ఆస్మాన్ ఘర్ ప్యాలెస్
ఆస్మాన్ గఢ్ ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
నిర్మాణ శైలి | గోతిక్ రివైవల్ నిర్మాణం |
ప్రదేశం | మలక్‌పేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
పూర్తి చేయబడినది | 1885 |
ఆస్మాన్ గఢ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట లో ఉన్న ప్యాలెస్. మధ్యయుగపు యురోపియన్ కోట ఆకృతిలో ఉన్న ఈ భవనం చిన్న కొండ పైన నిర్మించబడింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ పురావస్తు శేషాలని ప్రదర్శించే మ్యూజియంగా ఉపయోగించబడుతుంది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
చరిత్ర
[మార్చు]ఆస్మాన్ అనగా ఆకాశం, గఢ్ అనగా ఇల్లు. ఆకాశపు ఇల్లు అనిపించేలా 1885లో కొండపైన ఈ భవనం నిర్మించబడింది. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు. పైగా కుటుంబానికి చెందిన ఆస్మాన్ జా ఆకాశంకి దగ్గరగా ఉన్న ఇంటిని నిర్మించాలన్న తన కలను నెరవేర్చుకోవడంకోసం, విశ్రాంతి తీసుకోవడంకోసం కొండపైన ఈ భవనం నిర్మించాడు.[2]
ఆస్మాన్ గఢ్ చుట్టుప్రక్కల ఉన్న అడవి ప్రాంతానికి వేటకు వచ్చిన నిజాం ఈ ప్యాలెస్ ను చూసి ముచ్చటపడి వీలున్నప్పుడల్లా సందర్శించేవాడు. దాంతో సర్ అస్మాన్ జా ఆస్మాన్ గఢ్ ప్యాలెస్ ను నిజాంకు ఇచ్చాడు. కొంతకాలం ఉపయోగించకుండా ఉన్న ఈ ప్యాలెస్ పురావస్తు మ్యూజియంగా మార్చబడింది.
నిర్మాణం
[మార్చు]యురోపియన్ కోట యొక్క ఆకృతిలో ఉన్న ఈ ప్యాలస్ గోతిక్ శిల్ప శైలిలో నిర్మించబడింది.
మూలాలు
[మార్చు]- ↑ The Hindu, Hyderabad (21 January 2004). "Castle of dreams". K. Venkateshwarlu. Retrieved 30 December 2018.
- ↑ ఆస్మాన్ గఢ్ ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 85