ఫుట్‌బాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి అసలు పేరు నకలు మార్పు
చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
పంక్తి 105: పంక్తి 105:
[[వర్గం:జట్టు క్రీడలు]]
[[వర్గం:జట్టు క్రీడలు]]
[[వర్గం:ఒలింపిక క్రీడలు]]
[[వర్గం:ఒలింపిక క్రీడలు]]

{{Link FA|en}}
{{Link FA|es}}
{{Link FA|fr}}
{{Link FA|hr}}
{{Link FA|ml}}
{{link FA|ko}}

07:16, 30 మార్చి 2015 నాటి కూర్పు

ఆక్రమణ ఆటగాడు(ఎఱుపులో) రక్షక పంక్తిని(తెలుపులో) దాటి లక్ష్యం వైపు బంతిని తన్నబోవును.
బంతినిని గోలులోనికి వెళ్ళుటనుండి ఆపుయత్నంలో దూకు గోలీ

కాల్బంతి లేదా ఫుట్‌బాల్ (ఆంగ్లం: Football) అనునుది ఒక జట్టు క్రీడ. దీని అసలు పేరు అసోషియేషన్ ఫుట్‌బాల్. ఇందు జట్టుకు 11 మంది ఆటగాళ్లు వుందురు. ప్రపంచంలో అతి విరివిగా అడబడు ఆట ఇది .[1] ఇది ఒక బంతి ఆట. దీర్ఘచతురస్రాకార మైదానాల మీద అడబడుతుంది. మైదానము గడ్డి, మట్టి లేదా కృత్రిమం కావచ్చు. మైదానానికి ఇరు చివర్ల లక్ష్యాలుండును. బంతిని లక్ష్యానికి చేర్చి స్కోరు చెయ్యడం ఆట ప్రధానార్ధం. బంతిని చేతితో తాకు హక్కు గోలుకీపరు కు మాత్రమే వుండును. మిగిలిన ఆటగాళ్ళందరూ, బంతిని కాలితో తన్నడం, తలతో కొట్టడం, లేక ఛాతీతో నియంత్రించడం చేస్తుంటారు. నియంత్రిత సమయం లో ఎక్కువ సార్లు లక్ష్యాన్ని ఛేధించిన జట్టు విజేత. ఇఱు జట్లు సమాన సంఖ్యలో గోలులు చేస్తే పోటీ బట్టి ఆట డ్రాగా పరిగణించబడడం, లేక అధిక సమయంలోకి తీసుకు వెళ్ళడం జరుగుతుంది.

ఫుట్‌బాల్ యొక్క నూతన అవతారం ఇంగ్లాండులో ఫుట్‌బాల్ ఆసోషియేషన్ 1863 వారిచే లిఖించబడినది. దీనిని అంతర్జాతీయ స్థాయిలో ఫీఫా (Fédération Internationale de Football Association - అంతర్జాతీయ అషోషియేషన్ ఫుట్‌బాల్్ సంఘం), నియంత్రిస్తుంది. నాలుగేళ్ళ కోసారి జరిగే ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీ అతి ప్రఖ్యాతిని గాంచి అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీగా వెలసింది.

ఆట తీరు

ఫుట్‌బాల్ లాస్ అఫ్ ది గేమ్ అనబడు నియమాలు అనుసరిస్తూ ఆడబడును. గుండ్రంగా వుండు బంతి తో ఇది ఆడబడును. పదకొండు ఆటవాళ్లు వుండు రెండు జట్లతో ఆ బంతిని తమ ప్రత్యర్థుల గోలులోనికి పంపడానికి ప్రయత్నిస్తుంటారు. అలా గోలులోనికి వెళ్లనప్రతి సారి ఒక గోలు నెగ్గినట్టు పరిగణింపబడును. నియమిత సమయంలో ఎక్కువ గోళ్లు గల జట్టు విజేతలు. ఇఱువురూ సమానసంఖ్యలో గోలులు చేసినచో ఆట డ్రా అగును.

