కుమరకోమ్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
కుమరకోమ్ | |
---|---|
town | |
దేశం | India |
రాష్ట్రం | కేరళ |
జిల్లా | Kottayam |
భాషలు | |
• అధికార | Malayalam,ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | KL-05 |
Nearest city | Kottayam |
కుమరకోం కేరళ రాష్ట్రంలోని ఒక అందమైన తీర పట్టణం.
వివరాలు
[మార్చు]కుమర్‌కోన్ వెంబనాడ్ చెరువు మీద ఉండే చిన్నచిన్న ద్వీపాల సమాహారం. ఇది కుట్టనాడ్ ప్రాంతంలో భాగం. ఇక్కడ ఉండే పక్షి సంరక్షణ కేంద్రం, 14 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. అనేక వలస పక్షులకు ఇది విడిది కేంద్రం, అదేవిధంగా పక్షి శాస్త్రవేత్తలకు ఇది స్వర్గంగా భాసిల్లుతుంది. తెల్లకొంగలు, డార్టర్లు, నారాయణ పక్షులు, బాతులు, వాటర్‌ఫోలోస్‌తోపాటు సైబీరియా నుంచి కొంగలకు ఇది విడిది. ద్వీపాల వెంబడి బోటు ట్రిప్పుకు వెళ్లడం ద్వారా కుమర్‌కోన్‌లో విడిది చేసే పక్షులను ఎంతో చక్కగా చూడవచ్చు.
సముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్లకాలువలు కలగలసి కేరళ రాష్టానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్ హిల్స్ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. కేరళలో సరస్సులున్న ప్రాంతాలను కుట్టునాడు అని అంటుంటారు. కుట్టునాడు అంటే పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగుభూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మలయాళీలు ఈ నదుల పైనే ఆధారపడ్డారు. ఇప్పటికీ ఆయా లంకల్లోని మలయాళీలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజల దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకోనట్ లాగూన్ రిసార్టుకు వెళ్ళాల్సిందే.
కుట్టునాడ్ జీవనశైలికి ప్రతిబింబం..
[మార్చు]కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకోనట్ లాగూన్ రిసార్టు కొచ్చి నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్ చెట్ల మధ్యలో వెంబనాడ్ సరస్సు తూర్పుతీరంలో కవనార్ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్ లాగూన్ రిసార్టు వెలసింది. కుట్టునాడ్ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్ లాగూన్ హెరిటేజ్ రిసార్టు పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధమైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ లోనూ...
[మార్చు]ప్రపంచ ప్రఖ్యాత రచయిత అరుంధతీరాయ్‌కి బుకర్ ఫ్రైజును తెచ్చిపెట్టిన `గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్'లో పేర్కొన్న కోకోనట్ లాగూన్ రెస్టారెంట్ ఈ కోకోనట్ లాగూన్ రిసార్టు లోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ధారవాడ శైలిలో నిర్మించిన చక్కటి భవనం ఈ రిసార్టులోకెల్లా అత్యంత పురాతన భవనం. ఓ మలయాళీ కుటుంబానికి చెందిన ఈ భవనాన్ని కొనుగోలు చేసి జాగ్రత్తగా ముక్కలుచేసి తెచ్చి, ఈ లాగూన్‌లో మళ్లీ నిర్మించటం మరో విశేషం. కోకోనట్ లాగూన్‌లోని రిసెప్షన్ భవనం ఒక్కటే కేరళలోని సంప్రదాయ సిద్ధమైన మరో నిర్మాణశైలి, నలుకెట్టు ఆకృతితో అందంగా ఆహ్వానిస్తూంటుంది. నిజానికి ఇది ఈ లాగూన్‌కు సమీపంలో ఉండే గ్రామమైన వైకోమ్‌లో 1860లో నిర్మితమై, ఒక బ్రాహ్మణ కుటుంబీకులు నివాసం ఉండిన పురాతన భవనం. దీనిని కొనుగోలు చేసి లాగూన్‌కు తెచ్చి పునర్నిర్మించారు.
వసతులు
[మార్చు]చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 14 హెరిటేజ్ మాన్షన్లు, 28 హెరిటేజ్ బంగ్లాలు, 8 ప్రైవేట్ పూల్ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్ మాన్షన్లో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్తులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.
సూర్యాస్తమయం అద్భుతం
[మార్చు]సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్ లాగూన్ రిసార్ట్ ను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్ చుట్టుపక్కల ప్రాంతాలను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రిసార్ట్ కు సమీపంలో, కవనార్ నదికి దక్షిణ ప్రాంతంలో నెలవైన రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.
