ఖోవాయ్
ఖోవాయ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°3′54″N 91°36′18″E / 24.06500°N 91.60500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
జిల్లా | ఖోవాయ్ |
Government | |
• Type | మున్సిపల్ కౌన్సిల్ |
• Body | ఖోవాయ్ మున్సిపల్ కౌన్సిల్ |
Elevation | 23 మీ (75 అ.) |
జనాభా (2015) | |
• Total | 21,387 |
భాషలు | |
• అధికారిక | బెంగాళీ, కోక్బోరోక్, ఇంగ్లీష్ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 799201 |
ప్రాంతపు కోడ్ | 3825 |
Vehicle registration | టిఆర్ |
ఖోవాయ్, త్రిపుర రాష్ట్రంలోని ఖోవాయ్ జిల్లా ముఖ్య నగరం, ప్రధాన కార్యాలయం. ఖోవాయ్ మున్సిపల్ కౌన్సిల్‌గా, నగర పంచాయితీగా ఏర్పడింది. ఈ పట్టణం ఖోవాయ్ నది ఒడ్డున ఉండడం వల్ల దీనికి ఖోవాయ్ అనే పేరు వచ్చింది. ఖోవాయి దక్షిణ భాగం బంగ్లాదేశ్ సరిహద్దులతో కలుస్తోంది.
జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] ఖోవాయ్ పట్టణంలో 17,621 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు. ఖోవాయ్ సగటు అక్షరాస్యత రేటు 86% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 88% కాగా, స్త్రీల అక్షరాస్యత 85% గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
అటవీ
[మార్చు]ఖోవాయ్ ఉపవిభాగంలో ఖోవాయ్, పద్మాబిల్ అనే రెండు జోన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖోవాయ్ జోన్ శ్రేణిలో 13,578 హెక్టార్ల అటవీ భూములు ఉండగా, పద్మాబిల్ జోన్ శ్రేణిలో 6,468 హెక్టార్ల అటవీ భూమి ఉంది.
ఆరోగ్యం
[మార్చు]ఖోవాయ్ పట్టణంలో ఒక జిల్లా ఆసుపత్రి (ఖోవాయ్ హాస్పిటల్), ఐదు ప్రజారోగ్య కేంద్రాలు, 43 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి.
భౌగోళికం, వాతావరణం
[మార్చు]ఖోవాయ్ నది వెంబడి ఉన్న మైదానంలో ఈ ఖోవాయ్ పట్టణం ఉండడం వల్ల రుతుపవనాల ప్రభావంతో ఇక్కడ తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు (82°F) ఉండగా వర్షపాతంతో హెచ్చుతగ్గులు ఉంటాయి. నవంబరు నెట మధ్య నుండి మార్చి ఆరంభం వరకు స్వల్ప, తేలికపాటి శీతాకాలం ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా పొడి పరిస్థితులు, సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలు (64°F) ఉంటుంది.
సంస్కృతి
[మార్చు]ఖోవాయ్ పట్టణంలో కోక్బోరోక్, బంగ్లా భాషల ప్రాబల్యం ఉంది. ఇక్కడ దుర్గా పూజ, ఖార్చి, గారియా పూజ, ట్రింగ్ (త్రిపురి కొత్త సంవత్సరం) మొదలైన పండుగలు జరుపుకుంటారు.
ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు
[మార్చు]ఖోవాయ్ పట్టణం సరిహద్దు పొడవు 61.5 కి.మీ. ఉంటుంది. ఇది దాదాపు పూర్తిగా కంచెతో ఉంది. (950 మీటర్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి).
రవాణా
[మార్చు]ఖోవాయ్ పట్టణానికి రవాణా సేవలు అందించే ఖోవాయ్ విమానాశ్రయం ప్రస్తుతం వాడుకలో లేదు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 30 December 2020.
- ↑ "Unused Airports in India". Center For Asia Pacific Aviation. 27 November 2009. Archived from the original on 8 డిసెంబరు 2012. Retrieved 30 December 2020.