ఆట యొక్క ముఖ్య నియమము, గోలీ తప్ప మిగిలిన ఆటగాళ్ళు బంతిని కావాలని చేతితో తాకరాదు. బంతి మైదానం బయటకు వెళ్లినప్పుడు దాన్ని లోపలికి విసరడానికి చేతులు ఉపయోగించవచ్చు. ఆటగాళ్ళు ప్రముఖంగా కాళ్లను వాడినా, నియమాల ప్రకారం చేతులు మినహాయించి మిగిలిన ఏ శరీర అవయవముతో నైనా బంతిని నియంత్రించవచ్చు. [2]

బంతిని తమ అధీనంలో వుంచడానికి ఆటగాళ్ళు డ్రిబిలింగ్‌ చేయుదురు. అవకాశమున్నప్పుడు బంతిని తమ కంటే మెరుగైన స్థానంలో వున్న తమ జట్టువారికి అందింతురు. గోలుకు సరిపడ దూరాన వున్నప్పుడు బంతిని గోలు వైపు గట్టిగా తన్నడం జరుగుతుంది. అలా తన్నిన బంతిని గోలులోనికి వెళ్ల కుండా అవతలి జట్టు యొక్క గోలీ ప్రయత్నించును.అవతలి జట్టు ఆటగాళ్ళు బంతిని దక్కించుకోవడానికి, అందిస్తున్నబంతిని దక్కించుకోవడం, బంతిని డ్రిబిల్ చేస్తున్న ఆటగాళ్ళ దగ్గర నుండి దక్కించుకోవడం వంటి యత్నాలు చేస్తుంటారు. కాని అవతలి జట్టువారిని బౌతికంగా తాకడం నిషిద్దం. ఫుట్‌బాల్ నిరంతరాయంగా సాగే ఆట, బంతి మైదానం అవతలికి వెళ్లినప్పుడు, లేక రిఫరీ ఆపినప్పుడు మాత్రమే ఆగును. ఆట ఆగినప్పుడు రిఫరీ నిర్దేశించిన విధానంలో ఆట పునఃప్రారంభించబడును.

అత్యున్నత స్థాయిలో జరుగు ఆటలలో సగటున రెండు మాడు గోలులు మాత్రమే చేయబడతాయి. ఉదా ఆంగ్ల ప్రీమియర్ లీగ్ యొక్క ఎఫ్‌ఎ ప్రీమియర్ లీగ్ 2005-2006 కాలంలో ఆటకు సగటున 2.48 గోలులు మాత్రమే చేయబడినవి. [3]

ఆట నియమాల ప్రకారం ఆటగాళ్ళందరి స్థానాలు నియంత్రించబడి లేవు. గోలి తప్పు మిగిలిన ఆటగాళ్ళు మైదానంలో యదేఛ్చగా తిరగవచ్చు. [4]. కాని కాల గమనంతో ఫుట్‌బాలులో చాలా స్థితులు రూపుదిద్దుకున్నాయి. ఇందులో ముఖ్యంగా మూడు రకాల స్థితులున్నాయి: స్ట్రైకర్లు, ముందు వరుస వారు, (గోలులు చేయడం వీరి ప్రత్యేకత); రక్షకులు (వీరు ప్రత్యర్ధులు గోలు చేయకుండా చూడాలి); మరియు మైదాన మధ్యులు, బంతిని తమ జట్టు అధీనంలో వుంచడం, దానిని గోలు చేయవలసిన ముందువరుస వారికి అందించడం వీరి కర్తవ్యం. వీరిని గోలీ నుండి గుర్తించడానికి మైదానఆటవారు (అవుట్ ఫీల్డర్స్) గా సంబోధిస్తారు. ఆడువారు ఆడు చోటు ప్రకారం, ఈ స్థితులని ఇంకా విభజించి సంబోధించడం జరుగుతుంది. ఉదా- ఎడమ రక్షకులు, కుడి రక్షకులు వగైరా. పది మంది మైదాన ఆటవారిని ఏ విధానంగా నైనా అమర్చడం జరుగుతుంది. ప్రతి వరుసలో ఎంత మంది ఆటవారు వున్నదీ, జట్టు ఆడు తీరును రూపు దిద్దుతుంది. ఎక్కువ మంది ముందువరుస వారు, తక్కువ రక్షకులు వున్నప్పుడు, గోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టు ఆడుతున్నరు.

