మొలస్కా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
*విభాగం 5: స్కాఫోపోడా: ఉ. డెంటాలియమ్ |
*విభాగం 5: స్కాఫోపోడా: ఉ. డెంటాలియమ్ |
||
*విభాగం 6: పెలిసిపోడా: ఉ. యూనియో |
*విభాగం 6: పెలిసిపోడా: ఉ. యూనియో |
||
*విభాగం 7: సెఫాలోపోడా: ఉ. సెపియా |
*విభాగం 7: సెఫాలోపోడా: ఉ. సెపియా - [[ఆక్టోపస్]] |
||
09:13, 20 ఆగస్టు 2008 నాటి కూర్పు
మొలస్కా కాల విస్తరణ: Ediacaran or కాంబ్రియన్ - Recent
| |
---|---|
Caribbean Reef Squid, Sepioteuthis sepioidea | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | మొలస్కా లిన్నేయస్, 1758
|
తరగతులు | |
Caudofoveata |
మొలస్కా (Mollusca) జీవులు "మెత్తటి శరీరం" (మొలస్కస్ - మెత్తని)గల త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, విఖండ, విభక్త కుహరపు జంతువులు. ఇవి జంతుప్రపంచంలో కీటకాల తర్వాత రెండో అతి పెద్ద వర్గాన్ని ఏర్పరుస్తాయి. ఇవి సముద్ర, మంచినీటి, భూచర పరిసరాల్లాంటి అన్ని ఆవాసాలలో నివసిస్తాయి. మనకు బాగా తెలిసిన మొలస్కా జీవులు నత్తలు, శంఖాలు, ముత్యపుచిప్పలు, స్క్విడ్ లు, ఆక్టోపస్ లాంటివి.
సాధారణ లక్షణాలు
- శరీరం కర్పరంతో ఆవరించి ఉంటుంది.
- ఇవి ఎక్కువగా ద్విపార్శ్వ సౌష్టవాన్ని కనబరుస్తాయి.
- శరీరం మూడు భాగాలుగా విభజితమై ఉంటుంది. 1. చలనపు విధులని నిర్వర్తించే ఉదరపు పెద్ద పాదం, 2. అంతరాంగ అవయవాలు గల అంతరాంగ ద్రవ్యం, 3. అంతరాంగ ద్రవ్యాన్ని కప్పుటూ ఒక బరువైన ప్రావారం అనే కణజాలం మడత ఉంటుంది. కొన్నిటిలో స్పష్టమైన తల ఉంటుంది.
- శరీర కుహరం ఒక రక్తకుహరం. నిజశరీరకుహరం మూత్రపిండాలకు, బీజకోశాలకు, హృదయావణానికి పరిమితమై ఉంటుంది.
- ఎక్కువ జీవులలో ఆస్యకుహరంలో రాడ్యులా అనే నికషణ పరికరం ఉంటుంది. రాడ్యులా మీద అడ్డు వరసలో ఉన్న కైటిన్ దంతాలు ఆహారాన్ని నికషణ చేయడానికి సహాయపడతాయి.
- కంకాభాంగాలనే శ్వాసావయావాలు, ప్రావార కుహరంలో ఉంటాయి.
- వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
- నాడీసంధులు, సంధాయకాలు, సంయోజకాలతో నాడీవ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది.
- ఓస్ఫేడియం ఒక ప్రత్యేక జ్ఞానాంగం. ఇది నీటి నాణ్యతను పరీక్షించే రసాయన గ్రహకాంగం. స్పర్శకాలు, నేత్రాలు వంటి ఇతర జ్ఞానాంగాలు అధిక మొలస్కాలలో ఉంటాయి.
- విసర్జన నాళికాయుత అంత్యవృకాలు వల్ల జరుగుతుంది.
- మొలస్కాలు అధికంగా ఏకలింగజీవులు.