సౌందర్య వీక్షణమే కాదు.. ఆరోగ్య సౌలభ్యం కూడా...
[మార్చు]ఆయుర్వేదిక్ మసాజ్, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయాణాలు, రైస్ బోట్ ప్రయాణాలు, ఫిషింగ్, ఈత లాంటివి ఈ కోకొనట్ లాగూన్ రిసార్ట్ అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపాయాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి. సాధారాణంగా ఇక్కడి వాతావరణం కనిష్ఠంగా 23 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సి యస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవా లంటే.. కొచ్చిలోని కాసినో హోటల్ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది. లేదా కొంతదూ రం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమ రకోమ్ నుండిగానీ.. పుతెన్గడి నుండిగానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్ లాగూన్ హెరిటేజ్ రిసార్ట్ కు చేరుకోవచ్చు.
మరో ప్రకృతి సౌందర్యం.. కుమరకోమ్...
[మార్చు]కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్ ప్రాంతంలో వెంబనాడ్ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్ కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్లకాలువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి కుమరకోమ్‌కు వన్నె తెస్తాయి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు. కేరళలోని మరెన్నో ప్రాంతాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు, కాలువలు నిలుస్తున్నాయి. పల్లెలను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టనాడ్‌లో నదీమార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీమార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.
అన్నీ పడవల ద్వారానే...
[మార్చు]కుమారకోమ్.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లతో నిండివుంటుంది. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. పాలు మొదలకుకొని.. కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, పప్పులు, నూనెలు ఇలా గృహావసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. బైకులు, మోటార్‌సైకిళ్లకంటే.. బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో.. ఇక్కడి ప్రజల్లో చాలామంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.
ఆగస్టు, సెప్టెంబర్‌లలో వెంబనాడ్ సంబరాలు...
[మార్చు]కేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల మధ్యకాలంలో నిర్వహించే ఈ పోటీలు నీళ్లలో పోటీజ్వాలలు రగులుస్తాయని అంటుంటారు. నాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్ రేస్ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆగస్టు నెల రెండవ శనివారంనాడు దీనిని నిర్వహిస్తారు. మళ్లీ ఓనమ్ సందర్భంగా అళప్పూజ ప్రాంతంలో అరణ్‌ముల పడవల పోటీ నిర్వహించడం ఆనవాయితీ. కొట్టాయం నుండి పది కిలోమీటర్ల దూరంలో.. కొచ్చిన్ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే.. సగం దూరం రోడ్డు గుండా చేరుకుని తన్నీర్ముక్కమ్ జెట్టీ ద్వారా కుమరకోమ్ చేరుకోవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్ కొట్టాయం. సమీపంలోని విమానాశ్రయం.. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం.
ఎత్తుమానూర్ మహాదేవ టెంపుల్
[మార్చు]కొట్టాయం పట్టణానికి 10 కిలో మీటర్ల దూరంలో కుమరకోమ్ చుట్టుపక్కల ఉన్న ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం ఈ ఎత్తుమానూర్ మహాదేవ టెంపుల్. ఇది కేరళ లోని అతి ప్రాచీన శివుని దేవాలయాలలో ఒకటి. కొన్ని శతాబ్దాల చరిత కల ఈ దేవాలయం లక్షలాది భక్తులని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మనకి కనపడుతున్న టెంపుల్ నిర్మాణం 1542 లో పునర్నిర్మించారని నమ్మకం.గోడలపై అందంగా చిత్రింపబడి ఉన్న చిత్రలేఖనాలకి ప్రసిద్ధి అయిన ఈ గుడిలో ప్రముఖమైన చిత్రం ప్రదోష నృత్యం (శివుని నృత్యం). దేశంలోనే విశిష్టమైన వాల్ పెయింటింగ్స్ లలో ఈ చిత్రం ఒకటిగా పరిగణించబడింది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో గర్భగుడి, గోపురం, ప్రధాన విగ్రహం, వినాయకుడికి, లార్డ్ షస్తాకి అంకితమివ్వబడిన గుడులు, బంగారపు జెండా, రాగి పలకలతో కప్పబడిన పై కప్పులు ఉన్నాయి. ఫిబ్రవరి నుండి మార్చి నెలలలో జరుపుకోబడే ఆరట్టు పండుగ ఇక్కడ ప్రధానంగా జరుపుకునే పండుగ. ఎత్తుమనూర్ మహాశివుని గుడి ఈ రాష్ట్రము లోని ధనిక ఆలయాలలో ఒకటి. ఇక్కడకు వొచ్చే భక్తులు "తులాభారం సేవ" అనే ప్రత్యేక సేవ చేసుకుంటారు.
