గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్
Jump to navigation
Jump to search
గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ | |
---|---|
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | |
భౌగోళికం | |
స్థానం | చెంగల్ రావు పేట, విశాఖపట్నం, భారతదేశం |
వ్యవస్థ | |
[యూనివర్సిటీ అనుబంధం | ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము |
Services | |
అత్యవసర విభాగం | ఉంది |
పడకలు | 200 |
హెలిపాడ్ | No |
చరిత్ర | |
ప్రారంభమైనది | 1894 |
గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ (గోషా హాస్పిటల్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో తొలి మహిళా, పిల్లల హాస్పిటల్. శతాబ్దానికి పైగా సేవలందించిన ఈ హాస్పిటల్ విశాఖపట్నంలోని చెంగల్ రావు పేట ప్రాంతంలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]1894లో రాజా గోదాయ్ నారాయణ గజపతి రావు ఈ హాస్పిటల్ నిర్మించడంకోసం భూమిని కొనుగోలు చేశాడు. ఈ హాస్పిటల్ ప్రారంభ రోజుల్లో హిల్డా మేరీ లాజరస్ చేత నడుపబడేది. హాస్పిటల్ ని స్థాపించడానికి బ్రిటన్ రాణి విక్టోరియా నుండి అనుమతి వచ్చినందుకు హాస్పిటల్ పేరును విక్టోరియా హాస్పిటల్ గా మార్చారు. 1949లో ఈ హాస్పిటల్ మద్రాస్ ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది.[2]
సేవలు
[మార్చు]ప్రస్తుతం ఈ హాస్పిటల్ లో 200 పడకలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 100 పడకలతో దీనిని విస్తరిస్తోంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "introduction of the hospital". thehansindia. 31 Aug 2018. Retrieved 18 May 2021.
- ↑ "history". deccanchronicle. 16 Oct 2015. Retrieved 18 May 2021.
- ↑ "services". indianexpress. 18 Apr 2017. Retrieved 18 May 2021.