Jump to content

కడెం డ్యామ్

వికీపీడియా నుండి
కడెం డ్యామ్
కడెం డ్యామ్
కడెం డ్యామ్ is located in Telangana
కడెం డ్యామ్
Telangana లో కడెం డ్యామ్ స్థానం
కడెం డ్యామ్ is located in India
కడెం డ్యామ్
కడెం డ్యామ్ (India)
అధికార నామంకడెం డ్యామ్
ప్రదేశంకడెం, నిర్మల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
ప్రారంభ తేదీ1958
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుకడెం నది
Height31 మీటర్లు (102 అ.) from river level
పొడవు2,051 మీటర్లు (6,729 అ.)
జలాశయం
సృష్టించేదికడెం రిజర్వాయర్
మొత్తం సామర్థ్యం215,800,000 మీ3 (174,952 acre⋅ft)
క్రియాశీల సామర్థ్యం137,100,000 మీ3 (111,149 acre⋅ft)
పరీవాహక ప్రాంతం2,590 చదరపు కిలోమీటర్లు (1,000 చ. మై.)
ఉపరితల వైశాల్యం24.7 కి.మీ2 (9.5 చ. మై.)

కడెం డ్యామ్ నిర్మల్ జిల్లాలో గోదావరి నది యొక్క ఉపనది అయిన కడెం నది గోదావరి నదిలో కలిసే ప్రదేశంలో ఉంది.[1] డ్యామ్ ప్రధాన ప్రయోజనం నిర్మల్ జిల్లాలోని 25000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరందించడం ఈ డ్యాం యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిని గోదావరి ఉత్తర కెనాల్ ప్రాజెక్ట్ గా కూడా పిలుస్తారు. దీనిని 1949, 1965 మధ్యకాలంలో నిర్మించారు.[2]

ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన వాతావరణంలో చూట్టూ పచ్చదనంతో నిండిఉన్న సుందరమైన గుట్టల మధ్యలో ఈ డ్యాం నిర్మించారు. సికింద్రాబాద్-మన్మాడ్ రైల్వే లైన్ మీదుగా వెళ్లే పర్యాటకులకు కడెం డ్యామ్ అందుబాటులో ఉంటుంది.

చరిత్ర ప్రకారం, మొదటగా దీనిని ఈ ప్రాంతంలో యాగాలు చేసిన కండవ రుషి పేరుతో పిలిచేవారు. ఆ తరువాత, ఈ ప్రాంత నాయకుడు కదం నారాయణరెడ్డికి నివాళిగా కదం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ (KNRP) గా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసింది.

ఎడమ, కుడి కాలువల ద్వారా అనేక మండలాలకు నీరును అందిస్తుంది. ఎడమ కాలువ ద్వారా పెద్ద బెల్లాల్, చిన్న బెల్లాల్, చిట్యాల్, కొండుకూర్, కన్నాపూర్, మోరిగూడెం, పాత కొండుకూర్, ఉప్పరగూడెం, చిన్నా శిబిరం, పెర్కపల్లి, కడెం మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది. కుడి కాలువ ద్వారా జన్నారం, దండేపల్లి, తాళ్లపల్లి, మ్యాదార్ పేట్, లక్సెట్టిపేట మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది.

ప్రస్తుతం ఈ డ్యామ్ 68000 హెక్టార్ల వ్యవసాయానికి సాగునీటి అవసరాలను తీరుస్తుంది. డ్యాం పక్కన పర్యాటకులకోసం అందమైన గార్డెన్ ఉంది. వర్షాకాల సమయంలో వచ్చే వరదలకు డ్యాం గేట్లనుండి నీటిని వదులుతారు. హైదరాబాదునుండి అదిలాబాద్ కి వెళ్లే దారిలో నిర్మల్ వద్ద ఈ డ్యామ్ ఉంది. ఈ డ్యాంకు ఆదిలాబాద్ సమీప రైల్వే స్టేషన్.

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
  2. తెలంగాణ టూరిజం వెబ్ సైట్. "Kadam Dam". www.telanganatourism.gov.in. Archived from the original on 10 October 2016. Retrieved 18 October 2016.