విరాట పర్వము ప్రథమాశ్వాసము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి కృష్ణార్జునుల బొమ్మ
పంక్తి 1: పంక్తి 1:
[[File:Kris.JPG|right|thumb|కృష్ణార్జునులు]]
=== ప్రధమాశ్వాసం ===
=== ప్రధమాశ్వాసం ===
పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు " మహర్షీ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాతవాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా పాండవులు తమవనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి " అయ్యా! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నము గా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి " అని నమస్కరించాడు. ధౌమ్యుడు " ధర్మరాజా! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టుకొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరవాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాతవాసానంతరం పూర్వ వైభవం పొందగలవు " అన్నాడు. బ్రాహ్మణులందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.
పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు " మహర్షీ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాతవాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా పాండవులు తమవనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి " అయ్యా! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నము గా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి " అని నమస్కరించాడు. ధౌమ్యుడు " ధర్మరాజా! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టుకొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరవాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాతవాసానంతరం పూర్వ వైభవం పొందగలవు " అన్నాడు. బ్రాహ్మణులందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.

02:50, 21 అక్టోబరు 2009 నాటి కూర్పు

దస్త్రం:Kris.JPG
కృష్ణార్జునులు

ప్రధమాశ్వాసం

పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు " మహర్షీ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాతవాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా పాండవులు తమవనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి " అయ్యా! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నము గా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి " అని నమస్కరించాడు. ధౌమ్యుడు " ధర్మరాజా! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టుకొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరవాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాతవాసానంతరం పూర్వ వైభవం పొందగలవు " అన్నాడు. బ్రాహ్మణులందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.

పాడవులు ద్రౌపది వారివారి పనులను నిర్ణయించుకొనుట

ధర్మరాజు తమ్ములను చూసి " మనం అయిదుగురం ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి " అన్నాడు. అర్జునుడు "అన్నయ్యా! మనకు యమధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా! మనం ఎక్కడకు వెళ్ళినా ఎవరూ గుర్తుపట్టలేరు. కురు దేశం చుట్టూ పాంచాల, చేధి, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, శూరసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాస యోగ్యంగా ఉన్నాయి. ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న దేశంలో మనం అజ్ఞాతవాసం గడుపుదాం " అన్నాడు. ధర్మరాజు " నాకు తెలిసి విరాటరాజు సద్ధర్మవర్తి, మంచివాడు, బలవంతుడు అతని పాలనలో మనం అజ్ఞాత వాసం గడపటం ఉచితమని నాకు అనిపిస్తుంది. విరాటరాజు కొలువులో ఎవరెవరు ఏమి పనులు చేయగలరో నాకు వివరంగా చెప్పండి " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా! నీవు మహనీయ మూర్తివి. సుకుమారుడవు, ఎంతో ప్రాభవం అనుభవించిన వాడివి. అటువంటి వాడవు ఎలా ఇతరులను సేవించ గలవు " అన్నాడు. అర్జునా " నాకు శ్రౌతము, స్మార్తము, శకునము, జ్యోతిషము మొదలగునవి తెలియును. ఈ విద్యలు ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నేను ద్యూత ప్రియుడనని నీకు తెలుసు కదా. విరాటరాజును ద్యూతముతో అలరిస్తాను. ఆయన నా గురించి అడిగితే నేను పూర్వం ధర్మరాజు వద్ద స్నేహంగా ఉండేవాడినని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు భీమసేనుని చూసి " బకాసుర, కిమ్మీరాదులను చంపిన నీవు సేవకా వృత్తి ఎలా చేస్తావు " అన్నాడు. భీమసేనుడు " అన్నయ్యా! నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా. వంటలవాడిగా విరాటరాజు కొలువులో చేరతాను. పైగా నాకు మల్లయుద్ధంలో ప్రావీణ్యం ఉంది కదా. అతని కొలువులో మల్ల విద్యా ప్రదర్శనలు ఇస్తూ అందరికి వినోదం కలిగిస్తాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ధర్మరాజు కొలువులో వంటవాడిగా ఉన్నానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు అర్జునుని చూసి " అర్జునా! నీ సంగతి ఏమిటి నీవు ఎలాంటి కొలువు చేస్తావు " అని అడిగాడు. అర్జునుడు " అన్నయ్యా! నేను దేవేంద్రుని దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను ఊర్వసి కామించగా నిరాకరించాను. అప్పుడు ఊర్వసి నపుంసకుడివి కమ్మని శపించింది. దేవేంద్రుడు నన్ను ఆ శాపాన్ని అజ్ఞాత వాస కాలంలో అనుభవించమని చెప్పాడు. అజ్ఞాతవాసం కాగానే శాపవిమోచనం కాగలదని చెప్పాడు. ఆ శాపవశమున నేను విరాటరాజు కొలువులో పేడి రూపం దాల్చి విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. నాకు నాట్యవద్యలో ప్రవేశం కలదు. నేను అంత॰పురకాంతలకు నాట్యం నేర్పుతాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ద్రౌపది అంత॰పుఅరంలో నాట్యాచారుడిగా ఉన్నానని చెప్తాను " అని అన్నాడు. తరవాత నకులుని చూసి " ఇతడు చాలా సుకుమారుడు, అందగాడు ఇతడు తన నిజరూపమును ఎటుల దాచగలడు. ఒరులను ఎలా సేవించగలడు " అన్నాడు. నకులుడు " అన్నయ్యా! నాకు అశ్వశిక్షణలో ప్రవేశమున్నది. నేను అశ్వసిక్షకుడిగా విరాటుని కొలువులో చేరతాను. అశ్వశాలలోని గుర్రాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాను. ధామగ్రంధి నామంతో సంచరిస్తాను. ఇంతకు పూర్వం నేను ధర్మరాజు కొలువులో అశ్వశిక్షకుడిగా పని చేసానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు నవ్వి " సహదేవుని వైపు చూసాడు. సహదేవుడు " అన్నయ్యా! నాకు పశుపోషణలో అనుభవం ఉంది. తంత్రీ పాలుడనే పేరుతో గోరక్షకుడిగా విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. ఇంతకు పూర్వం ధర్మరాజు కొలువులో గోరక్షకుడిగా పని చేసానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని చూసాడు. " సుకుమారి ఇంత వరకు పనులు చేయించుకున్నది కాని ఎవరిని సేవించి ఎరుగదు. ఇంతటి ఉదాత్తచిత్త ఏ పని చేయగలదు " అని మనసులో బాధపడ్డాడు. అది గ్రహించిన ద్రౌపది " నేను సైరంధ్రీ వేషంలో మాలిని అనే పేరుతో విరాటరాజు అంత॰పురానికి వెళతాను. విరాటరాజు భార్య సుధేష్ణను ప్రసన్నం చేసుకుంటాను. అందరూ గౌరవించే విధంగా సైరంధ్రీ వ్రతం సాగిస్తాను " అన్నది. అందరికి అన్ని పనులు కుదిరాయి. మనం అందరం అజ్ఞాతవాసాన్ని నిరపాయంగా గడుపుదాం. ధౌమ్యుల వారు అగ్ని హోత్రం రక్షిస్తుంటారు. మిగిలిన వారు వారి వారి స్వస్థలాలకు వెళతారు. ఎవరైనా మా గురించి అడిగితే ద్వైతవనం నుండి ఎటో వెళ్ళారని చెప్పండి " అని ధర్మరాజు ఆదేశించాడు.

రాజకొలువులో ప్రవర్తించవలసిన పద్ధతులు

ధౌమ్యుడు పాండవులను చూసి "ధర్మరాజా! మీరు కురువంశంలో జన్మించారు. గౌరవంగా బ్రతికారు. ఇలాంటి మీరు పరులను సేవించుట కష్టమే. కాని మనకు అనుకూలం కాదని మరచి పోవద్దు. మీరు పరాక్రమాలు ప్రదర్శిస్తే అజ్ఞాతవాసం భగ్నమౌతుంది.రాజులను సేవించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రాజుతో చనువుగా ఉన్నాను అనుకుని రాజమర్యాద అతిక్రమిస్తే హాని కలుగుతుంది. రాజుకన్నా విలువైన దుస్తులు ధరించటం కాని, రాజుకన్నా అధికంగా మాట్లాడటం కాని, రాజగృహంకన్నా ఆడంబరమైన గృహంలో నివసించటం కాని చేయకూడదు. సహజంగా రాజులు తమ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు పుత్రులైనా మిత్రులైనా శత్రువులుగా చూస్తారు. తాను చేయలేని పని తలపై వేసుకోకూడదు అందువలన భంగపాటు తప్పదు. రాజులయందు మౌనంగా ఉండకూడదు అలాగని అతిగా భాషించకూడదు. మితమైన చతుర సంభాషణచే రాజులను మెప్పించాలి. అంత॰పుర రహస్యాలను బయటపెట్టకూడదు. రాజుకు చెప్పదగినవి, వినదగినవి అయిన మాటలనే చెప్పాలి. రాజు అనుమతి మీదనే ఆసనాన్ని అధిరోహించాలి. రాజుకన్నా ఉన్నతాసనం పై ఎప్పటికీ అధిరోహించకూడదు. రాజు అభిమానించాడని పొంగి పోకూడదు. అలాగే అవమానిస్తే కుంగి పోకూడదు. రాజు చెప్పిన పనిని ఎండ, వాన, ఆకలి, దప్పిక, కాలము ప్రదేశం నిమిత్తం లేకుండా చేయాలి. రాజధనాన్ని విషంతో సమానంగా చూడాలి. రాజధనాన్ని సంగ్రహించడం ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే. రాజు కొలువులో నవ్వటం ఆవులించడం చేయకూడదు. రాజుగారి శత్రువులతోకాని, వారి దూతలతో కాని సన్నిహితంగా మెలగ కూడదు. భటుడు సంపద కలదు కదా అని అధికంగా భోగింపరాదు. రాజుకు కంటగింపుగా ఉంటుంది. కనుక అజ్ఞాతవాస సమయమున మీరు అణగి మెణగి మెలగవలసి ఉంటుంది " అన్నాడు.

విరాటనగరానికి పయనం

ధర్మరాజు ధౌమ్యుని బుద్ధిమతి విని " మాకు అన్నీ మీరే. మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు. వాటిని తప్పక పాటిస్తాము " అన్నారు. ధౌమ్యుని ఆశీర్వాదం పొంది పంఆడవులు ధౌమ్యుడు అక్కడి నుండి విరాటనగరానికి వెళ్ళారు. యమునా నది వెంట నదుస్తున్నారు. మత్స్యదేశ పొలిమేర చేరగానే అక్కడ ఒక ఆశ్రమంలో ధౌమ్యుడు ఆగాడు. పాండవులు అరణ్యాలవెంట తమ ప్రయాణం సాగించారు. విరాటనగరానికి వెళ్ళటానికి చాలా దూరం నడిచారు. ద్రౌపది ఇక నడవలేక పోయింది విశ్రాంతి తీసుకుంటాము అనుకుంది. ధర్మరాజు అందుకు ఒప్పుకోలేదు త్వరగా విరాటనగరం చేరాలన్నది అతని కోరిక పట్టుదల. ద్రౌపది ఇక ఒక అడుగు కూడా వేయలేనని చెప్పింది. ధర్మరాజు నకులుని చూసి " నకులా! ద్రౌపది అలసి పోయింది. కొంచం ఎత్తుకుని తీసుకు రాగలవా " అని అడిగాడు. నకులుడు " నేను కూడా అలసి పోయాను అన్నయ్యా " అన్నాడు. ధర్మరాజు సహదేవుని అడిగాడు. సహదేవుడు అలాగే సమాధానం ఇచ్చాడు. ఇక అర్జునిని వంతు వచ్చింది. అర్జునుడు ద్రౌపదిని అవలీలగా ఎత్తుకుని విరాటనగరం వైపు నడిచాడు. అందరూ విరాట నగర పొలిమేర చేరగానే కొంత తడవు ఆగారు. ధర్మరాజు తమ్ములతో "మనం ఈ ఆకారాలతో ఆయుధాలతో నగరంలో అడుగుపెడితే మనలను సులువుగా గుర్తిస్తారు. మనం మన ఆయుధాలను దాచాలి " అన్నాడు.

పాండవులు తమ ఆయుధాలను దాచుట

ధర్మరాజు మాటలు విని అందరూ చుట్టూ పరికించారు. పక్కనే శ్మశానం ఉంది. అక్కడకు సామాన్యంగా ఎవరూ రారు. భూత, ప్రేత, పిశాచాలు అక్కడ తిరుగుతాయని ప్రజలు అక్కడకు రారు. అందువలన ఆయ్ధాలను దాచడానికి అదే అనువైనదని భావించారు. ఆ శ్మశానంలో ఒక జమ్మి చెట్టు ఉంది. ఆ జమ్మి చెట్టు ఆకాశాన్ని అంటే కొమ్మలతో దట్టమైన ఆకులతో పగటి పూట చూడటానికి కూడా భీతి కొల్పేలా భయంకరంగా ఉంది. ఆ జమ్మి చెట్టును చూసిన అర్జునుడు " అన్నయ్యా మనం మన ఆయుధాలను ఇక్కడ భద్రపరుస్తాము " అన్నాడు. పాండవులు తమ ఆయుధాలను ఒకచోట చేర్చి వాటిని వెంట్రుకలు ఉన్న చర్మంతో కట్టారు. పక్కనే పడి ఉన్న ఒక జంతు చర్మాన్ని సహదేవుని సాయంతో తీసుకు వచ్చి దానితో ఆమూట కట్టారు. ఆ పక్కనే ఒక అనాధ శవం పడి ఉంది. ఆ శవాన్ని ఆయుధాల మూటతో చేర్చి కట్టారు. ధర్మరాజు ఆ జమ్మి చెట్టు ఎక్కి ఆయుధాల మూటను చెట్టుకు వ్రేలాడ కట్టాడు. ధర్మరాజు ఆ ఆయ్ధాలమూటకు నమస్కరించి తనకు అర్జునికి తప్ప అవి సర్పాల వలె కనపడాలని ప్రార్ధించాడు. భీముడు వస్తే అస్సలు కనపడవద్దని వేడుకున్నాడు. ధర్మరాజు చెట్టు దిగి చుట్టూ పరికించాడు. దూరంగా కొంతమంది పశువుల కాపర్లు కనిపించారు. వారి దగ్గరకు పోయి " అయ్యలారా! మా తల్లి చనిపోయింది. మా కులాచారం ప్రకారం శవాన్ని జమ్మి చెట్టుకు వ్రేలాడ కట్టాలి అందుకే కట్టాము " అని శవాకృతిలో ఉన్న ఆయుధాల మూట చూపించాడు. అమాయకులైన గొల్లలు భయభ్రాంతులై ఇతరులకు చెప్పటానికి పరుగుపరుగున వెళ్ళారు.

పాండవుల వేషధారణ

ఆ తరవాత ధర్మరాజు యమధర్మరాజును ప్రార్ధించాడు. వెంటనే ధర్మరాజుకు సన్యాసి వేషం , భీమునకు వంట వాడి వేషం, ార్జునినికి పేడి వేషం, నకులునికి అశ్వరక్షకుడి వేషం, సహదేవుడికి పశుపాలకుని వేషం లభించాయి. మీరు అందరూ ఒకరి వెంట ఒకరు వచ్చి నగరంలో ప్రవేశించండి అని చెప్పి ధర్మరాజు ముందుగా కమండలం తీసుకుని పాచికల కట్ట చంకన పెట్టుకుని నగర ప్రవేశం చేసారు.

ధర్మరాజు కొలులో చేరుట

దైవవశాత్తు విరాటరాజు ఆరోజు నగరసంచారం చేస్తున్నాడు. దూరం నుండి సన్యాసి వేషంలో వస్తున్న ధర్మరాజుని చూసి " ఆహా ఏమి ఠీవి, ఏమి రాజసం , రాజ్యాను ఏలే చక్రవర్తిలా ఉన్నాడు " అనుకుని ధర్మరాజుకు ఎదురు పోయి నమస్కరించాడు. ధర్మరాజుతో " అయ్యా! మీరెవరు? ఏ ఊరు? మా నగరుకు ఎందుకు వచ్చారు? వివరించండి " అన్నాడు. ధర్మరాజు చిరునవ్వు నవ్వి " నేను బ్రాహ్మణుడను. కురుదేశంలో జన్మించాను. సన్యాసాశ్రమం స్వీకరించాను. నాకు జూదంలో ప్రవేశముంది. శత్రువులు జూదంలో ఓడించి నా సంపదనంతా అపహరించారు. ఆ అవమానం భరించలేక దేశం విడిచి వచ్చాను. నన్ను కంకుడు అంటారు. నేను తమరు సజ్జనులైన మహారాజులని విని వచ్చాను. నేను నీచ వృత్తి చేయను. ఒక సంవత్సరం వ్రతం ఉన్నది . ఆ వ్రతకాలం మీ వద్ద ఉంటాను అనుగ్రహించండి. ఆ తరవాత నన్ను అవమానించిన వారిని వెతుక్కుంటూ వెళతాను " అన్నాడు. విరాటరాజు "అయ్యా! తమరు మా రాజ్యంలో ఉండటం కంటే మాకు భాగ్యం లేదు. నాకు జరిగే మర్యాదలు అన్నీ నీకు జరుగుతాయి. తమరు సంతోషంగా మా నగరంలో ఉండండి " అన్నాడు. ధర్మరాజు " నాకు రాజభోగాలతో పని లేదు. నేల మీద నిద్రిస్తాను. హోమం చేయగా మిగిలినది తింటాను " అన్నాడు. విరాటరాజు అందుకు అంగీకరించాడు. ధర్మరాజు కొలువులో ప్రవేశించాడు.

