చేకూరి రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేకూరి రామారావు
Chekuri ramarao.jpg
చేకూరి రామారావు
జననంచేకూరి రామారావు
అక్టోబర్ 1, 1934
ఖమ్మం లోని మధిర తాలూకా ఇల్లెందులపాడు
మరణంజూలై 24, 2014
హైదరాబాద్ లోని హబ్సిగూడా
మరణ కారణముగుండెపోటు
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుచేరా
వృత్తిసాహిత్య విమర్శకులు, భాషా పరిశోధకులు

తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్తగా పిలువబడేవారు డాక్టర్‌ చేకూరి రామారావు (అక్టోబర్ 1, 1934 - జూలై 24, 2014). చేరాగా అందరికి సువరిచితులు.

జననం[మార్చు]

ఈయన 1934, అక్టోబరు 1న ఖమ్మం లోని మధిర తాలూకా ఇల్లెందులపాడులో జన్మించారు.

చదువు[మార్చు]

హెచ్ ఎస్ సి వరకు మచిలీపట్నంలో చదువుకున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎ (తెలుగు) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తుమాటి వేణప్ప ప్రోత్సాహంతో భాషా శాస్త్రంలో ఎంఎ పట్టభధ్రులయ్యారు. భాషావేత్త బద్రిరాజు కృష్ణమూర్తి ప్రోత్సాహంతో అమెరికాలోని కోర్నెల్ యూనివర్సిటీ నుంచి ట్రాన్స్‌ఫర్మేషన్‌ థియరీ ఇన్‌ తెలుగులో అంశంపై పిహెచ్‌డి పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రాధిపతిగా పనిచేస్తున్న కాలంలో డాక్టర్‌ ద్వానా శాస్త్రి దగ్గర ఆయన శిష్యరికం చేశారు. ప్రధానంగా శిక్షణ పొంది మౌలిక పరిశోధన చేసింది భాషాశాస్త్రంలో. ఆధునిక భాషాశాస్త్ర రంగంలో కొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన నామ్ చామ్‌స్కీ పరివర్తన సిద్ధాంతాన్ని ఉపయోగించి తెలుగు వాక్యాన్ని విశ్లేషించి కొత్త ఒరవడికి ఆద్యులయ్యారు.

రచనా ప్రస్థానం[మార్చు]

ఆయన భాషపై రచించిన పలు వ్యాసాలు విమర్శకులు, సాహితీవేత్తల దృష్టినాకర్శించాయి. చెరా పీటికలు తెలుగు వెలుగుల, తెలుగు వాక్యం, ముత్యాల పదాల ముచ్చట్లు, మరోసారి గిడుగు రామ్మార్తి, రచన రచన తత్వాన్వేషన, భాషాంతరంగం వంటి వ్యాసాలే కాక రెండుపదుల ఏటనే వచన గేయ కవితా సంపుటులు వెలువరించారు.

ఆంధ్రజ్యోతి ఆదివారంలో చేరాతలు అన్న శీర్షిక నిర్వహించడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శరంగంలోకి సుడిగాలిలా దూసుకువచ్చి, సంచలనం సృష్టించారు - ఒక కొత్త విమర్శ ధోరణిని ప్రవేశ పెట్టారు. ఈయన రాసిన స్మృతికిణాంకమనే వ్యాససంపుటికి 2002లో భారత ప్రభుత్వము కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బహూకరించింది.

స్మృతికిణాంకానికి కేంద్ర సాహిత్య పురస్కారం అందుకొన్న ఆయన ప్రముఖ దిన పత్రికల్లో చేరా శీర్షికన సుదీర్ఘ కాలం సాహితీ విమర్శనాత్మక వ్యాసాలు రచించారు. వామపక్ష భావజాలం కల చేరా ఒకరకంగా ఫెమినిస్టు ఉద్యమ సాహిత్యానికి ఆయన చేరాతలు దోహదపడ్డాయి. ఎనభై ఏళ్ల వయస్సులోనూ ఆయన నిత్యం సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలకు త్యాగరయగానభలో చివర వరకూ కొలువయ్యెవారు.

అలరించిన చేరా చేరాతలు[మార్చు]

తెలుగు భాషా శాస్త్రంలో చేరా నూతన ఒరవడిని సృష్టించారు. 'చేరాతలు' పేరుతో పత్రికలలో సుదీర్ఘకాలంపాటు ఆయన కొనసాగించిన సాహితీ కాలం అన్నివర్గాల వారిని అలరించింది. చేరా రచించిన 'స్మృతి కిణాంకం' అనే వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. చేరా రాసిన 'సాహిత్య విమర్శ', 'పరామర్శ', 'చేరాతలు', 'రెండు పదులపైన', 'ఇంగ్లిష్-తెలుగు పత్రికా పదకోశం', 'ముత్యాల సరాల ముచ్చట్లు', 'వచన పద్యం' సాహితీ ప్రియులను అలరించాయి.

ప్రసిద్ధ రచనలు[మార్చు]

తెలుగు పుస్తకాలు[మార్చు]

 1. 1975 తెలుగు వాక్యం
 2. 1978 వచన పద్యం: లక్షణ చర్చ
 3. 1982 రెండు పదుల పైన
 4. 1982 తెలుగులో వెలుగులు (భాషా పరిశోధన వ్యాసాలు)
 5. 1991 చేరాతలు సాహిత్య విమర్శ - పరామర్శ
 6. 1994 చేరా పీఠికలు
 7. 1997 ముత్యాల సరాల ముచ్చట్లు
 8. 1998 ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం
 9. 2000 స్మృతికిణాంకం
 10. 2000 భాషానువర్తనం
 11. 2001 భాషాంతరంగం
 12. 2001 సాహిత్య వ్యాస రింఛోళి
 13. 2001 కవిత్వానుభవం
 14. 2002 వచన రచన తత్త్వాన్వేషణ
 15. 2002 సాహిత్య కిర్మీరం
 16. 2003 భాషా పరివేషం

మరణం[మార్చు]

తన నివాసంలో ధ్యానం చేస్తుండగా 24 జూలై, 2014 రాత్రి గుండెపోటు వచ్చి మృతిచెందారు.

మూలాలు[మార్చు]