Jump to content

డెబియన్

వికీపీడియా నుండి
డెబియన్
Debian logo
డెబియన్ 6.0 ("స్క్వీజ్") తెరచాప
గ్నోమ్ తో డెబియన్ గ్నూ/లినక్స్ 6.0 ("స్క్వీజ్")
అభివృద్ధికారులుడెబియన్ ప్రోజెక్ట్
నిర్వహణవ్యవస్థ కుటుంబంయునిక్స్ వంటి
పనిచేయు స్థితిప్రస్థుతపు
మూల కోడ్ విధానంఉచిత, ఓపెన్ సోర్స్ సాప్ట్వేర్
తొలి విడుదల16 ఆగస్టు 1993 (1993-08-16)
విడుదలైన భాషలు65 భాషలకు పైగా
తాజా చేయువిధముAPT
ప్యాకేజీ మేనేజర్dpkg
ప్లాట్ ఫారములుi386, amd64, PowerPC, SPARC, DEC Alpha, ARM, MIPS, PA-RISC, S390, IA-64
Kernel విధముMonolithic (Linux, FreeBSD), Micro (Hurd)
వాడుకరిప్రాంతముGNU
అప్రమేయ అంతర్వర్తిGNOME, KDE Plasma Desktop, Xfce, LXDE
లైెసెన్స్ఫ్రీ సాప్ట్వేర్, ముఖ్యంగా GNU GPL, ఇతర లైసెన్సులు
అధికారిక జాలస్థలిwww.debian.org

డెబియన్ అనేది ఒక కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ, ఇది ఫ్రీ, ఓపెన్ సోర్స్ ప్రత్యేకంగా గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్సు కింద ఉన్న సాప్ట్వేర్లు, ఇతర ఫ్రీ సాప్ట్వేర్ల లైసెన్సుల మీద ఉన్న సాప్ట్వేర్ల కూర్పు.లినక్స్ కెర్నలు, గ్ను ఆపరేటింగ్ సిస్టం సాధనాలను వాడటం వలన దీనిని డెబియన్ గ్నూ/లినక్స్ గా వ్యవహరిస్తారు, ఇది గ్నూ/లినక్స్ పంపకాలలో ఒక ప్రజాదరణ పొందిన పంపకం. స్థాపించి వాడుకోవటానికి తయారుగా ఉన్న వేల సాప్ట్వేర్ల ప్యాకేజీలు కలిగిన నిధులను అందుబాటులో ఉండేటట్లు దీనిని పంచుతారు. యునిక్స్, ఫ్రీ సాప్ట్వేర్ తత్వాలను తప్పనిసరిగా పాటించే పంపకంగా దీనిని వ్యవహరిస్తారు. డెబియన్ను డెస్క్టాపు వలె అదే విధంగా సెర్వర్ ఆపరేటింగ్ సిస్టంగా కూడా వాడుకోవచ్చు.

నిర్వాహణ

[మార్చు]

డెబియన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది స్వచ్ఛంద కార్యకర్తలచే, లాభం ఆశించని స్వచ్ఛంద సంస్థల విరాళాలచే అభివృద్ధి చేయబడుతుంది.

విశిష్టతలు

[మార్చు]

డెబియన్ మీద ఆధారపడి చాలా పంపకాలు ఉన్నాయి, వాటిలో ఉబుంటు, లినక్స్ మింట్, మెపిస్, క్జాండ్రోస్, నాపిక్స్, లిన్స్పైర్, లిన్ఎక్స్, బాస్ లినక్స్, స్వేచ్ఛ, ఇతర ఉన్నాయి.