భీముడు కొలువులో చేరుట

తరవాత భీముడు వంటలవాడిగా చేతితో గరిటతో నగర ప్రవాశం చేసాడు. విరాటరాజుకు అభివాడం చేసాడు.భీముడు " అయ్యా! నేను నాల్గవజాతి వాడను. వంటలు చేయగలను. తమరి కొలువులో వంటల వాడిగా ఉంటాను. నేను ఇదివరకు ధర్మరాజు వద్ద వంటలవాడిగా ఉన్నాను. ఆ యనకు ప్రీతికరమైన వంటలు చేసేవాడిని. ఆయనను సేవించినట్లు మిమ్మల్ని సేవిస్తాను. నాకు మల్ల యుద్ధం వచ్చు. తమరికి వినోదం కలిగిస్తాను అనుగ్రహించండి. తమరికి ఇష్టం లేకుంటే వేరొక చోటికి పోతాను " అన్నాడు. విరాటరాజు " నీమాటలకు నేను ముగ్ధుడనయ్యాను. నీవు వంటవాడిగా చేరు " అన్నాడు. భీముడు విరాటుని కొలువులో వంటల వాడయ్యాడు.

అర్జునుడు కొలువులో చేరొట

అర్జునుడు అందమైన చీరె కట్టుతో, రవికతో, చక్కని తలకట్టుతో ఆడవేషంలో విరాటుని కొలువులో ప్రవేశించాడు. అర్జునినిలో నపుంసకత్వం ఆడతనం మూర్తీభవిస్తున్నాయి. విరాటుని చూసి " మహారాజా! నా పేరు బృహన్నల. నేను పేడి వాడిని. ఆడపిల్లలకు ఆట పాట నేర్పుతాను. నన్ను మీ కొలువులో చేర్చుకోండి " అన్నాడు. విరాటరాజు "అయ్యో ఇంత అందమైన నీకు పేడి రూపమా " అడిగాడు. అర్జునుడు " ఔను మహారాజా! శాపవశాన పేడితనం ప్రాప్తించింది. పేడి తనం వలన ఏ పని చేయలేను. సంగీతం, నృత్యం నేర్చుకున్నాను, అన్ని రకముల వాద్యాలను వాయించ గలను. అలంకారకళలో ప్రవేశం ఉంది " అన్నాడు. అతడి పేడి రూపంలో ఏమీ దోషం లేదని గ్రహించి ఉత్తరను కొలువుకు రప్పించాడు. మందగమనయఇ ఉత్తర కొలువుకూటమికి వచ్చింది. విరాటరాజు " బృహన్నలా! ఈమె నా కూతురు బృహన్నల. ఈమెకు నాట్యం నేర్పగలవా " అన్నాడు. బృహన్నల వినయంగా నేర్పుతాను అన్నాడు. విరాటరాఝూ " బృహన్నలా! నా కూతురు ఇంకా చిన్న పిల్ల. ఆట పాటల మీద మక్కువ ఇంకా పోలేదు. నీవు ఆమెకు కళలయందు ఆసక్తిని కలిగించి నాట్యంలో శిక్షణ ఇవ్వవలసిన బాధ్యత నీదే. నీవు ఈమెకు రక్షికుడిగా ఉండాలి " అన్నాడు. ఉతరను చూసి " అమ్మా! ఈమె నీ గురువు ఆమె ఎలా చెపితే అలా భక్తితో నడచుకో " అని బృహన్నలకు ఉత్తరను అప్పగించాడు. ఆ విధంగా అర్జునుడు విరాటుని కొలువులో ప్రవేశించాడు.

నకులుడు కొలులో చేరుట

తరవత నకులుడు అశ్వపాలకుని వేషంలో విరాటుని కొలువులో ప్రవేశించాడు. ఆ సమయంలో విరాటుడు తన వద్దకు కొనిరాబడిన గుర్రాలను పరిశీలిస్తున్నాడు. నకులుడు కూడా అశ్వాలను తదేకంగా చూస్తున్నాడు. ఇది గమనించిన విరాటుడు అతనికి అశ్వవిద్యలో ప్రవేశం ఉన్నదని గ్రహించాడు.అతని గురించి వివరాలు కనుక్కుని రమ్మని మంత్రులను ఆడేశిస్తున్న తరుణంలో నకులుడు విరాటనుని దగ్గరకు వచ్చాడు. నకులుడు " మహారాజా! నా పేరు తామగంధి. నాకు అశ్వవిషయములు అన్ని తెలుసు అశ్వపోషణ చేయగలను. అశ్వఆయు॰ప్రమాణాన్ని చెప్పగలను. నేను ఇంతకు ముందు ధర్మరాజు వద్ద అశ్వరక్షకుడుగా ఉంటున్నాను. కాని ధర్మరాజు అందరిని వదిలి పోయాడు. విరాటరాజు సుజవుడు, లోకోత్తర అని విని నేను తమరి కొలువులో చేరి తమరిని సేవించాలని వచ్చాను " అన్నాడు. విరాటుడు అతని నైపుణ్యానికి మెచ్చి అతనిని తన అశ్వశాలలో చేర్చుకున్నాడు.

సహదేవుడు కొలువులో చేరుట

సహదేవుడు చేతిలో ముల్లుగర్రతో, తలమీద తాళ్ళ మూటతో గోపాలుడి వేషంలో విరాటుని వద్దకు వచ్చాడు. సహదేవుడు విరాటునితో " మహారాజా! నాపేరు తంత్రీ పాలుడు. నేను ఆలమందలను చక్కగా పెంచుతాను. నాకు పశువులలో ఉన్న రకాలు తెలుసు. పశువుల వ్యాధులకు చికిత్స చేయగలను. ఇంతకు ముందు ధర్మరాజు పాలనలో పశుపాలకుడిగా ఉండే వాడిని. నన్ను తమరి కొలువులో పశుపాలకునిగా నియోగించండి " అని కోరాడు. విరాటుడు అతని మాటలకు మెచ్చి అతనిని కొలువులో పశుపాలకుడిగా నియోగించాడు. ఈ విధంగా పాండవులు అయిద్య్గురు కొలువులో చేరారు.

ద్రౌపది అంత:పురంలో చేరుట

ద్రపది సైరంధ్రి వేషానికి తగినట్లుగా తలకు కొప్పు పెట్టుకుంది. మాసిన చీర కట్టుకుంది. దాసీభావాన్ని మనసులో నింపుకుంది. విరాటనగర రాజవీధిలో నడుస్తూ అంత:పురం చేరుకుంది. ఆ సమయంలో విరాటరాజపని సుధేష్ణాదేవి విహారనిమిత్తం రాజప్రాసాదం పైకి ఎక్కి విహరిస్తూ రాజవీధి వెంట విహరిస్తున్న సైరంధ్రిని చూసింది. ఆమె అందానికి ఆశ్చర్యపోయింది. ఆమెను తీసుకు రమ్మని చెలికత్తెలను పంపింది. వారు వెళ్ళి సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని సుధేష్ణ సముఖానికి తీసుకు వచ్చారు. సుధేష్ణ ద్రౌపదితో " మానినీ నీవు ఎవరు? ఏమి కులం? నీ పేరేమి? ఏ పని మీద ఈ నగరానికి వచ్చావు? " అని అడిగింది. దౌపది " అమ్మా! సైరంధ్రీ జాతి స్త్రీని. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. నేను ఒక కారణంపై నా భర్తల ముందే అవమానింప బడ్డాను. భర్తలతో అడవులలో నివసించాను. బ్రహ్మచారిగా కాలంగడిపాను. నాకు ఇంకొక్క వ్రతం ఉన్నది. మీరు ధర్మవర్తనులు అని విని వ్రతకాలం మీ రాణివాసంలో గడపాలని వచ్చాను. నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్యభామ వద్దా, పాండవ పత్ని ద్రౌపది వద్దా పని చేసాను. నాకు పూలమాలలు, చెండ్లు కట్టడం తెలుసు. రకరకాలుగా తిలకం దిద్దగలను. అందంగా కురులను అల్లగలను ముడువగలను " అన్నది. ఆమెను అంత:పురంలో చేర్చుకోవడానికి సుధేష్ణకు కొంత సందేహం ఉంది " సైరంధ్రీ! నీవు అందగత్తెవు. నిన్ను చూసి మహారాజు నీ మీద మనసు పడితే నేను ఏమి చేయాలి? ఆడవాళ్ళే నీపై చూపు మరల్చలేక పోతున్నారే ఇక మగవాళ్ళ విషయం చేప్పేదేముంది. నిన్ను అంత:పురంలో ఉంచుకోవడం అంటే నా వినాశనం నేను కోరుకోవడమే " అన్నది సుధేష్ణ. ద్రౌపది " అమ్మా! తమరు అలా అనవలదు. నా భర్తలు బలవంతులు. నా విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఏవరైనా నన్ను నీచభావంతో చూసినా చాలు వారిని సంహరిస్తారు. కనుక ఎవరూ నన్ను దుర్బుద్ధితో చూడరు. నాకు అలాంటి నీచ బుద్ధులు లేవు. నన్ను మీరు నమ్మి మీ సేవకురాలిగా స్వీకరించండి. కాని నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఇతరుల ఎంగిలి తినను. నీచపు పనులు చేయను " అని పలికింది. సైరంధ్రి మాటలకు సుధేష్ణ సంతోషించి ఆమెను తన పరిచారికగా స్వీకరించింది. అలా ద్రౌపది కూడా విరాటుని కొలువులో చేరింది. పాండవులు ద్రౌపది విరాటుని కొలువులో సంతోషంగా కాలం గడుపుతున్నారు.

ద్వితీయాశ్వాసం

ధర్మరాజు విరాటరాజు కొలువులో ధర్మప్రసంగములు చేస్తూ, జూదక్రీడతో కాలం గడుపుతూ అంద్లో అర్జించిన ధనం తమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు.భీముడు రాజుకు రుచిగా వండిపెడుతూ మిగిలిన ఆహారపదార్ధములను అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు. అర్జునుడు తన కళాప్రదర్శనలలో గడించిన బహుమతులు అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నాడు. నకులసహదేవులు తమ విధి నిర్వహణలో అర్జించిన ధనాన్ని అన్నదమ్ములకిస్తూ కాలం గడుపుతున్నారు.ఆ విధంగా నాలుగు నెలలలు గడిచాయి.

మల్లయోధుని వలలుడు ఓడించుట

ఒక రోజు విరాటుని కొలువులోకి ఒక మల్లుడు ప్రవేశించాడు. అతని భయంకరాకారం చూసి విరాటుని కొలువులోని వారంతా భయపడ్డారు. మల్లుడు " రాజా నేను అనేక రాజ్యాలు సందర్శించాను. ఎక్కడా నన్ను మల్లయుద్ధంలో గెలిచే వీరుడు కనిపించ లేదు. అందుకే మీ వద్దకు వచ్చాను " అన్నాడు.కొలువులో ఉన్న మల్లులు కూడా అతనిని భంకరాకారాన్ని చూడగానే వెనుకడుగు వేసారు. విరాటుని మొహం చిన్నబోయింది. ధర్మరాజు విరాటుని చూసి " ధర్మరాజా ఇదివరకు నేను ధర్మరాజు కొలువులో ఉండగా ఒక మల్ల్ని చూసాను. అతడు ఇప్పుడు మీ కొలువులో వంటవాడిగా ఉన్నాడు. అతడు ఎందరో మల్ల యోధులను ఓడించాడు " అని చెప్పి ఊరకున్నాడు. విరాటరాజు వెంటనే వలలుని పిలిపించాడు. వలలుడు రాగానే విరాటరాజు " నీవు ఇతనితో మల్ల యుద్ధానికి సిద్ధం కమ్ము" అన్నాడు. అప్పుడు భీముడు అన్నగారి వైపు చూసాడు. ధర్మరాజు అనుజ్ఞ ఇస్తూ కను సైగ చేసాడు. వలలుడు " మహారాజా! నేను ఇదివరకు ధర్మరాజ సభలో అనేక మంది మల్ల యోధులతో పోరాడి ఆయనకు వినోదం కలిగించాను. అలాగే మీకూ వినోదం కలిగిస్తాను " అన్నాడు. వలలుని వేషంలో ఉన్న భీముడు మల్లయోధునితో యుద్ధం మొదలు పెట్టాడు. భీముడు ఉత్సాహంతో తొడలు కొట్టాడు. ఇరువురు ఒకరిని ఒకరు చూసుకున్నారు. కిందికి వంగి మట్టిని వంటికి రాసుకున్నాడు. ఆఖరికి మల్లుని పట్టుకుని ముక్కు మీద గుద్ది బయటికి విసిరి వేసి భీముడు మల్లుని ఓడించాడు. విరాటరాజు వలలునికి ఎన్నో కానుకలిచ్చి సత్కరించాడు. భీముడు అక్కడౌన్న పేదవారికి ఆకానుకలు పంచి ఇచ్చి తిరిగి వంటశాలకు వెళ్ళాడు. ఆవిధంగా భీముడు మల్లులతో పోరుతూ అంత॰పుర కాంతలకు వినోదం కలిగిస్తున్నాడు. మల్లులు లేనప్పుడు సింహములతో, పులులతో పోరి వినోదం కలిగించాడు.

కీచకుడు ద్రౌపదిని చూచుట

అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొన్నిరోజులలో ముగుస్తున్న సమయంలో విరాటుని బావమరిది కీచకుడు అంత॰పురంలో అక్కను చూడటానికి వచ్చి యాదృచ్చికంగా ద్రపదిని చూసాడు. కీచకుడు మంచి అందగాడు, బలవంతుడు, కాని వివేక హీనుడు. అతడికి బలగర్వం, సౌందర్య గర్వం ఎక్కువ. అతడు విరాటరాజు కొలువులో దండనాయకుడు. కీచకుడు ద్రౌపది అందానికి ఆశ్చర్యపోయి ఆమె నుండి చూపులు మరల్చుకోలేక పోయాడు. అతడు మనసులో " అహా! మానవులు ఎవరైనా ఇంతటి అందగత్తెను చూసి ఉండరు. ఇంతటి అందగత్తె మాన్మధుని వద్ద ఉంటే ఆనాడు శివుని కూడా జయించే వాడు కదా. బ్రహ్మదేవుడు మన్మధుని అయిదు బాణాలు కలిపి ఈమెను సృష్టిండో ఏమో. మన్మధుడు కూడా విరహతాపంలో వేగిపోతాడేమో. ఈ సుందరాంగి తల్లితండ్రులు ఎవరో, అదృష్టవంతుడైన భర్త ఎవరో, పేరు ఏమో, ఈమెను పొందే మార్గమేమిటో, ఈ పనికి ఎవరు నాకు సాయపడగరు " అని పరిపరి విధాల ఆలోచించాడు. మాసిన చీర ధరించిన ద్రౌపది అతని వికారపు చూపులకు అసహ్యించుకుంది. ఆమె మనసులో " ఇతడు ఏమిటి ఇలా చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఇతని నుండి రక్షించే దిక్కెవరో " అనుకున్నది. కీచకుడు అదేమి పట్టించు కోకుండా ఆమె చూపులను చూసి శృంగార చేష్టలని అపోహ పడ్డాడు. పక్కనే సుధేష్ణ, పరిచారికలు చూస్తున్నా పట్టించుకోకుండా ఆమె వైపు మోహంతో తధేకంగా చూసాడు. తరవాత తేరుకుని అక్క సుధేష్ణకు నమస్కరించాడు. ఆమె అతనికి ఉచితాసనం చూపించింది.

కీచకునికి సుధేష్ణ బుద్ధిమతి చెప్పుట

కీచకుని మాటలు విన్న సుధేష్ణ " నేను అనుకున్నంత అయింది. ఈ సైరంధ్రిని చూసి కీచకుడు మోహావేశంలో పడ్డాడు. వీడికి ఏమి కీడు మూడుతుందో? వద్దన్నా వినే వాడు కాదు. నేనేమి చేసేది? నా శక్తి వంచన లేకుండా చెప్పి చూస్తాను " అనుకున్నది. సుధేష్ణ " తమ్ముడా కీచకా! నీ అంత॰పురంలో అతి సుందరులైన కాంతలు ఉన్నారు. ఈ నీరసాకార అయిన సైరంధ్రి ఎందుకు " అని అనునయంగా చెప్పింది సుధేష్ణ. కీచకుడు " అక్కా! ఈ సైరంధ్రిని పోలిన అందగత్తె ఈ భూమి మీదే కాదు దేవతలలో కూడా లేదు ఇది నిజం. ఆమె నేత్రాలు, అద్మాలవంటి కాళ్ళు, ఆ కోకిల కంఠం, ఆ మేని సొంపు నన్ను ఆకర్షిస్తున్నాయి. ఏ ఉపాయం అయిన సరే ఆమె నాకు కావాలి " అన్నాడు. కీచకుడు మామూలు మాటలతో వినడని కొంచం కటువుగా చెప్ప సాగింది. " తమ్ముడా కీచకా! పరస్త్రీ సాంగత్యం వలన నీ ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి హరింపబడతాయని తెలియదా? ధర్మాత్ములు దీనిని హర్షించరు. భర్తకు తెలిస్తే ప్రాణం మీదకు వస్తుందని, ఇతరులు చూస్తే పరువు పోతుందని, సాటి ఆడువారికి తెలిస్తే గౌరవం పోతుందని, బంధువులకు తెలిస్తే వంశనాశనం ఔతుందని క్షణ క్షణం భయపడుతూ, భయపడుతూ, వ్యధతో ఉండే పరస్త్రీతో ఏమి సుఖపడతావు. జారిణితో పొందు సుఖం కాదని అందరూ దూరంగా ఉంటారు. ఆమె భర్తలు గంధర్వులు వాళ్ళ చేతిలో నీవు మరణించవచ్చు. దానిని మర్చిపోరా తమ్ముడూ. చెడు మార్గలో చరించే వారికి వినాశనం తప్పదు నీ లాంటి బుద్ధి మంతులకు ఇది తగదు " అన్నది సుధేష్ణ. అక్క చెప్పిన మాటలు కీచకుని చెవికెక్క లేదు. " ఓ సుధేష్ణా! ఒక్క మాట చెప్తున్నాను విను. ఈ భూలోకంలో నన్ను ఎదిరించి నిలువగల వీరుడు లేడు. నా బాహుబలంతో గంధర్వాదులను సంహరించగలను. కనుక నాకు బుద్ధి చెప్పుట మాని నాకోరిక మార్గం సుగమం చెయ్యి " అని వంగి అక్క పాదాలకు నమస్కరించాడు. " ఇక వీడు ఏమి చెప్పినా వినడు. వీడికి ఆమెను జతచేస్తే సరి. ఆమె భర్తలైన గంధర్వుల చేతిలో చస్తాడు. లేకున్న మన్మధుడి చేతిలో చస్తాడు.ఎలాగైనా వీడికిక చావు తధ్యం " అనుకున్నది సుధేష్ణ.

