జూలై 2024 ప్రపంచ సైబర్ అంతరాయాలు
తేదీ | 19 జూలై 2024 |
---|---|
స్థానం | ప్రపంచవ్యాప్తం |
రకం | అంతరాయం |
కారణం | క్రౌడ్ స్ట్రైక్ సాఫ్ట్వేర్తో డ్రైవర్ సమస్య |
2024 జులై 19న ప్రపంచవ్యాప్తంగా వివిధ కంప్యూటర్ వ్యవస్థలు అంతరాయాలకు గురయ్యాయి. క్రౌడ్‌స్ట్రైక్ భద్రతా సాఫ్ట్‌వేరు తాజాకరణలో లోపం వివిధ పరిశ్రమలలో అంతరాయాలకు దారితీసింది.
కారణం
[మార్చు]ఈ సంఘటన విండోస్ యంత్రాలను "బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్"తో నిలిపివేసింది.[1] అమెరికాకు చెందిన సైబర్ భద్రత సంస్థ క్రౌడ్‌స్ట్రైక్, ఈ సమస్యలకు కారణం తానే అని పెర్కొంది. ఈ సంస్థకు చెందిన ఫాల్కన్ సెన్సార్ అనే భద్రతా సాఫ్ట్‌వేరుకు సంబంధించిన తాజాకరణ ఈ సమస్యకు మూల కారణమని గుర్తించారు.[2]
ప్రభావం
[మార్చు]విండోస్, క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్‌వేరును ఉపయోగిస్తున్న అనేక వ్యాపార సంస్థల ఐటి వ్యవస్థలకు అంతరాయాలు కలిగాయి.[3]
భారతదేశం
[మార్చు]ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్, విస్తారా వంటి విమానయాన సంస్థల్లో అంతరాయం ఏర్పడింది. దీని వలన చేతితో వ్రాసిన బోర్డింగ్ పాసులు జారీచేసారు. [4][5][6]
భారతదేశంలోని ఒరాకిల్, నోకియా, అనేక ఇతర ప్రధాన ఐటి సంస్థలు కూడా అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి.
ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ సమస్య నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) నెట్‌వర్క్‌పై ప్రభావం చూపలేదని అన్నారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య ప్రభావం భారతీయ స్టేట్ బ్యాంకుపై లేదని ఆ సంస్థ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు.[7]
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
[మార్చు]యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలను నిలిపివేసాయి. అప్పటికే టేకాఫ్ అయిన విమానాలు ప్రయాణం కొనసాగిస్తాయి, కానీ కొత్త విమానాలు టేకాఫ్ కావు.[8]
అలాస్కా, అరిజోనా, ఫ్లోరిడా, మిన్నెసోటా, ఒహయో, పెన్సిల్వేనియాలోని కొన్ని ప్రాంతాల్లో 911 కాల్ సెంటర్ల కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.[9]
అంతరాయం ఫలితంగా మైక్రోసాఫ్ట్, క్రౌడ్‌స్ట్రైక్ కంపెనీల షేర్లు పడిపోయాయి. [10]
ప్రతిస్పందన
[మార్చు]అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం జాతీయ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ, "ఆస్ట్రేలియన్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ అంతరాయం గురించి ఆందోళన చెందుతున్నారని నేను అర్థం చేసుకున్నాను. నా ప్రభుత్వం నేషనల్ సైబర్ సెక్యూరిటీ సమన్వయకర్తతో కలిసి పని చేస్తోంది." [11] [12] "ఈ దశలో కీలకమైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సేవలు లేదా ట్రిపుల్-0 సేవలపై ఎలాంటి ప్రభావం లేదు. నేషనల్ కోఆర్డినేషన్ మెకానిజం క్రియాత్మకంగా పని చేస్తోంది. సమావేశం జరుపుతోంది," అని పేర్కొన్నాడు.[13]
మూలాలు
[మార్చు]- ↑ Taylor, Josh (2024-07-19). "Banks, airlines and media outlets hit by global outage linked to Windows PCs". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2024-07-19.
- ↑ Baran, Guru (2024-07-19). "CrowdStrike Update Pushing Windows Machines Into a BSOD Loop". Cyber Security News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-19.
- ↑ Yeo, Amanda (2024-07-19). "Windows PCs crashing worldwide due to CrowdStrike issue". Mashable (in ఇంగ్లీష్). Retrieved 2024-07-19.
- ↑ "Global Microsoft outage impacts Indigo, Akasa, Spicejet, Air India ops, airport services". The Indian Express (in ఇంగ్లీష్). 2024-07-19. Retrieved 2024-07-19.
- ↑ "Microsoft tech glitch: Airlines across globe affected, IndiGo, SpiceJet & Akasa say ops impacted at Mumbai, Delhi airports". The Economic Times. 2024-07-19. ISSN 0013-0389. Retrieved 2024-07-19.
- ↑ "Live: IT outages reported worldwide for banks, stores, airports, media". RNZ (in New Zealand English). 2024-07-19. Retrieved 2024-07-19.
- ↑ Telugu, 10TV; thanniru, Harish (2024-07-19). "మైక్రోసాప్ట్ సేవలకు అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, విమానయాన, టెలీకాం రంగాలపై తీవ్ర ప్రభావం". 10TV Telugu (in Telugu). Retrieved 2024-07-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "United, Delta and American Airlines issue global ground stop on all flights". ABC News (in ఇంగ్లీష్). Retrieved 19 July 2024.
- ↑ Team, Alaska's News Source Digital (2024-07-19). "Alaska experiencing widespread 911 outage". https://www.alaskasnewssource.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-19.
{{cite web}}
: External link in
(help)|website=
- ↑ "Microsoft, CrowdStrike Stock Fall After Outage Hits Companies Globally". The Wall Street Journal. 19 July 2024. p. 1. Retrieved 19 July 2024.
{{cite news}}
: CS1 maint: url-status (link) - ↑ "Live: Banks, stores, airport reporting issues amid global IT issues". 1 News. 19 July 2024. Retrieved 19 July 2024.
- ↑ ""I understand Australians are concerned about the outage that is unfolding globally and affecting a wide range of services."".
- ↑ "There is no impact to critical infrastructure, government services or Triple-0 services at this stage".