అరువిక్కుజ్హి ఫాల్స్
[మార్చు]కుమరకొంకి సమీపంలో ఉన్న అరువిక్కుజ్హి ఫాల్స్ అద్భుతమైన జలపాతం. కొట్టాయం పట్టణం నుండి 18 కి మీ ల దూరంలో ఉండడం వల్ల సులభంగా దీనిని చేరుకోవచ్చు. ఈ ప్రఖ్యాత మైన పర్యాటక ప్రదేశాన్ని కుమరకొంకి వెళ్ళే మార్గ మద్యంలో సందర్శించవచ్చు. సరదాగా షికారుకి అనువైన ప్రదేశం ఇది. పెద్ద రాళ్ల గుండా 100 అడుగుల ఎత్తు నుండి కిందకి పారే నీటి సెలయేర్ల అందాల అద్భుతం పర్యాటకులకి మధురమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. రబ్బర్ చెట్ల తోటల నుండి విశాలంగా పొడిగించబడిన ఈ జలపాతం కుటుంబ సమేతంగా పిక్నిక్స్ కి , ఆహ్లాద పర్యటనలకి అనువైన ప్రదేశం. ఈ ప్రాంతం యొక్క సహజమైన సౌందర్యం ప్రకృతి ప్రేమికులకి , ఫోటోగ్రాఫర్లకి అమితమైన ఆనందం కలిగిస్తుంది. కుమరకొం పట్టణం నుండి అరువిక్కుజ్హి జలపాతానికి నడక ద్వారా చేరుకోవచ్చు. కొన్ని మైళ్ళ దూరంలో నుండి ఈ జలపాతాల సడులు వినబడతాయి. ఇక్కడ ప్రవాహాలని రుతుపవనాల జల్లులు స్వచ్ఛమైన నీటితో భర్తీ చేస్తాయి. అంతే కాదు, ఎండా కాలం మొదలు కాక ముందే అంటే సెప్టెంబరు నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతాన్ని సందర్శించడం అనువైన సమయం.
బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం, కుమరకొం
[మార్చు]భారతదేశంలో డ్రిఫ్ట్ వుడ్స్ చే తయారు చేయబడిన ఎన్నో కళాఖండాల సేకరణ కలిగిన ఏకైక మ్యూజియం ఈ బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం. ప్రకృతి యొక్క కళా నైపుణ్యం, మానవుడి సృజనాత్మకతకి సాక్ష్యం ఈ మ్యూజియంలో కనిపించే కళాఖండాలు. వీటి వల్ల ఈ మ్యుజియం ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందింది. వ్రేళ్ళ నుండి తయారు చేయబడిన శిల్పాలు ఈ మ్యూజియంలో నున్న ఆసక్తికరమైన అంశాలలో ఒకటి. ఈ మ్యూజియంలో ప్రదర్శించబడిన కళాఖండాలు సముద్రపు అలల ద్వారా సహజంగా సృష్టించబడినవి. వీటిని మ్యూజియం అధికారులు సేకరించి, సవరించి, మెరుగుపట్టారు. వైవిధ్యమైన , అద్భుతమైన ఈ మ్యూజియం శ్రీమతి రాజి పున్నూస్ గారి ఆలోచనకి రూపకల్పం తన అసాధారణ కళాత్మక విలువలు , ప్రత్యేకతల వల్ల రాష్ట్ర ప్రభుత్వం వారిచే 'ది మోస్ట్ ఇన్నోవేటివ్ పర్యాటకం ప్రాజెక్ట్ అవార్డ్ (2004) ని ఈ మ్యూజియం కైవసం చేసుకుంది. 2001 లో ఈ మ్యూజియంని ప్రారంభించారు. లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా ఈ మ్యుజియం చోటు దక్కించుకుంది. కళాత్మక హృదయం కలిగిన వారితో పాటు సాధారణ పర్యాటకుడిని కూడా ఈ మ్యూజియం సంతోషపరుస్తుంది. సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు (వారంలోని పని దినాలలో మాత్రమే) ఆదివారం : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సెలవు దినం : సోమవారం
కుమరకొం బీచ్
