ఏనుగు సంతోష్ రెడ్డి

వికీపీడియా నుండి
(ఏనుగు సంతోష్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఏనుగు సంతోష్‌ రెడ్డి
ఏనుగు సంతోష్ రెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 ఫిబ్రవరి 2022
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

న్యాయశాఖ కార్యదర్శి
పదవీ కాలం
2019 నవంబరు – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జి
పదవీ కాలం
2014 జూన్‌ 2 – 2017 జూన్‌

వ్యక్తిగత వివరాలు

పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఏనుగు సంతోష్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి. 2022, ఫిబ్రవరి 3న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[1][2]

జననం, విద్య

[మార్చు]

సంతోష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, జోగిన్‌పల్లి గ్రామంలో జన్మించాడు.[3] తండ్రి ఏనుగు నారాయణరెడ్డి 1962 అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] తల్లి లింగమ్మ గృహిణి. జగిత్యాలలోని ఎస్. కె.ఎన్.ఆర్ కళాశాలలో డిగ్రీ, అనంతపూర్ లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి న్యాయవిద్యలో డిగ్రీ, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ డిగ్రీ పూర్తిచేశాడు.[5]

వృత్తిరంగం

[మార్చు]

సంతోష్ రెడ్డి 1985లో కరీంనగర్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 1991లో డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌గా ఎంపికై, 2004లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2010లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందాడు. ఆ తరువాత సిద్ధిపేట జిల్లా అదనపు జడ్జిగా కొంతకాలం పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో న్యాయశాఖ కార్యదర్శి నియమించబడ్డాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ వరకు రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పనిచేశాడు. 2019 నవంబరులో రెండోసారి న్యాయశాఖ కార్యదర్శిగా నియమించబడ్డాడు.[6] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  2. Vamshidhara, Vujjini (2022-02-02). "SC Collegium okays 7 advocates. 5 judicial officers as Telangana HC judges". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  3. "Telangana High Court: హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు". EENADU. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
  4. "ఆ 'సైకిల్' స్వతంత్రులదే..!". Sakshi. 2014-04-24. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  5. M, Mahesh (2022-02-03). "హర్షం వ్యక్తం చేస్తున్న జోగిన్‌పల్లి గ్రామస్తులు". Dishadaily (దిశ): Latest Telugu News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  6. "హైకోర్టుకు 12 మంది జడ్జీలు!". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  7. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.