సుధేష్ణ మాలినిని కీచకుని ఇంటికి పంపుట

సుధేష్ణ కీచకుని మంకుపట్టు గ్రహించి " తమ్ముడా కీచకా! ఎందుకు ఆరాట పడతావు. ఆమెను నీ వద్దకు పంపుట కష్టం కాదులే నీవు వెళ్ళు సైరంధ్రిని నీ వద్దకు పంపుతాను ఆ తరవాత నీ ఇష్టం " అన్నది.క్క మాటలు విన్న కీచకుడు సంతోషంతో తన మందిరానికి వెళ్ళాడు. విందు భోజనం సిద్ధం చేసాడు, మధుర రసాలు ఏర్పాటు చేసాడు, పని వారందరిని ఏర్పాటు చేసాడు. తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకుని అందమైన ప్రదేశంలో కూర్చుని సైరంధ్రి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సుధేష్ణ సైరంధ్రిని పిలిచి " మాలినీ! నాకు చాలా దాహంగా ఉంది. నా తమ్ముని కీచకుని ఇంట్లో రుచికరమైన మధ్యం ఉంది తీసుకురా " అన్నది ఈ మాటలు విన్న ద్రౌపది మనసు తల్లడిల్లింది. ఆమెకు శరీరం నిండా చెమట పట్టింది. ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలా అని భగవంతుని ప్రార్ధించింది. ద్రౌపది " అమ్మా! నన్ను వదిలి పెట్టు. మధిరను తీసుకురావటానికి వేరొకరిని పంపు. నేను మీకు నీచపు పనులు చేయనని చెప్పాను. మీ గృహం అతి నిర్మలమయినదని నా భర్తలు దూరంగా ఉన్నా మిమ్ము నమ్మి మీ ఇంట ఉన్నాను. మిమ్ము నమ్మిన నావంటి అనాధను ఇలాంటి నీచపు పనులకు పంపడం భావ్యమా " అన్నది. సుధేష్ణ " మాలినీ! నేను మనసు పడి త్రాగాలని మద్యం తేవడానికి నిన్ను పంపుతున్నాను. ఇందుకు నీచజాతి వారిని పంపగలనా. మన స్నేహం ఇంతేనా.నా తమ్ముడు కీచకుని ఇల్లు నాకు పరాయిది కాదు కదా. కనుక నీవు వెళ్ళి మద్యం తీసుకురా " అన్నది. ఆమె మాటను ఔదల దాల్చడం తప్ప ద్రౌపదికి వేరు మార్గం తెలియలేదు. దేవిని మీద భారం వేసి ద్రౌపది కీచకుని ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమె సూర్యునికి నమస్కరించి " ఓ సూర్య భగవానుడా! నేను పాండు పుత్రులను తప్ప అన్యులను మనసునైనా తలపనేని నాకు ఈ కీచకుని వలన ఎటువంటి ఆపద కలగ కుండా కాపాడు " అని ప్రార్ధించింది. సూర్యుడు కరుణించి ద్రౌపదికి రక్షణగా ఒక రాక్షసుని పంపాడు. అతడు అదృశ్య రూపంలో ద్రౌపదిని వెన్నంటి వస్తున్నాడు. ద్రౌపది తడబడే అడుగులతో కీచకుని ఇంట ప్రవేశించింది. కీచకుడు ఆమె రాకకోసమే ఎదురు చూస్తున్నాడు.

ద్రౌపది విరాటుని కొలువులో ప్రవేశించుట

ద్రౌపది కీచకునితో " మాదేవి తృష తీరటానికి మధిర తీసుకు రమ్మంది. త్వరగా మధిరను ఇవ్వండి " అన్నది. కీచకుడు " మీ దేవి తృష తీర్చినట్లే నా తృష తీర్చవా " అన్నాడు. ద్రౌపది " ఆలస్యం అయితే మా దేవి కోపిస్తుంది. త్వరగా మధిరను ఇవ్వండి " అన్నది. కీచకుడు " మధ్యం వేరే వాళ్ళతో పంపుతాను. నీవు ఈ మద్యంత్రాగి నా తాపాన్ని పోగొట్టు. నిన్ను నా రాణిని చేసుకుంటాను. అపారమైన మణిభూష్ణాలు, విలాసగృహాలు నీకు సమర్పిస్తాను. నా భార్యలను నీకు దాసిని చేస్తాను. నేను నీ కనుసన్నలలో మెలుగుతాను " అంటూ కీచకుడు ద్రౌపదిని పట్టుకోబోయాడు. అంతలో ద్రౌపదికి రక్షగా ఉన్న రాక్షసుడు ఆమెలో ప్రవేశించాడు. అంత బలాడ్యుడైన కీచకుని ఆమె విదిలించి కొట్టి బయటకు వచ్చింది. కీచకుడు ఆ మెను వెంబడించాడు. ద్రౌపది పరుగెత్తి విరాటుని కొలువులో ప్రవేశించింది. కీచకుడు ఆమె వెంట కొలువులో ప్రవేశించి ఆమె జుట్టు పట్టుకుని లాగి కింద పడేసాడు. ఆ సమయంలో ఆమెలో ఉన్న రాక్షసుడు కీచకుని కొట్టి లాగి కింద పడవేసాడు. కీచకుడు ఆ బదెబ్బకు అవమానంతో కుంగి పోయాడు. ఆసమయంలో అన్నగారితో పాటు కొలువు కూటంలో ఉన్న భీముడు ఆగ్రహంతో ఊగి పోయాడు. ఒక్క క్షణం తమ అజ్ఞాత వాస విషయం మరిచాడు. కీచకుని పైన పట్టరాని కోపంతో వెంటనే పక్కన ఉన్న వృక్షాన్ని చూసి అలాగే అన్నగారి వైపు చూసాడు. ధర్మజుడు భీముని కను సైగతో వారించాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా! మన వంటల వాడు వలలుడు ఎక్కడ చూసాడో కాని వంట చెరకు కొరకు వేరు వృక్షాలు లేవా? ఫలపుష్పాదులతో ఉండి నలుగురికి నీడ నిచ్చే వృక్షాన్ని వంట చెరకు కొరకు ఖండించడం తగునా " అన్నాడు. భీముని కోపం ధర్మరాజు వారింపు ద్రపది చూసి విరాటునితో " అయ్యా! ధర్మాధర్మాలు తెలిసిన వారు, శత్రువులను అవలీలగా చంపగలిహిన వారు, గంధర్వులు అయిన నా భర్తలు అయిదుగురు నన్ను ఈ కీచకుడు అవమానిస్తుంటే చూస్తూ ఊరకున్నారు. ఇక సామాన్యమైన స్త్రీలకు రక్షణ ఏది. ఈ విరాటరాజు కొలువులో స్త్రీకి అవమానం జరుగుతుంటే ఎవరూ పలకరేమి? ఎవరికీ కరుణ లేదా? ధర్మరక్షణ చేయవలసిన రాజు ఇలా మిన్నకుండటం భావ్యమా? " అని సూటిగా ప్రశ్నించింది. అది చూసిన విరాటరాజు కీచకుని మందలించడానికి ధైర్యం లేక ద్రౌపదిని అనునయించాడు. అది చూసి కీచకుడు తన మందిరానికి వెళ్ళాడు. కలత చెందిన మనసుతో ధర్మరాజు ద్రౌపదిని చూసి " సైరంధ్రీ! నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు అంత॰పురానికి వెళ్ళు. నూకు జరిగిన అవమానానికి నీ భర్తలు మాత్రం కీపించరా? ఇది సమయం కాదని ఊరకుండి ఉంటారు. నీ భర్తలను నిందించడం తగదు. కులస్త్రీ నిండు సభలో ఇలా మాట్లాడటం భావ్యమా " అన్నాడు. కాని ద్రౌపది అక్కడి నుండి కదలక ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ధర్మరాజు " ఓ సైరంధ్రీ!ఏమిటిది పదిమందిలో నాట్యకత్తెలా నిలబడ్డావు. కులస్త్రీలకు ఇది తగదు " అన్నాడు. ద్రౌపది రోషంగా తల ఎత్తి ధర్మరాజును చూసి " ఓ కంకు భట్టా! నా భర్త ఒక నటుడు ఇది సత్యము. పెద్దల ప్రవర్తన చూసి పిన్నలు ప్రవర్తిస్తారు. నా భర్త నటుడు కనుక నేను నర్తకినే. నా భర్త నటుడే కాదు జూదరి కూడా. ఒక జూదరి భార్యకు గౌరవ మర్యాదలు ఎలా లభిస్తాయి ? " అంటూ ద్రౌపది సభ నుండి వెళ్ళి పోయింది.

ద్రౌపది సుధేష్ణ వద్ద విలపించుట

ద్రౌపది తనను ఒక దూర్తుని ఇంటికి మదిరకు పంపిన సుధేష్ణకు తన బాధ చెప్పుకోటానికి ఆమె మందిరానికి వెళ్ళింది. సుధేష్ణ ద్రౌపదిని చీసి కంగారు నటిస్తూ " మాలినీ! ఏందుకు ఇలా ఉన్నావు. నిన్ను ఎవరేమి అన్నారు. ఏమి జరిగిందో చెప్పు వారి అంతు చూస్తాను " అన్నది. ద్రౌపది నిర్వేదంగా నవ్వి " అమ్మా! అన్నియు తెలిసి కూడా ఇలా అడిగితే ఏమి చెప్ప గలను. నీవు కీచకుని ఇంటికి మధిర కోసం నన్ను పంపావు. అతను నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను పరుగెత్తాను. అతడు నన్ను వెంబడించి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతకంటే ఏమి చెప్పేది " అన్నది. సుధేష్ణ ద్రౌపదితో " ద్రౌపదీ! విచారించకు నేను ఆ కీచకుని దండిస్తాను " అని అనునయంగా అన్నది. ద్రౌపది సుధేష్ణతో " అమ్మా! తమరు అంతగా చింతించ పనిలేదు. నా భర్తలైన అయిదుగురు గంధర్వులు కీచకునిపై పగతీర్చుకుంటారు " అని పలికింది. ఆ మాటలు విన్న సుధేష్ణ భయప్రాంత అయింది. ద్రౌపదిని ఎన్ని విధాలుగానో ఓదార్చింది. ద్రౌపది కోపం తగ్గలేదు. అన్న పానీయాలు విసర్జించి తన నివాసమునకు పోయి రోదిస్తూ ఉంది.

ద్రౌపది భీముని సహాయం అర్ధించుట

ద్రౌపది మనసులో " కీచకుడు మహాబలవంతుడు. అతనిని చంపగలిగిన సామర్ధ్యం భీమునికి మాత్రమే ఉందని తలచింది " తలచింది. ఆ రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో భీముని వద్దకు వెళ్ళింది. హాయిగా నిద్రపోతున్న భీముని చూసి " ఆహా! నన్ను అవమానించిన కీచకుడు హాయిగా నిద్రపోతున్నాడు. కాని అది చూసిన మీరు నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నారు. మీ అన్నగారు ఇది తగిన సమయం కాదని చెప్పాడనా " అనుకుంటూ అతడిని తట్టి లేపింది. భీముడు ఉలిక్కిపడుతూ నిద్రలేచి " ఎవరు " అని అడిగాడు. ద్రౌపది " నేను మాలినిని " అన్నది. భీముడికు ద్రౌపది ఎందుకు వచ్చిందో అర్ధమైనా ఆమె నోట వినాలని " ఏమిటి ఇంత పొద్దుపోయి వచ్చావు. ఎవరు చూడకుండా వచ్చావా " అని అడిగాడు. ద్రౌపది " అన్ని తెలిసి నన్ను అడుగుతారేమి. నా నోట వినాలనుందా. విరాటును బావమరిది కీచకుడు సుధేష్ణ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసాడు.తడు నన్ను మోహించి అనరాని మాటలాడి నన్ను అవమానించాడు. నేను అతనితో నా భర్తలైన గంధర్వులు నిన్ను హతమార్చగలరు జాగ్రత్త " అన్నాడు. సుధేష్ణ పంపగా మధిర కోసం కీచకుని ఇంటికి వెళ్ళాను. అతను నన్ను పట్టుకోవాలనుకున్నాడు నేను అతనిని విలించి పరుగెత్తుతూ సభా మండపానికి వచ్చాను. అతడు నన్ను వెన్నంటి తరుముతూ వచ్చాడు. అలనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అడవిలో సైంధౌడు అవమానించాడు. ఈ నాడు విరాటుని కొలువులో కీచకునిచే అవమానించబడ్డాను. ఈ అవమానాలు నాకు కొత్తగాదు. స్త్రీ ఆర్తనాదం విన్నా, గోమాత అరుపు విన్నా రక్షించడం వీరుల ధర్మం. నేను ఇలా విలపిస్తుంటే ధర్మరాజు చూస్తూ ఎలా ఉన్నాడు " అన్నది. భీముడు " ద్రౌపదీ! కీచకుడు నిన్ను అవమానించడం నన్ను ధర్మరాజు అడ్డుకోకపోతే విరాటునితో సహా కీచకుని అతని సైన్యాన్ని హతమార్చే వాడినే. కాని అజ్ఞాతవాసం భగం అయితే మరలా అరణ్యవాసం అజ్ఞాతవాసం ప్రాప్తించేవి. దీనికంతా కారణం నీవు నేను అని అందరూ మనలను నిందించరా. కనుక నన్ను నివారించిన ధర్మరాజును నిందించ వలదు. సమయం మించి పోలేదు. కీచకుని చంపి నీకు ఆనందం కలిగిస్తాను అదెంత పని. కాని అది బహిరంగంగా జరగరాదు. రహస్యంగా చేయాలి కదా " అన్నాడు. ద్రౌపది " నేను ఎవరికి భయపడ లేదు. అత్తగారు కుంతిని చూసి కాని భర్తలైన మిమ్మల్ని చూసి కాని భయపడ లేదు. కాని సుధేష్ణను చూసి భయం కలుగుతుంది. మూర్కుడైన కీచకుని వలన జరిగిన అవమాన భారంతో అన్నాను కాని విషయం తెలియక కాదు. ధర్మరాజుని నిందించడం నా అభిమతం కాదు " అన్నది. ఇంకా ధర్మరాజు గురించి ద్రౌపది ఇలా చెప్పింది. " భీమసేనా! రాజసూయ యాగ కర్త, అజాతశత్రువు, ధర్మైకనిరతుడనే పేరు ధర్మరాజుకే చెల్లింది కాని వెరెవరికి తగదు. అతని గంభీర్యం, కరుణ, నిత్యసత్యవ్రతం మరెవరికి ఉంటాయి. అతడు సామాన్య మానవుడు కాదు. అట్టి మహాత్ముడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే బాధగా ఉంది. కిమ్మీరుడు, బకాసురుడు మొదలైన రాక్షసులను చంపిన నీ లాంటి వీరుడు కట్టెలు కొట్టడం, వంటలు చేయడం ఎంత బాధాకరం. పరమేశ్వరుని మెప్పించి పాశుపతాన్ని సంపాదించిన అర్జునుడు పేడి రూపంలో అంత॰పుర కాంతలకు నాట్యం నేర్పుతుంటే చూడటానికి కూడా మనసు ఒప్ప లేదు. అత్యం సుందరాంగుడు అరివీర భయంకరుడు అయిన నకులుడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే కన్నుల నీరు ఆగడం లేదు. అత్యంత సుకుమారుడైన సహదేవుడు పశువులను మేపుతుంటే దు॰ఖ్భారం ఆగలేదు. తల్లి తండ్రుల ప్రేమాభిమానాలు పొంది, రాజసూయ యాగంతో పునీతనై కుంతీదేవి లాంటి మహానుభావురాలి మన్ననలందిన నేను నేడు సైరంధ్రిగా సామాన్యురాలిగా సేవిస్తున్నాను. భీమసేనా! కీచకుని వధించక పోతే నాకు మనశ్శాంతి లేదు " అని దు॰ఖించింది. భీముడు " ద్రౌపదీ! నీవు ఇంతగా చెప్ప పని లేదు. రేపటి రోజున కీచకునికి నా చేతిలో చావు మూడింది. నీవు నిశ్చింతగా ఉండు. మన అజ్ఞాతవాసం ముగియనున్నది. రేపు నువ్వు కీచకుని కోర్కె అంగీకరించినట్లు నటించి అతనిని నర్తనశాలకు ఒంటరిగా రమ్మని చెప్పు. నేను అతనిని చంపుతాను. తెల్లవారబోతుంది ఇక వెళ్ళు " అన్నాడు.