[మార్చు]కేరళలో ఉన్న అద్భుతమైన బీచ్ లలో కుమరకొం బీచ్ ఒకటి. విశ్రాంతి తీసుకుని తిరిగి ఉత్తేజం పొందేందుకు తగిన ప్రదేశం. పొడవైన ఇసుక తీరం విరామ చర్యలతో సేద దీరాలనుకునే వారికి ప్రియమైన ప్రదేశం. ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడున్న ప్రశాంతతను భగ్నం చెయ్యలేవు. ప్రశాంతంగా గడిపేందుకు అనువైన ప్రదేశం ఈ కుమరకొం బీచ్.స్విమ్మింగ్, వాలీ బాల్, ఫ్రిస్బీ వాటర్ స్కయింగ్, పారాసైలింగ్, విండ్ సర్ఫింగ్ , వాటర్ ఏరోబిక్స్ వంటి ఉల్లాసభరితమైన కార్యక్రమాలని ఇక్కడ నిర్వహించుకునే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు రోజులు పట్టణ జీవనం నుండి బయటికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరడానికి పర్యాటకులకి ఇది చక్కటి అవకాశం. పుస్తకాలు చదవడం, సన్ బాత్ చెయ్యడం, సూర్యాస్తమయాన్ని చూడడం వంటి వాటి ద్వారా విరామం పొందుతూ హాయిగా గడపడానికి ఈ ప్రదేశం ఎంతో తోడ్పడుతుంది. ఈ బీచ్ కి సమీపంలో ఎన్నో రిసార్ట్స్ , హోం స్టే స్ సౌలభ్యం ఉంది. ఈ రిసార్ట్స్, స్పా ట్రీట్ మెంట్స్ , ఆయుర్వేదిక్ మసాజుల సదుపాయం కలిగిస్తాయి. ఈ ఇసుకతో కూడిన స్వర్గానికి విచ్చేసిన పర్యాటకులు మళ్లీ దైనందిన కార్యకలాపాలలోకి వెళ్ళేలోగా ఎంతో ఉత్సాహభరితంగా మారతారు.
వెంబనద్ కాయల్
[మార్చు]వెంబనద లేక్ ని వెంబనద్ కాయల్ అని కూడా పిలుస్తారు. దీని పైనే ద్వీపాల సమూహం ద్వారా కుమరకొం ప్రాంతం ఏర్పడింది. సహజమైన నీటి అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులని ఆకర్షిస్తుంది. కేరళ రాష్ట్రంలో నే అతి పెద్ద సరస్సుగా అలాగే దేశంలో నే అతి పొడవైన సరస్సుగా రికార్డు కలిగి ఉంది. అనేక జిల్లాలకు ఈ సరస్సు విస్తరిస్తుంది. ఈ సరస్సు పున్నామద కాయల్ , కొచ్చి లేక్ గా కూడా ప్రసిద్ధి. సంవత్సరానికి ఒక సారి ఓనం పండుగ సమయంలో నిర్వహించబడే నెహ్రూ ట్రోఫీ బోటు రేసులకి ఈ సరస్సు ప్రసిద్ధి చెందింది. వీక్షకులకు కనువిందు చేసే విధంగా వివిధ ప్రాంతాల నుండి పలు పడవలు ఈ చారిత్రాత్మక బోటు రేసులలో పాల్గొంటాయి.వెంబనద్ లేక్, కేరళ బ్యాక్ వాటర్ పర్యాటక రంగానికి వెన్నెముక వంటిది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులని ఆకట్టుకోవడంలో ఈ లేక్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
కుమరకోమ్ పక్షుల రక్షిత ప్రాంతం...
[మార్చు]కుమరకోమ్ ప్రాంతం అంతా వెంబనాడ్ సరస్సు తీరంలోని చిన్నచిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్ ప్రాంతానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్ స్టార్‌క వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శించాలనుకుంటే ఇక్కడి లంకల్లో పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం.
మరెన్నో ప్రతే్యకతలు...
[మార్చు]కుమరకోమ్‌లో ఇంకా ఎన్నో ప్రతే్యక ఆకర్షణలు పర్యాటకలను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్ గార్డెన్ రిట్రీట్‌లో బోటింగ్, ఫిషింగ్ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమరకోమ్ టూరిస్‌ట గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు కూడా ఉంది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.