దీపికా చిఖ్లియా
దీపికా చిఖ్లియా | |
---|---|
లోక్‌సభ సభ్యురాలు | |
In office 1991–1996 | |
అంతకు ముందు వారు | ప్రకాష్ బ్రహ్మభట్ |
తరువాత వారు | సత్యజిత్సింగ్ గైక్వాడ్ |
నియోజకవర్గం | బరోడా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | దీప్తి చిఖ్లియా ముంబై, మహారాష్ట్ర |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | హేమంత్ టోపివాలా |
వృత్తి | నటి, రాజకీయ నాయకురాలు |
దీపికా చిఖ్లియా టోపివాలా, మహరాష్ట్రకు చెందిన టీవి సినిమా నటి, రాజకీయ నాయకురాలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ సినిమాలలో నటించిన దీపిక, రామానంద్ సాగర్ రూపొందించిన టివి సీరియల్ రామాయణం[1]లో సీత పాత్రలో నటించి గుర్తింపు పొందింది. తెలుగులో 1989లో వచ్చిన యమపాశం, 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలలో నటించింది.[2]
1991లో భారతీయ జనతా పార్టీ తరపున బరోడా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలు ఎన్నికయింది.
జననం
[మార్చు]దీపికా మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
సినిమారంగం
[మార్చు]1983లో వచ్చిన సన్ మేరీ లైలా సినిమాలో తొలిసారిగా నటించిన దీపికా, రాజేష్ ఖన్నాతో రూపాయే దస్ కరోడ్, ఘర్ కా చిరాగ్, ఖుదాయి అనే మూడు హిందీ సినిమాలలో నటించింది.[3] మలయాళంలో మమ్ముట్టితో 1986లో ఇతిలే ఇనియుమ్ వరు సినిమా, కన్నడంలో శంకర్ నాగ్‌తో 1990లో హోస జీవన సినిమా, 1989లో అంబరీష్‌తో ఇంద్రజిత్ సినిమా, తమిళంలో ప్రభుతో 1992లో నంగల్ సినిమా, బెంగాలీ'లో ప్రోసెంజిత్ ఛటర్జీతో 1989లో ఆశా ఓ భలోబాషా సినిమాలో నటించింది.
2019 నవంబరులో వచ్చిన బాలా సినిమాలో పారి (యామీ గౌతమ్) తల్లిగా నటించింది.[4] స్వాతంత్ర్య సమరయోధురాలు - సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటిస్తోంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]శింగార్ బిందీ, టిప్స్ అండ్ టోస్ కాస్మెటిక్స్ యజమాని హేమంత్ టోపివాలా[5]తో దీపిక వివాహం జరిగింది.[6] వారికి ఇద్దరు కుమార్తెలు నిధి టోపీవాలా, జుహీ టోపీవాలా ఉన్నారు.[7]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1983 | సన్ మేరీ లైలా | హిందీ | ||
1985 | పత్తర్ | హిందీ | ||
1986 | చెంప | హిందీ | ||
1986 | భగవాన్ దాదా | హిందీ | శాంతి | |
1986 | ఘర్ సన్సార్ | హిందీ | ||
1986 | ఇథిలే ఇనియుం వారు | మలయాళం | ప్రియా | |
1987 | రాత్ కే అంధేరే మే | హిందీ | సెక్సీ రోజీ | |
1987 | సజన్వా బైరి భైలే హమార్ | భోజ్‌పురి | ||
1989 | ఇంద్రజిత్ | కన్నడ | ఉష | |
1989 | ఘర్ కా చిరాగ్ | హిందీ | ఆశా | |
1989 | ఆశా ఓ భలోబాషా | బెంగాలీ | రూపా | |
1989 | యమపాశం | తెలుగు | ||
1990 | హోస జీవన | కన్నడ | శంకర్‌నాగ్ భార్యగా సీత | |
1990 | పెరియ ఇదాతు పిళ్లై | తమిళం | ||
1991 | కాల చక్ర | కన్నడ | ||
1991 | బ్రహ్మర్షి విశ్వామిత్ర | తెలుగు | ||
1991 | రూపాయే దస్ కరోడ్ | హిందీ | రవి కార్యదర్శి/హస్తినాపూర్ కి రాణి | |
1992 | నాంగల్ | తమిళం | ||
1994 | మేయర్ ప్రభాకర్ | కన్నడ | ||
1994 | ఖుదాయి | హిందీ | పద్మిని రాజ్ ఆనంద్ | |
1989 | జోడే రహేజో రాజ్ | గుజరాతీ | ||
1992 | లాజు లఖన్ | గుజరాతీ | ||
2018 | గాలిబ్ | హిందీ | ||
2018 | నటసామ్రాట్ | గుజరాతీ | ||
2019 | బాలా | హిందీ | సుశీల మిశ్రా (పరి తల్లి) |
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy". Archived from the original on 15 September 2009. Retrieved 2022-03-12.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)CS1 maint: archived copy as title (link) - ↑ Chitrajyothy (27 May 2024). "ఆ సినిమా చేయకపోవడం వల్లే.. ఈ రోజు ఇంత గుర్తింపు". Retrieved 27 May 2024.
- ↑ "Ramayan's Sita aka Dipika Chikhalia's real life wedding was attended by this Bollywood superstar; see pic - Times of India".
- ↑ "'Bala': A cracker of a film, powered by 'hair' apparent Ayushmann Khurrana". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-12.
- ↑ "Deepika Chikhalia". khabridost.in. Archived from the original on 13 March 2018. Retrieved 2022-03-12.
- ↑ "Hemant Topiwala: Executive Profile & Biography - Bloomberg". www.bloomberg.com. Retrieved 2022-03-12.
- ↑ "Where are they now? Deepika Chikhalia". Retrieved 2022-03-12.