదీయకపోతే వారిద్దరూ బ్రతికే అవకాశం ఉన్నది అనేది వివాదస్పదము. నార్త్ వెస్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన అలిస్ డ్రెగర్ పరిశీల ప్రకారం సాధారణ కవలల కంటే అవిభక్త కవలల జీవితం నాణ్యతాలక్షణాలు తక్కువగా ఉంటాయి.[8] వీరులో ముఖ్యులు లోరీ, జార్జ్ ఛాపెల్, అబ్బే, బ్రిటానీ హెన్సిల్.

2000 సంవత్సరంలో నేపాల్ లోని ఖాట్మండులో జన్మిచిన "గంగా , జమునా శ్రేష్ట" లకు 2001 లో విడదీత శస్త్రచికిత్స విజయవంతమైనది. దీనికి గానూ 197 గంటల పాటు శ్రమపడవలసి వచ్చింది. ఈ శస్త్రచికిత్స సింగపూర్ లో జరిగింది.[9] ఈ శస్త్రచికిత్స ఫలితంగా గంగా మెదడు గాయపడింది, జమునా నడవలేకపోయింది. ఏడు సంవత్సరాల తరువాత 2009లో ఖాట్మండు హస్పటల్ లో గంగా శ్రేష్ట మరణించింది.[10]

అవిభక్త కవలల జాబితా

[మార్చు]

21 వ శతాబ్ద జననాలు

[మార్చు]
Conjoined twins lambs Former collection : Naturalization and collection Jules Berdoulat last quarter of the nineteenth century. Size : 66 x 37.5 x30 cm
  • కార్మెన్, లుపితా ఆండ్రాడే-సోలిస్, 2000లో మెక్సికోలో జననం. వారికి రెండు తలకు, నాలుగు చేతులు, రెండి కాళ్ళు ఉన్నాయి. విడదీత సంభవం కాలేదు.
  • కార్ల్, క్లారెన్స్ అగురీ, 2002 ఏప్రిల్ 21 న జన్మించారు. వారిని 2004 లో విడదీసారు.[11]
  • కేంద్ర, మాలియా హెర్రిన్, వారి 4 వ యేట 2006లో విడదీసారు.[12]
  • అనస్టాసియా, టాటిన డోగరు, 2004 జనవరి 13 లో ఇటలీ లోని రోమ్‌లో జన్మించారు. వారు "క్రానియోపాగస్ కవలలు".
  • లక్ష్మీ తత్మ (జననం 2005) భారతదేశంలోని బీహార్ లో జన్మించారు. వారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్ళు. వారికి పొత్తికడుపు వద్ద కలసి యుంది. కానీ ఒకరి యొక్క తల ఎదగలేదు.[13]
  • వాణీ-వీణా : వీరు వరంగల్ జిల్లాకు చెందిన అవిభక్త కవలలు తలభాగాలు అత్కుకొని పుట్టిన ఆడపిల్లలు. వారి కపాలాలు కలసి ఉన్నాయి. 2003 అక్టోబరు 15 న వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిషేట్టిగుడెం గ్రామానికి అవిభక్త కవలలుగా మురళిగౌడ్, నాగలక్ష్మి తల్లిదండ్రులకు గుంటూరు జిల్లా జనరల్ ఆసుపత్రిలో జననం.[14][15] 2006 నుండి నీలోపర్ ఆసుపత్రి లోనే ఉంటున్నారు.[16]
  • క్రిస్ట, టాటినా హోగన్, కెనడాకు చెందినవారు. వారి తలలు కలసి యున్నాయి. వారు 2006 అక్టోబరు 25 న జన్మించారు. వారి మెడడు లోని భాగాలు కలసి యున్న కారణంగా ఒకరి ఆలోచనలు మరియొకారికి తెలుస్తాయి.
  • అసా, ఎలీ హంబీ : రెండు తలలతో, ఒకే దేహం, ఒకే హృదయాన్ని పంచుకుని అవిభక్త కవలలు జూన్ 2014 లో అట్లాంటా నగరంలో నార్త్‌సైడ్ హస్పిటల్‌లో జన్మించారు.[17]

మూలాలు

[మార్చు]
  1. "Conjoined Twins Facts". University of Maryland Medical Center. Archived from the original on 6 జనవరి 2012. Retrieved 6 Jan 2012.
  2. 2.0 2.1 "Clinics - Importance of angiographic study in preoperative planning of conjoined twins: case report". Scielo.br. 1990-01-06. Retrieved 2014-08-03.
  3. Le, Tao; Bhushan, Vikas; Vasan, Neil (2010). First Aid for the USMLE Step 1: 2010 20th Anniversary Edition. USA: The McGraw-Hill Companies, Inc. p. 121. ISBN 978-0-07-163340-6.
  4. "h2g2 - Twins - A369434". Bbc.co.uk. Retrieved 2014-08-03.
  5. "Conjoined Twins". University of Maryland Medical Center. January 8, 2010. Archived from the original on 2013-06-03. Retrieved February 9, 2010.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 The embryology of conjoined twins, PMID 15278382 2008-06-21
  7. 7.0 7.1 7.2 7.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-15. Retrieved 2015-10-16.
  8. "One of Us: Conjoined Twins and the Future of Normal: Alice Domurat Dreger: 9780674018259: Amazon.com: Books". Amazon.com. Retrieved 2014-08-03.
  9. "In Conversation with Medicine's Miracle Workers -- Dr Chumpon Chan and Dr Keith Goh". Channel News Asia Singapore. April 19, 2001. Archived from the original on 2011-01-14. Retrieved March 27, 2010.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-05. Retrieved 2015-10-16.
  11. DA Staffenberg and JT Goodrich. Separation of craniopagus conjoined twins: an evolution in thought. Clin Plast Surg. 2005 Jan;32(1):25-34.
  12. "Herrintwins". Herrintwins. Archived from the original on 2014-06-06. Retrieved 2014-08-03.
  13. "Many-limbed India girl in surgery". BBC News. 2007-11-06.
  14. [1]
  15. [2]
  16. యూట్యూబ్ వీడియో
  17. "రెండు తలలు,ఒకే దేహంతో అవిభక్త కవలల జననం". Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-16.

ఇతర లింకులు

[మార్చు]