Jump to content

జై హింద్

వికీపీడియా నుండి

జై హింద్ అనేది "హిందుస్థాన్‌కు విజయం" అనే అర్థాన్నిచ్చే వందనం, నినాదం. [1] సమకాలీన వ్యావహారిక వాడుకలో సాధారణంగా "భారతదేశం చిరాయువు" [2] లేదా "భారతదేశానికి వందనం" అని అర్ధం ఉంది. ఈ నినాదం బ్రిటిష్ పాలన నుండి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఉపయోగించబడింది. [3] [4] ఈ నినాదం "యుద్ధ కేక" గా, రాజకీయ ప్రసంగాలలో ఒక రూపంగా ఉద్భవించింది. [5]

శబ్దవ్యుత్పత్తి, నామకరణం

[మార్చు]

"జై" అనే పదం జయ ( సంస్కృతం ) నుండి వచ్చింది. దీని అర్థం "విజయం, సంతోషించు". [6] జయ అనే పదం అథర్వణ వేదం 8.50.8 వంటి వేద సాహిత్యంలో, మహాభారతం వంటి వేద కాల అనంతర సాహిత్యంలో కనిపిస్తుంది. [7]

చరిత్ర

[మార్చు]

"జై హింద్" అనే పదాన్ని తొలుత చెంపాకరమన్ పిళ్లై 1907 లో "జై హిందూస్తాన్ కీ" అనే పదానికి లఘురూపంగా రూపొందించాడు. [8] [9]

సుభాష్ చంద్రబోస్ 'జై హింద్' అనే నినాదాన్ని సృష్టించారని ఒక అపోహ ఉంది. అయితే డాక్యుమెంటరీ సాక్ష్యాలు, ఇంటర్వ్యూలు, పరిశోధనల ఆధారంగా "లెజెండోట్స్ ఆఫ్ హైదరాబాద్" అనే పుస్తకంలో మాజీ సివిల్ సర్వంట్ అయిన నరేంద్ర లూథర్ దీనిని జైన్ -ఉల్ అబిదీన్ హసన్‌కు అందించినట్లు ఉంది. అతను హైదరాబాద్ కలెక్టర్ కుమారుడు. అతను ఇంజనీరింగ్ చదవడానికి జర్మనీకి వెళ్లాడు. తరువాత జైన్-ఉల్-అబిదీన్ ఐ.ఎన్.ఏ లో మేజర్ గా ఉద్యోగం పొంది భారతదేశ ఉద్యమాలలో పాల్గొన్నాడు. "నేతాజీ" ( హిందుస్తానీ : "గౌరవనీయ నాయకుడు") సుభాష్ చంద్రబోస్ తన సైన్యంలో భారతీయ తరహా వందనం కోరుకున్నాడు. దానికి వివిధ విధములైన సూచనలు వచ్చాయి. జైన్-ఉల్-అబిదీన్ 'జై హింద్' అనే నినాదంతో ముందుకు వచ్చాడు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దానిని సంతోషంగా అంగీకరించారు. [10] ఈ నినాదాన్ని 1941 లో జైన్-ఉల్-అబిదీన్ సిఫారసు ఆధారంగా ఐ.ఎన్.ఎ కొరకు సుభాష్ చంద్రబోస్ స్వీకరించాడు.

చరిత్రకారుడైన బోస్ మేనల్లుడు సుమంత్ర బోస్ చెప్పిన ప్రకారం, ఈ పదబంధంలో మతపరమైన అంశం లేదు. సుభాష్ చంద్రబోస్, అతని సహచరులు, ముఖ్యంగా 1943–45 మధ్య నిర్వహించిన భారత జాతీయ సైన్యం యొక్క నినాదం, గ్రీటింగ్‌గా ఈ పదం ప్రజాదరణ పొందింది. [5] భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ఇది జాతీయ నినాదంగా ఆవిర్భవించింది. జవహర్‌లాల్ నెహ్రూ, [11] ఇందిరాగాంధీ, [12] రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు వంటి రాజకీయ నాయకులు, ప్రధానమంత్రులు, ఇతర నాయకులు భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పే ఒక సాధారణ రూపం గా మారింది. [13] [14] ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రసంగాలను "జై హింద్" ట్రిపుల్ నినాదాలతో ముగించేది. [12] 1990 ల మధ్య నుండి, భారత సైనిక దళ సిబ్బందిలో గ్రీటింగ్‌గా ఉపయోగించబడుతోంది. [5]

ప్రముఖ సంస్కృతిలో

[మార్చు]

భారత జాతీయవాది సుభాష్ చంద్రబోస్ అనుచరుడు, మధ్య భారతదేశానికి చెందిన గ్వాల్హెర్ (గ్వాలియర్) చెందిన రామచంద్ర మోరేశ్వర్ కర్కరే, మార్చి 1947 లో జై హింద్ అనే దేశభక్తి నాటకం రాశాడు. అదే పేరుతో హిందీలో ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. తరువాత, కర్కరే మధ్య భారతదేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. 