ద్రౌపది కీచకుని నర్తన శాలకు ఆహ్వానించుట

మరునాడు ఉదయం కీచకుడు నిద్రలేచాడు. కాలకృత్యాలు నిర్వర్తించాడు. ద్రౌపది మీది కోరిక కలిగింది. చక్కగా అలఖరించుకున్నాడు. ద్రౌపది కోసం సుధేష్ణ అంత॰పురానికి వెళ్ళాడు. సైరంధ్రిని చూడగానే అతని మనసు చలించింది. ధైర్యాన్ని, వివేకాన్ని కోల్పోయి ఆమె దగ్గరగా పోయాడు. భీముడు చెప్పిన మాటలు మననం చేసుకుంది ద్రౌపది. అతనిని చూసీ చూడనట్లు నటించింది. కీచకుడు ద్రౌపదితో " మాలినీ ఈ తిరస్కారం ఏమిటి? నానంటే ఇష్టం లేదా? అసలు మగాళ్ళంటేనే ఇష్టం లేదా? నా సంపదలకు నీవే రాణివి. ఈ రాజ్యాన్నేలే విరాటరాజు పేరుకు మాత్రమే రాజు. నేనే అతనికి కూడు పెడుతున్నాను. ఈ రాజ్యంలో ప్రజలందరూ నన్నే రాజుగా ఆరాధిస్తారు. ఈ రాజ్యంలో ప్రజలెవరికీ నా మాత కాదనే ధైర్యం ఎవరికీ లేదు " అన్నాడు. ద్రౌపది కొంచం మెత్తబడినట్లు నటించింది. " కీచకా! ఎంత కాదన్నా వినకుండా నా మీద మనసు పారేసుకున్నావు. నీలాగే ఎదుటి వారూ మనసు పారేసుకుంటారు కదా. మీరి పురుషులు కనుక బయట పదతారు కాని మగువలు అలా కాదు కనుక కీచకా రహస్యంగా కలుసుకుంటే నీ కోరిక తీరగలదు " అంటూ నమ్మబలికింది ద్రౌపది. కీచకుడు ఆనందపరవశుడై " మాలినీ నీ మనసు తెలిసింది కదా మరి నా కోరిక ఎప్పుడు ఎలా తీరుస్తావో చెప్పు " అని అడిగాడు. ద్రౌపది " ఈ రోజు ఒంటరిగా నర్తనశాలకురా " అన్నది. కీచకుడు " మాలినీ! నీ అనుమతి ప్రకారం ఒంటరిగా నర్తనశాలకు వస్తాను. మాట మీద ఉండు " అన్నాడు. ద్రౌపది " నీవు ఒక్కడివే రావాలి. లేకుంటే నేను వెడలి పోవుట నిశ్చయం. ఇక మనమిరువురము ఇక్కడ ఉండుట భావ్యం కాదు వెళ్ళి పొండి " అన్నది.

కీచక వధ

కీచకుడు వెళ్ళగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. అక్కడ భీమునితో "నేను నాపని పూర్తి చేసాను. ఇక మీ పని మీరు పూర్తి చెయ్యండి. ఈ రాత్రికి కీచకుని చంపాలి ఎలా చంపుతారో చెప్పండి " అన్నది. భీముడు ద్రౌపదితో " ద్రౌపదీ! నీవు కీచకుడు ఏమి మాట్లాడుకున్నారో చెప్పు" అని అడిగాడు. ద్రౌపది జరిగినది చెప్పగానే అది విన్న భీముడు ఆహ్లాదం పొందాడు. భీముడు " ద్రపదీ! ఇక చాలు ఆ కీచకుని మీద పగ తీర్చుకుంటాను కాని అతడు చెప్పినట్లు ఒంటరిగా వస్తాడా! లేక బుద్ధిహీనుడై అందరికి చెప్తాడా? అయినా ఎందుకు చెబుతాడులే. వాడు నర్తనశాలకు తప్పక వస్తాడు. నిశ్చలంగా పడుకున్న నన్ను తడిమి చూస్తాడు. నీవు కాదని తెలిసుకుంటాడు. నేను ఒడిసి పట్టుకుని వాడి అంతు చూస్తాను. వాడు నాచేతిలో హతం కావడం ణీశ్చయం ద్రౌపదీ! ఇక నీవు నిశ్చింతగా ఉండు " అన్నాడు. భీముని ఆవేశం చూసి ద్రౌపది భయపడింది. కోపావేశంలో గుట్టు బయటపడి అజ్ఞాతవాస భంగం ఔతుందేమో అనుకున్నది. ద్రౌపది "భీమసేనా! కోపావేశంలో గుట్టు రట్టు చేయకు ధర్మరాజాదులు అజ్ఞాతవాస భంగానికి మనమే కారణమని నిందిస్తారు. కార్యాన్ని అతి గుప్తంగా పూర్తి చేయాలి " అన్నది. భీమసేనుడు " ద్రౌపదీ వాడు ఎదిరించి నిలబడితే ఇది రహస్యంగా చేయాలని గుర్తుంటుంద. అయినా నీవు చెప్పినట్లు రహస్యంగా చంపడానికి ప్రయత్నిస్తాను " అన్నాడు. ద్రౌపది " సుధేష్ణ నాకొరకు వెతుకుతుంటుంది నేను పోయి వస్తాను " అని వెళ్ళి పోయింది. కీచకుడు మనసు పరి పరి వధాల తపిస్తుంది అతడు మనసులో " అయ్యో ఎంతకీ రాత్రి కాదేమి. మాలి వస్తుందో రాదో, వచ్చినా ఏమంటుందో, రాత్రిలోగా మనసు మారుతుందేమో, ఆమెకు అయిదుగురు గంధర్వులు భఎర్తలుగా ఉన్న మాట నిజమేనా, మాలిని వచ్చే వేళకు సుధేష్ణ ఏదైనా పని చెప్తుందేమో అనుకున్నాడు. మరలా మాలిని ఎందుకు రాదులే అంత కఠినాత్మురాలా . ఆమె వచ్చే ముందు నేనే ఆమెను తీసుకు రావచ్చు కదా " అనుకున్నాడు. కీచకుడు ఉద్యానవనంలో విహరిస్తూ అస్తమించనందుకు సూర్యుని నిందించాడు. తన కోసం బ్రహ్మ రాత్రి రాకుండా పగలే ఉంచాడని అనుమాన పడ్డాడు. ఎట్టకేలకు సూర్యుడు అస్తమించాడు. చంద్రోదయం అయింది ద్రౌపది కూడా సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. చంద్రుడు కూడా అస్తమించాడు. బాగా పొద్దు పోగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళి సమయం ఆసన్నమయినదని భీమ్,ఉని తొందర పెట్టింది. భీముడు ఒక చీరని తలపాగాలా చుట్టుకుని నర్తనశాలకు బయలుదేరాడు. ద్రౌపది అతనిని అనుసరించింది. ఇద్దరూ నర్తన శాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీఊముడు పడుకున్నాడు. ద్రౌపది పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మద్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి " మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను " అన్నాడు కీచకుడు. భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో " మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా సరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే . నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే " అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు. ఇరువురి మద్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీన్మసేనుని బలం ద్విగుణీకృతం అయింది. ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళాను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు.ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో " కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాట పడ్డావు " అనుకున్నది. భీముడు " ద్రౌపదీ! నా మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి నా బుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. నీ మనసు శంతచింది కదా " అన్నాడు. ద్రౌపది ఆనందంతో " నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈ నాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం క్నియాడ నా తరమా భీమసేనా " అన్నది. ద్రౌపది మాటలకు భీముడు పొంగి పోయాడు. అతనిలో వివేకం మేలుకొంది. ద్రౌపదీ " ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను" అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు.

తృతీయాశ్వాసం

కీచకుని వధించిన భీముడు వంటశాలను చేరాడు.శరీరాన్ని శుభ్రంగా కడిగాడు. ఒంటికి రక్త వాసన వాసనలు తెలియకుండా పూత పూసాడు. తన శయ్యపై కూర్చున్నాడు. ద్రౌపది తన భర్త క్షేమంగా చేరుకున్నాడని దృవపరచుకుని అక్కడ ఉన్న కావలి వాళ్ళను పిలిచింది. వారితో " నా భర్తలైన గంధర్వుల వలన ఇతడు ఎలాంటి దుర్గయి పాలయ్యాడో చూడండి " అన్నది. వారు అది విని కలవపడి పెద్దగా అరచుకుంటూ నర్తనశాలలోకి ప్రవేశించారు.

ఉపకీచకుల వధ

కావలి వాళ్ళ అరుపులు విని ఉపకీచకులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ మాంసపు ముద్దలా పడి ఉన్న కీచకుని చూసి పెద్దగా దొర్లుతూ ఏడ్చారు. ఇంతలో వారి బంధువులు కూడా అక్కడికి వచ్చారు. వారిలీ వారు " ఎన్నోచావులు చూసాము కాని ఇలాంటి వింత చావు చూడలేదు. అసలు వీడికి చేతులు ఏవి? కాళ్ళు ఏవి ? గంధర్వులు ఇలాగే చంపుతారేమో. ఎందరినో యుద్ధభూమిలో జయించిన సింహబలుని బలం ఎందుకూ కొరరానిదైంది కదా " అనుకున్నారు. ఉపకీచకులలో ఒకడు " ఎంత సేపు ఏడ్చినా పోయిన వాడు తిరిగి వస్తాడా. ఇతనికి అంత్య కెఇయలు చేస్తాము " అన్నాడు. మిగిలిన కీచకులు సరే అన్నారు. ద్రౌపది వారికి దగ్గరగా నిలబడు వారు ఏమి చేస్తున్నారో చూస్తూ ఉంది. ఆమెను చూసిన కీచకులు కోపంతో రెచ్చి పోయారు. తమ అన్న మరణానికి కారణం ఆమె అని అనుకున్నారు. ఒక్కసారిగా ద్రౌపది మీదకు దూకి ఆమెను పట్టుకున్నారు. ఆమె చేతులు వెనక్కు విరిచి కట్టారు. వారు " దీని వలనే దీని అందం చూసి మోహించే కీచకుడు మరణించాడు అంతటికీ కారణం ఈమే కనుక ఈమె ఇక బ్రతుక కూడదు. అన్న శవంతో చేర్చి కాల్చి వేయాలి " అని నిర్ణయించారు. తమ నిర్ణయాన్ని విరాటరాజుకు తెలిపి అతని అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు. అప్పటికే కీచకుని మరణవార్త వన్న విరాటుడు కీచకుని మరణానికి ఎంతో దు॰ఖిస్తున్నాడు. "మహారాజా! మేము ఈ సైరంధ్రిని కీచకుని శవంతో చేర్చి దహనం చేయాలని అనుకున్నాము ఇందుకు మీరు అనుమతించాలి " అని అడిగారు. విరాటుడు " మీకు తోచని విధంగా చేయండి " అని చెప్పాడు. ఉపకీచకులు ద్రౌపదిని ఈడ్చుకు వెళ్ళి కీచకుని శవంతో కట్టారు. అందరూ శ్మశానానికి బయలుదేరారు. అనుకోని ఈ పరిణామానికి ద్రౌపది కలత చెందింది. ఆపత్సమయంలో ఒకరిని ఒకరు పిలుచుకోవడానికి పాండవులు నిర్ణయించుకున్న మారు పేర్లతో ద్రౌపది భర్తలను ఎలుగెత్తి పిలువసాగింది. "జయా! జయంతా! విజయా! జయత్సేనా! జయత్బలా! నన్ను ఈ దుర్మార్గులు కీచకుని శవంతో కట్టి దహనం చేయడానికి తీసుకు పోతున్నారు. రక్షించండి " అని పాండవులను రక్షణ కోసం పద్దగా ఏడుస్తూ పిలిచింది. ద్రౌపది కేకలు భీముని చేరాయి. భీముడు ఆగ్రహోదగ్రుడై వారికంటే ముందుగా శ్మశానం చేరాడు. ఒక పెద్ద చెట్టును మొదలంటా పెకిలించి భుజంపై పెట్టుకుని ఉపకీచకుల రాకకై ఎదురు చూస్తున్నాడు. శ్మశానం చేరుకున్న ఉపకీచకులు భయంకరాకారంతో నిలబడి ఉన్న భీముని చూసి గంధర్వుడు వచ్చాడనుకుని భయపడి శవాన్ని అక్కడే వదిలి పారిపోయారు. భీముడు వారిని తరిమి తరిమి కొట్టి సంహరించాడు. ద్రౌపదిని విడిపించి " త్వరగా సుధేష్ణ మందిరానికి వెళ్ళు " అని ద్రౌపదికి చెప్పి తాను వడివడిగా వంటశాల చేరుకున్నాడు.

సైరంధ్రీ బృహన్నలలు కలుసుకొనుట

ఉపకీచకుల మరణ వార్త విన్న విరాటుడు తన భార్య సుధేష్ణ వద్దకు వెళ్ళి " సుధేష్ణా! ఈ సైరంధ్రిని ఎలాగైనా ఇక్కడి నుండి బయటకు పంపు. ఆమె ఇక్కడ ఉంటే మగవాళ్ళు ఆమె పక్కకు పోతేనే ప్రమాదంలో చుక్కుకుంటున్నారు. ఆమె ఇక్కడ ఉంటే మరింత అనర్ధాలు జరిగేలా ఉంది. నా మాటగా చెప్పి ఆమెను పంపించు " అన్నాడు విరాటుడు. శవాన్ని తాకిన మైల పోవడానికి ద్రౌపది సచేల స్నానం చేసింది. సుధేష్ణ మందిరానికి చేరటానికి పురవీధులలో నడిచి వస్తుండగా ప్రజలు ఆమెను చూసి భయభ్రాంతికి లోనయ్యారు." ఈ మెను కోరిన కీచకుడంతటి వానికే ఈ గతి పట్టింది ఇక మనమెంత ? " అంటూ ఆమెను చూడటానికే భపడ్డారు. వంటశాలను సమీపించిన ద్రౌపది ఎవరికీ అర్ధం కాకుండా " కీచకుల బారి నుండి నన్ను రక్షించిన నా గంధర్వ పతికి నమస్కరిస్తున్నాను " అన్నది. భీముడు కూడా అలాగే ఎవరికీ అర్ధం కాకుండానే " ఆపదలో ఉన్న భార్యను రక్షించడం భర్త కర్తవ్యం కదా దానికి పొగడ్త ఎందుకు " అన్నాడు. ద్రౌపది అక్కడి నుండి నర్తనశాలకు వెళ్ళింది. నాట్యం నేర్చుకుంటున్న కన్యలను చూస్తూ నిలబడింది. ఆమెను చూసిన కన్యలు " అయ్యో ఆ కీచకుడు ఇంత పని చేసాడా. తగిన శాస్తి జరిగింది. ఉప కీచకులు నిన్ను కీచకుని శవంతో కట్టి తీసుకు పోవడం ఏమిటి? నీ భర్తలచే వారికీ తగిన శాస్తే జరిగిందిలే " అన్నారు. ఆమెను చూసిన బృహన్నల " మాలినీ ఏమి జరిగిందో వివరంగా చెప్పు " అని అడిగాడు. ద్రౌపది " బృహన్నలా! అంత॰పురంలో కన్యలకు ఆటపాటల నేర్పుకుంటున్న నీకు ఈ సైరంధ్రికి ఏమి జరిగినా పట్టదు కదా. అందుకే ఏమి జరిగిందని అడుగుతున్నావు " అన్నది. బృహన్నల " అయ్యో సైరంధ్రీ నీవు పడుతున్న కష్టాలు తెలిసినా నిన్ను ఆదుకోలేని పుట్టుక నాది. ఏమి చెయ్యగలను మనసులో నేను పడే బాధ ఎవరికి తెలుస్తుంది చెప్పు ? నీవు ఏ అపరాధం చేయవని నేనెరుగనా నీ కసహ్టాలు నన్ను బాధించవా " అని నిగూఢంగా అన్నాడు బృహన్నల. ద్రౌపది " అయ్యో నీ సంగతి నాకు తెలియనిదా. అంత॰పురంలో నీవు నీకు తగిన విధంగా ఉండటమే నాకు కావలసింది " అన్నది ద్రౌపది.

ద్రౌపది సుధేష్ణను మరికొంత గడువు కోరుట

ఆమె మిగిలిన అంత॰పుర కాంతలతో చేరి సుధేష్ణ మందిరంలో ప్రవాశించింది. సుధేష్ణ ఆమెను సాదరంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆమె ద్రౌపదితో " సైరంధ్రీ! నీవు చక్కని దానవు. కాని మగవాళ్ళు ఏమాత్రం నిగ్రహం లేని వాళ్ళని విరాటరాజు భయపడుతున్నాడు. నీ భర్తలైన గంధర్వులు నిన్ను చూసినంతనే మగవాళ్ళ్ను హతమార్స్తున్నారు. ప్రజలు నిన్ను చూస్తేనే భయపడుతున్నారు. విరాటరాజు నిన్ను నువ్వు కోరిన చోటికి పంపమని తన మాటగా నాకు చెప్పాడు. కనుక నీవు మా దేశం విడిచి ఎక్కడికైనా వెళ్ళు " అన్నది. ద్రౌపది " అమ్మా సుధేష్ణా ఇక పదమూడు రోజులు మాత్రం నన్ను ఎప్పట్లా మీ ఇంట ఉండనివ్వండి చాలు. అంతటితో నా వ్రతం పూర్తి ఔతుంది. ఆ తరవాత నా భర్తలు మీకు కనిపించి మీ కోరిక తీరుస్తారు. వారు దయామయులు పరోపకార పరాత్పరులు. వారికి ఉపకారం చేసిన విరాటునికి వారి ప్రత్యుపకారం చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక సందేహించకు. ఇంత కాలం నన్ను మీతో సమానంగా ఆదరించి ఇప్పుడు ఇప్పుడు విడిచిపెట్టడం భావ్యమా " అని వేడుకుంది. ద్రౌపది మాటలకు చలించిన సుధేష్ణ " మాలినీ! నీ వ్రతం పూర్తయ్యే వరకు నా ఇంట ఉండవచ్చు. నా భర్తను, కుమారుని రక్షించుము. నీవు ఇక అంత॰పురం దాటి రావద్దు. నీకు కావలసినవన్ని నేను సమకూరుస్తాను " అని పలికింది. మత్స్యదేశంలో ప్రజలు జరిగిన ఉదంతం గురించి నానావిధాలుగా అనుకుంటున్నారు. " అత్యంత బలశాలి అయిన విరాటుని బావమరిది ఒక్క ఆడదాని కోసం గంధర్విని చేతిలో మరణించాడు " అనుకోసాగారు.

