వాడుకరి చర్చ:Veera Narayana
కొత్త చర్చ ప్రారంభించటానికి పైనున్న అదేశ వరుసలో విషయాన్ని చేర్చు నొక్కి రాయండి.
|
ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం
[మార్చు]నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా సినిమాల విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు,
నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో--పవన్ సంతోష్ (చర్చ) 08:53, 26 జూలై 2014 (UTC)
దృష్యం సినిమా పేజి
[మార్చు]ఇంగ్లీష్ వికీలో మీరు రాసిన దృష్యం సినిమా పేజి చూశాను.. లింక్స్ లతో పాటు చాలా బాగా రాశారు. అదేవిధంగా తెలుగు వికీలో కూడా రాయగలరని నా మనవి...Pranayraj1985 (చర్చ) 15:46, 15 జూలై 2014 (UTC)
- ధన్యవాదాలండీ.. Pranayraj1985 (చర్చ) 06:33, 18 జూలై 2014 (UTC)
ఫిలింఫేర్ అవార్డులు
[మార్చు]ఫిలింఫేర్ పత్రికవారు చాలా కాలంగా ఫిలింఫేర్ అవార్డులను భారతీయ సినిమా రంగంలోని వివిధ విభాగాలకు అందజేస్తున్నారు. వాటి వివరాలు ఆంగ్ల వికీపీడియాలో ఉన్నాయి. మీకు ఆశక్తి ఉంటే వాటిని తెలుగు వికీలో అభివృద్ధి చేయడానికి నేను సహాయం చేయగలను. ఒకసారి ఆలోచించి తెలియజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:05, 30 జూలై 2014 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు. మొదటగా ఫిలింఫేర్ అవార్డు పేజీని సృష్టిస్తున్నారు. దానిని విస్తరించిన తర్వాత వేర్వేరు విభాగాలలోకి వెళ్దాము.Rajasekhar1961 (చర్చ) 14:06, 30 జూలై 2014 (UTC)
వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ
[మార్చు]నమస్కారం, సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 20:14, 3 ఆగష్టు 2014 (UTC)
ఆగడు
[మార్చు]ఆగడు వికీ పేజీ చించేశావు కదా బాస్. చాలా బాగుంది. ఇలాంటి వ్యాసాలే తెలుగులో మరిన్ని వ్రాస్తారని ఆశిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 03:10, 14 అక్టోబరు 2014 (UTC)
తెలుగు సినిమాల గురించి తెలుగులో కూడా ఇరగదీయండి సార్
[మార్చు]ఇంగ్లీషు వికీలో తెలుగు సినిమాల గురించి ఇరగదీస్తున్న పవన్ జంధ్యాల గారూ.. మీరు తెలుగు వికీలో రాస్తున్నారని, తెవికీలో సినిమాలకు ప్రస్తుతం ఒకానొక కేరాఫ్ అడ్రస్ మీరేనని తెలుసు. కాకుంటే మీరు ఇంగ్లీష్ వికీలో చేసిన స్థాయిలో అభివృద్ధి తెవికీలోనూ చెయ్యాలని మనవి. ఆంగ్లవికీలో అత్తారింటికి దారేది సినిమా పేజీ చూసి అవాక్కైపోయానంటే నమ్మండి. మరీ ముఖ్యంగా నా అభిమాన రచయిత త్రివిక్రంకైతే రాబోయే సినిమాలు కూడా మీరు పేజీలు క్రియేట్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. అటువంటి మీరు తెవికీలో కూడా అంతంత స్థాయిలో రాయాలని ఆశపడుతున్నాను. మరోలా అనుకోకండి ఇలా అడిగినందుకు. కావస్తే నేనూ మీకు ఉడతా భక్తిగా సాయం చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:44, 26 జనవరి 2015 (UTC)
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
