కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | సాహిత్యం (వ్యక్తిగతం) | |
వ్యవస్థాపిత | 1954 | |
మొదటి బహూకరణ | 1955 | |
క్రితం బహూకరణ | 2022- త్రిపురాంతకం నరేంద్ర - మనోధర్మ పరాగం | |
బహూకరించేవారు | కేంద్ర సాహిత్య అకాడమీ, భారత ప్రభుత్వం | |
వివరణ | భారతీయ సాహిత్య పురస్కారం |
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు.2022 సంవత్సరానికి త్రిపురాంతక నరేంద్ర రచన అయిన మనోధర్మ పరాగం కి వచ్చింది
చరిత్ర
[మార్చు]కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో స్థాపించింది. రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు తాను పరిగణనలోకి తీసుకున్న మరికొన్ని భాషలు కలిపి మొత్తం 22 భాషల సాహిత్యవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తొలి పురస్కారాన్ని 1955 ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటుగా అందజేసే నగదు బహుమతిని ప్రారంభించినప్పుడు రూ.5వేలుగా ఉండగా క్రమంగా ఆ మొత్తాన్ని పెంచారు. 1983లో రూ.10వేలు, 2001లో రూ.40వేలు, 2003లో రూ.50వేలుగా బహుమతి మొత్తాన్ని పెంచారు. 2009 నుంచి పురస్కార గ్రహీతలకు రూ.లక్ష చొప్పున బహుమతిని అందజేస్తున్నారు.
పురస్కారం
[మార్చు]సాహిత్య అకాడమీ ఇతర పురస్కారాలు
[మార్చు]కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటుగా కొన్ని ఇతర పురస్కారాలను కూడా ఏర్పాటుచేశారు. ఇతర పురస్కారాల నుంచి వేరుగా గుర్తించేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రధాన పురస్కారంగా వ్యవహరిస్తుంటారు. సాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు అకాడమీ ప్రకటించే ఇతర పురస్కారాలు:
- భాషా సమ్మాన్ పురస్కారం : సాహిత్య అకాడమీ సంస్థ గుర్తించిన ఇతర భాషలలో సాహిత్యసృజన, సేవ చేసిన వారికి ప్రకటిస్తారు.
- సాహిత్య అకాడమీ అనువాద బహుమతి : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో అనువాద రచనలు చేసిన వారికి ప్రకటిస్తారు.
- సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లోని ఉత్తమ బాలసాహిత్యానికి/బాలసాహిత్యానికి సేవ చేసిన వారికి ప్రకటిస్తారు.
- సాహిత్య అకాడమీ యువ పురస్కారం : సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృష్టి చేసిన 35 సంవత్సరాలలోపు సాహిత్యవేత్తలకు ప్రకటిస్తారు.
పురస్కారాల ప్రాతిపదిక
[మార్చు]నిబంధనలు
[మార్చు]- ఈ అవార్డు కొరకు పుస్తకం అది వ్రాయబడిన భాషలో విశేషమైనదిగా గుర్తింపబడాలి. ఈ పుస్తకం క్రొత్తగా సృష్టింపబడినది గానీ లేదా విశేషమైన కృషితోగాని వ్రాయబడినదై ఉండాలి. కానీ అనువాదం.
భాషలు
[మార్చు]తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు
[మార్చు]సంవత్సరం | పుస్తకం | సాహితీ విభాగం | రచయిత |
---|---|---|---|
2023 | రామేశ్వరం కథలు మరికొన్ని కథలు | కథనిక | టీ.పతంజలి శాస్త్రిగారు |
2022 | మనోధర్మ పరాగం | నవల | మధురాంతకం నరేంద్ర |
2021 | వల్లంకి తాళం | కవిత | గోరటి వెంకన్న |
2020 | అగ్నిశ్వాస | కవితా సంపుటి | నిఖిలేశ్వర్ |
2019 | విమర్శిని | వ్యాసాలు | కొలకలూరి ఇనాక్ |
2018 | శప్తభూమి | నవల | బండి నారాయణస్వామి |
2017 | గాలిరంగు | కవిత్వం | దేవిప్రియ |
2016 | రజనీగంధ - కవితా సంకలనం | కవిత్వం | పాపినేని శివశంకర్ |
2015 | విముక్తి-కథానిక | కథ | వోల్గా |
2014 | మన నవలలు-మన కథానికలు | విమర్శా వ్యాసాల సంకలనం | రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి |
2013 | సాహిత్యాకాశంలో సగం | తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం | కాత్యాయని విద్మహే[1] |
2012 | పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు | కథా సంకలనం | పెద్దిభొట్ల సుబ్బరామయ్య |
2011 | స్వరలయలు | వ్యాసాలు | సామల సదాశివ |
2010 | కాలుతున్న పూలతోట | నవల | సయ్యద్ సలీమ్ |
