Jump to content

డి.కె. సత్యప్రభ

వికీపీడియా నుండి
డి.కె. సత్యప్రభ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం
ముందు సికె. జయచంద్రా రెడ్డి
తరువాత ఆరణి శ్రీనివాసులు

వ్యక్తిగత వివరాలు

జననం 21 సెప్టెంబర్ 1951
సదుం మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 18 నవంబర్ 2020
బెంగళూరు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి డి.కె.ఆదికేశవులు నాయుడు
సంతానం 1 కొడుకు, 2 కూతుర్లు

డి.కె. సత్యప్రభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచింది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

డి.కె. సత్యప్రభ 21 సెప్టెంబర్ 1951లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో జన్మించింది. ఆమె బెంగళూరులో ఇంటర్మీడియట్ వరకు చదివింది.

రాజకీయ జీవితం

[మార్చు]

డి.కె. సత్యప్రభ తన భర్త [[డి.కె.ఆదికేశవులు నాయుడు మరణాంతరం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 2014లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు శాసనసభ నియోజకవర్గం|చిత్తూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరుపన పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పై 6,799 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. సత్యప్రభ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్‌గా, అసెంబ్లీ మహిళా శిశుసంక్షేమ కమిటీలో సభ్యురాలిగా, అసెంబ్లీ సాధారణ కమిటీలో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించింది. ఆమె 2019లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రాజంపేట (లోక్ సభ నియోజకవర్గం) నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పి.వి.మిధున్ రెడ్డి చేతిలో ఓడిపోయింది. ఆమె 2020లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది.

మరణం

[మార్చు]

డి.కె. సత్యప్రభ అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని వైదేహీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 18 నవంబర్ 2020న మరణించింది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. TV9 Telugu (20 November 2020). "టీడీపీలో విషాదం.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ..!". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Zee News Telugu (20 November 2020). "చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  4. Andhrajyothy (20 November 2020). "చిత్తూరు. మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.