దుర్యోధనుడు పాండవుల జాడకై ప్రయత్నించుట

హష్తినలో దుర్యోధనుడు చారుల ద్వారా ఈ విషయం విన్నాడు. వెంటనే సభ ఏర్పాటు చేసాడు. దుర్యోధనుడు " పాండవులు అరణ్యవాసం అజ్ఞాత వాసం ముగించుకుని రాజ్యభాగాన్ని అడగక ముందే వారిని తిరిగి అరణ్యాలకు పంపే మార్గం ఆలోచించండి " అని దుర్యోధనుడు తన మంత్రులను ఆదేశించాడు. కర్ణుడు లేచి " సుయోధనా! మనం వేలకొలది చారులను మారు వేషాలలో దేశం నలుమూలలకు పంపుదాం. వారు తప్పకుండా పాండవులను గుర్తిస్తారు " అన్నాడు. దుశ్శాసనుడు లేచి " పాండవుల గురించి నీవు భయపడవలసిన పని లేదు. వారు ఎప్పుడో అడవులలో కృరమృగాలకు బలి అయి ఉంటారు. వారిని గురించి ఆలోచించడం అనవసరం " అన్నాడు. ద్రోణుడు లేచి " సుయోధనా! పాండవులకు ఆపద కలగడం అసంభవం. కనుక వారిని వెతికించే ఏర్పాట్లు ముమ్మరం చెయ్యండి " అన్నాడు. భీష్ముడు " సుయోధనా! ద్రోణాచార్యులు చెప్పింది సత్యం. పాండవులు బాహుబలంలోనూ, బుద్ధిబలంలోనూ అసమానులు. దైవబాలం కూడా తోడైంది కనుక వారికి ఆపద కలుగుట అసంభవం. నాకు పాండవులు మీరు సమానులు కాని అడిగావు కనుక చెబుతున్నాను. పుణ్యఆత్ముడైన ధర్మరాజు ఏ రాజ్యంలో ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అక్కడి ప్రజలు ధర్మవర్తనులై ఉంటారు. అక్కడ పశుసంపద అభివృద్ధి చెందుతాయి. కనుక అలాంటి దేశాన్ని గుర్తించి అక్కడ వెదికించడం మంచిది " అన్నాడు. అది విన్న కృపాచార్యుడు " ఆలస్యం చేయకుండా వెదికించడం మంచిది. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసారు. అజ్ఞాతవాసం దాదాపు పూర్తి అయింది. పగవాడు అల్పుడైనా అతని పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాండవులు మహా బలవంతులు పైగా సుయోధనునిపై కోపంగా ఉన్నారు. కనుక వారితో సంధి చేసుకొనుట సముచితం. లేకున్న యుద్ధం అనివార్యం. పాండవులు సంధికి అంగీకరించకున్నా యుద్ధం తప్పదు. వారు అరణ్యాలలో మరణించారనుకున్నా వారి మిత్రదేశరాజులు మనపై దండెత్తే అవకాశం ఉంది కనుక మనం సైన్యాన్ని సమాయత్త పరచడం మంచిది " అన్నాడు. దుర్యోధనుడు అందరి మాటలను సావధానంగా విని సభను ఉద్దేశించి " కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు అసమాన బలాఢ్యులు. వీరితో పోలిన వారు భీమిలో ఎవరూ లేరు. వారిలో వారే ఒకరిని ఒకరు గెలవాలి. మత్స్యదేశ సైన్యాద్యక్షుడు కీచకుని గంధర్వుడెవరో చంపాడని తెలిసింది. ఒక కాంత కారణంగా చంపాఋఅని తెలిసింది. కీచకుని చంపాలంటే మిగిలిన ముగ్గురిలో ఒకరు చంపాలి. బలరాముడు , శల్యుడు మత్స్య దేశానికి దూరంగా ఉన్నారు కనుక వారు చంపలేరు. ఉపకీచకులతో చేర్చి కీచకుని వధించిన గంధర్వుడు అజ్ఞాతవాసంలో ఉన్న భీముడై ఉండచ్చు. ఆ కాంత ద్రౌపది కావచ్చు. తాతగారైన భీషంఉడు చెప్పిన లక్షణాలు మత్స్య దేశంలో కానవస్తున్నాయి. కనుక మనం పాండవుల కొరకు మత్స్యదేశంలో వెదకడం మంచిది. విరాటుడు మన శత్రువు కనుక అతని గోధనాన్ని అపహరిస్తే పాండవులు అతనికి సహాయంగా బయటికి వస్తారు. సమయభంగం అయినదని వారిని గుర్తించి తిరిగి అరణ్యవాసానికి పంపచ్చు. పాండవులు లేకున్నా అతని సంపదనంతా కుల్లగొడతాము కనుక మనకు ఎలాగైనా లాభమే. ఇది అందరికి సమ్మతమైతే యుద్ధప్రయత్నాలు చేయండి " అన్నాడు.

దక్షిణ గోగ్రహణం

దుర్యోధనుని మాటలు విన్న త్రిగర్త దేశాధిపతి " సుయోధన సార్వభౌమా! ఇంతకు పూర్వం కీచకుడు నన్ను యుద్ధంలో గెలిచాడు. అతడు మరణించినందున అతనితో యుద్ధం చేసే వీలు లేదు. నన్ను విరాటుని మీదకు యుద్ధానికి పంపండి. నేను విరాటుని ఓడించి అతని పశుధనం పట్టుకొస్తాను. అలాగే పాండవుల జాడ తెలుసుకొస్తాను " అన్నాడు. అది విన్న కర్ణుడు " సుయోధనా! త్రిగర్త దేశాధీసుడు ఉచితముగా చెప్పాడు. అందుకు మీరు అనుమతి ఇవ్వండి " అన్నాడు. సుయోధనుడు ఆలోచించి చూసి దుశ్శాసనునితో " ఈ సభలోని పెద్దలు నీకు అనుమతి ఇచ్చారు. మనసైన్యాలను సిద్ధం చెయ్యి. ముందురోజు సుశర్మ విరాటుని మీదకు యుద్ధానికి వెళతాడు. మరునాడు మనం విరాటుని మీదకు యుద్ధానికి వెళతాము " అని సుయోధనుడు అన్నాడు. దుశ్శాసనుడు అలాగే అన్నాడు. దుర్యోధనుడు తన వ్యూహాన్ని ఇలా వివరించాడు. " ముందుగా సుశర్మ తన బలగాలతో వెళ్ళి ఒక బైపు గోవులను మళ్ళిస్తాడు. విరాటుడు శుశర్మతో యుద్ధానికి దిగుతాడు. మరునాడు మనం మరొక వైపు నుండి విరాటుని గోవులను పట్టుకుందాం. అప్పుడు గత్యంతరం లేక పాండవులు మనతో యుద్ధానికి వస్తారు " అంటూ సుశర్మను చూసి " రాబోయే బహుళ అష్టమి నాడు నీవు నీ సేనతో విరాటుని గోగణాన్ని అపహరించు. మేము మరునాడు వేరొక వైపు నుండి విరాటుని గోవులను పట్టుకుంటాము " అన్నాడు. అందరూ యుద్ధానికి సిద్ధం అయ్యారు కాని అప్పటికే పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అయిందని ఎవరూ ఊహించ లేదు. సుశర్మ తన సైన్యాలతో మత్స్యదేశం పై దండెత్తాడు. చారుల వలన గోసమూహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వాటిని పట్టుకోవడానికి ముందుకు సాగాడు. గోసమూహాలను చేరి వాటిని మళ్ళిస్తున్నాడు. గోరక్షకులు సుశర్మతో పోరాడుతున్నారు కాని సుశర్మ సైన్యాల ధాటికి ఆగలేక పోతున్నారు. వారంతా విరాటుని వద్దకు పరుగెత్తారు. విరాటడు వారిని చూసి కలవర పడ్డాడు. వారు " మహారాజా! సుశర్మ తన సేనలతో వచ్చి మన గోసమూహాలను మళ్ళించుకు పోతున్నాడు. తమరు వచ్చి కాపాడాలి " అన్నారు. అది విన్న విరాటుడు ఆశ్చర్య పోయి ఇలా అన్నాడు. " మీరు చెప్పేది నిజమా. మన చేతిలో చావు దెబ్బ తిన్న సుశర్మకు ఇంతలో ఇంత ధైర్యం ఎలా వచ్చింది " అంటూ మంత్రులను చూసి " ఇప్పుడు మనం మన సేనలను తీసుకు వెళ్ళి సుశర్మతో యుద్ధం చేయాలి. లేకుంటే మన పశుధనం మనకు దక్కదు. వెంటనే యుద్ధానికి సిద్ధం కండి " అన్నాడు.

విరాట సుశర్మల యుద్ధం

విరాటుడు చారుల ద్వారా సుశర్మ గోగణాలతో ఎటు వెళుతున్నాడో తెలుసుకుని అటు వైపు తన సేనలను నడిపించాడు. విఆటుని తమ్ముళ్ళు శతానీకుడు, మదిరాశ్వుడు, సూర్యదత్తుడు తమతమ సేనలతో విరాటుని వెంబడించారు. విరాటుఇ కుమారుడు శంఖుడు కూడా తన శంఖాన్ని భయంకరంగా పూరిస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఈ సమరసన్నాహాలను చూసిన ధర్మరాజు తతమ్ములను తీసుకుని విరాటుని వద్దకు వచ్చాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా నేను ఇదివరకు ఒక ఋషి వద్ద ఎన్నో శాస్త్రాలు అభ్యసించాను. నాకు యుద్ధం చేయడంలో నైపుణ్యం ఉంది. తమరు యుద్ధానికి వెళుతుంటే నేను ఊరకుండటం న్యాయమా నేను కూడా నీతో యుద్ధానికి వస్తాను " అన్నాడు. విరాటుడు అందుకు అంగీకరించాడు. వెంటనే ధర్మరాజు తన తమ్ములైన భీమ, నకుల, సహదేవులను రమ్మని సైగ చేసాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా! ఇతడు మనవంటవాడు వలలుడు మల్లయుద్ధంలో నేర్పరని మీకూ తెలుసు మనకు యుద్ధం అవసర పడగలడు. అలాగే మన అశ్వపాలకుడైన తామ్రగంధికి యుద్ధంలో ప్రావీణ్యం ఉంది. అలాగే గోరక్షకుడైన తంత్రీపాలునికి యుద్ధంలో నేర్పు ఉంది అందుకని వీరిని కూడా యుద్ధానికి పిలుచుకు పోవడం మంచిది అని నాకు అనిపిస్తుంది " అన్నాడు. విరాటుడు శతానీకుని పిలిచి వారికి కూడా రధాలను సిద్ధపరచమని చెప్పాడు. అందరితో కలసి విరాటుడు సుశర్మ గోవులను మళ్ళించి వైపు సైన్యాలను నడిపించాడు. సుశర్మ సేనలను చేరుకున్నాడు. సుశర్మ సేనలకు విరాటుని సేనలకు ఘోరయుద్ధం జరిగింది. శతానీకుడు తనసేనలతో సుశర్మ సేనలను చుట్టు ముట్టాడు. మదిరాశ్వుడు తన సేనలతో సుశర్మ సేనలను నుగ్గు నుగ్గూ చేస్తున్నాడు. సూర్యదత్తుడు కూడా తన సేనలతో సుశర్మ సేనలను కకావికలు చేస్తున్నాడు. విరాటుడు కూడా యుద్ధరంగంలో ఎక్కడ చూసినా తానే అయి యుద్ధం చేస్తున్నాడు. విరాటుడు సుశర్మ రధాన్ని చూసాడు. విరాటుడు సుశర్మను ఎదుర్కొన్నాడు. ఇద్దరూ భీకరంగా పోరు సాగించారు. విరాటుని ధాటికి తాళ లేక సుశర్మ సేనలు తిరుగు ముఖం పట్టాయి. ఇంతలో సూర్యాస్తమయం అయింది. చీకట్లు అలుముకున్నాయి. కళ్ళు కనిపించక యుద్ధం ఆపివేసారు. కొంతసేపటికి చంద్రోదయం అయింది పండు వెన్నెల వచ్చింది. ఆ వెన్నెల వెలుగులో ఇరు పక్షాలు మరలా యుద్ధానికి సిద్ధ పడ్డాయి. సుశర్మ రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి వచ్చాడు. విరాటుని సారధిని గుర్రాలను చంపి విరాటుని పట్టుకున్నాడు. తన రధం మీదకు విరాటుని లాగిన సుశర్మ పెద్దగా సింహనాదం చేసాడు. విజయ దుంధుభులు మ్రోగించారు.

సుశర్మచేతిలో చిక్కిన విరాటుని పాండవులు విడిపించుట

సుశర్మ విరాటుని పట్టుకున్నాడన్న వార్త అందరికీ తెలిసింది. ధర్మరాజు భీముని పిలిచి " భీమా! ఈ విరాటుని కొలువులో మేము తలదాచుకుని బ్రతుకుతున్నాము. సుశర్మ విరాటుని బంధీగా పట్టుకున్నాడు. అతన్ని విడిపించడం మన ధర్మం. సుశర్మను వెంబడించి విరాటుని విడిపించి తీసుకురా " అన్నాడు. భీమసేనుడు " అన్నయ్యా! అదెంత పని ఈ మద్ది చెట్టును పెకిలించి సైన్యాన్ని చావగొట్టి విరాటుని విడిపించుకు వస్తాను " అన్నాడు. ధర్మరాజు నవ్వి భీమసేనా " నువ్వలా చేస్తే నువ్వు భీముడవని అందరికి తెలిసి పోతుంది. మన అజ్ఞాత వాసం భంగం ఔతుంది. కనుక విల్లు అంబులతో యుద్ధం చెయ్యి. నకుల, సహదేవులు నీకు చక్రరక్షకులుగా ఉంటారు " అని అన్నాడు.భీముడికి నిరాశ కలిగింది అన్న మాట ప్రకారం చెట్ల జోలికి పోకుండా "అన్నయ్యా! తమరు చెప్పినట్లే చేస్తాను నా భుజ బలంతో శత్రువులను ఓడిస్తాను. విరాటుని తెచ్చి అప్పగిస్తాను " అన్నాడు. అంతట ధర్మరాజు తాను ముందుండి సేనలను నడిపించాడు. త్రిగర్త సైనికులు ఇది చూసి ధర్మరాజు పై కత్తులు బాణాలతో దాడి చేసారు. భీముడు శత్రువుల రధాలను విరగొట్టాడు, సారధులను చంపాడు. ధర్మరాజు సుశర్మను ఎదుర్కొని యుద్ధం చేస్తున్నాడు. ఇది చూసిన సుశర్మ రధంలో ఉన్న విరాటుడు పక్కనే ఉన్న గద ఒకటి తీసుకుని రధం మీద నుండి కిందికి దూకి సుశర్మను మోదాడు. అదే అదనుగా తీసుకుని భీముడు సుశర్మ రధం మీదకు దూకాడు. సుశర్మను పట్టుకుని అతని చేతులు విరిచి పట్టుకుని సింహనాదం గట్టిగా చేసాడు. సుశర్మ సేనలు ఆశ్చర్య పోయాయి. సుశర్మ చక్రరక్షకులు పారి పోయారు. సుశర్మ సైన్యాలు వెనుదిరిగాయి. భీముడు వారిని వెంబడించి తరిమాడు. సుశర్మ తోలుకు పోతున్న పశువులను మళ్ళించాడు. అన్నగారు ధర్మరాజుతోను నకుల సహదేవులతోను భీముడు విరాటుని దగ్గరకు వచ్చాడు. విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో వారిని అభినందనలతో ముంచెత్తాడు. విరాటుడు ధర్మరాజును చూసి " మీరు నా ధన, మాన, ప్రాణాలను కాపాడారు. అందుకు ప్రతిగా నేను ఏమిచ్చుకోగలను. నా రాజ్యాన్ని మీకు సమర్పించుకుంట్శాను. ఇది మీరు కాపాడిన శరీరం, ఈ రాజ్యం మీరు జయించింది. కనుక ఈ మత్స్యదేశాన్ని మీరే తీసుకోడి " అన్నాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా! ఇది మీకు మామీద ఉన్న మర్యాద. మీరు విజయోత్సాహంతో మత్స్యదేశంలో విజయం చేయడం కంటే నాకు మరొక ఆనందం లేదు. నన్ను ఇంతగా పొగడ తగదు " అన్నాడు. విరాటరాజు ధర్మరాజుని చూసి "కంకా! నాకు అర్ధం కానిది ఒకటి ఉంది. నువ్వు చేసింది నాకు ఉపకారమా లేక నావద్ద ఉన్నందుకు సేవాతత్పరతా! నాపై కృతజ్ఞతా! లేక నాపై కృపా! లేక శతృ సంహార మొనర్చి నీవు కీర్తి పొందుదామనా ఏ కారణంతో నీవు ఈ శత్రు సంహారం చేసావు. అయినా వంటలవాడేమిటి? అతని పరాక్రమం ఏమిటి? ఆ యుద్ధం చేయడమేమిటి? ఇతడే కదా నన్ను యుద్ధంలో గెలిచింది. ఈ అశ్వశిక్షకుడు, గోపాలకుడు వీరిద్దరే యుద్ధంలో గాయపడకుండా శత్రుసంహారం చేసింది. ఆపదలో ఉన్నప్పుడు సాయంచేసిన వాడే నిజమైన మిత్రుడు. కంకా! నీ మైత్రిని నేను మరువలేను. మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి గజములా! అశ్వములా! కాంచనమా! రత్నములా! వజ్రవైఢూర్యములా! దేవతా కాంతల పోలు అందగత్తెలా! నానావిధ భోగభాగ్యములా! మీ ఇష్టం వచ్చినవి కోరుకోండి నేను మీకు సమర్పించుకుంటాను " అన్నాడు. అది విన్న పాండవులు " మహారాజా! మీరు మమ్ము ఇలా గౌరవించడం మాకు ఎంతో ఎక్కువ. దీని కంటే మీరు ఇస్తానన్న కానుకలు ఎక్కు కాదు. మనం అందరం నగరానికి చేరుకున్న తరవాత మమ్ములను తగురీతిన సత్కరించండి " అన్నారు. ధర్మరాజు విరాటుని చూసి " మహారాజా నా దొక మనవి. మీరు కోరుకోమని చెప్పారు కనుక కోరుతున్నాను. ఈ సుశర్మను అతని బంధు మిత్రులతో ససైన్యంగా విడుదల చెయ్యండి. ఇదే నేను కోరుకొనేది. వెంటనే మన నగరంలో ఈ విజయవార్తను ప్రకటించండి. విజయోత్సవాలు జరిపించండి " అని అన్నాడు. ధర్మరాజు కోరిన ప్రకారం విరాటుడు సుశర్మను అతని బంధుమిత్రులను ససన్యంగా విడుదల చేసాడు. ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు విరాట నగరానికి ప్రయాణమయ్యారు.