2009 | ద్రౌపది | నవల | యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ |
2008 | పురుషోత్తముడు | పద్యరచన | చిటిప్రోలు కృష్ణమూర్తి |
2007 | శతపత్రం | ఆత్మకథ | గడియారం రామకృష్ణ శర్మ |
2006 | అస్తిత్వనదం ఆవలి తీరాన | చిన్న కథ | మునిపల్లె రాజు |
2005 | తనమార్గం | కథా సంకలనం | అబ్బూరి ఛాయాదేవి |
2004 | కాలరేఖలు | నవల | అంపశయ్య నవీన్ |
2003 | శ్రీ కృష్ణ చంద్రోదయము | పద్యరచన | ఉత్పల సత్యనారాయణాచార్య |
2002 | స్మృతి కిణాంకం | వ్యాసాలు | చేకూరి రామారావు |
2001 | హంపీ నుంచి హరప్పా దాక | ఆత్మకథ | తిరుమల రామచంద్ర |
2000 | కాలాన్ని నిద్ర పోనివ్వను | పద్యరచన | ఆచార్య ఎన్.గోపి |
1999 | కథాశిల్పం | వ్యాసాలు | వల్లంపాటి వెంకటసుబ్బయ్య |
1998 | బలివాడ కాంతారావు కథలు | కథలు | బలివాడ కాంతారావు |
1997 | స్వప్నలిపి | కవిత | అజంతా (పి. వి. శాస్త్రి) |
1996 | కేతు విశ్వనాథ రెడ్డి కథలు | కథలు | కేతు విశ్వనాథరెడ్డి |
1995 | యజ్ఞంతో తొమ్మిది | కథలు | కాళీపట్నం రామారావు |
1994 | కాలరేఖ | విమర్శ | గుంటూరు శేషేంద్రశర్మ |
1993 | మధురాంతకం రాజారాం కథలు | కథలు | మధురాంతకం రాజారాం |
1992 | హృదయనేత్రి | నవల | మాలతీ చందూర్ |
1991 | ఇట్లు మీ విధేయుడు | కథలు | భమిడిపాటి రామగోపాలం |
1990 | మోహనా ఓ మోహనా | కవిత | కె.శివారెడ్డి |
1989 | మణిప్రవాళము | వ్యాసాలు | ఎస్.వి.జోగారావు |
1988 | అనువాద సమస్యలు | విమర్శ | రాచమల్లు రామచంద్రారెడ్డి |
1987 | గురజాడ గురుపీఠం | వ్యాసాలు | ఆరుద్ర |
1986 | ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం | సాహితీ విమర్శ | ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం |
1985 | గాలివాన | కథలు | పాలగుమ్మి పద్మరాజు |
1984 | ఆగమ గీతి | కవిత | ఆలూరి బైరాగి |
1983 | జీవనసమరం | వ్యాసాలు | రావూరి భరద్వాజ |
1982 | స్వర్ణ కమలాలు | కథలు | ఇల్లిందుల సరస్వతీదేవి |
1981 | సీతజోస్యం | నాటకం | నార్ల వెంకటేశ్వరరావు |
1979 | జనప్రియ రామాయణం | కవిత్వం | పుట్టపర్తి నారాయణాచార్యులు |
1978 | కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు) | కవిత్వం, నాటకాలు | దేవులపల్లి కృష్ణశాస్త్రి |
1977 | కుందుర్తి కృతులు | కవిత్వం | కుందుర్తి ఆంజనేయులు |
1975 | గుడిసెలు కూలిపోతున్నాయి | కవిత్వం | బోయి భీమన్న |
1974 | తిమిరంతో సమరం | కవిత్వం | దాశరథి |
1973 | మంటలు మానవుడు | కవిత్వం | సి.నారాయణరెడ్డి |
1972 | శ్రీశ్రీ సాహిత్యము | కవిత్వం | శ్రీశ్రీ |
1971 | విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య | వ్యాఖ్యానం | తాపీ ధర్మారావు |
1970 | అమృతం కురిసిన రాత్రి | కవిత్వం | దేవరకొండ బాలగంగాధర తిలక్ |
1969 | మహాత్మకథ | కవిత్వం | తుమ్మల సీతారామమూర్తి |
1965 | మిశ్రమంజరి | కవిత్వం | రాయప్రోలు సుబ్బారావు |
1964 | క్రీస్తుచరిత్ర | కవిత్వం | గుర్రం జాషువా |
1963 | పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా | నవల | త్రిపురనేని గోపీచంద్ |
1962 | విశ్వనాథ మధ్యాక్కఱలు | కవిత్వం | విశ్వనాథ సత్యనారాయణ |
1961 | ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము | జీవిత చరిత్ర | బాలాంత్రపు రజనీకాంతరావు |
1960 | నాట్యశాస్త్రము | చరిత్ర | పి.ఎస్.ఆర్. అప్పారావు |
1957 | శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర | జీవిత చరిత్ర | చిరంతానందస్వామి |
1956 | భారతీయ తత్వశాస్త్రము | పరిశోధన | బులుసు వెంకటేశ్వర్లు |
1955 | ఆంధ్రుల సాంఘిక చరిత్రము | చరిత్ర | సురవరం ప్రతాపరెడ్డి |
1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.
పురస్కార గ్రహీతలు
[మార్చు]- సీ.ఎస్. లక్షీ (2021)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-12-19. Retrieved 2013-12-19.