చరిత్ర మరియు పురోగమనం

ప్రపంచంలో ఫుట్‌బాలు యొక్క ఆదరణ తెలుపు పటము. పచ్చ రంగులోని దేశాలలో దీనికి అత్యధికాదరణ వున్నట్టు, తక్కువ ఆదరణ వున్న దేశాలు ఎఱుపులో. వెయ్యికి ఎంత మంది ఆటవారు ఉన్నదాని ప్రకారం పచ్చదనం పెరుగుతువుటుంది.

కాలి బంతులాటలు అనాధిగా మానవులు ఆడుతున్నవే. ఫీఫా ప్రకారం అధునాతన ఫుట్‌బాలుకి ఎక్కువ పోలిక వున్న ఆట ఆతి పురాతనంగా క్రీ.పూ. రెండవ శతాబ్దంలో చైనా ఆడారని ఆధారాలు వున్నాయి. (కుజు అనబడు ఆటగా).[5]. ఇక ఐరోపాలో పురాతన రోము నగరంలో ఆడబడిన హర్పస్తుమ్ ఆట నుండి నేటి ఫుట్‌బాలు అవతింరించవచ్చు. ఐరోపాలో వివిధ కాలాలలో వేర్వేరు నియమాలతో ఫుట్‌బాలు ఆడడం జరిగింది.

19వ శతాబ్ద మధ్యకాలంలో ఇంగ్లాండులోని ప్రభుత్వ పాఠశాలలలో ఆడబడిన ఫుట్బాలు యొక్క వివిధ రాకాలని ఏకం చేయడానికి ఫుట్బాలు యొక్క నియమాలు రచించడం జరిగింది. 1848లో కెంబ్రిడ్జ్ లోని ట్రినిటీ కళాశాలలో 'కేంబ్రిడ్జ్ నియమాలు' రచించడం జరిగింది. ఆ సమావేశానికి వివిధ పాఠశాలలనుండి representatives వచ్చారు. ఆ నియమాలని అందరూ అనుసరించకపోయినా, తర్వాతి నియమాలకు ఇవి మార్గదర్శకాలయ్యాయి.

1863లో ఫుట్‌బాల్ సంఘం ఏర్పడినది. వారి మొదటి సమావేశం 26 అక్టోబరు 1863 ఉదయం లండన్ లో జరిగింది. [6] .

ఇదే ప్రదేశంలో జరిగిన తదుపరి సమావేశాలలో ఆట యొక్క నియమాలు రచించబడినవి. వీరు బంతిని చేతబట్టి పరిగెట్టే సౌకర్యన్ని రద్దు చేయడంతో, అప్పటి వరకూ ఫుట్‌బాలు సంఘంలో వున్న పలు రగ్బీ జట్టులు వైదొలగినవి. ఆపైన వివిధ నియమాలలో మార్పులు చేయడం జరిగింది.


ప్రస్తుతం ఆట యొక్క నియమాలు పర్యవేక్షించేది అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘం బోర్డు. (IFAB). ఆ బోర్డు 1886 లో స్థాపింపబడినది.[7].

ప్రపంచంలోని అతి ప్రాచీన ఫుట్‌బాలు పోటి ఎఫ్‌ఎ కప్పు. ఇందులో ఆంగ్ల జట్టులు 1872 నుండి ఆడుతున్నారు. మొదటి అంతర్జాతీయ ఆట ఇంగ్లాండు, స్కాటులాండుల మధ్య 1872లో గ్లాస్గో లో జరిగింది. again at ప్రపంచంలోని మొదటి ఫుట్‌బాలు లీగు ఇంగ్లాండులోని ఫుట్‌బాలు లీగు. ఇందులో 12 జట్లు ఆడేవి. అంతర్జాతీయ అశోషియేషన్ ఫుట్‌బాలు సంఘం (ఫీఫా) 1904లో పారిస్ నగరంలో ఏర్పడినది.

