జంగా కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జంగా కృష్ణమూర్తి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసనమండలి సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009
నియోజకవర్గం గురజాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 04 జూన్ 1958
గామాలపాడు, దాచేపల్లి మండలం,గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు పెద్ద వీరయ్య, వీరమ్మ
సంతానం వెంకట కోటయ్య (పిడుగురాళ్ల జెడ్పీటీసీ), సురేష్ (గామాలపాడుసర్పంచ్‌) [1]
వృత్తి రాజకీయ నాయకుడు

జంగా కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గురజాల నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జంగా కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలం, గామాలపాడు గ్రామంలో 1958 జూన్ 04లో పెద్ద వీరయ్య, వీరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన మాచెర్ల లోని ఎస్.కె.బి.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి 1984లో బి .కామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1988లో గామాలపాడు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస రావు పై 64035 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడిగా పనిచేశాడు. జంగా కృష్ణమూర్తి వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస రావు చేతిలో ఓడిపోయాడు.

జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్‌గా, వైఎస్ఆర్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయనఆంధ్రప్రదేశ్ శాసనమండలికి 2019లో ఎమ్మెల్యే కోటా స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[2][3]

జంగా కృష్ణమూర్తి 2024 ఏప్రిల్ 1న  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి  రాజీనామా చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (18 February 2021). "తండ్రి ఎమ్మెల్సీ.. తనయుడు సర్పంచ్‌." Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.
  2. Sakshi (21 February 2019). "వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి". Archived from the original on 5 December 2021. Retrieved 5 December 2021.
  3. Sakshi (1 March 2019). "అయిదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 12 December 2021. Retrieved 12 December 2021.
  4. NTV Telugu (1 April 2024). "వైసీపీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గుడ్‌బై.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా". Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.