చర్చలు
[మార్చు]మీతో వ్యక్తిగతంగా కొన్ని చర్చించాల్సిన విషయాలు వున్నాయి. దయచేసి మీ నంబరు నాకివ్వగలరా. నా నంబర్ *********. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 08:30, 1 ఫిబ్రవరి 2015 (UTC)
- @Rajasekhar1961: క్షమించండి. నా నంబరుని మీకు నేను ఎందుకు ఇవ్వలేనో నేనిప్పుడే ఆంగ్ల వికీలో మీ సందేశానికి బదులుగా ఇచ్చాను. మీరు ఏం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పగలరు. Pavanjandhyala (చర్చ) 10:05, 1 ఫిబ్రవరి 2015 (UTC)
మీ సాయం కోసం
[మార్చు]ఇంగ్లీష్ వికీపీడియాలో సినిమాల పేజీలు, మీ కృషి గమనిస్తూంటే అక్కడి గుడ్ ఆర్టికల్, ఫీచర్డ్ ఆర్టికల్ వంటి విభాగాలు, వాటి నియమాలు వంటివాటిపై మీకు లోతైన అవగాహన ఉన్నట్టు తెలుస్తోంది. తెవికీలో పుస్తకాల గురించిన పేజీల్లో నేను కృషిచేసి ఏకరూపత్వానికి, అతిశయోక్తులను పరిహరించే శైలికీ మాత్రమే కాక కంటెంట్ పరంగా కూడా చాలా కృషి చేశాను. సినిమాల పేజీలను అభివృద్ధి చేయాలని నేను ప్రస్తుతం భావిస్తున్నాను. కానీ నాకు ఏ మార్గమూ తెలియట్లేదు. ఇప్పటికే ఉన్న ఆంగ్లవికీ పేజీలు చూసి తెలుసుకుందామంటే వాటిలోని చాలా టెక్నికల్ పదాలకు తెలుగు తోచట్లేదు. అనువాదాలు కాక ఒరిజినల్ కృషి చేద్దామని నా భావన. మీరేదైనా ఓ మార్గం చూపితే బావుంటుంది. నేను రెగ్యులర్ గా తెలుగు సినిమాలకు సంబంధించిన కబుర్లే కాక సాంకేతికంగా సినిమాల గురించి రాసిన విశేషాలు కూడా చదువుతుంటాను. ప్రతి తెలుగు పత్రికల్లో పాత తెలుగు సినిమాల గురించి 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వ్రాస్తున్న వ్యాసాలు సేకరిస్తున్నాను. కానీ మీరు నాతో తెలుగు సినిమాలపై తెలుగు వికీలో కొద్దిరోజులు సమిష్టి కృషి చేస్తే నాకు అవగాహన కలుగుతుందని భావిస్తూన్నాను. మీరేమైనా సాయం చేయగలరా?--పవన్ సంతోష్ (చర్చ) 07:48, 8 ఫిబ్రవరి 2015 (UTC)
- పవన్ జంధ్యాల గారూ చిన్న అభ్యర్థన తెలుగులో కొన్ని డబ్బింగ్ సినిమాల గురించి రాసేప్పుడు సందేహాలు వస్తున్నాయి. వాటి మూలచిత్రాలు చాలా ప్రఖ్యాతి పొందినవి, కనుక వాటికీ పేజీలు సృష్టిస్తే బావుంటుందా? ఉదాహరణకు నాయకుడు సినిమా తీసుకుంటే అది తమిళ డబ్బింగ్. మూలచిత్రం అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పేరుపొందింది, టైమ్స్ మేగజైన వారి 100 సినిమాల జాబితాలో చేరింది. ఆ వివరాలన్నీ నాయకుడు సినిమా పేజీలో ఏం ఇస్తాం. అందుకోసం విడిగా నాయగన్ సినిమా పేజీ సృష్టించుకుంటే బావుంటుందా? ఒకవేళ అలాచేస్తే రెండు సినిమాల్లో అత్యధిక వివరాలు ఒకటే అయి కవల వ్యాసాలు తయారవుతాయేమో? ఇలాంటి సందేహాలతో ఉన్నాను. ఇంగ్లీషులో మీరేం చేస్తున్నారీ విషయంలో? పాలసీలు, గైడ్లైన్లు ఏమైనా ఉన్నాయా?--పవన్ సంతోష్ (చర్చ) 09:59, 11 ఏప్రిల్ 2015 (UTC)
అభివృద్ధి చేస్తున్న వ్యాసాల్లో సూచనల కోసం
