పలుకూరు
పలుకూరు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°7′42.38″N 79°32′32.39″E / 16.1284389°N 79.5423306°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | బొల్లాపల్లి |
విస్తీర్ణం | 32.89 కి.మీ2 (12.70 చ. మై) |
జనాభా (2011)[1] | 11,674 |
• జనసాంద్రత | 350/కి.మీ2 (920/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 5,839 |
• స్త్రీలు | 5,835 |
• లింగ నిష్పత్తి | 999 |
• నివాసాలు | 2,800 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 518176 |
2011 జనగణన కోడ్ | 594361 |
పలుకూరు పల్నాడు జిల్లా, బొల్లాపల్లి మండలానికి చెందిన గ్రామం.
విశేషాలు
[మార్చు]నల్లమల అటవీ అంచున విసిరేసినట్లుగా ఉన్న ఒక చిన్న పల్లె ఇది. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన 40 కుటుంబాలవారు ఈ గ్రామానికి 3 కి.మీ. దూరంలో నివాసం ఏర్పరచుకున్నారు. దీనిపేరు ఎర్రవేణి చెంచు కాలనీ. కుడి ప్రధాన కాలువకు కూతవేటు దూరంలో ఉంటూ పోడు వ్యవసాయం చేసుకుంటూ వీరు జీవించుచున్నారు. ఓటు హక్కు, రేషను కార్డు ఇచ్చారు. పక్కా ఇళ్ళు లేవు. మొండిగోడలపై కప్పు వేసికొని ఉంటున్నారు. నీటిసోసం రెండు చేతిపంపులున్నవి. చీకటి పడితే అంధకారమే. వీధిదీపాలు లేవు. ఈ పరిస్థితులలో అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ చొరవ తీసికొని కాలనీవాసుల వెతలను ఇటలీకి చెందిన "కడూరీ ఫౌండేషన్" కు వివిరించగా, వారు కాలనీని దర్శించి సౌరవిద్యుత్తు సౌకర్యం కలిగించడానికి ఏడు లక్షల రూపాయలను మంజూరుచేసి, దానిద్వారా వీధిదీపాలు ఏర్పాటుచేసారు. ఇంటికొక బల్బును ఉచితంగా అందజేసినారు. ఆపైన ఒక చేతిపంపుకు విద్యుత్తు సౌకర్యం కలుగజేసి, దానిద్వారా పెరటిసాగుకు అవకాశం కల్పించి కూరగాయల సాగు చేసికొనుటకు వీరికి అవకాశం కలిపించి వీరికి శాస్వతంగా జీవనోపాధి కల్పించారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017