Jump to content

ఖోవాయ్

అక్షాంశ రేఖాంశాలు: 24°3′54″N 91°36′18″E / 24.06500°N 91.60500°E / 24.06500; 91.60500
వికీపీడియా నుండి
ఖోవాయ్
పట్టణం
ఖోవాయ్ is located in Tripura
ఖోవాయ్
ఖోవాయ్
భారతదేశంలోని త్రిపురలో ప్రాంతం ఉనికి
ఖోవాయ్ is located in India
ఖోవాయ్
ఖోవాయ్
ఖోవాయ్ (India)
Coordinates: 24°3′54″N 91°36′18″E / 24.06500°N 91.60500°E / 24.06500; 91.60500
దేశం భారతదేశం
రాష్ట్రంత్రిపుర
జిల్లాఖోవాయ్
Government
 • Typeమున్సిపల్ కౌన్సిల్
 • Bodyఖోవాయ్ మున్సిపల్ కౌన్సిల్
Elevation
23 మీ (75 అ.)
జనాభా
 (2015)
 • Total21,387
భాషలు
 • అధికారికబెంగాళీ, కోక్బోరోక్, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
799201
ప్రాంతపు కోడ్3825
Vehicle registrationటిఆర్

ఖోవాయ్, త్రిపుర రాష్ట్రంలోని ఖోవాయ్ జిల్లా ముఖ్య నగరం, ప్రధాన కార్యాలయం. ఖోవాయ్ మున్సిపల్ కౌన్సిల్‌గా, నగర పంచాయితీగా ఏర్పడింది. ఈ పట్టణం ఖోవాయ్ నది ఒడ్డున ఉండడం వల్ల దీనికి ఖోవాయ్ అనే పేరు వచ్చింది. ఖోవాయి దక్షిణ భాగం బంగ్లాదేశ్ సరిహద్దులతో కలుస్తోంది.

జనాభా

[మార్చు]
కోహినూర్ కాంప్లెక్స్ నుండి శుభాష్ పార్క్ దృశ్యం

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] ఖోవాయ్ పట్టణంలో 17,621 జనాభా ఉంది. ఈ జనాభాలో 51% మంది పురుషులు, 49% మంది స్త్రీలు ఉన్నారు. ఖోవాయ్ సగటు అక్షరాస్యత రేటు 86% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 88% కాగా, స్త్రీల అక్షరాస్యత 85% గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

అటవీ

[మార్చు]

ఖోవాయ్ ఉపవిభాగంలో ఖోవాయ్, పద్మాబిల్ అనే రెండు జోన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖోవాయ్ జోన్ శ్రేణిలో 13,578 హెక్టార్ల అటవీ భూములు ఉండగా, పద్మాబిల్ జోన్ శ్రేణిలో 6,468 హెక్టార్ల అటవీ భూమి ఉంది.

ఆరోగ్యం

[మార్చు]

ఖోవాయ్ పట్టణంలో ఒక జిల్లా ఆసుపత్రి (ఖోవాయ్ హాస్పిటల్), ఐదు ప్రజారోగ్య కేంద్రాలు, 43 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి.

భౌగోళికం, వాతావరణం

[మార్చు]

ఖోవాయ్ నది వెంబడి ఉన్న మైదానంలో ఈ ఖోవాయ్ పట్టణం ఉండడం వల్ల రుతుపవనాల ప్రభావంతో ఇక్కడ తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు (82°F) ఉండగా వర్షపాతంతో హెచ్చుతగ్గులు ఉంటాయి. నవంబరు నెట మధ్య నుండి మార్చి ఆరంభం వరకు స్వల్ప, తేలికపాటి శీతాకాలం ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా పొడి పరిస్థితులు, సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలు (64°F) ఉంటుంది.

సంస్కృతి

[మార్చు]

ఖోవాయ్ పట్టణంలో కోక్బోరోక్, బంగ్లా భాషల ప్రాబల్యం ఉంది. ఇక్కడ దుర్గా పూజ, ఖార్చి, గారియా పూజ, ట్రింగ్ (త్రిపురి కొత్త సంవత్సరం) మొదలైన పండుగలు జరుపుకుంటారు.

ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు

[మార్చు]

ఖోవాయ్ పట్టణం సరిహద్దు పొడవు 61.5 కి.మీ. ఉంటుంది. ఇది దాదాపు పూర్తిగా కంచెతో ఉంది. (950 మీటర్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి).

రవాణా

[మార్చు]

ఖోవాయ్ పట్టణానికి రవాణా సేవలు అందించే ఖోవాయ్ విమానాశ్రయం ప్రస్తుతం వాడుకలో లేదు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 30 December 2020.
  2. "Unused Airports in India". Center For Asia Pacific Aviation. 27 November 2009. Archived from the original on 8 డిసెంబరు 2012. Retrieved 30 December 2020.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఖోవాయ్&oldid=3979635" నుండి వెలికితీశారు