ఆదరణ

ప్రపంచంలో అన్ని దేశాలలోనూ ఫుట్‌బాలు ను వృత్తిగా అడావారు వున్నారు. కోట్ల మంది జనం, తమ ఇష్ట జట్లను ఆడడం చూడడానికి స్టేడియాలకి తఱచూ వెళ్తుంటారు. [8]. శతకోట్ల మంది ఆటను టీవీలో చూస్తుంటారు.[9]. ప్రపంచంలో చాలా మంది ఫట్‌బాలును మనోరంజనానికి ఆడతారు. 2001 లో ఫిఫా జరిపిన ఒక సర్వే ప్రకారం వీరి సంఖ్య 24కోట్ల దగ్గరలో వుంది. ఇది 200 దేశాలలో ఆడబడుతుంది. [10]. దీని సరళమైన నియమాలు, మౌశికంగా వుత్త బంతి అవసరం మాత్రమే వుండడంతో దీన్ని ఆడడం ప్రారంభించడం చాలా తేలిక. దానితో దీని ఆదరణ చాలా ఎక్కువ గా వ్యాపిచింది.

ప్రపంచంలో చాలా మందికి ఫుట్‌బాలంటే వీరాభిమానం. అభిమానుల జీవితంలో ఫుట్‌బాల్ కి ఎనలేని ప్రాముఖ్యం వుంటుంది. కొన్ని జనగణాలలో, దేశాలలో దీనికున్న ప్రాముఖ్యత బట్టి దీన్ని ప్రపంచంలోని అతి ఎక్కువ ఆదరణ పొందిన ఆట గా పరిగణిస్తారు. దీని వల్ల యుధ్దాలు ఆగడం, యుద్ధాలు జరగడం కూడా జరిగాయి. [11]

ఆట నిబంధనలు

ఫుట్‌బాలుకు పిల్లలు మరియు పెద్దలలో సమాన ఆదరణ కలదు

ఆధికారిక ఆట నియమాలు పదిహేడు వున్నవి. ఇవే ఆట యొక్క అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తాయి. పిల్లలు మహిళలకోసం వీటిని అప్పుడప్పుడూ స్వల్పంగా మార్చడం జరుగుతుంది. ఈ పదిహేడు నియమాలతో బాటు అనేక IFAB నిర్దేశాలు ఆటని నియంత్రిస్తాయి. ఆట నియమాలను ఫీఫా ప్రచురించినప్పటికీ అవి IFAB పర్యవేక్షణలోనే వున్నాయి. .[12]

ఆటవారు, సామగ్రి, రిఫరీలు

జట్టుకు గరిష్టంగా పదకొండు ఆటవారు ఉండవచ్చు, అందులో ఒకరు గోలీగా ఉండవలెను. బంతిని చేతితో గోలీలు మాత్రమే తాక గలరు, అది కూడా వారి పెనల్టి స్థలంలో మాత్రమే.


ఆటకి కావలసిన కనీస సామగ్రి చొక్కా, లాగు, పాద రక్షకలు, మోకాలి కవచాలు. ఇతరులకి తమకి హాని కలిగించగల చేతి గడియారాలు, ఆభరణాలు వంటి వస్తువులు ధరించరాదు. ఇఱు జట్ల దుస్తుల రంగుల మధ్య తగు వ్యత్యాసం ఉండాలి. [13]

ఆట జరుగు సమయంలో కొందరు ఆటవారి బదులు ఇతరులను మార్చవచ్చు. చాలా పోటీలలో గరిష్టంగా ముగ్గురు ఆటవారి బదిలీ చేయవచ్చు. అప్పుడప్పుడూ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ వుండవచ్చు. గాయం, అలసట, ఆటవాడితనంలో లోటు, వ్యూహంలో మార్పు, కాలయాపన వంటి అర్ధాల నిమిత్తం బదిలీలు వినియోగించడం జరుగుతుంది. ఒక సారి బదిలీ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తి తిరిగి ఆటలోకి వెళ్ళడానికి వీలు లేదు.[14]

