పాల్ బ్రంటన్
పాల్ బ్రంటన్ (1898 అక్టోబరు 21 – 1981 జూలై 27) ఒక ఆంగ్ల తత్వవేత్త, సన్యాసి, యాత్రికుడు.ఆయన చేస్తున్న పాత్రికేయ వృత్తిని వదిలేసి యోగులతో, సన్యాసులతో గడిపి ప్రాచ్య, పాశ్చాత్య దేశాల నిగూఢ తత్వాలను అధ్యయనం చేశాడు.
జీవిత చరిత్ర
[మార్చు]బ్రంటన్ 1898 లో లండన్లో జన్మించాడు. ఆయన జన్మనామం రఫెల్ హర్స్ట్. మొదట్లో పుస్తక విక్రేత మరియి పాత్రికేయుడుగా పనిచేసాడు. పాత్రికేయుడిగా వ్యాసాలు రాసేటపుడు అనేక మారు పేర్లతో రాసేవాడు. పాల్ బ్రంటన్ అనే పేరు అలా సృష్టించుకున్నదే. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ట్యాంక్ విభాగంలో పనిచేశాడు. తరువాత రహస్య శాస్త్రాల అధ్యయనం మీద ఆసక్తి కలిగింది. అందులో భాగంగా 1930 లో బ్రంటన్ భారతదేశానికి వచ్చాడు. మెహెర్ బాబా, చంద్రశేఖరేంద్ర సరస్వతి, రమణ మహర్షి, యోగి రామయ్య లాంటి యోగులని కలిశాడు. మొదట కంచి శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతిని కలవగా ఆయన రమణ మహర్షిని కలవమని సూచించాడు. 1931 లో బ్రంటన్ మొట్టమొదటి సారిగా రమణ మహర్షిని కలిశాడు.
బ్రంటన్ రమణ మహర్షిని 'భగవంతుని తెలుసుకోవడం ఎలా?' లాంటి ప్రశ్నలు అడిగాడు. అందుకు రమణులు 'విచారణ ద్వారా నువ్వెవరో తెలుసుకో' అని సమాధానమిచ్చాడు.[1]
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రంటన్ మైసూరు మహారాజా నాలుగవ కృష్ణరాజ ఒడయారు ఆస్థానంలో ఉన్నాడు.[2][3] ఆయన రచించిన ది క్వెస్ట్ ఆఫ్ ది ఓవర్సెల్ఫ్ అనే పుస్తకాన్ని మహారాజాకు అంకితం ఇచ్చాడు. 1940 లో మహారాజా మరణించినపుడు ఆయన అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడు.[4]
జీవన శైలి
[మార్చు]పాల్ బ్రంటన్ ఆధ్యాత్మిక సత్యాల సాధనలు, అవగాహన, సాక్షాత్కారం వంటి భాగస్వామ్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. మనుషులలోని ఆత్మ విలువలను ఆయన తెలుసుకోవడం ప్రాంరంభించాడు. ఆయన పదకొండు పుస్తకాలు వ్రాశాడు. అతనికి వచ్చే రోజువారీ ఆలోచనలను చిన్నవిగా నోట్స్ గా రాయడం రాశాడు, ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఉపాధ్యాయులు, ఫకీర్లను, సన్యాసులను, దొంగ సాధువులను కలసినాడు. బ్రంటన్ ప్రజలను తన అనుచరులుగా మారకుండా నిరోధించి నప్పటికీ, .అనివార్యంగా అతన్ని కలిసిన చాలా మంది అతని శిష్యులయ్యారు. ఆయన తన సలహాను, మార్గదర్శకత్వాన్ని ఎప్పుడు, ఎక్కడ సముచితమో తెలియజేశాడు. అందులో జరిగిన ఒక ఉదాహరణను చుస్తే, ఒక వ్యక్తి తన కొత్త రెస్టారెంట్ ను ఆశీర్వదించమని అడిగినప్పుడు, బ్రంటన్ ప్రతిస్పందన గమనిస్తే, అతడు అన్న మాట "నేను మీ సంస్థను ఆశీర్వదించగలను, ఆధ్యాత్మిక పాఠం ఎదగడానికి మీకు సహాయపడుతుంది, కానీ మీ వ్యాపారం విజయవంతం కావాలని మీరు కోరుకుంటే, ఒక వ్యాపారవేత్త సలహాను అడగాలని నేను సూచిస్తున్నాను!" అని అన్నాడు[5].
రచనలు
[మార్చు]పాల్ బ్రంటన్ తన ఆధ్యాత్మిక ప్రయాణం లో పుస్తకాల రచనలు కూడా చేయడం జరిగింది. అందులో ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా, ది సీక్రెట్ పాథ్, ది ఇన్నర్ రియాలిటీ ,ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్, హిడెన్ టీచింగ్ బియాండ్ యోగ మొదలైన రచనలు చేసాడు[6]
మూలాలు
[మార్చు]- ↑ Description of the visit and reproduction of one of the dialogues with the Maharshi, done from rough notes
- ↑ Jeffrey M. Masson (1999), Der Guru meines Vaters, Eine Kindheit mit Paul Brunton, Berlin, Theseus, ISBN 3-89620-144-1, p. 25
- ↑ Annie Cahn Fung, Paul Brunton A Bridge Between India and the West, Part I: Genesis of a Quest, Chapter 3: In Mysore
- ↑ "Notebooks of Paul Brunton, Category 15: The Orient", Chapter 2, p.453
- ↑ "Illustrated Biography". Paul Brunton Philosophic Foundation (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-11-19. Retrieved 2024-08-01.
- ↑ ThriftBooks. "Paul Brunton Books | List of books by author Paul Brunton". ThriftBooks (in ఇంగ్లీష్). Retrieved 2024-08-01.