[మార్చు]పవన్ గారూ, ఇటీవల కొన్ని సినిమా వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నాను. ముళ్ళపూడి వెంకటరమణ ఆత్మకథ, పరుచూరి గోపాలకృష్ణ సినిమాల గురించి రాసిన వ్యాససంకలనం, జంధ్యాల సినిమాల గురించి పులగం చిన్నారాయణ రాసిన పుస్తకం వంటివి సోర్సులుగా వాడుకుంటున్నాను. అయితే నేను అవసరమైన సమాచారాన్నే చేరుస్తున్నానా, సరిగానే శీర్షికలు విభజిస్తున్నానా లాంటి అనుమానాలు ఉన్నాయి. ఒకసారి మూగ మనసులు (1964 సినిమా), ముద్ద మందారం, రెండుజెళ్ళ సీత, నాలుగు స్తంభాలాట వంటివి చూసి సూచనలు చెప్పగలరా? --పవన్ సంతోష్ (చర్చ) 09:44, 31 జూలై 2015 (UTC)
- చాలా బాగుంది పవన్ సంతోష్ గారూ. వీలైనంత వరకూ ముఖ్యసమాచారమే చేర్చినట్టుగ కనబడుతోంది. కానీ, నాలుగు స్తంభాలాటలోని చిత్రీకరణ విబాగంలో నవతా కృష్ణంరాజు గారి మాటలు చేర్చడం సరైన పనిగా అనిపించడంలేదు. నావంతుగా చిన్నమార్పులు చేసాను. నొచ్చుకోవద్దు. Pavanjandhyala (చర్చ) 14:20, 31 జూలై 2015 (UTC)
- నొచ్చుకోవడం కాదు నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు. అప్పుడప్పుడూ చూస్తూండండి. ఇంతకీ ఆ మాటలు తీసినట్లు లేరు.--పవన్ సంతోష్ (చర్చ) 16:55, 31 జూలై 2015 (UTC)
- నేను మీకు ఆ విషయాన్ని చెప్పింది, మీరు ఆ మార్పు చేస్తారని. నా అంతటగా నేనా పని చెయ్యాల్సివస్తే నేను ఆగను. కానీ, అది నా పని కాదు. నా పని మీరడిగిన ప్రశ్నకి బదులివ్వడమే. Pavanjandhyala (చర్చ) 08:47, 1 ఆగష్టు 2015 (UTC)
- అలాగేనండీ. నాకు మొదట అర్థంకాలేదు. అందుకే అడిగా మరోమారి. చేస్తాను, ప్రస్తుతానికి ఉంటాను. రెస్పాండ్ అయినందుకు ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 05:55, 6 ఆగష్టు 2015 (UTC)
- నేను మీకు ఆ విషయాన్ని చెప్పింది, మీరు ఆ మార్పు చేస్తారని. నా అంతటగా నేనా పని చెయ్యాల్సివస్తే నేను ఆగను. కానీ, అది నా పని కాదు. నా పని మీరడిగిన ప్రశ్నకి బదులివ్వడమే. Pavanjandhyala (చర్చ) 08:47, 1 ఆగష్టు 2015 (UTC)
- నొచ్చుకోవడం కాదు నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు. అప్పుడప్పుడూ చూస్తూండండి. ఇంతకీ ఆ మాటలు తీసినట్లు లేరు.--పవన్ సంతోష్ (చర్చ) 16:55, 31 జూలై 2015 (UTC)
VANI BHOJAN
[మార్చు]Hi, kindly upload the images of Vani Bhojan in Wikimedia commons please sir. She have 3 images but she have more Wikipedia's so please upload the images please. Only one image please. Please kindly reply me sir please. Sir only one image please sir pleaseEswnav (చర్చ) 10:40, 15 డిసెంబరు 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
[మార్చు]@Veera Narayana గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)
2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
[మార్చు]@Veera Narayana గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:00, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)