బాలాంత్రపు రజనీకాంతరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 80: పంక్తి 80:
# చండీదాసు
# చండీదాసు
# మేఘసందేశం
# మేఘసందేశం
# సంధ్యాదీపకళిక
# మధురానగరిగాథ
# మధురానగరిగాథ
# సుభద్రార్జునీయం
# సుభద్రార్జునీయం

19:37, 15 సెప్టెంబరు 2014 నాటి కూర్పు

బాలాంత్రపు రజనీకాంత రావు
బాలాంత్రపు రజనీకాంత రావు
జననంబాలాంత్రపు రజనీకాంత రావు
జనవరి 29 1920
నిడదవోలు
ఇతర పేర్లుబాలాంత్రపు రజనీకాంత రావు
ఉద్యోగంఆకాశవాణి
ప్రసిద్ధికవి, పండితుడు, సాహితీ వేత్త
మతంహిందూ మతం
తండ్రికవిరాజహంస బాలాంత్రపు వేంకటరావు
తల్లివెంకటరమణమ్మ

బాలాంత్రపు రజనీకాంత రావు (1920 - ) బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు.

జీవిత సంగ్రహం

'రజని' గా పిలవబడే రజనీకాంతారావు 1920 జనవరి 29న జన్మించారు. జంట కవులైన వేంకట పార్వతీశ కవులలో ఒకరైన "కవిరాజహంస" బాలాంత్రపు వెంకటరావుగారి కుమారులు. బాలాంత్రపు నళినీ కాంతారావు వీరి అగ్రజులు. వీరి తండ్రి ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల సంస్థాపక, నిర్వాహకులు. తల్లి వెంకటరమణమ్మ కూడా గొప్ప సాహితీ సంస్కారం కల వ్యక్తి. ఇంటిలోని సాహితీ వాతావరణానికి తోడుగా తండ్రి నడిపే గ్రంథమాలకు వస్తూ పోతూ వుండే టేకుమళ్ళ రాజగోపాలరావు, తెలికచర్ల వెంకటరత్నం, చిలుకూరి నారాయణరావు, గంటి జోగి సోమయాజి వంటి పండితులతో కళకళలాడుతుండేది.[1]

పిఠాపురంలో పెరిగారు. బంధువైన పులిగుత్తుల లక్ష్మీనరసమాంబ దగ్గర భక్తిసంగీతం, మేనమామ దుగ్గిరాల పల్లంరాజు దగ్గర శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు. కాకినాడలో పి.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ శాస్త్రీయసంగీతం నేర్చుకున్నారు. రజని 1937-1940 వరకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ)లో ఎం.ఏ. తెలుగు చదివారు. పింగళి లక్ష్మీకాంతం గారు వీరి గురువులు. దేవులపల్లివారు ఆత్మీయ మిత్రులు.

ఉద్యోగ ప్రస్థానం

1941లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జెక్యుటివ్ గా చేరారు. 1966లో అసిస్టెంట్ డైరక్టరుగా పదోన్నతిపై పశ్చిమ బెంగాలులోని కర్సియాంగ్ స్టేషన్ కెళ్ళారు. కర్సియాంగ్ నుండి ఢిల్లీలోని ట్రాన్స్క్రిప్షన్ సర్విసులో చేరారు. 1970లో స్టేషన్ డైరక్టరై అహమ్మదాబాదు వెళ్ళారు. 1971 నుండి 76 వరకు విజయవాడ కేంద్రం డైరక్టరు. 76 నుండి 78 జనవరి వరకు బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి జనవరి 31న రిటైరయ్యారు. 1988 నుండి 90 వరకు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో గౌరవాచార్యులుగా పనిచేశారు. 1979 నుండి 82 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర కళాపీఠం డైరక్టరుగా వ్యవహరించారు. ఆకాశవాణి, దూరదర్శన్ లకు ఎమిరిటస్ ప్రొడ్యూసర్ గా 1982 నుండి 85 వరకు పనిచేశారు.

  1. 1947 ఆగష్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అర్ధరాత్రి నెహ్రు ""Our tryst with destiny" ప్రసంగం తర్వాత రజని రచించి స్వరపరిచిన "మాదీ స్వతంత్రదేశం అనే గీతం ప్రసారమయింది.
  2. 1972లో రజనీ రచించి స్వరపరిచిన "కొండ నుండి కడలి దాకా" రూపకం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. దీనికి జపాన్ నుంచి "నిప్పాన్ హోసో క్యొకాయ్" బహుమతి లభించింది
  3. కృష్ణశాస్త్రిగారి 'అతిథిశాల' సంగీతరూపకానికి పర్షియన్ సంగీతం ఆధారంగా కూర్చిన సంగీతానికి చాల పేరు వచ్చింది.
  4. 1981లో మేఘసందేశ రూపకానికి బెంగుళురులొ ఉండగా ఉత్తమ సంగీత రూపక బహుమతి లభించింది
  5. ఉషశ్రీతో ధర్మసందేహాలు కార్యక్రమం ప్రారంభించారు
  6. భక్తిరంజని కార్యక్రమం ప్రారంభించారు

లలిత సంగీతం

రజని తెలుగు లలిత సంగీత వికాసానికి ఎనలేని దోహదం చేశారు. ఎన్నో గేయ నాటకాలు, సంగీత రూపకాలు రజని రసమధురంగా రచించారు. రేడియో కోసం రజని వందలాది గీతాలను రచించారు. ఇతర రచయితల గీతాలకి కూడా స్వరరచన చేశారు. బాలలకోసం జేజిమామయ్య పాటలు రచించారు.

