ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ సి ఎల్ ) (The Indian Hotels Company Limited (IHCL) అనేది భారతీయ ఆతిథ్య సంస్థ. హోటళ్లు, రిసార్ట్స్, జంగిల్ సఫారీలు, ప్యాలెస్లు, స్పాలు, జమ్ షెడ్జీ టాటా స్థాపించిన ఈ సంస్థ 1903 సంవత్సరంలో బొంబాయిలో తాజ్ మహల్ ప్యాలెస్ అనే తన మొదటి హోటల్ ను ప్రారంభించింది. 4 ఖండాలు, 12 దేశాలు, 80కి పైగా ప్రదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న 40 హోటళ్లతో సహా 196 హోటళ్ల పోర్ట్ ఫోలియోను ఐహెచ్ సిఎల్ కలిగి ఉంది.

ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL) మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం దక్షిణాసియాలో అతిపెద్ద హాస్పిటాలిటీ కంపెనీ. ప్రధానంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (NSE) లలో జాబితాలలో ఉన్నది[1].

ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్
రకంపబ్లిక్
బి.ఎస్.ఇ: 500850
NSEINDHOTEL
ISININE053A01029
పరిశ్రమహోటల్
స్థాపన1899; 125 సంవత్సరాల క్రితం (1899)
స్థాపకుడుజంషెట్జీ టాటా
ప్రధాన కార్యాలయంఎక్స్ ప్రెస్ టవర్స్, నారిమన్ పాయింట్, ,
భారతదేశం
కీలక వ్యక్తులు
ఉత్పత్తులుహోటల్స్, రిసార్ట్స్
రెవెన్యూమూస:Up3,088.87 crore (US$390 million) (FY2022)[2]
మూస:Up28.2 crore (US$3.5 million)(FY2022)[2]
మూస:Up−247.72 crore (US$−31 million) (FY2022)[2]
ఉద్యోగుల సంఖ్య
33,797 (2020)[2]
వెబ్‌సైట్www.ihcltata.com Edit this on Wikidata

చరిత్ర

[మార్చు]

ఇండియన్ హోటల్స్ కంపెనీ అనేది భారతదేశపు అతి పెద్ద హోటల్. "తాజ్ హోటల్స్, ప్యాలెస్ లు, రిసార్ట్స్" అనే పేరు (బ్రాండ్ ) పై హోటల్స్ , ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో వారి సంస్థలకు ప్రసిద్ధి కలిగి ఉన్న లగ్జరీ హోటళ్ళు, రిసార్ట్ లలోఒకటి గా ఉన్నది.

భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటైన ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ నుండి వచ్చిన ఇండియన్ హోటల్స్ కంపెనీకి 76 హోటళ్ళు, 7 ప్యాలెస్ లు, 12 రిసార్టులు, స్పాలు, 6 ప్రైవేట్ ద్వీపాలు 5 ఖండాలలో 12 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇండియన్ హోటల్స్ కంపెనీ భారతదేశంతో పాటు, అమెరికా,బ్రిటన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, భూటాన్, మలేషియా, మారిషస్, మాల్దీవులు, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి ఇతర దేశాలలో ఉన్నది. 903 డిసెంబర్ 16న తాజ్ గ్రూప్ స్థాపకుడు జంషెట్జీ నుస్సర్వాన్జీ టాటా ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్ ను ప్రారంభించింది. ముంబైలోని వాట్సన్ హోటల్ లో అతనికి ప్రవేశం నిరాకరించబడిన జాతి వివక్ష ఒక సంఘటన, దానితో జంషెట్జీ నుస్సర్వాన్జీ టాటా హోటల్ ను తెరవాలని నిశ్చయించుకున్నాడు. తన హోటల్ నిర్మాణంలో ఉపయోగించడానికి ఫర్నిచర్, ఇంటీరియర్,కళాఖండాలు దిగుమతి చేసుకోవడానికి లండన్, డిసెల్డార్ఫ్, బెర్లిన్, పారిస్ లకు వెళ్ళి, వాటితో , ముంబై లో తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్ హోటల్ నిర్మాణం చేసాడు.[3]

భాగస్వామ్యం

[మార్చు]

ఇండియన్ హోటల్స్ కంపెనీ వ్యాపారంలో వ్యూహాత్మక అభివృద్ధిలో తన వ్యాపారాన్నిపెంచుకోవడానికి భాగస్వామ్యాలతో నిరంతరంగా పని చేస్తున్నది. 2004 సంవత్సరంలో, ఇండియన్ హోటల్స్ కంపెనీ వారి హోటల్ గ్రూప్ రాఫిల్స్ ఇంటర్నేషనల్ తో ఒక వ్యూహాత్మక మార్కెటింగ్ కూటమి చేసింది. ఇది రెండు బ్రాండ్లతో రాఫెల్స్ & స్విస్టెల్ కింద మార్కెట్ చేస్తుంది. 2006లో, ఇండియన్ హోటల్స్ కంపెనీ కొరియన్ కంపెనీ షిల్లా హోటల్స్ & రిసార్ట్స్ తో,సిల్వర్ సీ క్రూయిజెస్, ఒకురా హోటల్స్ & రిసార్ట్స్ తో మార్కెటింగ్ పొత్తులను కలిగి ఉంది.[3]

అవార్డులు

[మార్చు]

ఇండియన్ హోటల్స్ కంపెనీ పొందిన అవార్డులు ఈ విధంగా ఉన్నాయి.[4]

  • తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్స్ 2008 బిజినెస్ ట్రావెలర్ అవార్డ్స్ లో బ్రిటన్ ప్రజలచే భారతదేశంలో అత్యుత్తమ బిజినెస్ హోటల్ చైన్ అవార్డును గెలుచుకుంది.
  • తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్ లు ఆసియా పసిఫిక్ లో అగ్రస్థానంలో నిలిచాయి. హోటల్ సెగ్మెంట్ లో టాప్ 1,000 బ్రాండ్స్ సర్వేలో టాప్ 1,000 బ్రాండ్స్ సర్వేలో చోటు దక్కించుకుంది.
  • హోటల్స్ విభాగంలో ఐహెచ్ సిఎల్ డన్ & బ్రాడ్ స్ట్రీట్ -- అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్పొరేట్ అవార్డ్స్ 2007 -- ను పొందింది. అందుకుంది.
  • ఇండియన్ హోటల్స్ కంపెనీ తన వ్యాపార ?óôé1/4ÔÇ£ కస్టమర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ ప్రాక్టీస్ 2007 దానిలో అవయా గ్లోబల్ కనెక్ట్ కస్టమర్ రెస్పాన్సిబిలిటీ అవార్డ్స్ 2007ను గెలుచుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "The Indian Hotels Company | Business | Tata group". www.tata.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-19.
  2. 2.0 2.1 2.2 2.3 "The Indian Hotels CompanyLtd. Financial Statements". moneycontrol.com.
  3. 3.0 3.1 "Indian Hotels Company". business.mapsofindia.com. Retrieved 2022-07-19.
  4. "Indian Hotel: Reports, Company History, Directors Report, Chairman's Speech, Auditors Report of Indian Hotel - NDTV". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-19.