చతుర్ధాశ్వాసం

సుశర్మ తన సేనలతో విరాటుని గోవులను పట్టుకున్న మరునాడు ఉదయం దుర్యోధనుడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలసి విరాటనగరం వైపు బయలుదేరాడు. విరాటనగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశుసంపదను ముట్టడించారు. అక్కడ ఉన్న కొద్ది పాటి సైన్యం అసఖ్యాకంగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఎదిరించ లేక పోయింది. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే రధం తీసుకుని విరాటనగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో నగరంలో ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు. గవాధ్యక్షుడు " ఉత్తరకుమారా! కురు సైన్యములు మన ఆవుల మందల మీద విరుచుకు పడ్డాయి. ఆవుల మందలను అపహరించుకుని పోతున్నాయి మీరు వెంటనే వచ్చి వారితో యుద్ధం చేసి ఆవులను రక్షించండి " అన్నాడు. తమరి తండ్రి విరాటరాజు తమపరాక్రమం గురించి, తమ బాహుబలం గురించి, తమరి శౌర్యపరాక్రమాల గురించి చెప్తూ తమరు ఈ భూభారాన్ని వహించడానికి తగిన వారని చెప్తుంటారు. తమరి పరాక్రమం ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. వెంటనే బయలుదేరి మన ఆలమందలను రక్షించండి " అని ప్రార్ధించాడు.

ఉత్తరకుమారుని ప్రగల్భాలు

గవాధ్యక్షుని పొగద్తలకు ఉత్తర కుమారుడు పొంగి పోయాడు. " గవాధ్యక్షా! నిజం పలికావు. నేను కౌరవ సేనలను చిత్తు చేసి ఆవుల మందలను క్షణంలో విడిపిస్తాను. కాని నాకు తగిన సారధి లేడు కదా! అందుకని బాధగా ఉంది. సమర్ధుడైన సారధి దొరికితే కౌరవ సేనలను జయించడం ఎంత పని. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాశ్వద్ధామలను నేను చీసే యుద్ధంతో అర్జునిని తలపింప చేసి ఆలమందలను విడిపించకుంటే నాతండ్రి నా పరివారం నన్ను మెచ్చుతారా. ఆలస్యం చేస్తే ఆలమందలను తోలుకు పోతారు. వెంటనే తగిన సారధిని వెతకండి " అన్నాడు.ఆ సమయంలో అక్కడ ఉన్న ద్రౌపది ఉత్తరకుమారుడు తనను తాను అర్జునినితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంట్నే అర్జునిని దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించింది. అర్జునుడు లెక్కలు వేసి చూసి అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసుకున్నాడు. ఇక తమను తాము ఎరుకపరచుకొనే సమయం ఆసన్నమైనదని గ్రహించాడు. ద్రౌపదిని చూసి " నీవు పోయి మన బృహన్నలకు సారధ్యం చేయు సామర్ధ్యం కలదు. పూర్వం అర్జునినికి సారధ్యం వహించి అతనికి ఖాండవ వనదహనంలో సహాయం చేసి అతని ప్రశంశలందుకున్నాడు. అతని సహాయంతో కౌరవ సేనలను జయించడంలో సందేహం లేదని చెప్పి ఎలాగైనా అతనిని ఒప్పించు " అన్నాడు. ద్రౌపది వెంటనే వెళ్ళి ఉత్తరను కలుసుకుని " అమ్మా! మన రాకుమారుడు సారధి కొరకు వెతుకుతున్నాడు అని తెలిసింది. మీ గురువుగారు బృహన్నలకు రధం నడపడంలో అర్జునుడు మెచ్చుకునే సామర్ధ్యం ఉంది. ఖాండవవన ధనంలోను ఇతర సమయాలలోను అర్జునునికి సారధిగా ఉండి అతనికి విజయం చేకూర్చాడు. ఈ విషయం రాకుమారునికి చెప్పు " అన్నది. ఉత్తర మాలినితో చేరి అన్నయ్య వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పింది. అది విన్న ఉత్తర కుమారుడు ఫక్కున నవ్వాడు. ద్రౌపదితో " సైరంద్రీ! నన్ను ఎగతాళి చేస్తావా! నేను బృహన్నల వంటి వారిని కన్నెత్తి కూడా చూడను. అలాంటి బృహన్నలను నాకు సారధిని చేస్తావా. కౌరవుల సేనలు చచ్చి గోవులను పట్టుకుని నేను వారిపై యుద్ధానికి వెళ్ళి ప్రతాపం చూపవలసిన తరుణంలో నేను బృహన్నల సారధ్యంలో వెళితే నలుగురూ నవ్వరా? అయినా మనదేశంలో సారధులకు ఇంత కరువొచ్చిందా " అన్నాడు. సైరంధ్రి " రాకుమారా! ఒక్క కౌరవ సైన్యం మాత్రమే కాదు ముల్లోకాలు ఒకటై వచ్చినా బృహన్నల సారధిగా ఉన్నచో నువ్వు గెలువవచ్చు. కారణాంతరాల వలన పేడి తనం వచ్చినంత మాత్రాన అతని సామర్ధ్యం పోతుందా " అన్నది. ఉత్తర కుమారుడు గత్యంతరం లేక బృహన్నలను సారధిగా అంగీకరించాడు.

బృహన్నలతో ఉత్తరకుమారుడు సమరానికి బయలుదేరుట

ఉత్తరకుమారుడు బృహన్నల సారధ్యాన్ని అంగీకరించగానే ఉత్తర బృహన్నల వద్దకు పరుగెత్తింది. గురువుగారికి నమస్కరించు " మా అన్నయ్య సారధి ఒక యుద్ధంలో మరణించాడు. మరల వేరే సమర్ధుడైన సారధి లభించ లేదు. ఈ రోజు కౌరవ సేన మా గోవులను అపహరించింది. మా అన్నయ్య యుద్ధానికి పోవడానికి తగిన సారధి లేడని బాధపడుతున్నాడు. మీ సారధ్య సామర్ధ్యం గురించి సైరంధ్రి చెప్పింది. అందుకని మా అన్నయ్యకు సారధిగా మిమ్మలిని తీసుకు పోవడానికి వచ్చాను నా మాట మన్నించి నా మీద వాత్సల్యంతో తమరు ఒప్పుకోవాలి " అన్నది. బృహన్నల నవ్వి అమ్మా " అమ్మా! ఉత్తరా నాకు సారధ్యం చేసే నేర్పు ఉందా? ఏమో భయంగా ఉంది. నీ మాట ఎందుకు కాదనాలి. నువ్వు అడిగావు కనుక సారధ్యమే కాదు ఎంతటి కష్టమైన పని అయినా చేసి పెడతాను " అన్నాడు. బృహన్నల అంత దూరంలో ఉండగానే " నేను కౌరవులతో యుద్ధం చేయాలి. నీవు సారధిగా నా రధం నడపాలి త్వరగా రధం ఎక్కు. నీ గురించి సైరంధ్రి చెప్పింది " అన్నాడు. బృహన్నల ఉత్తరునితో " రాకుమారా! ఏదో ఆటపాటలకు నన్ను పిలువవచ్చు కాని యుద్ధం చేయుటకు సారధిగానన్ను పిలుచుట ఉచితమా. ఎక్కడైనా బలాఢ్యుడైన వాడిని సారధిగా నియమించు " అని అన్నాడు బృహన్నల. "అదేమిటి బృహన్నలా! నాడు ఖాండవవన దహనాన సమయమున అర్జునిని రధం నీవు నడిపావట కదా. అర్జునినికి విజయం చేకూర్చావట కదా మరి ఆచాతుర్యం శౌర్యం నీలో తగ్గి పోయాయా. మరో మాట మాటాడక యుద్ధానికి సిద్ధంకా " అన్నాడు ఉత్తరుడు. అయిష్టంగా ఉన్నట్లు ఒప్పుకున్నాడు బృహన్నల. తరవాత ఉత్తరకుమారుడు బృహన్నలకు కవచం తెప్పించాడు. బృహన్నలకు ఇచ్చి తొడుక్కోమన్నాడు. దానిని తలక్రిందులుగా తొడిగి అందరినీ నవ్వించాడు బృహన్నల. ఉత్తరకుమారుడు బృహన్నలకు కవచం తొడిగాడు. " బృహన్నలా త్వరగా రధమునకు హయములను పూన్చుము. ధ్వజమును ఎత్తుము. మనం త్వరగా పోయి గోవులను విడిపించ వలెను " అన్నాడు. బృహన్నల " నీవు ఏమి చెప్పిన అది చేయ వలెను. నీవు రమ్మన్న రావలయును, పొమ్మన్న చోటికి పోవలెను. నా బలం తెలుసుకుని నా చేత పని చేయించుకుని విజయం సాధించు " అన్నాడు. బృహన్నల రధం సిద్ధం చేసాడు. కేతనం ఎగురవేసాడు. యుద్ధానికి వెళుతున్న అన్నయ్యను చూసి ఉత్తర " అన్నయ్యా! నీవు కౌరవ వీరులను గెలిచినపుడు వారి తల పాగా కుచ్చులను నాకు బొమ్మ పొత్తికలుగా తీసుకు రావా " అన్నది. బృహన్నల " ఉత్తరా! అదెంత పని రాకుమారుడు విజయంతో తిరిగి వస్తాడు. నీకు బొమ్మ పొత్తికలు తెస్తాడు " అన్నాడు. బృహన్నల వివిధ రకముల ఆయుధములు రధంలో పెట్టించి రధం ఎక్కాడు. ఉత్తరుడు పశువుల కాపరులను అడిగి కౌరవులు పశువులను ఏ పక్కకు తోలుకు వెళ్ళారో తెలుసుకుని ఆ దిక్కుగా రధం పోనివ్వమన్నాడు. బ్రాహ్మణుల, పుణ్యాంగనల దీవెనలందుకుని ఉత్తరకుమారుడు ఊరి వలుపలికి వచ్చాడు.

కౌరవ సేనలను చూసి ఉత్తరకుమారుడు భీతిల్లుట

అల్లంత దూరంలో రేగిన మట్టిని చూసి కౌరవ సైన్యాన్ని చేరుకున్నాడు. కౌరవ సేనను తేరిపార చూసిన ఉత్తర కుమారుడు భయపడ్డాడు. " బృహన్నలా! భీస్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసఖ్యాకమైన శస్త్రాస్త్రాలు కౌరవ సేన భయంకరంగా ఉన్నది. నేను వీరితో యుద్ధం చేయగలనా. నాకు విలు విద్యలో అంత ప్రావీణ్యత లేదు. బాలుడను విలువిద్యలో నిష్ణాతులైన శకుని, జయద్రధ, దుర్ముఖ, వికర్ణ, కర్ణ మొదలైన వీరులతో నేనేమి యుద్ధం చేయగలను. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుందని వచ్చాను. నీవేమో నీపాటికి రధం నడుపుతున్నావు. నేను కౌరవసేనతో యుద్ధం చేయలేను. రధమును వెనుకకు పోనిమ్ము. ఎవరి ప్రాణములు వారికితీపి కదా. నా శరీరం వణుకుతుంది " అన్నాడు. " ఉత్తరకుమారా! అసంఖ్యాకంగా ఉన్న కౌరవసేనల వైపు రధం ఎందుకు నడిపిస్తాను. కొద్ది పాటి సైన్యాల ర్క్షణలో ఉన్న గోసమూహాల వైపు రధాన్ని నడిపిస్తాను. వారిని ఎదిరించి మన గోవులను మళ్ళిస్తాము. అంతఃపురంలోని కాంతలతో గోవులను మళ్ళించి తీసుకువస్తాను అని చెప్పావు కదా ఇప్పుడు ఇలా బెదిరి పోవడం తగునా " అన్నాడు. ఉత్తరుడు " అమ్మో! గోవలమాటలు దేవుడెరుగు. అంతఃపుర కాంతల సంతోషంతో నాకేమి పని " అన్నాడు." అదికాదు ఉత్తరకుమారా! నీ బలం ఎదిరి బలం చూసుకుని కొంచం సేపు యుద్ధం చేసి మరలవచ్చు. కౌరవసేనలు నిన్ను ఇంకా చూడకనే మనం మరలి పోవడం యుక్తము కాదు వీరులిది మెచ్చరు " అన్నాడు అర్జునుడు. " బృహన్నలా! సుశర్మ మనగోవులను తరలించుకు వెళ్ళాడు కనుక మా తండ్రిగారు సైన్యాలతో అతనిని ఎదిరించడానికి వెళ్ళారు. నాకు సాయంగా సైన్యం లేరు కౌరవ సైన్యామో అసంఖ్యాకం దీనిని నేను ఒంటరిగా ఎలా ఎదిరించను చెప్పు. వాళ్ళు మనలిని చూడక మునుపే రధం మళ్ళించుట మంచిది వెనుదిరుగుము " అన్నాడు ఉత్తరుడు. అర్జునుడు " అదికాదు ఇలా ఆవులను వ్దిలి వెళితే నగరిలో అప్రదిష్ట కాదా. పిరికి వాళ్ళను లోకం మెచ్చదు. నీకు సారధి లేడని సైరంధ్రి చెపితే నీకు నేను సారధిగా వచ్చాను. ఇప్పుడు ఆవులను శత్రువులక్లు వదిలి మరలలేను. నీకేం భయం వద్దు మనసు చిక్కపట్టుకో. కౌరవ సైన్యాలను ఏదో ఉపాయంతో ఓడించవచ్చు " అన్నాడు. ఉత్తరుడు " బృహన్నలా! నలుగురు నవ్వితే నాకేమి? నీకు ధైర్యం ఉంటే నువ్వే యుద్ధం చెయ్యి " అంటూ ధనుర్భాణాలను రధం పై వదిలి వెను తిరిగి పరుగెత్త సాగాడు. బృహన్నల కూడా ఉత్తరకుమారుని వెంబడించాడు. ఇది చూసిన కౌరవ సేనలు నవ్వుకున్నాయి. బృహన్నల ఉత్తరుని పట్టుకున్నాడు. ఉత్తరకుమారుని నోరు, ఎండిపోతూ ఉంది, కాళ్ళూ చేతులు గడగడ లాడుతున్నాయి, నోరు ఎండి పోయింది, మొహం వెలవెల పోయింది గొటుపూడుకు పోయి పరిస్థితి దారుణంగా ఉంది.

ఉత్తరకుమారుని అనునయించి అర్జునుడు యుద్ధసన్నద్ధుడగుట

ఉత్తర కుమారుడు " బృహన్నలా! నీకు అనేక బహుమతులు ఇస్తాను నన్ను వదిలి పెట్టు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది ఆమెను చూడాలి " అన్నాడు. అర్జునుడు ఉత్తరకుమారుని చూసి అనునయంగా " ఉత్తరకుమారా! భయపడకుము నీవు యుద్ధం చెయ్యలేకపోతే నా రధానికి సారధిగా ఉండు. నేను కౌరవ సేనను జయించి గోవులను మరలిస్తాను " అంటూ అర్జునుడు ఉత్తరకుమారుని తీసుకుని రధం వైపు వచ్చాడు. తాను కూడా రధం ఎక్కి రధాన్ని తాము ఆయుధాలను దాచిన శ్మశానం వైపు మరలించాడు. ఇది చూసిన కౌరవసేనలు కలవర పడ్డాయి. వారికి కొన్ని అపశకునాలు గోచరించాయి. ద్రోణుడు ధైర్యంగా ఉండమని వారిని హెచ్చరించాడు.

