Jump to content

కొండబాల కోటేశ్వరరావు

వికీపీడియా నుండి
కొండబాల కోటేశ్వరరావు
కొండబాల కోటేశ్వరరావు


పదవీ కాలం
2017 – 2022

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
ముందు కట్టా వెంకటనర్సయ్య
తరువాత కట్టా వెంకటనర్సయ్య
నియోజకవర్గం మధిర నియోజకవర్గం

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌
పదవీ కాలం
1992 – 1995

వ్యక్తిగత వివరాలు

జననం 1948 డిసెంబర్ 7
కొండ కొడిమ గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రామయ్య
జీవిత భాగస్వామి రాజేశ్వరి
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
నివాసం హైదరాబాద్

కొండబాల కోటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో మధిర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] కొండబాల కోటేశ్వరరావు

రాజకీయ జీవితం

[మార్చు]

కొండబాల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి కొండ కొడిమ గ్రామా సర్పంచ్‌గా పని చేసిన తరువాత 1992 నుంచి 1995 వరకు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా పని చేశాడు.[2] ఆయన 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున మధిర నియోజకవర్గం నుండి పోటీ చేసి 5001 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2004లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. కొండబాల కోటేశ్వరరావు తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో టీడీపీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2017లో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 April 2014). "పోరుగడ్డ మధిర". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
  2. Andhra Jyothy (23 December 2020). "సహకార." (in ఇంగ్లీష్). Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
  3. The Hans India (2 March 2017). "Khammam leads the pack" (in ఇంగ్లీష్). Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.