Jump to content

గిడుగు రామమూర్తి సాహిత్యవ్యాసాలు

వికీపీడియా నుండి
గిడుగు రామమూర్తి సాహిత్యవ్యాసాలు
గిడుగు రామమూర్తి సాహిత్యవ్యాసాలు ముఖాచిత్రం
కృతికర్త: గిడుగు రామమూర్తి
సంపాదకులు: తెలికిచర్ల వెంకట రత్నం, గుంటూరు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): వ్యాస సంకలనం
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజ్నాన్ భవన్ హైదరాబాద్
విడుదల: 1933,ద్వితీయ ముద్రణ ఏప్రిల్ 1958, తృతీయ ముద్రణ జనవరి 1992
పేజీలు: 207


గిడుగు రామమూర్తి పంతులుగారు బహుముఖప్రజ్నాశాలి. 1910 నుండి మూడు దశాబ్దాల పాటు వ్యవహారిక భాషోద్యమాన్ని నిర్వహించి ఆదునిక తెలుగు సాహిత్యాలకు గొప్ప స్ఫూర్తిని కలుగచేసారు. అలా ఉద్యమ స్ఫూర్తిని కలిగిస్తూ వ్యావహారిక భాషలో వ్రాసిన వివిధ వ్యాసాలను అక్కిరాజు రమాపతిరావు గారి ద్వారా సంకలనం చేయించి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన పుస్తకం గిడుగు వెంకట రామమూర్తి సాహిత్యవ్యాసాలు.

పీఠిక

[మార్చు]

గ్రాంధిక భాష వాడుకరులను వ్యావహారిక పరిజ్ఞానవంతులుగా మార్చడంలో గిడుగువారు చేసిన సేవలను అక్కిరాజు రమాపతిరావు గారు ఇలా రాసారు.

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని భాషాపరిణామాన్ని పరిశోధించిన గొప్ప శోధకుడు గిడుగు. నన్నయ నాటి భాషలోఆయన 'ప్రాదెనుగుకమ్మా రచించారంటే ప్రాచీన భాష స్వరూపాన్ని ఆయన ఎంతగా వశం చేసుకున్నారో తెలుస్తుంది. సంసృతంలో ఆయన ప్రజ్న ఎంత గొప్పదంటే సమకాలీన పండితులలో చాలా మందికి సంసృతం సరిగా రాదని ఆయన నిరూపించాడు.

కిందటి శతాబ్ధానికి చివరలో తాళపత్ర గ్రంథాల పరిష్కరణం ముమ్మరమై ప్రచీన కావ్యాలు అచ్చువేస్తున్నపుడు పండిత పరిష్కర్తలు తమ వ్యాకరణ నిఘంటు పరిజ్ఞానం నమ్ముకుని వాటిలో దిద్దుబాట్లు చేస్తున్నపుడు అది కూడని పని విమర్శించారు.

చదువుకున్న వాళ్ళూ సంస్కారం కలవాళ్ళూ తమ నిత్య వ్యవహారంలో రాతకోతలలో ఏ భాషను ఉపయోగిస్తున్నారో అదే సత్యబాష అవుతుంది అన్నారు. అదే ఆ కాలపు శిష్ట వ్యవహారికం అవుతుంది. అటువంటి పద ప్రయోగాలు ఆ కాలపు రచనల్లో కనబడితే వాటిని తప్పనటానికి వీఎల్లేదు అనేవారు.

సంపాదకీయ భూమిక

[మార్చు]

వ్యాసాల సమాహారం

[మార్చు]

పుస్తకంలో వ్యాసాలు క్రమ పద్ధతిలో లేవు. కొన్ని వ్యాసాలుగానూ మరికొన్ని ప్రయోగ పాఠ్యాంశాలుగానూ, మరికొన్ని పీఠికలుగా, సంపాదకీయాలుగానూ ఉండటం వలన వాటిలో సమగ్రంగా ఉన్న వాటిని సేకరించి ఈ పద్ధతిలో విషయ సూచికగా ఇచ్చారు.అవి

  1. వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము.
  2. రాజరాజ కాలమందు తెలుగుబాష
  3. ప్రాదెనుగుగమ్మ
  4. విన్నపము
  5. పీఠిక
  6. జీవద్భాషను వాడుటకు స్వాతంత్ర్యయం
  7. భాషను స్థిరీకరించగలవారెవ్వరు.
  8. ప్రజా సాహిత్యం-1
  9. ప్రజా సాహిత్యం-2
  10. ప్రజా సాహిత్యం-3
  11. ఉపోద్ఘాతము
  12. చిన్నయసూరి నీతి చంద్రిక
  13. పీఠిక
  14. తుది విన్నపము
  15. నేటి తెలుగు
  16. బంధు ప్రశంస
  17. గ్రామ్యపద ప్రయోగం
  18. నేటి సాహిత్యం
  19. గృహలక్ష్మి కంఠాభరణం
  20. నోటి మాట
  21. నా మనవి చిత్తగించండి