డెబియన్ విరివిగా పొందగలిగిన సాప్ట్వేర్లకు, ఐచ్ఛికాలకు కొలువు. ప్రస్తుత స్థిర విడుదల 25 వేల సాప్ట్వేర్ ప్యాకేజీలను 12 వివిధ రకాల కంప్యూటర్ నిర్మితాలకు అందిస్తుంది. ఈ నిర్మితాలలో ఇంటెల్/AMD 32-బిట్/64-బిట్ నిర్మితాలు వ్యక్తిగత కంప్యూటర్లలో వాడబడుతుంటే, ARM నిర్మితాలలో ముఖ్యంగా ఎంబెడెడ్ సిస్టంలలో, IBM సెర్వర్ మెయిన్ ఫ్రేమ్ లలో సాధారణంగా వాడుతూ కనిపిస్తున్నాయి. డెబియన్‌లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి APT ప్యాకేజీ నిర్వాహణా వ్యవస్థ, అధిక మొత్తంలో ప్యాకేజీలు, నిర్ణయబద్దమైన ప్యాకేజీల విధానాలు, అధిక నాణ్యత కలిగిన విడుదలలు. ఈ పద్ధతి ద్వారా పాత ప్యాకేజీల నుండి కొత్తగా విడుదల అయిన ప్యాకేజీలను కావలిసిన వాటిని స్వయంచాలకంగా స్థాపించి అనవసరమైన ప్యాకేజీలను తొలగిస్తుంది. డెబియన్, దాని ఆధారిత సాప్ట్వేర్లన్నీ .deb అనే పొడిగింతతో ఉంటాయి, వీటిని డెబియన్ ప్యాకేజీలుగా పిలుస్తారు. వీటిని సులభంగా స్థాపించి వాడుకోవచ్చు.

డెబియన్ ప్రమాణిక స్థాపనలో GNOME డెస్కుటాప్ పర్యావరణం వాడబడుతుంది.ఇందులో లిబ్రే ఆఫీసు, ఐస్ వీసెల్ (ఫైర్ఫాక్స్ నకలీ), ఎవల్యుషన్ మెయిల్, CD/DVD వ్రైటింగ్ ప్రోగ్రాంలు, సంగీత, వీడియో ప్లేయర్లు, చిత్రాల వీక్షక మరయు సవరణ సాప్ట్వేర్లు, PDF చదువరి సాప్ట్వేర్లు డెబియన్ స్థాపించినపుడే దానితో పాటే స్థాపించబడతాయి. ముందుగా తయారుచేయబడిన CD ఇమేజ్లు KDE సాప్ట్వేర్ల కంపైలేషన్, Xfce, LXDE వంటి డెస్క్టాపు పర్యావరణాలకు కూడా అందుబాటులో ఉన్నాయి. డెబియన్‌ను సిడి/డివిడి ఇమేజ్ (.iso) ఫైళ్ళను మీరు ఉచితంగా నేరుగా లేదా టోరెంట్లు లేదా jigdoల వంటి వివిధ పద్ధతుల ద్వారా ఉచితముగా డౌన్లోడు చేసుకోవచ్చు లేదా ఆన్ లైన్ వర్తకుల నుండి కొనుక్కోవచ్చు.

చరిత్ర

[మార్చు]

డెబియన్ 1993లో ఇయాన్ ముర్డాక్ అనే పుర్డ్యు విశ్వవిద్యాలయ విద్యార్థిచే సృష్టించబడింది. అతను లినక్స్ పంపకం అందరికీ అందుబాటులో ఉండేటట్లు డెబియన్ ప్రణాళికను రూపొందించాడు. డెబియన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే అతని స్నేహితురాలి (ఇపుడు అతని భార్య ) పేరు డెబ్రా (DEBRA) లోని మొదటి మూడు అక్షరాలను తన పేరులోని (Ian Murdock) మొదటి మూడు అక్షరాలను కలిపి DEBIAN గా తయారయింది. దీనిని డెబియన్ (deb-e′-en) అని పిలుస్తారు. డెబియన్‌ను మొట్టమొదటిసారిగా 1993 ఆగస్టు 16న ఇయాన్ ముర్డాక్ ప్రకటించారు.

విడుదలలు

[మార్చు]
డెబియన్ స్థాపకం

డెబియన్ విడుదల పేర్లు టాయ్ స్టోరీ అనే ఒక ఆంగ్ల చిత్రంలోని పాత్రల పేర్లు తీసుకుని పెట్టడం జరుగుతుంది.