ఆటని పర్యవేక్షించడానికి రిఫరీకి సర్వ హక్కులూ వుంటాయి. అతని/ఆమె నిర్ణయాలకు తిరుగు వుండదు. రిఫరీకి అండగా ఇద్దరు సహాయక రిఫరీలు వుందురు. ఉత్తమ స్థాయి ఆటలలో అధనంగా నాలుగవ రిఫరీ కూడా ఉంటారు. [15]

మైదానము

మీటర్లలో మైదాన పరిమాణాలు (అడుగులలో చూడండి)

అంతర్జాతీయ పెద్దల ఆటలకు మైదాన పొడవు 100–110 మీటర్లు (110–120 గజాలు) వెడల్పు 64–75 మీటర్లు (70–80 గజాలు). మైదన పొడవంటూ వుండే గీతలను "అడ్డగీతలు"గా మరియు, మైదాన వెడల్పు వెంబడి వుండే గీతలను, "గోలు గీతలు"గా సంబోధింస్తారు. ఇఱు గోలు గీతల మధ్యలు చెరో చతుర్భుజాకార గోలు వుండును. [16]. గోలు వెడల్పు 8 గజాలు (7.32 మీ.) వుండాలి. గోలు యొక్క ఎత్తు 8 అడుగులు (2.44 మీ) వుండాలి. గోలు వెనుక నెట్లు వుంటాయి కాని నియమాల ప్రకారం అవి వుండనక్కర లేదు.[17]

ఇఱు గోలులకు ముందు పెనాల్టి స్థలం వుండును. దీనికి ఒక పక్క గోలు రేఖలు, గోలు రేఖ నుండి 18 గజాలు పొడవైన (16.5 మీ) 18 yards (16 m) రేఖలు, వాటి అంతాలను కలుపడానికి ఒక రేఖ వుంటాయి. ఈ స్థలానితో చాలా అవసరాలు వున్నాయి. ఒకటి, దీని బయట గోలి చేతితో బంతిని తాక వీలు లేదు. తమ పెనల్టి స్థలంలో జట్టు తప్పిదం చేస్తే, వారిని శిక్షించడానికి, అవతలి జట్టుకు పెనాల్టి కిక్ ఇవ్వబడును. [18]

కాలము, టై ఛేదించు విధానములు

పెద్దల ఆటలో 45 నిమిషాల రెండు సగాలు వుంటాయి. ఈ సగాలలో ఆట నిరంతరాయంగా జరుగుతూనే వుంటుంది. సగాల మధ్య 15 నిమిషాల విరామం వుంటుంది.

ఈ మ్యాచ్‍లో రెఫరీ అధికారికంగా సమయాన్ని నమోదుచేస్తారు,మరియు అత్యవసర సమయాలల్లో తగు విధంగా నిర్ణయాలను తీసుకుంటారు. సహాయక ఆటగాళ్ల చేర్పులు (సబ్స్టిట్యూశన్) మరియు ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పుడు మరియు ఇతర సంధర్బాలలో సమయాన్ని నియంత్రించి, అదనపు సమయాన్ని మ్యాచ్‍కు జోడించగల అధికారాలు రిఫరీకి ఉన్నాయి. ఆటలో సాధారణంగా కలిగే ఈ జోడింపులని "స్టాపేజ్ టైమ్" లేదా "ఇంజురీ టైమ్" అంటారు, వీటికి పూర్తి బాధ్యత రిఫరీ వహిస్తాడు. రిఫరీ ఒక్కడే మ్యాచ్ ముగింపును ప్రకటిస్తారు. నాల్గవ అంపైర్ అందుబాటులో ఉండు కొన్ని మ్యాచులలో, మ్యాచ్ ప్రథమార్థం లేదా ద్వితియార్థం చివర్లో రిఫరీ, తాను అదనంగా చేర్చదలచిన సమయాన్ని సూచిస్తాడు. అప్పుడు నాల్గవ అంపైర్, ఆటగాళ్లకి, న్యాయనిర్ణేతలకి (స్పెక్టేటర్లకి) రిఫరీ సూచించిన అదనపు సమయాన్ని ఒక బోర్డుపైన రాసి చూపిస్తాడు. ఈ అదనపు సమయాన్ని కూడా పొడిగించగల అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంది.02.htm అదనపు సమాచారం

