అక్షాంశ రేఖాంశాలు: 17°17′37″N 78°27′25″E / 17.2936°N 78.4570°E / 17.2936; 78.4570

ఉందా సాగర్ (చెరువు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉందా సాగర్
ఉందా సాగర్ is located in India
ఉందా సాగర్
ఉందా సాగర్
ప్రదేశంహైదరాబాదు, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు17°17′37″N 78°27′25″E / 17.2936°N 78.4570°E / 17.2936; 78.4570

ఉందా సాగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీ మధ్యలో ఉన్న చెరువు. ఇది, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాదు సమీపంలో ఉన్నా ఉందానగర్ ఉంది. హైదరాబాదులోని నాలుగు చెరువుల్లో (షామీర్‌పేట్ చెరువు, మీర్ ఆలం చెరువు, హుస్సేన్ సాగర్, ఉందా సాగర్) ఒకటైన ఈ చెరువు, 275 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

హైదరాబాదు నిజాం కాలంలో నిర్మించబడిన ఈ చెరువు, 1954లో హైదరాబాదు నగరానికి 8 మైళ్ళ దూరంలో ఉన్నట్లు తెలుపబడింది.[2] అయితే, హైదరాబాదు నగర పట్టణీకరణ కారణంగా పాతబస్తీలోని భూమి కనుమరుగైపోవడంతోపాటు ఈ చెరువు విస్తీర్ణం కూడా క్రమక్రమంగా తగ్గుతోంది.[3]

సర్వే ఆఫ్ ఇండియా తీసిన పటాలు, ఉపగ్రహ చిత్రాల ప్రకారం, ఉంది సాగర్ చెరువు, సుమారు 30 కాలువలతో పహాడి షరీఫ్ నుండి తలబ్ కట్ట వరకు విస్తరించి ఉంది.

ప్రమాదాలు

[మార్చు]

చెరువులోని కొన్ని భాగాలలో చిత్తడినేలలు, నీటి మొక్కలు, రాళ్ళు ఉండడంతో ఇందులోకి ఈతకోసం దిగిన వాళ్ళకు ప్రమదాలు జరుగుతున్నాయి. అనుభవజ్ఞులైన ఈతగాళ్ళు కూడా చెరువు లోపల కాళ్ళు చిక్కుకుంటే తప్పించుకోలేరు. ఈత రానివాళ్ళు ఈ చెరువులో మునిగి చనిపోతున్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. K. Ramamohan Reddy; B. Venkateswara Rao; C. Sarala (20 October 2014). HYDROLOGY AND WATERSHED MANAGEMENT: Ecosystem Resilience-Rural and Urban Water Requirements. Allied Publishers. pp. 236–. ISBN 978-81-8424-952-1.
  2. The Modern Review. Prabasi Press Private, Limited. 1954.
  3. Nov 21, Rohit PS / TNN /; 2012; Ist, 04:11. "Umda Sagar basin drying up | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2021-03-08. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: url-status (link)
  4. Rahoof, K. K. Abdul (2016-05-09). "Hyderabad: Still no warnings at deadly Umdasagar lake". Deccan Chronicle. Retrieved 2021-03-08.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]