స్వరకర్తగా, గేయకవిగా, సినీ గాయకుడుగా రజని ప్రసిద్ధుడు. భానుమతి, రజని కలిసి పాడిన పాటలు చిత్రసీమలొ గణన కెక్కాయి. స్వర్గసీమ, గృహప్రవేశం ఇత్యాది చిత్రాలకు పాడారు.


రచనలు

  1. శతపత్ర సుందరి గీత సంపుటి. 200పైగా గీతాలున్నాయి. (దీనికి 1953లో తెలుగు భాషా సమితి పురస్కారం లభించింది)
  2. విశ్వవీణ రేడియో నాటకాల సంకలనం. 1964లో ప్రచురణ
  3. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథం. (దీనికి 1958లో తెలుగు భాషా సమితి పోటీ బహుమతి లభించింది)
  4. తండ్రిగారి ఏకాంత సేవకు ఆంగ్లంలో 'Alone with spouse divine' అనువాదం
  5. క్షేత్రయ్య పదాలకు ఆంగ్లానువాదం 'Amourse of the Divine Cowherd' (కేంద్ర సాహిత్య అకాడమీవారికి)
  6. క్షేత్రయ్య, రామదాసు జీవిత చరిత్రలు (కేంద్ర సాహిత్య అకాడమీవారికి) [2]
  7. 'రజనీ భావతరంగాలు' - ఆంధ్రప్రభలో శీర్షిక
  8. క్షేత్రయ్య పదాలు, గాంధారగ్రామ రాగాలు, గీతగోవిందం, భారతీయ సంగీతంలో ప్రాచీన రాగాలు మొదలైనవాటి మీద పరిశోధనావ్యాసాలు. (మద్రాసు మ్యూజిక్ అకాడమీలో)
  9. జేజిమామయ్య పాటలు
  10. మువ్వగోపాల పదావళి
  11. త్యాగరాజు, శ్యామశాస్త్రి జీవితచరిత్రలు
  12. ఏటికి ఎదురీత (కవితలు)
  13. చతుర్భాణీ (4 సంస్కృత నాటకాలకి తెలుగు అనువాదం)
  14. ఆన్నమాచార్య కీర్తనలకి ఆంగ్లానువాదం

నృత్య/సంగీత రూపకాలు

  1. చండీదాసు
  2. మేఘసందేశం
  3. సంధ్యాదీపకళిక
  4. మధురానగరిగాథ
  5. సుభద్రార్జునీయం
  6. గ్రీష్మఋతువు
  7. శ్రీకృష్ణశ్శరణం మమ
  8. మేనకావిశ్వామిత్ర
  9. క్షీరసాగర మధనం (స్వరరచన)
  10. విప్రనారాయణ (స్వరరచన)
  11. కృష్ణశాస్త్రిగారి అతిథిశాల (ఉమర్ ఖయ్యూం) (స్వరరచన) - పర్షియన్ బాణీలో కూర్చిన సంగీతం. దీనికి చాలా పేరు వచ్చింది.
  12. దివ్యజ్యోతి (బుద్ధుడు)
  13. విశ్వవీణ (ఓర్ఫియస్)
  14. కళ్యాణశ్రీనివాసం
  15. నమోస్తుతే హరి

వాద్యబృంద

  1. ఆంధ్రి (కళ్యాణి, దేశవరాళి, దేవసాళగం రాగాలతో)
  2. విశ్వయానం (శబ్దచిత్రం) - విశ్వం యొక్క పుట్టుక, పరిణామం గురించి
  3. సంగీత గంగోత్రి - భారతీయ సంగీతం యొక్క పుట్టుక, పరిణామం గురించి
  4. కామదహనం


పురస్కారాలు/బిరుదులు

  1. ఠాగూర్ అకాడమీ రత్న - రవీంద్రనాథ్ ఠాగూర్ 150 జయంతి సందర్భంగా సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసింది.
  2. కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం 1981 లో బహుకరించిన గౌరవ డాక్టరేట్.
  3. కళారత్న అవార్డు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 లో ఇచ్చిన పురస్కారం.
  4. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - 1961. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథానికి.
  5. ప్రతిభా మూర్తి జీవితకాల సాఫల్య బహుమతి - అమెరికాలోని అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి పురస్కారం.
  6. నాద సుధార్ణవ - మదరాసు మురళీరవళి ఆర్ట్ అకాడమీ
  7. పుంభావ సరస్వతి
  8. నవీన వాగ్గేయకార

మూలాలు

యివి కూడా చూడండి