ఏనుగు (2022 సినిమా)
ఏనుగు | |
---|---|
దర్శకత్వం | హరి |
రచన | హరి |
నిర్మాత | సీహెచ్ సతీష్ కుమార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎస్. గోపినాథ్ |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థ | విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 1 జూలై 2022(India) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఏనుగు 2022లో విడుదలైన తెలుగు సినిమా. హరి ఈ దర్శకత్వంలో తమిళంలో ‘యానై’ పేరుతో విడుదలైన ఈ సినిమాను శ్రీమతి జగన్మోహినీ సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీహెచ్ సతీష్ కుమార్ తెలుగులోకి అనువదించి విడుదల చేశాడు. అరుణ్ విజయ్, ప్రియ భవాని శంకర్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 1న విడుదలైంది.[1]
కథ
[మార్చు]కాకినాడ ప్రాంతంలో సముద్రం, పీవీఆర్ అనే రెండు వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా శతృత్వం ఉంటుంది. పీవీఆర్ కుటుంబంలో రవి (అరుణ్ విజయ్)కు ఆయన సవతి తల్లి కుమారులు (సముద్రఖని, సంజీవ్, బోస్ వెంకట్) అండగా ఉంటారు. ఈ కుటుంబానికి సముద్రం ఫ్యామిలీకి చెందిన లింగం (రామచంద్రరాజు) తో వైరం ఉంటుంది. ఈ క్రమంలో రవి అన్న కూతురు వేరే మతానికి చెందిన యువకుడితో లేచిపోతుంది. ఈ నేపథ్యంలో హీరో రవి మరో మతానికి చెందిన యువతితో ప్రేమలో పడతాడు. ప్రేమించిన యువకుడితో అన్న కూతురు లేచిపోవడం వల్ల హీరో కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదురుకుంది ? తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- అరుణ్ విజయ్[3]
- ప్రియ భవాని శంకర్
- సముద్రఖని
- కేజీఎఫ్ రామచంద్రరాజు
- రాధిక శరత్ కుమార్
- యోగి బాబు
- అమ్ము అభిరామి
- బోస్ వెంకట్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్
- నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి
- సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
- సినిమాటోగ్రఫీ: గోపీనాథ్
- ఎడిటర్: ఆంథోని
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (26 June 2022). "వచ్చేస్తోంది 'ఏనుగు'". Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
- ↑ Sakshi (2 July 2022). "'ఏనుగు' మూవీ రివ్యూ". Retrieved 6 July 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ TV9 Telugu (11 June 2022). "మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న అరుణ్ విజయ్.. నయా మూవీకి ఏనుగు అనే టైటిల్". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)