పూజ (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Veera Narayana (చర్చ | రచనలు) కథ జతచేసాను |
Veera Narayana (చర్చ | రచనలు) సంగీతానికి సంబంధించిన వివరాలను జతచేసాను |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
*సూరి - వాసు స్నేహితుడు |
*సూరి - వాసు స్నేహితుడు |
||
*ఆండ్రియా జెరెమియా - ప్రత్యేక నృత్యం |
*ఆండ్రియా జెరెమియా - ప్రత్యేక నృత్యం |
||
==సంగీతం== |
|||
[[యువన్ శంకర్ రాజా]] ఈ సినిమాకి సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ అక్టోబర్ 5, 2014న హైదరాబాద్‌లో జరిగింది. శ్రుతి హాసన్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. హీరో నితిన్ తొలి సీడీని స్వీకరించారు. ప్రచార చిత్రాల్ని నితిన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌గౌడ్, విశాల్ సోదరుడు విక్రమ్‌కృష్ణ, శరత్‌మరార్, సందీప్ కిషన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వడ్డి రామానుజం, నవీన్‌చంద్ర, మాధవీలత, రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు. <ref>{{cite web|url=http://www.andhrajyothy.com/Artical.aspx?SID=30862&SupID=24|title=‘ఏడేళ్ల తర్వాత హరి దర్శకత్వంలో నటించా’|publisher=ఆంధ్రజ్యోతి|date=October 6, 2014|accessdate=October 23, 2014}}</ref> విశాల్ ఆరంభించిన ‘వి’ మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/sruthi-hassan-and-vishal-in-pooja-movie-audio-released-173322|title=ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు: విశాల్|publisher=సాక్షి|date=October 6, 2014|accessdate=October 23, 2014}}</ref> |
|||
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]] |
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]] |
07:58, 23 అక్టోబరు 2014 నాటి కూర్పు
పూజ | |
---|---|
దర్శకత్వం | హరి |
రచన | హరి, శశాంక్ వెన్నెలకంటి |
నిర్మాత | విశాల్ |
తారాగణం | విశాల్, శ్రుతి హాసన్, సత్యరాజ్, రాధిక శరత్‌కుమార్, ముఖేష్ తివారీ |
ఛాయాగ్రహణం | ప్రియన్ |
కూర్పు | వి. టి. విజయన్ - జై |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | అక్టోబర్ 22, 2014 |
భాష | తెలుగు |
విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు విశాల్ స్వీయనిర్మాణంలో హరి దర్శకత్వం వహించిన తెలుగు అనువాద సినిమా "పూజ". దీని మాతృక పూజై అనే తమిళ్ సినిమా. ఇందులో విశాల్, శ్రుతి హాసన్ జంటగా నటించగా సత్యరాజ్, రాధిక శరత్‌కుమార్, ముఖేష్ తివారీ ముఖ్యపాత్రల్లో నటించారు. నటి, గాయని ఆండ్రియా జెరెమియా ఐటెం పాటలో నర్తించింది.
యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ప్రియన్ ఛాయాగ్రహణం; వి. టి. విజయన్ - జై కూర్పునందించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 22, 2014న విడుదలయ్యింది.
కథ
ఈ సినిమా కథ బొబ్బిలి ప్రాంతంలో మొదలవుతుంది. చిన్నప్పుడే బొబ్బిలి నుంచి పారిపోయి బీహార్ లో గుండాగా దందాలు చేసి మళ్ళీ బొబ్బిలి తిరిగి వచ్చిన సింగన్న పాత్రుడు (ముఖేష్ అద్వానీ) బొబ్బిలిలో అన్నం ఫైనాన్స్ కంపెనీని పెట్టి దాని ముసుగులో కాంట్రాక్ట్ మర్డర్స్ చేస్తుంటాడు. అదే ఊరిలో ఓ మార్కెట్ యార్డులో వాసు(విశాల్) వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అనుకోకుండా కలిసిన దివ్య(శ్రుతి హాసన్)తో వాసు ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా విశాఖపట్నానికి వచ్చిన ఎస్.పి శివరాం నాయక్(సత్యరాజ్)ని సింగన్న చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వాసు శివరాం నాయక్ ని కాపాడతాడు.
అదే సమయంలో ఓ కారణంగా సింగన్న బొబ్బిలి ప్రాంతానికి చెందిన గికే గ్రూప్ కంపెనీ యజమానులైన ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. కానీ అదే కుటుంబానికి చెందిన వాసు తనవాళ్ళు ఆపదలో ఉన్నారని తెలియడంతో రంగంలోకి దిగుతాడు. ఏ కారణం చేత సింగన్న వాసు కుటుంబాన్ని చంపాలనుకుంటాడు ? తనకంటూ ఓ కుటుంబం ఉన్నా వాసు వారందరికీ ఎందుకు దూరంగా ఉన్నాడు ? శివరాంతో చేతులు కలిపిన వాసు తన వైరి కుటుంబానికి చెందినవాడని సింగన్న తెలుసుకున్నాక ఏం చేసాడు ? అనేది మిగిలిన కథ.
తారాగణం
- విశాల్ - వాసు
- శ్రుతి హాసన్ - దివ్య
- సత్యరాజ్ - ఎస్.పి శివరాం నాయక్
- రాధిక శరత్‌కుమార్ - వాసు తల్లి
- ముఖేష్ తివారీ - సింగన్న పాత్రుడు
- సూరి - వాసు స్నేహితుడు
- ఆండ్రియా జెరెమియా - ప్రత్యేక నృత్యం
సంగీతం
యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించారు. ఆడియో ఆవిష్కరణ అక్టోబర్ 5, 2014న హైదరాబాద్‌లో జరిగింది. శ్రుతి హాసన్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. హీరో నితిన్ తొలి సీడీని స్వీకరించారు. ప్రచార చిత్రాల్ని నితిన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విక్రమ్‌గౌడ్, విశాల్ సోదరుడు విక్రమ్‌కృష్ణ, శరత్‌మరార్, సందీప్ కిషన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వడ్డి రామానుజం, నవీన్‌చంద్ర, మాధవీలత, రఘుకుంచె తదితరులు పాల్గొన్నారు. [1] విశాల్ ఆరంభించిన ‘వి’ మ్యూజిక్ ద్వారా ఈ పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి.[2]
- ↑ "'ఏడేళ్ల తర్వాత హరి దర్శకత్వంలో నటించా'". ఆంధ్రజ్యోతి. October 6, 2014. Retrieved October 23, 2014.
- ↑ "ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుందనుకుంటారు: విశాల్". సాక్షి. October 6, 2014. Retrieved October 23, 2014.