ఆపరేషన్ గోల్డ్‌ఫిష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆపరేషన్ గోల్డ్‌ఫిష్
ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ సినిమా పోస్టర్
దర్శకత్వంసాయికిరణ్ అడవి
రచనసాయికిరణ్ అడవి
నిర్మాతప్రతిభ అడవి
పద్మనాభరెడ్డి
ఆశిష్ రెడ్డి
కేశవ్ స్వరూప్
గ్యారీ బిహెచ్
సత్స్ డేగల
తారాగణంఆది
సాషా చత్రి
నిత్య నరేష్
కార్తీక్ రాజు
పార్వతీశం
కృష్ణుడు
అబ్బూరి రవి
మనోజ్ నందం
ఛాయాగ్రహణంజైపాల్ రెడ్డి
కూర్పుగ్యారీ బిహెచ్
సంగీతంశ్రీ చరణ్‌ పాకాల
నిర్మాణ
సంస్థ
వినాయకుడు టాకీస్
విడుదల తేదీ
18 అక్టోబరు 2019 (2019-10-18)
సినిమా నిడివి
127 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ 2019, అక్టోబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2] వినాయకుడు టాకీస్, యు&ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయికిరణ్ అడవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆది, సాషా చత్రి, నిత్య నరేష్, కార్తీక్ రాజు, పార్వతీశం, కృష్ణుడు, అబ్బూరి రవి, మనోజ్ నందం తదితరులు నటించగా, శ్రీచరణ్ సంగీతం అందించాడు.[3] 1980వ దశకంలో కాశ్మీరీ పండితులను లోయ నుండి సామూహిక బహిష్కరణ చేసిన నిజ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందింది.[4][5][6] జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో దానికి అనుగుణంగా స్క్రిప్ట్ మార్చబడి, కాశ్మీరీ పండితుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా కొత్త దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి.

కథా నేపథ్యం

[మార్చు]

ఇది కశ్మీరీ పండితుల ఊతకోతకు సంబంధించిన కథ. ఉగ్రవాద సంస్థకు ముఖ్య నాయకుడైన ఘాజీ బాబా (అబ్బూరి రవి) హైదరాబాదు వచ్చినపుడు కమాండో ఆపరేషన్‌లో అర్జున్‌ పండిట్‌ (ఆది) అరెస్టు చేస్తాడు. ఘాజీబాబాను విడిపించటానికి అతని ప్రధాన అనుచరుడైన ఫరూఖ్‌ (మనోజ్‌ నందన్‌) ఒక కేంద్రమంత్రి కూతురిని కిడ్నాప్‌ చేసి, ఘాజీబాబాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తాడు. ఆ విషయం ముందే తెలుసుకున్న అర్జున్‌ కేంద్రమంత్రి కుమార్తె కిడ్నాప్‌ కాకుండా రక్షిస్తుంటాడు. ఫరూఖ్‌ ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాడా? ఉగ్రవాదులకు, కమాండో ఆఫీసర్‌ అర్జున్‌ పండిట్‌కు మధ్య జరిగిన పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • రచన, దర్శకత్వం: సాయికిరణ్ అడవి
  • నిర్మాత: ప్రతిభ అడవి, పద్మనాభరెడ్డి, ఆశిష్ రెడ్డి, కేశవ్ స్వరూప్, గ్యారీ బిహెచ్, సత్స్ డేగల
  • సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల
  • ఛాయాగ్రహణం: జైపాల్ రెడ్డి
  • కూర్పు: గ్యారీ బిహెచ్
  • నిర్మాణ సంస్థ: వినాయకుడు టాకీస్

పాటలు

[మార్చు]
ఆపరేషన్ గోల్డ్‌ఫిష్
పాటలు by
శ్రీచరణ్ పాకాల
Released9 సెప్టెంబరు 2019
Recorded2019
Studioస్టూడియో 102, మెలోడీ స్టూడియో
Genreపాటలు
Labelఅదిత్యా మ్యూజిక్

ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి పాటలు రాసాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "పలుకే బంగారమా"  యామిని ఘంటసాల 2:33
2. "మహాత్మా"  ఎం.ఎం. కీరవాణి 2:39
3. "ఫ్రెండ్షిప్ పాట"  శ్రీచరణ్ పాకాల, నిత్య నరేష్ 2:41

ప్రచారం

[మార్చు]

2018, నవంబరు 7న ఈ చిత్ర ఫస్ట్ లుక్ అధికారిక పోస్టర్ ట్విట్టర్ ద్వారా విడుదలయింది.[7] 2019, మార్చి 4న మహేష్ బాబు చేతులమీదుగా అధికారిక టీజర్ విడుదల చేయబడింది.[8][9] 2019, ఆక్టోబరు 7న ఈ చిత్ర అధికారిక ట్రైలర్ అదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయింది.[10]

2019, ఆక్టోబరు 18న ఈ చిత్రం విడుదలయింది.[11]

మూలాలు

[మార్చు]
  1. "Operation Gold Fish Movie Review: A melodramatic tale of revenge!". timesofindia. 18 October 2019. Retrieved 15 January 2020.
  2. "Operation Goldfish trailer: Aadi Sai Kumar plays an NSG commando in this patriotic thriller". The Times of India. 7 October 2019.
  3. 3.0 3.1 ఈనాడు, సినిమా (18 October 2019). "రివ్యూ: ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌". www.eenadu.net. Archived from the original on 18 October 2019. Retrieved 15 January 2020.
  4. "Operation Gold Fish, a film on Kashmiri Pandit exodus". The New Indian Express. Retrieved 15 January 2020.
  5. "Operation Gold Fish In Tollywood". The Hans India. 4 September 2018. Retrieved 15 January 2020.
  6. "Adivi Saikiran's 'Operation Gold Fish' adopts a new business model and writer Abburi Ravi plays antagonist". The Hindu. 4 September 2018. Retrieved 15 January 2020.
  7. Operation Gold Fish [@TheFilmOGF] (7 November 2018). "Here is the first look of @SaikiranAdivi's #OperationGoldFish introducing #AadiSaiKumar as NSG Commando ARJUN PANDIT. Best wishes to debutant #Airtel4G girl @RickshaRani, @nityanaresh @karthik17raju @nook_kerintha @abburiravi @iamkrishnudu & the team. Happy Diwali! #OgfFirstLook t.co/2YYviWQ4ul" (Tweet). Retrieved 15 January 2020 – via Twitter. Invalid |number= parameter (help)
  8. "Operation Gold Fish Official Teaser|Aadi, Sasha Chettri, Nitya Naresh|Adivi Sai Kiran". Aditya Music on YouTube. Retrieved 15 January 2020.
  9. Aditya Music [@adityamusic] (4 March 2019). "#OperationGoldFish teaser has been launched by Super Star #MaheshBabu & wished the team a huge success. Teaser @10AM Stay Tuned! Here're few glimpses from the launch A @SaikiranAdivi Film #Aadi @RickshaRani @nityanaresh @abburiravi @adityamusic #SuperStarWithOGF #OGF t.co/RfNU8sEfJQ" (Tweet). Retrieved 15 January 2020 – via Twitter. Invalid |number= parameter (help)
  10. "Operation Gold Fish Theatrical Trailer - Aadi, Sasha Chettri, Nitya Naresh - Adivi Sai Kiran". YouTube. Aditya Music. 7 October 2019. Retrieved 15 January 2020.
  11. "Operation Goldfish trailer looks promising". telugucinema.com. 7 October 2019. Archived from the original on 7 అక్టోబరు 2019. Retrieved 15 January 2020.

ఇతర లంకెలు

[మార్చు]