Jump to content

పి.వెంక‌ట్రామి రెడ్డి

వికీపీడియా నుండి
పరుపాటి వెంక‌ట్రామి రెడ్డి
పి.వెంక‌ట్రామి రెడ్డి


ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
22 నవంబర్ 2021 - 21 నవంబర్ 2027
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 21 సెప్టెంబర్ 1962
ఇందుర్తి, ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి డిగ్రీ
మతం హిందూ మతము

పరుపాటి వెంక‌ట్రామి రెడ్డి భారతదేశానికి చెందిన ఐఏఎస్ అధికారి. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన 2021 నవంబరు 15న తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.[1] ఆయన 2021 నవంబరులో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైయ్యారు.[2] ఆయన ఈ పదవిలో 2021 డిసెంబరు 01 నుండి 2027 నవంబరు 30 వరకు కొనసాగుతాడు.[3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వెంక‌ట్రామి రెడ్డి 1962 సెప్టెంబరు 21లో తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం, ఇందుర్తి గ్రామంలో పరుపాటి రాజిరెడ్డి, పుష్పలీల దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రీ పూర్తి చేశాడు.[4]

వృత్తి జీవితం

[మార్చు]

పి.వెంక‌ట్రామి రెడ్డి 1996లో గ్రూప్‌-1 ఉద్యోగం సంపాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బందర్‌, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పనిచేశాడు. ఆయన 2002 నుండి 2004 వరకు మెదక్‌ ఉమ్మడి జిల్లా డ్వామా పీడీగా పనిచేశాడు. వెంకట్రామి రెడ్డి హుడా సెక్రటరీగా, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్‌గా పనిచేసి 2007లో ఐఏఎస్‌ హోదా పొందాడు. ఆయన 2015 మార్చి 24 నుంచి 10, అక్టోబరు 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తరువాత 2016 అక్టోబరు 11న సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

పి.వెంక‌ట్రామి రెడ్డి 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 నెలల పాటు సిరిసిల్ల కలెక్టర్‌గా, తర్వాత సిద్దిపేట కలెక్టర్, 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో 15 రోజుల పాటు సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వహించి,[5] ఎన్నికల అంతరం తిరిగి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి [6] 2021 నవంబరు 15న ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.[7][8]

రాజకీయ జీవితం

[మార్చు]

వెంకట్రామి రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో కృషి చేస్తోందని, అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలని ఉద్యోగానికి రాజీనామా చేసి 2021 నవంబరు 16న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2021 నవంబరులో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై,[9][10][11] నవంబరు 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. 10TV (15 November 2021). "సిద్ధిపేట కలెక్టర్ రాజీనామా" (in telugu). Archived from the original on 15 November 2021. Retrieved 15 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Namasthe Telangana (16 November 2021). "ఎమ్మెల్యే కోటా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 16 November 2021. Retrieved 16 November 2021.
  3. TNews Telugu (1 December 2021). "'ఎమ్మెల్యే కోటా' ఎమ్మెల్సీల ప‌ద‌వీకాలం షురూ". Archived from the original on 1 December 2021. Retrieved 1 December 2021.
  4. ETV Bharat News (17 November 2021). "ఇదే తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రస్థానం". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  5. The Hindu (27 October 2020). "New Collector of Sangareddy district takes charge" (in Indian English). Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  6. Sakshi (16 November 2021). "కలెక్టర్‌ టు పొలిటీషియన్‌.. వెంకట్రామిరెడ్డి జర్నీ ఇలా." Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  7. Namasthe Telangana (15 November 2021). "సిద్దిపేట కలెక్టర్‌ వీఆర్‌ఎస్‌". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  8. Mana Telangana (15 November 2021). "సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద విరమణ". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  9. Eenadu (17 November 2021). "ఆరూ తెరాసకే!". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  10. Namasthe Telangana (16 November 2021). "ఉమ్మడి జిల్లాపై మమకారం". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  11. Eenadu. "ఇద్దరికి అవకాశం". EENADU. Archived from the original on 2021-11-16. Retrieved 18 November 2021.
  12. Andhrajyothy (22 November 2021). "తెలంగాణ: ఆ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.