ఇస్లామాబాద్ యునైటెడ్ అనేది పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పోటీపడే ఒక పాకిస్థానీ ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. పాకిస్తాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్‌లో ఈ జట్టు కార్యాలయం ఉంది. మొదటి సీజన్‌లో పోటీ పడేందుకు 2015లో ఈ జట్టు ఏర్పాటు చేయబడింది.[1]
ఫ్రాంచైజీని లియోనిన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ దాని స్పోర్ట్స్ ఎంటిటీ లియోనిన్ గ్లోబల్ స్పోర్ట్స్ ద్వారా కలిగి ఉంది. అమ్నా నఖ్వీ, అలీ నఖ్వీ యాజమాన్యంలో ఉంది.[2] ఫ్రాంచైజీ ప్రారంభ ఫైనల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌ను ఓడించి మొదటి పిఎస్ఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. వారు సిఎస్ఎల్ మూడవ సీజన్‌లో తమ రెండవ టైటిల్‌ను ఫైనల్‌లో మూడు వికెట్ల తేడాతో పెషావర్ జల్మీని ఓడించడం ద్వారా గెలుచుకున్నారు. ప్రస్తుతం రెండు టైటిల్ విజయాలతో పోటీ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా ఉన్నారు.
జట్టు హోమ్-గ్రౌండ్ రావల్పిండి క్రికెట్ స్టేడియం. అజార్ మహమూద్ స్థానంలో వచ్చిన మైక్ హెస్సన్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. షాదాబ్ ఖాన్ పిఎస్ఎల్ 5 కి ముందు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు, దానితో పిఎస్ఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ అయ్యాడు.[3] జట్టు బ్యాటింగ్ కోచ్ యాష్లే రైట్, బౌలింగ్ కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ఉన్నారు.
జట్టులో అత్యధిక పరుగుల స్కోరర్ ల్యూక్ రోంచి,[4] షాదాబ్ ఖాన్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు.[5]