Jump to content

ద్రోణవల్లి హారిక

వికీపీడియా నుండి
ద్రోణవల్లి హారిక
పూర్తి పేరుద్రోణవల్లి హారిక
దేశం భారతదేశం
టైటిల్ఇంటర్నేషనల్ మాస్టర్
మహిళా గ్రాండ్ మాస్టర్
ఫిడే రేటింగ్2491 (మే 2010)
అత్యున్నత రేటింగ్2491 (మే 2010)

ద్రోణవల్లి హారిక ప్రముఖ చదరంగ క్రీడాకారిణి. జనవరి 12, 1991గుంటూరు జిల్లాలో జన్మించింది. మహిళా గ్రాండ్ మాస్టర్, అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ బిరుదులు పొందినది[1]. భారత ప్రభుత్వం నుండి అర్జున అవార్డును, పద్మశ్రీ పురస్కారాలు పొందింది.

జననం, విద్య

[మార్చు]

ద్రోణవల్లి హారిక గుంటూరులో 1991, జనవరి 12న స్వర్ణ, రమేష్ దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్య గుంటూరు లోని వేంకటేశ్వర బాలకుటీర్ లో చదివింది.

క్రీడా విశేషాలు

[మార్చు]

ద్రోణవల్లి హారిక ఏడు సంవత్సరముల వయసులోనే చదరంగం నేర్చి ఆసియా ఖండపు పది సంవత్సరాలలోపు వయస్సు (U-10), పన్నెండు సంవత్సరాలలోపు వయస్సు (U-12) పోటీలలో మొదటి స్థానము సంపాదించింది. ముంబై లో 2003లో జరిగిన కామన్ వెల్త్ చదరంగపు క్రీడలలో మహిళా విభాగములో రెండవ స్థానము పొందింది.

హారిక మూడు ప్రపంచ యువ చదరంగ బిరుదులు స్వంతము చేసుకున్నది[2].

  • హెరాక్లియో, గ్రీసులో అండర్-14 - 2003
  • బటూమి, జార్గియా, అండర్-18 - 2006
  • గజియాన్ టెప్, టర్కీ, ప్రపంచ యువ చదరంగ పోటీ- 2008

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె ఆగస్టు 2018లో హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ చంద్రను వివాహం చేసుకుంది.[3][4] ఆమె అక్క అనూష తెలుగు సినిమా దర్శకుడు బాబీ(కె. ఎస్. రవీంద్ర)ను వివాహం చేసుకుంది.

అవార్డులు, పురష్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ratings.fide.com
  2. www.chessgames.com
  3. "Harika Dronavalli's Wonderful Wedding".
  4. "Harika Dronavalli : Indian Chess Grandmaster, Career And Personal Life - Sakshi". web.archive.org. 2023-01-09. Archived from the original on 2023-01-09. Retrieved 2023-01-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.