కొత్త ప్రభాకర్ రెడ్డి
కొత్త ప్రభాకర్ రెడ్డి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2023 డిసెంబరు 03 | |||
ముందు | ఎం.రఘునందన్ రావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | దుబ్బాక | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2014 సెప్టెంబరు – 2023 డిసెంబరు 13 | |||
ముందు | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | ||
నియోజకవర్గం | మెదక్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | 1966 జూన్ 6||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | మంజులత[1] | ||
సంతానం | పృథ్వీకృష్ణారెడ్డి[2], కీర్తి రెడ్డి | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
మతం | హిందూ |
కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు, 16వ పార్లమెంటు సభ్యులు. 2014లో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.[3]
జననం
[మార్చు]ప్రభాకర్ రెడ్డి 1966, జూన్ 6 న తెలంగాణ లోని హైదరాబాద్లో జన్మించారు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరున్న ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సన్నిహితుడు. కేపీఆర్ ట్రస్టు ద్వారా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు.[4]
కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంకోసం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభాకర్ రెడ్డి పోటీచేసి గెలుపొందారు. 2014 సెప్టెంబరు 13న జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పై భారీ మెజారిటీతో గెలిచారు.[5][6] 2014, నవంబరు 25న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి 2022 జనవరి 26న టిఆర్ఎస్ పార్టీ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7]
కొత్త ప్రభాకర్ రెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై 53,513 ఓట్లతో మెజార్టీ గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[8] ఆయన దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత డిసెంబరు 13న మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశాడు.[9]
హత్య యత్నం
[మార్చు]కొత్త ప్రభాకర్ రెడ్డి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన ప్రచారంలో భాగంగా అక్టోబరు 30న సిద్దిపేట జిల్లా, దౌల్తాబాద్ మండలం, సూరంపల్లి గ్రామంలో ప్రచారంలో భాగంగా ఓ పాస్టర్ కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా కార్యకర్త ముసుగులో రాజు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా నటించి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ ఆయనను ఎంపీ వ్యక్తిగత సిబ్బంది గజ్వేల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్య కోసం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.[10][11]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (17 November 2023). "ప్రజా సంక్షేమమే బీఆర్‌ఎస్ ధ్యేయం". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ Andhrajyothy (14 November 2023). "మా నాన్నే స్ఫూర్తి." Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ తెలుగు వెబ్ దునియా. "మెదక్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధారణమే : ప్రభాకర్ రెడ్డి". telugu.webdunia.com. Retrieved 13 February 2017.
- ↑ మెడిన్ టిజి. "మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి 'కొత్త'". madeintg.com. Retrieved 13 February 2017.[permanent dead link]
- ↑ "Kotha Prabhakar Reddy Affidavit" (PDF). 2014. Archived from the original (PDF) on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ The Hindu (16 September 2014). "TRS wins Medak Lok Sabha seat" (in Indian English). Archived from the original on 22 May 2024. Retrieved 22 May 2024.
- ↑ Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
- ↑ Namaste Telangana (4 December 2023). "ఉద్యమ గడ్డ పై గులాబీ జెండా". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
- ↑ Eenadu (13 December 2023). "ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Eenadu (31 October 2023). "ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ Eenadu (31 October 2023). "ఎంపీని అనుసరించి.. దాడికి తెగబడి". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.