ఎం.టి.వాసుదేవన్ నాయర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భారతీయ రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11: పంక్తి 11:
[[వర్గం:1933 జననాలు]]
[[వర్గం:1933 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:భారతీయ రచయితలు]]

13:34, 21 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

ఎం.టి.వాసుదేవన్ నాయర్ ప్రముఖ మలయాళ రచయిత. ఆయన ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.

వ్యక్తిగత జీవితం

వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది. ఆయన చిన్నతనం పున్నయర్కుళం గ్రామంలో గడిపారు. కుమరనెల్లూర్ గ్రామంలో పాఠశాల విద్యను, పాలక్కాడ్(పాల్ఘాట్) పట్టణంలోని విక్టోరియా కళాశాలలో కళాశాల విద్యనూ పూర్తిచేసుకున్నారు.

సాహిత్య రంగం

1950దశకం తొలినాళ్ళ నుంచీ చిన్నకథలను వ్రాయడం ప్రారంభించిన వాసుదేవన్ నాయర్ 1958లోని నాలుకెట్టు(కేరళ సంప్రదాయ గృహం), 1962లో అసురవిత్తు(రాక్షస బీజం), 1964లో మంజు(మంచు), 1969లో కాలం, 1984లో రాండమూఝం(రెండవ సారి), విలపయత్ర, పతిరవుం పకల్వెలిచెవుం(అర్థరాత్రీ, పగటివెల్తురు), వారణాసి తదితర నవలలను రచించారు. ఇవేకాక నాటికలు, పరిశోధనాత్మక, సాహిత్యాంశాల వ్యాసాలు, యాత్రాచరిత్రలు, ఆత్మకథాత్మక రచనలు రాశారు. సర్పబిందు, నాలుకెట్టు నవలల్లో ఉమ్మడి కుటుంబాలు కలిగిన కేరళ సామాజిక వ్యవస్థలో ఆధునికత తీసుకువస్తున్న మార్పులను గురించి వాసుదేవన్ నాయర్ ప్రస్తావించారు. మంచు నవలలోని కథాంశం ఇద్దరు వ్యక్తుల అర్థరహితమైన నిరీక్షణను గురించి ఉంటుంది. నైనిటాలుకు యాత్రికునిగా వచ్చిన యువకునితో ప్రేమానుబంధం కలిగుండి అతను తిరిగి ఎప్పుడు వస్తాడోనని యువతి ఆకాంక్ష, కొండజాతి స్త్రీ, ఆంగ్లేయ యాత్రికులకు జన్మించి తన తండ్రిని కలవాలని ఆశించే కుర్రాడి నిరీక్షణలను ఇతివృత్తంగా రాశారు.

మూలాలు