ప్రేమ్ సింగ్ (దీక్షగురు)

వికీపీడియా నుండి
(దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్
దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్
జననం (1944-08-30) 1944 ఆగస్టు 30 (వయసు 79)
రాఖీ పూర్ణిమ, కొత్తపల్లి (హెచ్) నార్నూర్ ఆదిలాబాద్, తెలంగాణ ఇండియా
జాతీయతభారతీయ హిందూ
ఇతర పేర్లుదీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్
వృత్తిసంచార సాధువు,బంజారా ధర్మ ప్రచార గురువు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దీక్ష భూమి పీఠాధిపతి , ప్రముఖ బంజారా ధర్మ గురువు,

సంత్ సేవాలాల్ దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ దీక్షభూమి కొత్తపల్లి (హెచ్)[1] [2]పీఠాధిపతి.ప్రముఖ బంజారా సంచార సాధువు.భారత దేశంలో ఉన్న తన బంజారా , లంబాడీ భక్తులతో 1992 లో దీక్షభూమి కొత్తపల్లి (హెచ్) నుండి సేవాలాల్ దీక్ష ప్రారంభించారు[3][4].[5][6]

బాల్య జీవితం[మార్చు]

సంత్ సేవాలాల్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ వారు శ్రావణ మాసంలో రాఖీ పూర్ణిమ రోజున తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి హెచ్ తాండలో ఘమాబాయి, లచ్మా భంగీ దంపతులకు దేగావత్ భూక్య గోత్రంలో 30 ఆగష్టు 1944 లో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆ రోజులలో పాఠశాలాలు లేక పోవడంతో విద్యకు నోచుకోలేదు. తన పదిహేనవ ఏట జనాబాయితో వివాహం జరగినది.సంసార జీవనంలో ఉంటూ లోకహితం కోసం పాటుపడాలని ఆలోచించే వారు.నిరంతరం శివున్ని ఆరాధిస్తూ భక్తిభావంతో ధర్మాన్ని నిర్వర్తిస్తు సాధన కొనసాగించే వారు. ఇంటి వద్దనే మరాఠీ వర్ణమాల నేర్చుకుని సహజ పాండిత్యంతోనే హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత,బ్రహ్మానంద, గీత పారాయణం పఠనం ప్రారంభించారు. బంజారా భజన గాయకులు మౌఖికంగా పాడే సంత్ సేవాభాయా, సంత్ రామరాయా, సాతీ భవానీ, చరిత్ర, భీమానాయక్ చేసిన తపస్సు, మొదలగు విషయాలలో సంపూర్ణమైన జ్ఞాన్నాన్ని సంపాదించారు.దీక్ష గురువు తన మూపై నాల్గవ ఏట అనగా 1978 లో సంసార బంధాలను త్యజించి సన్యాసి జీవితం స్వీకరించారు.

సన్యాస జీవితం[మార్చు]

ప్రేమ్ సింగ్ మహారాజ్ లోకహితం కోసం సన్యాస జీవితం స్వీకరించి భౌతికంగా తనకు ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా తన యొక్క అంతరంగంలో భగవంతుని స్మరిస్తూ పరోపకారం కోసం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నాలుగు పవిత్ర దేవాలయాలు,చార్ ధామ్ ముఖ్యంగా శివుడు నివసించే కేదార్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని,ముఖ్యమైన తీర్థయాత్రలను దర్శించుకున్నారు.ఒక రోజు వారి కలలో పౌరహాదేవి పీఠాధిపతి బాలబ్రహ్మ చారి తపస్వి సంత్ రామారావు మహారాజ్ దండకారణ్యంలో ఉన్న ఒక విశాల మైనా జలపాతంలో స్నానం చేస్తూ నీటిలో మునిగిపోతున్న దీక్ష గురు ప్రేమ్ సింగ్ మాహారాజ్ ని సంత్ రామారావు మహారాజ్ తన కుడిచేతిని పట్టి పైకి లాగి జలపాతం నుండి బయటికి తీసినట్లు కనిపించింది.

1978 లో ప్రేమ్ సింగ్ మహారాజ్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో కుంరంభీం ఆసిపాబాద్ జిల్లా కెరమెరి[7] మండలంలోని కోటా పరందోలి అడవుల్లో ఉన్న ఒక పవిత్రమైన క్షేత్రం శంకర్ లొద్దిలో మహారాజ్ దీక్షకు పూనుకున్నారు.శివుని అనుగ్రహ ముతో రావి చెట్టు క్రింద ఒక సంవత్సరం పాటు ఉపవాసంతో తపస్సు చేసి భక్తి మార్గంలో నిమగ్నమైన అతనిని అమ్మ జగదాంబ దేవి సంత్ రామారావు మహారాజ్ కలలో ప్రత్యక్షమై శంకర్ లొద్దిలో తపస్సులో ఉన్న దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గురించి చెప్పడంతో పౌరహాగడ్ పీఠాధిపతి సంత్ రామారావు మహారాజ్ 11 జనవరి 1979 లో మహారాష్ట్ర వాసీం జిల్లా మనోరా తాలుకా పౌరహాదేవి నుండి సంత్ రామారావు మహారాజ్ కెరమెరి మండలంలోని అనార్ పల్లి తాండ మీదుగా శంకర్ లొద్ది చేరుకొని తపస్సు నుండి విరమింపజేసి గురువు సంత్ రామారావు మహారాజ్ విరిపట్ల ప్రసన్నుడై ఉపదేశం ఇచ్చి ఆశీర్వదించి తమ శిష్యునిగా స్వీకరించారు.

