గోపగాని రవీందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోపగాన రవీందర్ [1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీకారుడు, ఉపాధ్యాయుడు. ఇతను మూడు దశాబ్దాలుగా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు ఏజేన్సీ ప్రాంతంలో అవిశ్రాంత సాహితీ ప్రస్థానం చేస్తున్నాడు. మూలవాసుల అడుగుజాడలకై అడుగులు వేస్తూ, గిరిజను ల జీవితాలను కవిత్వంలో బలంగా చిత్రీకరణ చేస్తున్నాడు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా దండేపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాడు.[2]

గోపగాని రవీందర్
గోపగాని రవీందర్
జననంగోపగాని రవీందర్
(1971-06-13) 1971 జూన్ 13 (వయసు 52)
తిమ్మాపూరం(హావేలి), ఖిల్లా వరంగల్ మండలం వరంగల్ జిల్లా, తెలంగాణ భారతదేశం
నివాస ప్రాంతంలక్షటిపేట్ మంచిర్యాల, తెలంగాణ
వృత్తితెలుగు ఉపాద్యాయుడు
ప్రసిద్ధికవి, రచయిత, సాహితీకారుడు
భార్య / భర్తరమణశ్రీ
పిల్లలుస్నేహసాగర్
తండ్రిగోపగాని రాములు
తల్లిశాంతమ్మ

జననం,విద్య[మార్చు]

అనువంశికంగా, సాంప్రదాయకంగా కవి పండితులు కాని, కనీసం అక్షరజ్ఞానం లేని కుటుంబం నుండి వచ్చాడు. వరంగల్‌ జిల్లాలోని ఖిలా వరంగల్ మండలంలోని తిమ్మాపురం (హావేలి) గ్రామంలో గోపగాని రాములు, శాంతమ్మలకు 13 జూన్‌, 1971లో రవీందర్‌ జన్మించారు. స్థానిక గ్రామంలోనే ఐదవ తరగతి వరకు, గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసు క్యాంపులోని మామునూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు నడుచుకుంటు వెళ్ళి చదువుకున్నారు. హన్మకొండ లో ఇంటర్‌, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీ లో ఎం.ఎ., ఎమ్‌.ఫిల్‌ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామాకాల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాంతంలో ఉద్యోగం రావడంతో పాఠాలు బోధిస్తూనే సాహితీయానం చేస్తున్నారు. 9వ తరగతి చదువుతున్నప్పుడే శ్రీశ్రీ ‘మహాప్రాస్థానం’ పాఠశాల గ్రంథాలయం నుండి తీసుకొని చదవడంతో అతని మీద గాఢమైన ముద్రను వేసింది. కవిత్వం పట్లను ప్రేరణ రగిలించింది. గ్రామంలోని ఏకశీల యూత్‌ అసోసియేషన్‌ అండ్‌ లైబ్రరీ నిర్వహించే సాహితీ కార్యక్రమాలు రాయాలనే ఉత్సాహన్ని కల్గించింది.[3]

రచనలు[మార్చు]

సమాజంలోని అసమానతలనే కవితా వస్తువులుగా స్వీకరించి రాసిన అతని కవితలు పుస్తకాలుగా వెలువడినవి.

  1. అంకురం (2001),
  2. చిగురు (2009),
  3. చెరగని సంతకం (2015),
  4. దూరమెంతైన (2019)
  5. నేలమ్మ నేలమ్మ గేయరూపకవిత్వం`పరిశీలన’ (2012), (కవితా సంపుటాలతో పాటుగా పాటకు జాతీయ స్థాయి అవార్డును అందుకున్న సుద్దాల అశోక్‌తేజ గేయాలపై పరిశోధన చేశారు.)
  6. తెలంగాణ కథకులు కథాంతరంగం’ (2016) లో వెలువరించారు.తెలంగాణ కథ విశిష్టతను చాటే ‘తెలంగాణ కథకులు గురించి తెలిపారు.
  7. శతారం (కవిత్వ విమర్శన వ్యాసాలతో ' శతారం ' పుస్తకాన్ని రచించారు. తెలంగాణ పాట, కథ మీద ఆయన చేసిన పరిశోధన కృషికి గాను ఆయన రచనలు నిదర్శనంగా నిలిచాయి.)
  8. మా ఊరొక కావ్యం (2024) కవితా సంపుటి.

అవార్డులు[మార్చు]

  1. శ్రీ సోమ సీతారాములు తెలంగాణ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం
  2. పెండెం సత్యనారాయణ ‘అమ్మయాది’ రాష్ట్రస్థాయి పురస్కారం
  3. ‘బోవెరా సాహితీ పురస్కారం’
  4. మంచిర్యాల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.
  5. తెలుగు తేజోమూర్తి పురస్కారం

బాధ్యతలు[మార్చు]

తెలంగాణ రచయితల వేదిక ఆదిలాబాదు జిల్లా శాఖకు పదేండ్లు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉట్నూరు ఏజెన్సీలో ఉట్నూరు సాహితీ వేదిక ను స్థాపించారు. ఏజెన్సీలో సాహితీ వికాసం కోసం అనేక కార్యక్రమాలు చేశారు. 50 నెలల పాటు నిర్విరామంగా మొదటి ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించి రికార్డు సృష్టించారు. ఉసావే ద్వారా ‘ఉట్నూరు కవిత`2014’, ఉట్నూరు సాహితీ సంచిక, ఉట్నూరు సాహితీ కెరటాలు’ సంకలనాలు వెలువరించి ఆ ప్రాంత సాహితీ చైతన్యానికి దోహదం చేశారు.[4] అనేక సాహితీ వ్యాసాలు రాస్తూనే స్థానికత బలంగా ఉండే రచనలు రావాలని నిరంతరం తపిస్తూంటారు. తెలంగాణ రచయితల వేదికకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూనే, సాహితీ స్రవంతి లక్షెట్టిపేట సంస్థకు అధ్యక్షులుగా ఉండి ఈ కరోనా కాలంలో ఇక్కడి కవులతో ‘ఊపిరి పాట’ (2020) కవితా సంకలనానికి సంపాదకులుగా వెలువరించడం అతని సాహితీ కృషికి నిదర్శనంగా నిలిచింది.[5]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2022-09-22). "కళలకు గౌరవం". www.ntnews.com. Retrieved 2024-04-12.
  2. "తెలంగాణ కథకుల కథాంతరంగం (పుస్తక సమీక్ష) | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2024-04-12.
  3. ఈనాడు (2021-08-19), మన్యంలో మకరందాల జల్లు, retrieved 2024-04-12
  4. "సాహితీ వనంలో వికసించిన గోపగాని 'శతారం '". telugu.asianetnews.com. Retrieved 2024-04-12.
  5. Babu, Velugu (2024-03-10). "అమానవీయతపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం". Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-12.