అస్ధిర విడుదల

[మార్చు]

డెబియన్ ప్రోజెక్టు ఎల్లప్పుడూ అస్థిర విడుదల మీద పని కొనసాగిస్తుంది. దీనినే "సిడ్" (కోడ్ పేరు sid, ఇది కూడా టాయ్ స్టోరీ చిత్రంలో ఒక పాత్ర, సిడ్ అనే పేరు గల కుర్రాడు బొమ్మలను ధ్వంసం చేస్తూ అనందిస్తూ ఉండే ఒక దుష్టమైన పాత్ర) గా పిలుస్తారు.ఇక ఈ పేరును డెబియన్ వారు ఎంతో తెలివిగా SID (Still in Developement) గా వాడుతున్నారు. ఇందులో కొత్తగా నవీకరించబడిన ప్యాకేజీలను స్థిరంగా ఉన్న కొత్త విడుదలకు జతచేసి తరువాయి స్థిరమైన విడుదలకు ప్రయత్నిస్తారు. ఈ విధంగా డెబియన్ విడుదల చక్రం తిరుగుతూ ఉంటుంది.

స్ధిరమయిన విడుదల

[మార్చు]

డెబియన్ ఎల్లప్పుడూ ఒక స్థిరమైన విడుదలని వాడుకలో ఉంచుతుంది. ఎప్పుడైతే ఒక కొత్త వెర్షన్ విడుదలవుతోందో, అంతకు ముందు విడుదల అయిన వెర్షన్ కి మరో సంవత్సరం పాటు డెబియన్ రక్షణ బృందం వారు మద్ధతు అందిస్తారు. తరువాయి స్థిరమైన విడుదల అయ్యేవరకూ అస్థిర, పరీక్షించబడుతున్న రెండు నిక్షేపాలను నిరంతరం నవీకరించి అభివృద్ధి చేస్తారు. ప్రస్తుత స్ధిరమయిన విడుదల పేరు వ్హీజి.

పంపకాలు

[మార్చు]

డెబియన్ సగటున 1.5 సంవత్సరాల వ్యవధిలో ఒక కొత్త వెర్షన్ విడుదల చేస్తుంది. అంటే దాదాపు 535 రోజుల వ్యవధిలో ఒక కొత్త వెర్షన్ విడుదల అవుతుంది. దీని అభివృద్ధి సాధారణంగా మూడు స్థితుల్లో జరుగుతుంది. వీటిని స్థిరమైన, పరీక్షించబడుతున్న, అస్థిరమైన దశలుగా విభజించారు. ఇందులో మొదటిగా అస్థిరమైన దశలో ఉన్న దానిని తీసుకుని అందులో గల లోపాలను కొంతవరకూ సరిచేసిన తర్వాత దానిని పరీక్షించబడుతున్న స్థితిలో ఉన్న దానిగా పరిగణించి దాంట్లో కూడా ఉన్న దోషాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాడుకరుల నుంచి సేకరించి వాటిలోని ఉన్న దోషాలను కూడా పరిష్కరించి ఒక స్థిరమైన స్థితికి తీసుకు వస్తారు అలా అ దశలో ఉన్న దానిని స్థిరమైనది (Stable) గా ప్రకటిస్తారు. డెబియన్ అభివృద్ధి క్రమంలో ఉన్నమూడు దశలు ఇక్కడ గమనించవచ్చు.

  • Stable (స్థిరమైనది)
  • Testing (పరీక్షించబడుతున్నది)
  • Unstable (అస్థిరమైనది)

బయటి లింకులు

[మార్చు]


లినక్స్ పంపిణీలు edit

డెబియన్ | ఉబుంటు | రెడ్ హ్యాట్ లినక్స్ | ఫెడోరా | జెంటూ లినక్స్ | ఓపెన్ స్యూజ్ | సెంటాస్ | నాఁప్పిక్స్ | కుబుంటు | లినక్స్ ఫ్రమ్ స్క్రాచ్ | డామ్ స్మాల్ లినక్సు | పీసీ లినక్స్ ఓ యస్
మాండ్రివా | మెపిస్ | పప్పీ లినక్సు | స్లాక్ వేరు లినక్స్ | క్షాండ్రోస్ లినక్స్ | మరిన్ని...

"https://te.wikipedia.org/w/index.php?title=డెబియన్&oldid=4027866" నుండి వెలికితీశారు