తెలుగుతల్లి కెనడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగుతల్లి కెనడా పత్రిక కెనడా దేశం నుండి వెలువడుతున్న తొలి తెలుగు అంతర్జాల సాహిత్య మాసపత్రిక.[1] 2016 లో ప్రారంభించబడింది. అంతర్జాలంలో ప్రతీ నెలా 15 వ తేదీన ప్రచురించబడుతుంది. దీనిలో అన్ని దేశాల రచయితల, రచయిత్రుల రచనలు, సాహిత్యప్రక్రియలు ప్రచురించబడతాయి. ప్రతీ సంవత్సరం పోటీలు నిర్వహిస్తుంది. సంస్థాపకురాలు, సంపాదకురాలు శ్రీమతి లక్ష్మీరాయవరపు, ఈమె స్వస్థలం తెలంగాణ, అల్వాల్. ప్రస్తుత నివాసం కెనడా. పత్రిక ఆద్గ్వర్యంలో ప్రతీ సంవత్సరం అంతర్జాలంలో సాహిత్య కార్యక్రమాలు,[2] కెనడా వారికి పాడనా తెలుగు పాట సంగీత పోటీలు నిర్వహించబడతాయి. 1993 సంవత్సరంలో కొమరవోలు సరోజ మొదలుపెట్టిన తెలుగుతల్లి పేరు మీద వారి గౌరవార్ధం కొనసాగడం విశేషం.

శీర్షికలు

[మార్చు]
  • పురాణాలు, జానపదాలు ఆధారిత రచనలు, అనువాదాలు
  • వైద్య సంబంధిత వ్యాసాలు
  • జ్యోతిష్య వ్యాసాలు
  • పుస్తక పరిచయాలు
  • వివిధ రంగాలలో ప్రముఖుల పరిచయ వ్యాసాలు
  • పూర్వ రచయిత/త్రుల రచనల పరిచయాలు
  • కార్టూనిస్టుల ఇంటర్వూలు

కార్యక్రమాలు

[మార్చు]
  • 2016 లాభాపేక్ష లేని సంస్థగా రూపుదిద్దుకుని దేశ వ్యాప్తంగా సంగీతం. సాహిత్యం, లలితకళలు మొదలయిన వాటిని అభివృధ్ది పరిచే లక్ష్యాన్ని రచించుకుని ఆ దిశగా అడుగులు వేసింది.
  • పత్రిక అనుబంధ సంస్థ గడుగ్గాయి పిల్లల పత్రిక తొమ్మిదిమంది సభ్యుల కమిటీతో నడపబడుతోంది.
  • ఇతర విభాగాలు తెలుగుతల్లి పబ్లికేషన్, తెలుగుతల్లి యూట్యూబ్ ఛానెల్,[3] కెనడా తెలుగువారి వివాహవేదిక మొదలయినవి.
  • ప్రతీ సంవత్సరం కెనడా కళాకారులతో అన్నమయ్య ఆరాధనోత్సవాలు జరుగుతాయి.[4] 2022 సంవత్సరం వీటిలో సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు.
  • త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు యూట్యూబ్ లో పత్రిక నిర్వహకులతో జరుపబడుతున్నాయి.
  • ఒక సీనియర్ గాయకునికి/గాయనీ మణికి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వబడుతుంది.
  • 2021 కెనడా- అమెరికా తెలుగు సదస్సు[5][6]

ప్రచురణలు

[మార్చు]
  1. మొట్టమొదటి కెనడా తెలుగు సాహిత్య సదస్సు ప్రత్యేక సంచిక.- వంగూరి ఫౌండేషన్ భాగస్వామ్యంతో తొమ్మిది ఇతర సంస్థలతో
  2. కలిపి జరిగిన తొలి కెనడా తెలుగువారి సదస్సు విశేషాలు, ప్రసంగాలు, చిత్రాలు ఇందులో ఉంచబడ్డాయి.
  3. జ్వలిత-ఎన్నెల - జ్వలిత అనే పేరుతో రచనలు చేస్తున్న దెంచనాల జ్వలిత, లక్ష్మీరాయవరపు ఇద్దరు రచయిత్రుల కథల సంకలనం.
  4. తియ్యండ్రా బండ్లు- ఆటోమొబైల్ సంబంధిత కథలు పాత కొత్త రచయిత/త్రులవి సమీకరించి ప్రచురించిన తొలి పుస్తకం.
  5. సంగీత సాగరి- తెలుగుతల్లి పత్రికలో రత్నచెర్ల తొలితరం సంగీతకళాకారుల గురించిన వ్రాసిన వ్యాసాల సంపుటి.
  6. కెనడా కతలు- కెనడాలో నివసిస్తున్న రచయిత/రచయిత్రుల కథల తొలి సంకలనం.
  7. నిర్వచనోత్తర రామాయణము- రామాయణంపై అందులో శ్లోకాలపై వివరణాత్మక వ్యాసాల సంకలనం. రచయిత శ్రీరామం దగ్గుబాటి.

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు తల్లి కెనడా పత్రిక". www.telugutalli.ca. Retrieved 2024-02-14.
  2. krishna (2021-08-28). "కెనడాలో తెలుగు సాహితీ సదస్సు..." Mana Telangana. Retrieved 2024-02-14.
  3. https://www.youtube.com/@TeluguTalliCanada
  4. telugu, NT News (2023-05-25). "Annamaiah Aradhanostavalu | కెనడాలో అట్ట‌హాసంగా అన్నమయ్య ఆరాధనోత్సవాలు". www.ntnews.com. Retrieved 2024-02-14.
  5. జెఎస్కె. "ద్విగ్విజయంగా సాగిన కెనడా- అమెరికా తెలుగు సదస్సు". telugu.webdunia.com. Retrieved 2024-02-14.
  6. ** (2021-10-08). "ద్విగ్విజయంగా సాగిన కెనడా-అమెరికా తెలుగు సదస్సు". Suryaa.co.in. Retrieved 2024-02-14. {{cite web}}: |last= has numeric name (help)

ఇతర లంకెలు

[మార్చు]