ప్రవర్తక సంఘాలు

ప్రపంచవ్యాప్తంగా ఫుట్‍బాల్ (మరియు సంబంధిత ఆటలగు, ఫుట్‍సాల్ మరియు బీచ్ సాకర్)ను శాసించగల, గుర్తింపుపొందిన సంస్థ FIFA (Fédération Internationale de Football Association - ఫెడరేషన్ ఇంటర్‍నేషనల్ డి ఫుట్‍బాల్ అసోసియేషన్). ఈ FIFA యొక్క ప్రధాన కార్యాలయాలు (Zürich) జ్యూరిచ్ నందు కలవు.

FIFA కు అనుబంధంగా మరొక ఆరు ప్రాంతీయ సంస్థలు (కాన్‍ఫెడరేషన్స్) ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. అవి:

జాతీయ అసోసియేషన్లు వాటి వాటి దేశాల్లో మాత్రమే ఫుట్‍బాల్‍ను చూస్తుంటాయి. ఇవి (జాతీయ అసోసియేషన్లు) FIFA తోనూ మరియు వాటి వాటి ఖండపు కాన్‍ఫెడరేషన్స్‍తోనూ అనుబంధంగా ఉంటాయి.

వివిధ పేర్లు

మొదట్లో ఈ ఆట యొక్క నియమనిబంధనలు రచించు సమయంలో అసోషియేషన్ ఫుట్ బాల్ గా పేర్కొనబడినది. అప్పటిలో ఫుట్‌బాల్ గా వ్యవహరింపబడే వేరే ఆటలనుండి తేడా తెలుసుకోవడానికి దీనికి ఈ పేరు ఇవ్వబడినది. ఈనాడు ప్రాచుర్యంలో వున్న ఇంకో పేరు "సాకర్". దీన్ని ప్రధానం గా అమెరికా సంయుక్త రాష్టాలలో వాడతారు, అక్కడ అమెరికన్ ఫుట్‌బాల్ ని ఫుట్‌బాల్ గా వ్యవహిరంచడం చేత.

అధికారిక పేరు అసోషియేషన్ ఫుట్ బాల్ అయినప్పటికి, ప్రపంచమంతటా దీనిని ఎక్కువగా "ఫుట్‌బాల్" గానే పిలవడం జరుగుతుంది.

ప్రతిసూచనలు

  1. Soccer Encarta. Retrieved on May 24 2007.
  2. "Laws of the game (Law 12)". FIFA. Retrieved 2007-09-24.
  3. "England Premiership (2005/2006)". Sportpress. Retrieved 2007-06-05.
  4. "Laws of the game (Law 3–Number of Players)". FIFA. Retrieved 2007-09-24.
  5. "History of Football". FIFA. Retrieved 2006-11-20.
  6. "History of the FA". Football Association website. Retrieved February 19. {{cite web}}: Check date values in: |accessdate= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  7. "The International FA Board". FIFA. Retrieved 2007-09-02.
  8. "Baseball or Football: which sport gets the higher attendance?". Guardian Unlimited. Retrieved 2006-06-05.
  9. "TV Data". FIFA website. Retrieved 2007-09-02.
  10. "FIFA Survey: approximately 250 million footballers worldwide" (PDF). FIFA website. Retrieved 2007-09-02.
  11. "Has football ever started a war?". The Guardian. Retrieved 2007-09-24.
  12. "Laws Of The Game". FIFA. Retrieved 2007-09-02.
  13. "Laws of the game (Law 4–Players' Equipment)". FIFA. Retrieved 2007-09-24.
  14. "Laws of the game (Law 3–Substitution procedure)". FIFA. Retrieved 2007-09-24.
  15. "Laws of the game (Law 5–The referee)". FIFA. Retrieved 2007-09-24.
  16. "Laws of the game (Law 1.1–The field of play)". FIFA. Retrieved 2007-09-24.
  17. "Laws of the game (Law 1.4–The Field of play)". FIFA. Retrieved 2007-09-24.
  18. "Laws of the game (Law 1.3–The field of play)". FIFA. Retrieved 2007-09-24.

బాహ్య లంకెలు