Jump to content

ఆరతి సాహా

వికీపీడియా నుండి
ఆరతి సాహా
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరుఆరతి గుప్తా నీ సాహా
జాతీయతభారతీయులు
జననంసెప్టెంబర్ 24, 1940
మరణంఆగష్టు 23, 1994
క్రీడ
క్రీడSwimming
1999లో పోస్టల్ స్టాంపుపై ఆరతి సాహా

ఆరతి గుప్తా నీ సాహా (సెప్టెంబర్ 24, 1940 - ఆగష్టు 23, 1994) ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. ఈమె జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళ.

జీవిత విశేషాలు

[మార్చు]
పద్మశ్రీ పురస్కారం

ఆమె తన నాల్గవ యేట నుండే ఈతను ప్రారంభించారు. ఆమె ప్రతిభను "సచిన్ నాగ్" అనే కోచ్ గుర్తించారు. 1945 నుండి 1951 వరకు ఆమె ఆలిండియా రికార్డు (1949) తో పాటు 22 పోటీలలో పాల్గొన్నది. ఆమె ఇంగ్లీషు ఛానెల్ ఇదిన భారతీయ స్విమ్మర్ అయిన మిహిర్ సేన్ కు ప్రభావితురాలైంది. సెప్టెంబర్ 29 1959 న ఇంగ్లీషు ఛానెల్ ఈది భారతదేశంలో ప్రథమ మహిళగా నిలిచింది.[1] ఆమె ఫ్రాన్స్ లోని "కేప్ గ్రిస్ సెజ్" నుండి ఇంగ్లాండు లోని "సాండ్‌గేట్" వరకు ఈది రికార్డు సృష్టించింది. ఈ దూరాన్ని ఆమె 16 గంటల 20 నిమిషాలలో పూర్తిచేయగలిగింది. ఆమె "సాండ్‌గేట్" వద్ద భారతీయ పతాకాన్ని నిలిపింది. ఆమెకు 1960 లో పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆమె ఆగష్టు 23 1994 న మరణించింది. 1998 లో వివిధ రంగాలలో భారతీయ మహిళల కృషికి గుర్తింపుగా, ఆర్తీ గుప్తాకు కూడా పోస్టల్ స్టాంపును భారత ప్రభుత్వం విడుదలచేసింది.

మూలాలు

[మార్చు]
  1. "First Indian Woman to Swim Across English Channel".

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఆరతి_సాహా&oldid=4301590" నుండి వెలికితీశారు