పోలవరపు సూర్యప్రకాశరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోలవరపు సూర్యప్రకాశరావు
జననంఅక్టోబర్ 16, 1912
మరణంనవంబర్ 19, 2006
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, సమాజ నిర్వాహకుడు
తల్లిదండ్రులువెంకట్రామయ్య, కౌసల్య

పోలవరపు సూర్యప్రకాశరావు (అక్టోబర్ 16, 1912 - నవంబర్ 19, 2006) ప్రముఖ రంగస్థల నటుడు, సమాజ నిర్వాహకుడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

సూర్యప్రకాశరావు 1912, అక్టోబర్ 16న వెంకట్రామయ్య, కౌసల్య దంపతులకు కృష్ణా జిల్లా డోకిపర్రు లో జన్మించాడు. బందరు హిందూ హైస్కూలు, గుడివాడ మున్సిపల్ హైస్కూల్లో చదివి హిందీ విశారదలో పాసయ్యాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

పాఠశాల స్థాయినుండే నటనపై ఆసక్తి ఉన్న సూర్యప్రకాశరావు బాలనటుడిగా రంగస్థలంపై అడుగుపెట్టాడు. హార్మోనియం కూడా నేర్చుకున్నాడు. 1942లో కృష్ణా జిల్లా ముదినేపల్లి లోని ఎక్సల్షియర్ నాట్యమండలిలో ఆశాజ్యోతి, సత్యాన్వేషణ, తెలుగుతల్లి వంటి నాటకాలలో నటించాడు. కోడూరి అచ్చయ్య చౌదరి దర్శకత్వం వహించిన ఈ నాటకాలలో అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు, సూరపనేని ప్రభాకరరావు వంటివారు సూర్యప్రకాశరావుకి సహనటులుగా నటించారు.

ఆంధ్ర నాటక కళా పరిషత్తు కార్యక్రమాలలో కీలకపాత్ర వహించాడు. 1955లో పరిషత్తు పోటీకి వచ్చిన 110 నాటకాలు, 150 నాటికల ప్రాథమిక పరిశీలనకోసం ఒక్కడే ఆరు రాష్ట్రాలు తిరిగి 7 నాటకాలు, 12 నాటికలు ఎంపికచేశాడు.

మరణం[మార్చు]

2006, నవంబర్ 19న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.670.