జై హింద్ పోస్ట్ మార్క్ స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి స్మారక పోస్ట్ మార్క్. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి స్టాంపులు 1947 నవంబర్ 21న వెలువడ్డాయి. అందులో "జై హింద్" నిదాదం గల 1.5 అణాలు, 3.5 అణాలు, 12 అణాల స్టాంపులు ఉన్నాయి. జై హింద్‌ తో పాటు, వారు వరుసగా అశోకుని రాజధాని, జాతీయ పతాకం, ఒక విమానం చిత్రాలను ప్రచురించారు. [15] "जय हिन्द" మొదటి, ఇండియన్ స్టాంపుల స్వాతంత్ర్య సిరీస్‌లో కూడా పేర్కొనబడింది.

ఆల్ ఇండియా రేడియోలో ప్రసారాల చివరలో ఈ పదబంధం ఉపయోగించబడింది.  ఇది 1963 లో లతా మంగేష్కర్ పాడిన "ఏ మేరే వతన్ కే లోగో " అనే దేశభక్తి గీతంలో కనిపిస్తుంది [16]

మహాత్మా గాంధీ 1947 లో బ్రిటిష్ రాజ దంపతులు క్వీన్ ఎలిజబెత్ II , ప్రిన్స్ ఫిలిప్‌ల వివాహ కానుకగా తాను స్వయంగా తయారుచేసిన నూలుతో నేసిన వస్త్రంపై "జై హింద్" అని రాసి అందజేసాడు. [17]

ఎయిరిండియా నినాదాల ప్రారంభ సంవత్సరాల్లో ఈ పదబంధం ఉండేది. 1965 లోక్‌సభ చర్చలో ఇది "ఒక దేశం, ఒక నాయకుడు, ఒక భారతదేశం, జై హింద్" అనే ప్రభుత్వ యాజమాన్యంలోని జాతీయ విమానయాన సంస్థ యొక్క ట్యాగ్‌లైన్‌లో భాగం అని పేర్కొన్నారు. [18]

ఇతర వాడుకలు

[మార్చు]

ఈ పదబందం ఈ క్రింది వానిలో ఉపయోగించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

 

  1. Chopra, Pram Nath (2003). A comprehensive history of modern India. Sterling Publishing. p. 283. ISBN 81-207-2506-9. Retrieved 17 February 2010.
  2. James, Lawrence (1997). The Rise and Fall of the British Empire. Macmillan. p. 548. ISBN 978-0-312-16985-5. Retrieved 17 February 2010.
  3. Ian W. Archer (2014). Transactions of the Royal Historical Society. Cambridge University Press. p. 203. ISBN 978-1-107-06386-0.
  4. Gyanendra Pandey (2001). Remembering Partition: Violence, Nationalism and History in India. Cambridge University Press. pp. 100–101. ISBN 978-0-521-00250-9.
  5. 5.0 5.1 5.2 Sumantra Bose (2018). Secular States, Religious Politics. Cambridge University Press. pp. 49–50. ISBN 978-1-108-47203-6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "bose2018" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. Duncan Forbes (1958). A Dictionary, Hindustani & English: Accompanied by a Reversed Dictionary, English and Hindustani. W.H. Allen and Company. p. 307.
  7. Monier Monier-Williams. "jaya (जय)". Monier-Williams Sanskrit-English Dictionary 1899 (Updated 2009). Harvard University Press.
  8. https://www.onmanorama.com/lifestyle/news/chempaka-raman-pillai-indian-revolutionary-freedom-fighter.html
  9. https://tamil.indianexpress.com/lifestyle/chempakaraman-pillai-jai-hind-history-in-tamil-independence-day-essay/
  10. https://m.timesofindia.com/india/Who-coined-the-slogan-Jai-Hind/articleshow/30939048.cms
  11. Benjamin Zachariah (2004). Nehru. Routledge. pp. 126–127. ISBN 978-1-134-57740-8.
  12. 12.0 12.1 Indira Gandhi (1984). Selected speeches and writings of Indira Gandhi, September 1972-October 30, 1984. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. p. 273.
  13. Jagdish Bhagwati; Arvind Panagariya (2013). Why Growth Matters: How Economic Growth in India Reduced Poverty and the Lessons for Other Developing Countries. Public Affairs. p. 27. ISBN 978-1-61039-272-3.
  14. Economic and Political Weekly, Volume 24. Sameeksha Trust. 1989. p. 1325.
  15. Gopa Sabharwal (2017). India Since 1947: The Independent Years. Penguin Random House. p. 24. ISBN 978-93-5214-089-3.
  16. Chaturvedi, Mamta (2004). Filmi & non-filmi songs. Diamond Pocket Books. p. 38. ISBN 81-288-0299-2.
  17. "Archived copy". Archived from the original on October 8, 2015. Retrieved November 10, 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  18. Asian Recorder. K. K. Thomas at Recorder Press. 1965. p. 6220.
"https://te.wikipedia.org/w/index.php?title=జై_హింద్&oldid=4073088" నుండి వెలికితీశారు