కౌరవ సేనలో ప్రముఖుల వాదోపవాదాలు

ద్రోణుడు భీష్ముని చూసి " వీడు ఎవరో మహా గర్విష్టి వలె ఉన్నాడు. వీడు ఎవరో తెలుసుకోవాలి " అన్నాడు. భీష్ముడు దుర్యోధనునితో " సుయోధనా! మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటాము. ఇంక మనం శత్రువలకు భయపడవలసిన పని లేదు " అని సుయోధనునికి చెప్తున్నట్లు ద్రోణుడికి అన్యాపదేశంగా బదులిచ్చాడు. ఆ మాటలను బట్టి పాండవుల అజ్ఞాత వాసం ముగిసింది ఇక వారు బయటికి రావచ్చు అన్న విషయం గ్రహించిన ద్రోణుడు ఉత్సాహభరితుడై స్యోధనుని చూసి " సుయోధనా! ఆకలితో నకనకలాడుతున్న సింహం గుహ నుండి బయటకు వస్తున్నట్లు అర్జునుడు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని మన మీద యుద్ధానికి వస్తున్నాడు. అతడితో యుద్ధం చేయతగిన వీరూడు మనలో ఎవరు ఉన్నారు. అర్జునుడు గోవులను తరలించుకు వెళ్ళటం తధ్యం " అన్నాడు. ఆ మాటలను విన్న కర్ణుడు కోపంగా " పాండవ పక్షపాతంతో మాట్లాడుయ్తున్నావు. కౌరవ సేనలలో నీవు ఒక్కడివే వీరుడివా. అర్జునుడు అంతటి జయించని వీరుడా. అతడితో నేను ఒక్కడినే యుద్ధం చేసి ఓడించగలను. పెద్దలని మన్నించి ఇంతకంటే మాటాడలేక పోతున్నాను " అన్నాడు. సుయోధనుడు కర్ణుని చూసి " కర్ణా! నీవు తప్పు పలికావు. అతడు నిజంగా అర్జునుడైతే మరల అరణ్య, అజ్ఞాతవాసాలు చేస్తాడు. కాకుంటే వాడిని నేనే జయిస్తాను " అన్నాడు. సుయోధనుని మాటలకు అంగీకరించినట్లు తలూపుతోనే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మనసులో నవ్వుకున్నారు.

అర్జునుడు ఉత్తరకుమారునకు తనను తాను వెల్లడించుట

బృహన్నల రధాన్ని జమ్మి చెట్టు వద్దకు తీసుకు వెళ్ళి " య్త్తరకుమారా! ఇవి మామూలు ధనస్సులు ఇవి నాప్రతాపానికి సరిపోవు. నీవు ఈ చెట్టు ఎక్కి అక్కడ ఉన్న గాండీవాన్ని నాకు అందించు. పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ దాచారు " అంటూ శవాకారంలో ఉన్న ఆయుధాల మూటను చూపాడు. ఉత్తరకుమారుడు " బృహన్నలా! రాజకుమారుడైనైన నన్ను శవాన్ని తాకమని చెప్పుట తగునా " అన్నాడు. అర్జునుడు " ఉత్తరకుమారా! అది శవము కాదు. పాండవుల ఆయుధములు. వారు ఇతరులు చేపట్టకుండా వాటిని శవాకారంలో శ్మశానంలోలి ఈ జమ్మి చెట్టుపై దాచారు " అన్నాడు. బృహన్నల మాటలతో ఉపశాంతిని పొందిన ఉత్తరుడు చెట్టు ఎక్కి ఆయుధాల మూటను విప్పాడు. అవి అతనికి సర్పాల వలె కనపడ్డాయి. అది చూసిుత్తరుడు భయపడ్డాడు. అర్జునుడు ప్రార్ధించగానే అవి ఉత్తరునుకి ఆయుధముల వలె కనిపించాయి. ఉత్తరుడు వాటిలో ఉన్న గాండీవమును చూసి " బృహన్నలా! ఈ ధనస్సు ఇలా భయంకరంగా ఉన్నదే దీనిని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు " అన్నాడు. అర్జునుడు ఉత్తరునితో " ఉత్తరకుమారా! అది గాండీవము దానిని అర్జునుడు ధరిస్తాడు. దాని ప్రభావంతో అర్జునుడు దేవదానవులను జయించాడు. దీనిని బ్రహ్మ లక్ష సంవత్సరాలు ధరించాడు. తరవాత ప్రజాపతి అరవైనాలుగు వేల సంవత్సరాలు ధరించాడు. తరవాత ఇంద్రుడు ఎనభై ఐదేండ్లు ధరించాడు. తరవాత చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు ధరించాడు. తరవాత అగ్ని దేవుడు వరుణుడి నుండి దానిని తీసుకుని అర్జునునికి ఖాండవ వన దహనం సమయంలో ఇచ్చాడు. ఈ గాడీవాన్ని అర్జునుడు అరవై ఐదేళ్ళు ధరిస్తాడు " అని చెప్పి అలాగే మిగిలిన పాండవుల ఆయుధాల వివరాలు చెప్పాడు. ఉత్తరకుమారుడు సందేహంగా " బృహన్నలా! పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ పెట్టి ఎక్కడకు వెళ్ళారో. వారు నా బంధువులు, మిత్రులు. అయ్యో ఆ ధ్ర్మరాజు ఎక్కడ ఉన్నాడో. వాయుపుత్రుడు ఎన్ని అవస్థలు పడుతున్నారో. అర్జునుడు ఎక్కడ దాగాడో. కవలలు ఎన్ని తిప్పలు పడుతున్నారో. మహాసాధ్వి ద్రౌపది ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో " అంటూ ఆవేదన పడ్డాడు. అర్జునుడు అనునయంగా ఉత్తరునితో " ఉత్తరకుమారా! చింతించ వలదు. పాడవులు అరణ్యవాసం పూర్తి అయిన తరవాత అజ్ఞాతవాసాన్ని మన నగరంలోనే గడుపుతున్నారు. కంకు భట్టు ధర్మరాజు, వలలుడే భీమసేనుడు, దామ్రగంధి, తంత్రీ పాలుడు నకులసహదేవులు. ఇక దాచడమేల అర్జునడను నేనే. మాలిని పేరొతో సైరంధ్రిగా ఉన్నది సాధ్వి ద్రౌపది. ఆమె కారణంగానే భీముడు కీచకుని, ఉపకీచకులను చంపాడు " అని అన్నాడు. ఆ మాటలు విన్న ఉత్తరకుమారుడు సంభ్రమాశ్చర్యాలతో సందేహంగా " బృహన్నలా! అర్జునికి పది పేర్లున్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతాను " అన్నాడు. బృహన్నల చిరునవ్వుతో ఉత్తరుని చూసి " కుమారా! అర్జునుడు, పల్ఘుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభస్తుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి " అన్నాడు. అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక " బృహన్నలా! ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను " అన్నాడు. అర్జునుడు " కుమారా! నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జింతిని కనుక ధనుంజయుడనయ్యాను. ఎవ్వరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడినయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రధమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేతవాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రాకాసిస్తుంటుంది కనుక కిరీటి నయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి భిభత్సమైన పరిస్తితిలో కూడా సంయమును కోల్పోయి జుగ్గుస్సాకరమైన, భీభత్సమైన పనులు చెయ్యను కనుక భీభత్సుడినయ్యాను. నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కవ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర జల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి బ్ హోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది. పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను. అయినా ఉత్తరకుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవవనదహనంలో అగ్ని దేవునికి సాయపడినందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాతకవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు నీవు భపడవలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం " అన్నాడు. ఉత్తరకుమారుడు చెట్టుదిగి సంభ్రమాశ్చర్యాలతో అర్జునినికి నమస్కరించాడు. ఉత్తరకుమారుడు " అర్జునా! నా అదృష్ట దేవతలా నువ్వు నాకు కనిపించావు. చాపల్యంతో నేను ఏదైనా నిన్ను అని ఉంటే నన్ను మన్నించు. నీ అండ దొరికినందుకు నా ఆనందానికిక అవధులు లేవు నన్ను కనికరించు " అన్నాడు. అర్జునుడు రధం దిగి ఉత్తరుని ప్రియమార కౌగలించుకున్నాడు. ఉత్తరుడు రధం ఎక్కి అర్జునా ఇప్పుడు నా భయం తొలగి పోయింది. న్వ్టితో అర్జునినికి సారధిని కావలెనన్న నా కోరిక ఈడేరింది. నీవు నన్ను ఆజ్ఞాపించి సారధ్యం చేయించుకుని కౌరవులను జయించి గోవులను మరల్పుము " అన్నాడు. అర్జునుడు వాత్సల్యంతో " కుమారా! భయపడకుము నీ మీద గాలి కూడా సోకనివ్వను. నీకు రక్షణ కల్పించడమే నా కర్తవ్యం " అన్నాడు. ఉత్తరుడు " అర్జునా! నీ నిజరూపం తెలిసిన వెంటనే నా భయం పట్శాపంచలైంది. ఈ పేడి రూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది " అన్నాడు. అర్జునుడు " ఉత్తరకుమారా! మా అన్నగారి ఆజ్ఞను అనుసరించి బ్రహ్మచర్య వ్రతం స్వీకరించిన సమయంలో దేవేంద్రుని ఆహ్వానంపై ఇంద్రలోకం వెళ్ళాను. అక్కడ ఊర్వశి కోరికను నిరాకరించిన నన్ను పేడి రూపం ధరించమని శపించింది. అజ్ఞాతవాస సమయంలో అది నాకు వరంలా పరిణమించింది. అజ్ఞాత వాసం ముగియగానే పేడి రూపం పోయింది ఇప్పుడు నేను అర్జునుడను " అన్నాడు. ఉత్తరుడు " అర్జునా ఇప్పుడు నన్ను ఏమి చెయ్యమటావు " అని అడిగాడు. అర్జునుడు " నీవు గాండీ వమును తుణీరములను ఇతర ఆయుధములను తీసుకుని మిగిలిన ఆయుధములను అలాగే ఉంచు " అన్నాడు. ఉత్త్ర కుమారుడు అలాగే చేసాడు. అర్జునుడు వాటిని ధరించి గాండీవాన్ని ఎక్కు పెట్టి అల్లె త్రాటిని మ్రోగించి అగ్ని దేవుని తలచగానే అమోఘమైన కపిధ్వజం సాక్షాత్కరించింది. ఉత్తరకుమారుని సింహపతాకమున్న ధ్వజం శమీవృక్షం మీద పెట్టి కపిధ్వజాన్ని రధమునకు కట్టాడు. మనమున తలవగానే చేతికి దేవదత్తము వచ్చినది. అర్జునుడు " ఉత్తరకుమారా! నీవు రధమును జమ్మిచెట్టుకు ప్రదక్షిన చేయించి ముందుకు పొమ్ము ఇప్పటికే ఆలస్యం అయినది. పశువులు చాలా దూరం వెళ్ళి ఉంటాయి " అన్నాడు. ఉత్తరుడు రధం మరల్చగానే అర్జునుడు దేవదత్తం పూరించాడు. ఆ ధ్వని భూనభోనాంతరాలలో వ్యాపించింది. రధమునకు కట్టిన గుర్రాలు మూర్చిల్లాయి. అర్జునుడు గుర్రాలను నిమిరి వాటికి చైతన్యం కలిగించి " కుమారా! యుద్ధసమయంలో ఇది సహజం కలత చెందకు " అన్నాడు. ఉత్తరుడు " అర్జునా! యుద్ధ సమయంలో అనేక శంఖారావాల విన్నాను. కాని ఈ శభ్దానికి నా గుండెలు అవిసి పోయాయి, దిక్కులు తిరిగి పోయాయి, చెవులు బద్దలయ్యాయి నా మనసు నీరు కారింది. ఈ కపిధ్వజాన్ని చూస్తుంటేనే నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నీ తేజము చూసి నేను వివశుడిని అయ్యాను " అన్నాడు.

