చింతమనేని ప్రభాకర్
చింతమనేని ప్రభాకర్ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 - 2019 | |||
ముందు | మాగంటి వెంకటేశ్వరరావు | ||
---|---|---|---|
తరువాత | కొఠారు అబ్బయ్య చౌదరి | ||
నియోజకవర్గం | దెందులూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1970 దుగ్గిరాల, పెదవేగి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | చింతమనేని కేశవరావు | ||
జీవిత భాగస్వామి | రాధారాణి | ||
సంతానం | సాయి నవ్యశ్రీ, సాయి ప్రణీత, ప్రేమ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చింతమనేని ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దెందులూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]చింతమనేని ప్రభాకర్ 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలం, దుగ్గిరాలలో జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదివాడు.
రాజకీయ జీవితం
[మార్చు]చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చి తొలిసారి 2001లో ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పత్తి చేసి తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు రామచంద్ర రావుపై 14235 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పై 17746 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
చింతమనేని ప్రభాకర్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రభుత్వ విప్‌గా నియమితుడయ్యాడు. ఆయన 2019 ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో 17459 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1]
వివాదాలు
[మార్చు]- దెందులూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి 2011 నవంబర్ 26వ తేదీన మంత్రి వసంతకుమార్ పై చేయిచేసుకున్న కేసులో భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించింది.[2][3]
- కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.[4]
- ఏలూరు విజిలెన్స్ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో ఉన్న వీడియో జర్నలిస్టులపై అసభ్య పదజాలంతో దూషణ
- దళితులపై అనుచిత వ్యాఖ్యలు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (23 May 2019). "చిత్తు చిత్తుగా ఓడిన చింతమనేని". Archived from the original on 23 May 2019. Retrieved 15 January 2022.
- ↑ HMTV (14 February 2018). "టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు 6 నెలల జైలు శిక్ష". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ Sakshi (15 February 2018). "చింతమనేనికి పదవీ గండం?". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
- ↑ Sakshi (4 April 2019). "నాపైనే దాడి జరిగితే సామాన్యులకేది రక్షణ..?". Archived from the original on 4 April 2019. Retrieved 15 January 2022.