జ్వలిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జ్వలిత
జననందెంచనాల విజయకుమారి
(1959-03-11)1959 మార్చి 11
తిరుమలాయపాలెం గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ India
ప్రసిద్ధికవయిత్రి, కథా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తతుంగతుర్తి జనార్ధనరావు
తండ్రిదెంచనాల బ్రహ్మయ్య
తల్లిదెంచనాల ఈశ్వరమ్మ

జ్వలిత అనే కలం పేరుతో కవిత్వం వెలువరిస్తున్న కవయిత్రి అసలు పేరు దెంచనాల విజయకుమారి. ఈమె దెంచనాల ఈశ్వరమ్మ, బ్రహ్మయ్య దంపతులకు 1959 మార్చి 11వ తేదీన ఖమ్మం జిల్లా తిరుమలాయపాళెంలో జన్మించింది[1]. ఈమె స్వయంకృషితో ఎం.ఎ. తెలుగు, ఎం.ఎస్.సి సైకాలజీ, ఎం.ఇడి, ఎల్.ఎల్.బి. చదివింది. ఈమె భర్త తుంగతుర్తి జనార్ధనరావు. ఈమె తమ్ముడు దెంచనాల శ్రీనివాస్ తెలుగు నాటకరంగ రిపర్టరీలో నూతన ప్రయోగాలతో మలుపులు తిప్పుతున్న రచయిత. ఈమె ఉపాద్యాయినిగా పనిచేసి త్వరలో పదవీ విరమణ చేయనున్నది.[2]

రచనలు[మార్చు]

ఈమె పలు వచనకవితలు, కథలు, వ్యాసాలు రచించింది. ఈమె రచనలలో ఉద్యోగినులైన మహిళల జీవితంలో ఎదురయ్యే సమస్యలు, దళిత బహుజన మహిళల సమస్యలు ప్రతిబింబిస్తాయి.

ఈమె వ్రాసిన పుస్తకాలు:

  1. జ్వలితార్ణవాలు (వ్యాస సంపుటి)
  2. సుదీర్ఘ హత్య (కవిత్వం)
  3. ఆత్మాన్వేషణ (కథలు)
  4. పరివ్యాప్త (కవితా సంకలనం)
  5. అగ్నిలిపి
  6. కాలాన్ని జయిస్తూ నేను
  7. మర్డర్ ప్రొలాంగేర్
  8. గాయాలే గేయాలై
  9. ఖమ్మం కథలు (1911-2016) (సంపాదకత్వం) మొదలైనవి.

సాహితీవ్యాసంగం[మార్చు]

ఈమె రుంజ రచయితల వేదిక, మట్టిపూల రచయిత్రుల వేదిక, బి.సి.రచయితల వేదిక, దళిత బహుజనుల రచయితల వేదిక, జీవన జ్వలిత చారిటబుల్ ట్రస్ట్ మొదలైన అనేక సాహిత్య సామాజిక సంస్థలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నది. ఈమె కృషిని గుర్తించి అనేక సంస్థలు ఈమెను సత్కరించాయి. రంజని నందివాడ శ్యామల స్మారక పురస్కారం,భూమిక ఉత్తమకథా పురస్కారం, మధర్ థెర్రిస్సా సేవాసంస్థ ఆణిముత్యం పురస్కారం,రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారం, శాతవాహన విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయి పురస్కారం,విశ్వభారతి ఉగాది పురస్కారం వీటిలో కొన్ని మాత్రమే. 2015 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం ఈమెకు ఉత్తమ రచయిత్రిగా కీర్తి పురస్కారాన్ని ప్రకటించింది.[3]

మూలాలు[మార్చు]

  1. "` కాలాన్ని జయిస్తూ నేను`అంటున్న 'జ్వలిత'". Archived from the original on 2016-06-06. Retrieved 2017-03-12.
  2. బి.ఎస్., రాములు (9 March 2017). "నిరంతరం జ్వలించే జ్వలిత - సాహితీ కెరటాలు". నేటి నిజం. బైస దేవదాసు.
  3. విలేకరి (9 March 2017). "తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే". సాక్షి దినపత్రిక. Archived from the original on 12 మార్చి 2017. Retrieved 12 March 2017.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=జ్వలిత&oldid=3867111" నుండి వెలికితీశారు