Coordinates: 17°06′22″N 79°41′58″E / 17.106011°N 79.699482°E / 17.106011; 79.699482

ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం is located in Telangana
ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
తెలంగాణలో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°06′22″N 79°41′58″E / 17.106011°N 79.699482°E / 17.106011; 79.699482
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసూర్యాపేట
స్థలంఉండ్రుగొండ, చివ్వేంల మండలం
సంస్కృతి
దైవంలక్ష్మీనరసింహస్వామి
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ8-9 శతాబ్దం

ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం, ఉండ్రుగొండ గ్రామంలోని కొండలపై ఉన్న లక్ష్మీనరసింహస్వామి దేవాలయం.[1] ఇక్కడి ప్రాంతాన్ని గిరిదుర్గం అని కూడా పిలుస్తారు. ఇది శయన నరసింహస్వామి ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది సూర్యాపేట పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో, 65వ జాతీయ రహదారి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రదేశం[మార్చు]

ఈ ప్రాంతంలో 1,372 ఎకరాల్లో ఎనమిది కొండలు విస్తరించి ఉన్నాయి. ఈ ఎనమిది కొండలను కలుపుతూ దుర్గం ప్రాకారాలు నిర్మించబడ్డాయి. ఇక్కడ దాదాపు 23 దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఈ దేవాలయం ఒకటి.[2]

దేవాలయ విశేషాలు[మార్చు]

సా.శ. 8-9 శతాబ్దం మధ్యకాలంలో రేచర్ల పద్మనాయకుల కాలంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీనరసింహస్వామి 1200 ఏళ్ళకిందటే పూజలు అందుకున్నాడని చరిత్ర చెబుతోంది. విష్ణుకుండినుల చేత ఈ దేవాలయం నిర్మించబడింది. నరసింహావతారం ముగిసే సమయంలో ఆ స్వామి ఇక్కడి వెలిసాడని, కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి చేత పూజలు కూడా అందికున్నాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయంలో భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని వర్ణించే చిత్రాలు, బొమ్మలు ఉన్నాయి. దేవాలయ ముందుభాగంలోని కోనేరులో, మెడ విరిగినట్టుగా కనపడే భారీ మొసలి ఆకారంలోని రాయి ఉంది.

స్వామి రక్షణగా ఏడు పడగల ఆదిశేషురూపాలు, క్షేత్ర పాలకులుగా ఆంజనేయ స్వామి, హరిహరుల సమన్వయాన్ని సూచిస్తూ వినాయకుడు, కాలభైరవుల రూపాలు ఇక్కడ వెలిసాయి. రాక్షస శిలలను పగలగొడుతున్న అడవి జువ్వి వృక్ష రాజము ఇక్కడి ప్రత్యేకత.

పూజలు, ఉత్సవాలు[మార్చు]

ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు (శనిఆదివారాలు, పండుగ-సెలవు రోజులలో సాయంత్రం 4 వరకు) ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. ప్రతినెల స్వాతి నక్షత్రం రోజున విశేష అభిషేకం జరుగుతుంది.

  • కార్తీక పౌర్ణమి: ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పూజలతో కార్తీక దీపరాధనలతో భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు.
  • హనుమాన్ జయంతి: ప్రతియేటా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ దేవాలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, లక్ష్మీనరసింహ స్వామి వరమాల, మూల మంత్ర హోమం నిర్వహించబడుతాయి.[3]

మూలాలు[మార్చు]

  1. "ఎనిమిది కొండల..ఉండ్రుగొండ!". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-22. Archived from the original on 2022-01-24. Retrieved 2022-01-24.
  2. "ఉండ్రుగొండ గిరులు.. పర్యాటక సిరులు". ETV Bharat News. Archived from the original on 2022-01-24. Retrieved 2022-01-24.
  3. "నిరాడంబరంగా హనుమజ్జయంతి". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-04. Archived from the original on 2022-01-24. Retrieved 2022-01-24.