వికీపీడియా:ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ur:منصوبہ:پانچ ارکان
చి యంత్రము కలుపుతున్నది: zh-classical:維基大典:五柱
పంక్తి 95: పంక్తి 95:
[[yi:װיקיפּעדיע:פינף זיילן]]
[[yi:װיקיפּעדיע:פינף זיילן]]
[[zh:Wikipedia:五大支柱]]
[[zh:Wikipedia:五大支柱]]
[[zh-classical:維基大典:五柱]]
[[zh-yue:Wikipedia:五大支柱]]
[[zh-yue:Wikipedia:五大支柱]]

10:06, 21 జూలై 2008 నాటి కూర్పు

అడ్డదారి:
WP:5P
    
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
 
దస్త్రం:Balance scale.jpg వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
 
వికీపీడియాలోని విషయ సంగ్రహం GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు (GFDL) కింద పూర్తిగా ఉచితం. ఏ వ్యాసం కూడా, ఏ ఒక్కరికీ స్వంతమూ కాదు, ఎవరి నియంత్రణా ఉండదు. కాబట్టి మీరు చేసే రచనలను ఎవరిష్టం వచ్చినట్లు వారు మార్పులు, చేర్పులు చెయ్యవచ్చు. GFDL కు లోబడి ఉండని రచనలను ఇక్కడ సమర్పించవద్దు.
 
దస్త్రం:Mudra.jpg
వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
 
ఇక్కడ పేర్కొన్న ఐదూ కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.