బోధనలు[మార్చు]

దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహరాజ్ భారత దేశం లోని వివిధ రాష్ట్రాల్లోని తాండాలలో పర్యటిస్తూ బంజారా, లంబాడి, సుగాలి సమాజాన్ని దిశా నిర్దేశం చేసి ప్రతితాండ ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నారు.తాండలలో బంజారా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తూ పదిహేను కోట్ల బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి ఆలయ భూమిపూజ, మందిర నిర్మాణానికి కృషి చేస్తున్నారు. మందిరంలో సంత్ సేవాభాయా, సంత్ రామరాయా విగ్రహ ప్రతిష్టాపన,భోగ్ భండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన యొక్క బోధనలతో ప్రజలను చైతన్య పరుస్తూ మత మార్పిడులను నిరోధిస్తున్నారు.హిందూ ధర్మాన్ని మరియు బంజారా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతు హైందవ సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటుతున్నారు.బంజారా సమాజంలో దాగి ఉన్న సాంఘిక దూరాచారాలు నిర్మూలించడానికి తన వంతు కృషి చేస్తూ జాతిని జాగృతం చేస్తున్నారు.మద్యం ధూమపానం,మాదక ద్రవ్యాల నుండి అనేక తాండాలను దూరం చేశారు.

మహా యజ్ఞాలు[మార్చు]

దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ వారి గురువు సంత్ రామారావు మహారాజ్ అధ్వర్యంలో ఈ యజ్ఞం నిర్వహించినారు. ఇప్పటి వరకు మహారాజ్ వారు మొత్తం ఏడు యజ్ఞాలు నిర్వహించారు.లోక కల్యాణం కొరకు వివిధ రకాలైన యజ్ఞాలు చేశారు. యజ్ఞం చేయడం వలన అగ్నిలో వేసిన పదార్థాలు దేవి దేవతలకు చేరుతాయని విశ్వాసం.యజ్ఞం యొక్క లక్ష్యం దేవి,దేవతలను అగ్ని హోమం వద్ద వేద మంత్రాలతో పూజించడం అని అర్థం.

1.రుద్ర సహాకార యజ్ఞం. రుద్ర సహాకార యజ్ఞం మహారాజ్ వారు తొలి సారిగా చేసిన యజ్ఞం. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని శంకర్ లొద్దిలో ఈ యజ్ఞం 16 ఫిబ్రవరి 1988 లో నిర్వహించారు.

2.లక్ష చండి యజ్ఞం దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఈ లక్ష చండి యజ్ఞాన్ని 02-03-1992 లో దీక్షభూమి కొత్తపల్లి-హెచ్ ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో జరిపారు.ఈ యజ్ఞంలో పౌరహ గడ్ పీఠాదీపతి సంత్ రామారావు మహారాజ్ పాల్గొన్నారు.

3.సహాస్ర చండి యజ్ఞం 04 ఎప్రిల్ 1992లో మహారాష్ట్రలోని వాసీం జిల్లా మనోరా తాలుకాలోని బంజారా కాశీ పౌరహాగడ్ లో జరిగింది.

4.లక్షచండి మహా యజ్ఞం ఈ నాల్లో మహా యజ్ఞం పౌరహాగడ్ లో సంత్ రామారావు మహారాజ్ ఆధ్వర్యంలో 11 ఎప్రిల్ 1994 లో జరిగినది.

5.లక్షచండి మహా యజ్ఞం 28 ఫిబ్రవరి 2000 లో సంత్ రామారావు మహారాజ్ నేతృత్వంలో పోరహాగడ్ తీర్థ క్షేత్రంలో జరిగినది.

6.లక్షచండి మహా యజ్ఞం 24 మార్చి 2017 లో పౌరహాదేవిలో సంత్ రామారావు మహారాజ్ వారి అధ్వర్యంలో జరిగినది.

7.సహాస్ర చండి మహా యజ్ఞం 02 ఎప్రిల్ 2022లో తీర్థ క్షేత్రం సేవాదాస్ నగర్ (పెన్ గంగా)మహోర్ గడ్ జిల్లా నాందేడ్ మహారాష్ట్ర లో జరిగినది.

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2024-01-10). "దీక్షభూమికి ఆధ్యాత్మిక శోభ". www.ntnews.com. Retrieved 2024-03-11.
  2. "సాక్షి : Sakshi Telugu News Paper | Sakshi ePaper | Sakshi Andhra Pradesh | Sakshi Telangana | Sakshi Hyderabad". epaper.sakshi.com. Retrieved 2024-03-13.
  3. telugu, NT News (2024-01-10). "దీక్షభూమికి ఆధ్యాత్మిక శోభ". www.ntnews.com. Retrieved 2024-03-13.
  4. "Namasthe Telangana e Paper | e Paper ntnews". epaper.ntnews.com. Retrieved 2024-03-13.
  5. "సేవాలాల్ దీక్ష స్వీకరించిన తండావాసులు". EENADU. Retrieved 2024-04-10.
  6. సాక్షి (2024-04-07), IMG 20240407 WA 0163, retrieved 2024-04-10
  7. సాక్షి (2024-04-07), IMG 20240407 WA 0163, retrieved 2024-04-10