Jump to content

పరిటాల ఓంకార్

వికీపీడియా నుండి

పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. విజయవాడ దగ్గరలోని పెనమలూరు గ్రామంలో జన్మించారు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ ధారావాహికలకు రచయితగా, చలనచిత్ర నటుడిగా, టీవీ ధారావాహికలలో కూడా నటించాడు.[1] ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు.

టీవీ ధారావాహికలకు రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు.[2] నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు.

ఓంకార్ పోలీసు భార్య, పందిరిమంచం వంటి చిత్రాలలో నటించాడు. స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహించాడు. స్వాతిలో సినీ తారల పుకార్ల వార్తల విభాగం కూడా ఆయన నిర్వహించేవాడు. ఇతను వ్రాసిన ఆల్ ఇన్ వన్ బహుళ ప్రచారం పొందింది. ఈయన కుమారుడు పరిటాల నిరుపమ్ కూడా టివి నటుడు.[3][4]

సినిమాలు

[మార్చు]

రచయితగా

[మార్చు]

మరణం

[మార్చు]

జనవరి 7, 2007 న గుండెపోటు తో చనిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. K, Mamatha (9 September 2021). "ఒక నటుడు.. ఒక రచయిత.. ఓంకార్". TeluguStop.com. Retrieved 22 June 2022.
  2. "స్మరణ : బుల్లితెర రచయితగా ఓంకార్ పరిటాల". indiaherald.com. Retrieved 22 June 2022.
  3. aithagoni.raju. "తండ్రి ఓంకార్‌ మరణంతో తలక్రిందులైన `కార్తీకదీపం` నటుడు నిరుపమ్‌ జీవితం.. హీరో కాబోయి.. అదొక ఎమోషనల్‌ జర్నీ." Asianet News Network Pvt Ltd. Retrieved 2022-06-22.
  4. "ప్రేక్షకుల ప్రేమే∙ నా విజయం". Sakshi. 2019-12-25. Retrieved 2022-06-22.
  5. Staff (2007-01-08). "Writer Omkar cremated". oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-22.

వెలుపలి లంకెలు

[మార్చు]