Jump to content

పుట్టా సుధాకర్ యాదవ్

వికీపీడియా నుండి
పుట్టా సుధాకర్ యాదవ్
పుట్టా సుధాకర్ యాదవ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు శెట్టిపల్లె రఘురామిరెడ్డి
నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గం

టీటీడీ పాలమండలి ఛైర్మన్‌
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 ఏప్రిల్‌ నుండి జూన్ 2019

వ్యక్తిగత వివరాలు

జననం 1964 నవంబర్ 21
కొత్తపల్లె, ప్రొద్దుటూరు మండలం,వైఎస్ఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పుట్టా వెంకటసుబ్బయ్య, పోలమ్మ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
బంధువులు యనమల రామకృష్ణుడు , తలసాని శ్రీనివాస్ యాదవ్
సంతానం రవి కుమార్ యాదవ్, మహేష్ యాదవ్

పుట్టా సుధాకర్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 ఏప్రిల్‌ నుండి జూన్ 2019 వరకు టీటీడీ పాలమండలి ఛైర్మన్‌గా పని చేశాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

పుట్టా సుధాకర్ యాదవ్ 1964 నవంబర్ 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లె గ్రామంలో పుట్టా వెంకటసుబ్బయ్య, పోలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

పుట్టా సుధాకర్ యాదవ్ 2012 టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్ధి శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయాడు. సుధాకర్ యాదవ్ 2018 ఏప్రిల్ 11న తిరుమల–తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి ఛైర్మన్‌గా నియమితుడై[2], ఏప్రిల్ 28న భాద్యతలు చేపట్టి[3], జూన్ 2019న తన పదవికి రాజీనామా చేశాడు.[4]

పుట్టా సుధాకర్ యాదవ్ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మైదుకూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డిపై 20950 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (19 June 2019). "టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా". Archived from the original on 2 June 2022. Retrieved 2 June 2022.
  2. Zee News Telugu (11 April 2018). "టీటీడీ ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్". Retrieved 7 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Mana Telangana (28 April 2018). "టిటిడి చైర్మన్‌గా సుధాకర్ యాదవ్ ప్రమాణం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  4. HMTV (19 June 2019). "టీటీడీ ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్‌ యాదవ్ రాజీనామా". Archived from the original on 7 జూన్ 2022. Retrieved 7 June 2022.
  5. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Mydukur". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.