భీష్ముడు వాదోపవాదాలను నివారించుట

అర్జునుడు నవ్వి మరలా శఖాన్నిపూరించాడు. ద్రోణుడు " సుయోధనా! ఆ ధ్వని విన్నావా. ఆ ధనుష్టంకారం గాండీవం కాదూ, వచ్చేది అర్జునుడు కాదూ, ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ఆ కిరీటం అర్జునికి ఇంద్రుడు ప్రసాదించినది కాదూ, సమరోత్సాహంతో అర్జునుడు కాక మరెవ్వరు. అతనిని ఎదుర్కోడానికి సన్నాహాలు చెయ్యండి " అంటూ కృపాశ్వద్ధామలను చూసి ముందు మనం రారాజు సుయోధనుని పంపుదాము. ఆ వెనుక గో సమూహాలను పంపుదాం. ఆ వెనుక మనం ఉంటాము. అర్జునుడు వచ్చిన అతనితో మనం యుద్ధం చేస్తాము " అన్నాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు భీష్మ, కర్ణ, వికర్ణుల వంక చూసి నేను మీకు ఇదివరకే చెప్పాను. పాండ్శవులు జూదంలో ఓడి పోయి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాత వాసం ఒప్పందం చేసుకూన్నారు. ఇంకా ఆ సమయం పూర్తి కాకుండా పార్ధుడు భట పడ్డాడు కనుక పాండవులు అరణ్య, అజ్ఞాతవాసములు చేయాలి. ఈ విషయం మనం మోహంతో కాని పాండవులు లోభంత్యో కాని గమనించ లేదు. తాత భీష్ముడే దానిని నిర్ణయించటానికి అర్హులు. " అన్నాడు. " వచ్చునది ఉత్తరకుమారుడు కాకుండా గాండీవి అయితే మన పని సఫలం అయినట్లే. అసలు సుశర్మ దక్షిణ దిక్కుగా మనం ఉత్తర దిక్కుగా గోవులను పట్టుకోవడానికి వచ్చింది మత్స్యదేశంలో ఉన్న పాండవులను బయట పెట్టడానికే గదా. ఆ వచ్చిన వాడు అర్జునుడైతేనేమి దేవతలైతేనేమి మనం గోవులను పట్టుకున్నాం. వాటి కోసం యుద్ధం చేస్తాము కాని వెరువ నేల కనుక ముందు మనమే యుద్ధం చేస్తాము. అయినా అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురు సైన్యాలతో ఎలా యుద్ధంచాస్తాడు. విన్న వారు నవ్వుతారని కూడా అనుకోకుండా శత్రువును నందుల వలె పొగడుట ఈ ద్రోణునికి తగునా. అయినా ఆచార్యుల వారు దూరంగా నిలిచి పర్యవేక్షిస్తుంటారు. భోజన సమయాలలో, విద్యగరిపే సమయాలలో, నీతిని భోదించే సమయాలలో గురువులను సంప్రదించాలి కాని యుద్ధ విషయాలు వారికేం తెలుస్తాయి అడగటానికి. అయినా వారు యుద్ధం చేయరు వెనుక ఉండి మన విజయం కాంక్షిస్తుంటారు " అన్నాడు సుయోధనుడు. తండ్రిని అలా తూలనాడటం విన్న అశ్వత్థామ " సుయోధనా! పశువులను కాచేవారిని బెదిరించి ఆవులను పట్టుకున్నంతా మాత్రాన ఇలా మాట్లాడటం తగదు. మనమింకా యుద్ధం చేయ లేదు, శత్రువులను జయించ లేదు, నగరం చేర లేదు యుద్ధసంలో గెలిచిన వారు కూడా ఇలా మాట్లాడరు. యుద్ధమంటే జూదంలో రాజ్యాన్ని అపహరించటం కాదు, యుద్ధభీమిలో జూదం ఆడటం కుదరదు. పాండవుల జయించేనా ద్రపదిని సభకు పిపించింది? ఈడ్చుకు రమ్మని ఆజ్ఞాపించింది. శకుని మ్ట వినేగా అవన్నీ చేసింది ఇప్పుడు ఆ శకుని యుద్ధం చేస్తాడులే . సభలో నీచే అవమానించబడిన కపికేతనుడు నీపై యుద్ధానికి వస్తున్నాడు. గురువును అధిక్షేపించావు కాని దేవదానవులను జయించిన అర్జునుని నీవు ఒక్కడివే ఎదుర్కొన గలవా? వీరుని పొగడటం సహజం. పుత్రసమానుడైన ప్రియ శిష్యుడైన అర్జునిని పొగడటం నేరమా. ఇంత జరిగిన తరవాత సిగ్గు లేకుండా నా తండ్రి యుద్ధం చేయ వచ్చు కాని నేను చేయను. సుయోధనా! యముడు చెలరేగినా, అగ్ని ఆగ్రహించినా, మృత్యుదేవత పురులు విప్పినా కొంత అయినా మిగులుతుంది. అర్జునుడు బాణాలు సర్వనాశనం చేస్తాయి. నీ కుటిల బుద్ధులు ఇక్కడ పని చేయవు. అర్జునుడు గాండీవంతో శరస్మాధానం చేసి బాణాలు విసురుతాడు కాని పాచికలు విసరడు. మనం మత్స్యదేశాధీశుని గోవులను పట్టుకున్నందుకు మత్స్యదేశాధీశుడు ససైన్యంతో వస్తే ఎదిరిస్తాము కాని అర్జునిని ఎదిరించ లేము " అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు ఊగిపోయాడు " మం వచ్చిందిావులను పట్టు కోవడానికి పాండవులను గుర్తించడానికి. అర్జునిని చూసి బెదరడం భావ్యమా. సుయోధనుని పిచ్చివాడిని చేయటం తగునా? మీకు భయంగా ఉంటే మీరు ఊరుకోండి. ఒక్కని ఎదిరించడానికి ఎంత మంది కావాలి. నేను ఒక్కడినే ఎదిరిస్తాను. కపిధ్వజాన్ని విరగొట్టి, దాని చుట్టూ ఉన్న పిశాచాలను తరిమి కొడతాను. సారధిని చంపి అర్జునిని శరీరాన్ని నా బాణాలతో తూట్లు చేస్తాను. నా బాహు బలాన్ని చూడండి. అర్జునుడు పమూడేళ్ళ అరణ్యాజ్ఞాత వాసాలు ముగించుకొని యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నాడు. కౌరవసేనలో మహా వీరుడనైన నేను అతనిని ఎదుర్కొంటాను. రారాజు ఋణం తీర్చుకోవడానికి, పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్రప్రయోగం చేయడానికి కర్ణార్జునులలో ఎవరు గొప్పో తేలడానికి ఇది సమయం అర్జునిని గెలిచి సుయోధనునికి ముదము చేకూర్చెదను. ఇష్టం ఉన్న వారు మా ద్వంద యుద్ధం చూడండి లేని ఎడల ఆవుల వెంట నగరానికి పొండి " అన్నాడు. కర్ణుని మాటలు విన్న కృతవర్మ " కర్ణా! నీవు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతావు. కార్యసిద్ధి గురించి నీకు పట్టదు. కార్యసాధనలో యుద్ధం ఒక నీచమైన ప్రక్రియ అని రాజనీతిజ్ఞులైన పెద్దలు చెప్తారు. దేశ, కాల, పరిస్థితిని అరధం చేసుకుని తన బలాన్ని ఎదిరి బలాన్ని బేరీజు వేసుకుని యుద్ధం చేయాలి కాని ముర్ఖంగా దుస్సాహసంతో యుద్ధానికి దిగితే ఓటమి తప్పదు. అర్జునుడు ఒంటరి వాడని నువ్వు అంటున్నావు. ఖాండవవన దహన సమయంలో ఇంద్రునితో యుద్ధం చేసింది అర్జునుడు ఒక్కడే, యాదవ సైన్యంతో పోరాడి సుభద్రను చేపట్టింది అర్జునుడు ఒక్కడే, రాజసూయ యాగమున దిగ్విజయం చేసింది అర్జునుడొక్కడే, నివాతకవచులను సంహరించి దేవతలకు మేలొనరించించింది అర్జునుడొక్కడే, దేవేంద్రునికి అజేయులైన కాలకేయులను సంహరించింది అర్జునుడొక్కడే. అంతెందుకు ద్రౌపది స్వయవరంలో అబేధ్యమైన మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని చేపట్టడమే కాక అనంతరం తిరగబడిన రాజులను జయించినది అర్జునుడు ఒక్కడే నువ్వూ అక్కడే ఉన్నావు కదా. పాండవులు అందరూ తమతమ శక్తి కొద్దీ దిగ్విజయం చేసారు. నీవేమో హస్థినా పురంలో కూర్చుని ప్రగల్భాలు పలుకుతున్నావు. నీవు అర్జునుని గెలుస్తానని చెప్పడం ఒంటి చేత్తో సముద్రం ఈదడం లాంటిది. కనుక దుస్సాహసం విడిచి మనమంతా రారాజును కాపాడుకోవాలి కాని యుద్ధోన్మాదులం కాకూడదు. అందరం కలసి అర్జునిని ఎదుర్కొందాం నువ్వొక్కడివే పోరాడతానని చెప్పడం అవివేకం " అన్నాడు. కర్ణుడు కోపంగా " కృపాచార్యా! శత్రువుల మిత్రుడవని తెలిసీ నిన్ను తీసుకురావడం సుయోధనుని అమాయకత్వం. బాలురు, బంధువులు రాజు సంపదను ఆరగిస్తారు కాని సమయానికి తప్పుకుంటారు. ఇంటికి వెళ్ళి హాయిగా మృష్టాన్నాలు ఆరగించు. అనవసరంగా రాజునిన్ను యుద్ధంలో ప్రవేశపెట్టాడు. మారుమాటాడక వెళ్ళు. నేను ఒక్కడినే పదునాలుగు భువనాలను గెలుస్తాను. ఒక్క రధికుడు అర్జునుడెంత " అన్నాడు. భీష్ముడు కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ సముచితంగా మాట్లాడాడు. కర్ణుడు వీరోచితంగా మాట్లాడాడు. కాని ఒకరిని ఒకరు నిందించుకోవడం న్యాయం కాదు. అంత శక్తి ఉన్న వాడు యుద్ధం చేయాలి కాని ఇలా ఇతరులను నిందించడం ఎందుకు? శత్రువులు ముట్టడించకముందే ఉపాయం ఆలోచించాలి. శత్రువు పరాక్రమవంతుడైతే పొగడటం సజ్జనులకు ఉచితం. పెద్దలను గౌరవించాలి కాని నిందించడం తగదు. ప్రస్తుత కర్తవ్యం ఆలోచిద్దాం. ఆచార్యా అర్జునుడు మమీద యుద్ధానికి వస్తున్నాడు. మనం అందరం కలసి ఎదిరిస్తాం. విభేదాలకు ఇది సమయం కాదు. ఎవరో ఏదో అన్నారని మీరు కోపగించడానికిది సమయం కాదు. నన్ను క్షమించి ముందుకు పదండి ఆచార్యా " అన్నాడు. కృపాచార్యుడు " అయ్యో మీరు క్షమించంచమని అడుగ తగునా. నేనంతటి వాడనా. ద్రోణుడు శాంతిస్తే చాలు " అన్నాడు. కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణునితో పోయి ద్రోణాచార్యుని అశ్వత్థామను క్షమించమని కోరారు. భీష్ముని మాటలతో నా కోపం పోయింది. ముందుకు పదండి ముందు మనం రారాజును కాపాడు కుంటాము. అర్జునుడు చాలా కసితో ఉంటాడు కనుక అందరం అర్జునిని ఎదుర్కొందాము. అజ్ఞాత వాసం గురించి సుయోధనుడు అడిగిన దానికి భీష్ముడు వివరణ ఇస్తాడు " అన్నాడు. ద్రోణుని ఆంతర్యం గ్రహించిన భీష్ముడు కాల నిర్ణయం చేయవలసిన సమయం ఆసన్న మయినదని గ్రహించాడు. అతడు " సుయోధనా! మన ప్రస్తుత కాలమానం ప్రకారం రెండు సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది. ఈ పదమూడేళ్ళ కాలంలో వచ్చిన అధికమాసాలను గణనలోకి తీసుకుంటే నిన్నటితో పాండవుల అజ్ఞాత వాసం పూర్తి అయింది. ఈ విషయం తెలిసే అర్జునుడు నిజ రూపంతో మనముందుకు వచ్చాడు. అతడు ధర్మం తప్పడు. అలా తప్పే వాడైతే జూదంలో ఓడి పోయిన నాడే మూర్ఖత్వంతో మనతో యుద్ధానికి దిగే వాడు. ధర్మంకోసం కట్టుబడ్డారు కనుకనే ఇంత కాలం వేచి ఉన్నారు. మనతో యుద్ధానికి వచ్చింది అర్జునుడని తెలిసి పోరాటానికి దిగితే మనం గెలువ వచ్చు ఓడి పోవచ్చు. జయాపజయాలు దైవాధీనం కనుక మనం సంధి చేసుకోవడం ఉత్తమం " అన్నాడు భీష్ముడు. సుయోధనుడు " మనకు పాండవులతో సంధి ఎలా పొసగుతుంది. పాండవులకు నేను రాజ్యభాగం ఇవ్వను. యుద్ధం నిశ్చయం ఇందులో తిరుగు లేదు " అన్నాడు. ఇది చూసిన ద్రోణుడు " యుద్ధ సమయంలో నిర్ణయాధికారం రాజుకు మాత్రమే ఉంటుంది. కనుక ఎవరూ రాజు మాట నిరాకరించ లేరు కనుక మనం యుద్ధవ్యూహాన్ని చేయాలి. సైన్యంలో నాల్గవ భాగాన్ని తీసుకుని సుయోధనుడు ముందు నడుస్తాడు. మరొక నాల్గవభాగం గోవులతో నడుస్తుంది. మిగిలిన సగం సైన్యంతో మనం వెనుక కదులుదాము. నేను మధ్యలో ఉంటాను. నా కుడి వైపు కృపాచార్యుడు, ఎడమ వపు అశ్వత్థామ ఉంటారు. ముందు భాగంలో కర్ణుడు ఉంటాడు. దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని, జయద్రధుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, సోమదత్తుడూ అక్కడక్కడా మొహరిస్తారు. అర్జునుడు ఎవరితో యుద్ధం చేస్తే వారిని మనంమంతా రక్షిస్తాము. ఇం,దుకు భీష్ముడు ఆమోదాన్ని తెలిపాడు. తాను వెనుక ఉండి సైన్యాలను నడిపించాడు.

ద్రోణుడు వ్యూహరచన చేయుట

యుద్ధారంభం

ఆ యుద్ధం చూడటానికి దేవతలంతా విమానాలెక్కి ఆకాశవీధిలో నిలబడ్డాఋ. అర్జునుడు తన దేవదత్తాన్ని పూరిస్తూ అమిత వేగంతో కురు సైన్యాన్ని చేరుకున్నాడు. అతని పరాక్రమానికి కురు సైన్యం బెదిరి పోయింది. అర్జునుడు ఉత్తరకుమారునితో " కుమారా! సైన్యం రెండు భాగాలుగా పోతుంది ఇందులో సుయోధనుడెక్కడ ఉన్నాడో తెలుసుకుని యుద్ధం చేయాలి. రధాన్ని సేనకు ఎడమ వైపుగా పోనియ్యి. రాజును పట్టుకుయంటే కురు సైన్యం విచ్చిన్నమౌతుంది. మనపని సులభం ఔతుంది గోవులను మళ్ళించడంతో పనౌతుంది. గోవులు ఎక్కడ ఉన్నాయో అక్కడకు వెళితే వాట్ని రక్షించడానికి సుయోధనుడు అక్కడకు వస్తాడు " అన్నాడు అర్జునుడు. అర్జునుడు రధాన్ని ఎడమ వైపు నడిపిస్తూ సన్యాన్ని కలయచూసి సుయోధనుడు లేడని తెలుసుకుని ముందుకు సాగాడు. పోతూ కృపాచార్యునకు, ద్రోణాచార్యునకు, భీష్ముడికీ తగిలీ తగలనట్లు నమస్కార బాణాలు వేసాడు. అర్జునిని గురు భక్తికి, పెద్దల ఎడ భక్తికి భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఆనందించారు. " అచార్యా! అర్జునుడు మనతో యుద్ధం చేయక ముందుకు పోతున్నాడంటే సుత్యోధనుని కోసం వెతుకుతున్నాడు. కనుక మనం సుయోధనుని రక్షించాలి " అంటూ భీష్ముడు సైన్యాలను ముందుకు నడిపించాడు. ఇంతలో అర్జునుని రధం ఆవులమందలను చేరుకుంది. " నేను ఆలమందలకు రక్షణగా ఉన్న సైన్యాన్ని ఎదిరిస్తాను వారిని రక్షించడానికి సుయోధనుడు వస్తాడు. మన చేతికి చిక్కుతాడు " అంటూ అర్జునుడు రధాన్ని తూర్పు దిక్కుకు నడపమన్నాడు. గోవులకు కాపలాగా ఉన్న సైన్యం అర్జునిని శరపరంపర ధాటికి ఆగలేక చెల్లాచెదరైంది. అర్జునుడు గోవులను వెనుకకు మళ్ళించాడు. గోవులు గోపాలురు వెంట రాగా వెనుకకు పరుగెత్తాయి. అర్జునుడు తనరధాన్ని గోవులకు సైన్యాలకు మధ్యగా నిలిపి గోవులకు రక్షగా నిలిచి గోపాలురను చూసి " మీరు గోవులను తీసుకు వెళ్ళండి " అన్నాడు. గోగణం మత్స్యదేశ పొలిమేరలో చేరుకున్నాయి. కురుసేనలు అర్జునిని చుట్టుముట్టాయి.

పంచమాశ్వాసం

అర్జునుడు దూరంగా ఉన్న సుయోధనుని చూడగానే " ఉత్తరకుమారా! అడుగో సుయోధనుడు. రధం అటు పోనివ్వు " అన్నాడు. ఇంతలో కౌరవ సేనలోని ప్రముఖులైన చెరి ఒక వెయ్యి రధములను తీసుకుని సుయోధనుని వైపు వెళ్ళారు. సుయోధనుడికి అర్జునినికి మధ్య సైన్యం మూదు నిలిచారు. చేత చిక్కిన గోగణములు అర్జునుడు తోలుకు పోవడం చూసి సుయోధనుడు నిట్టూర్చాడు. అర్జునుడు కురుసేనను తేరి పార చూసాడు. " ఉత్తరకుమారా! కురుసేనను చూడు. కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు " అన్నాడు. " ఉత్తరకుమారా! ఇప్పుడు మన రధం గురువుగారు ద్రోణాచార్యునకు ప్రదక్షిణగా పోనిమ్ము. ధనుర్విద్యలో అపార పాండిత్యము కలిగిన గురువుగారిని అవమానించ కూడదు. కనుక నేను ముందుగా సుయోధనునితో యుద్ధం చేస్తాను. సుయోధనుని రక్షించడానికి గురువుగారు వస్తారు అప్పుడు నేను ఆయనతో యుద్ధం చేస్తాను. గురు పుత్రుడు అశ్వథ్థామ శివుని వరం వలన పుట్టాడు. భీకరమైన యుద్ధం చేయగల సమర్ధుడు. ఆ ప్రక్కన ఉన్న వాడు కృపాచార్యుడు. నాకు చిన్న నాటి గురువు, ద్రోణ సమాన పరాక్రమవంతుడు. కనుక వారితో యుద్ధం వద్దు రధం పక్కకు పోనివ్వు. అక్కడ సుయోధనుని మిత్రుడు కర్ణుడున్నాడు చూడు పరశురాముని శిష్యుడైన ఇతడు మహా పరాక్రమ శాలి నాకు సరి జోడు . ఇతనితో యుద్ధం చేయాలని నా కోరిక నన్ను చూస్తే ఊరుకోడు కనిక రధం అతనికి ముందుగా నిలిపి మేము చేయబోయే యుద్ధం చూడు. మా పెదనాన కుమారుడు సుయోధనుడు. అతడు అభిమానధనుడు కోపం ఎక్కువ, పరాక్రమ వంతుడు, అత్యంత దుష్టుడు, మా మీద ద్వేషం పెంచుకున్న వాడు. అతడు కనపడితే వదల వద్దు. అదుగో పితామహుడైన భీష్ముడు, అత్యంత పరాక్రమవంతుడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, పరశురామని ఎదిరించిన ధీశాలి, ఎన్నో శస్త్ర రహస్యాలు తెలిసిన వాడు. ఆయనకు కోపం రానివ్వ వద్దు. అలా చేస్తే నన్ను సుయోధను చేరనివ్వడు " కురు వీరులను ఉత్తరునికి పరచయం చేసాడు. ఆ సమయంలో అశ్వథ్థామ కర్ణుని చూసి " కర్ణా నిన్ను నీవు పొగుడుకున్నావు కదా! అర్జునుడు వచ్చాడు పోరాడు నీకు ఒక వేళ చేతకాకపోతే శకునితో మంతనాలు చెయ్యి. రారాజు ఈ యుద్ధ భారం నీ మీద పెట్టాడు కదా! తప్పుతుందా " అన్నాడు పరిహాసంగా. కర్ణుడు ఆగ్రహించి " నేను నీలా భీరువుని కాదు యుద్ధం, నుండి తప్పుకోవడానికి అర్జునుడే కాదు అతని తండ్రి ఇంద్రుడు వచ్చినా నేను ఎదిరించగల పరాక్రమ వంతుడను కావాలంటే చూడు " అన్నాడు. కర్ణుడు అలా మాట్లాడుతూ ఉండగానే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వథ్థామ సుయోధనునికి రక్షణగా నిలిచారు. వారి వెనుక బాహ్లిక సోమదత్తులు తమతమ సైన్యాలతో పోరాడారు.

అర్జునుని వీరవిహారం

అర్జునుడు గాండీవాన్ని ధరించి కురు సైన్యాలను నుగ్గు, నుగ్గు చేసాడు. కురు సైన్యం వజ్రవ్యూహంగా ఏర్పడి అర్జునిని ఎదిరించ సాగాయి. ఉత్తరకుమారుడు అర్జునిని పరాక్రమానికి పొంగి పోయి శ్లాఘించాడు. అర్జునుడు చెలరేగి యుద్ధం చేయసాగాడు. గాండీవం గుండ్రంగా తిప్పుతూ ఇరు వైఉలా ఉన్న అమ్ముల పొది నుండి బాణాలు తీసి రెండు చేతులతో ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తూ వజ్రవ్యూహాన్ని చేధించాడు. అర్జునిని ధాటికి గుర్రములు రధం విడిచి పారి పోతున్నాయి. రధికులు రధం నుండి కింద పడుతున్నారు.కింద పడ్డ వారిని విడిచి పెడుతూ ముందుకు సాగుతున్నాడు. ఒకసారి కనిపించిన వారు మరలా కనిపించడం లేదు. ఉత్తరకుమారుని జాగ్రత్తగా కాపాడు కుంటూ యుద్ధం చేస్తున్నాడు. అర్జునినితో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అప్రతిహతంగా సైన్యాల మధ్య అర్జునిని ధాటికి సన్యాలు నిస్తేజం ఔతున్నాయి.ద్రోణాదులపై శరసంధానం చేసాడు కర్ణుని రధసారధిని బాణంతో కొట్టాడు, అతని రధాన్ని విరగకొట్టాడు, విల్లును విరిచాడు, దేవదత్తాన్ని పూరించాడు. కర్ణుని అవస్థ చూసి కురు సైన్యాలు భీష్ముని వెనక చేరారు. భీష్ముడు వారిని ఉత్సాహ పరిచాడు. కృపాచార్యుడు, ద్రోణుడు, వికర్ణుడు సుయోధనునికి రక్షణకవచంగా నిలిచారు.

అర్జునుడు కర్ణునితో తలపడుట

అర్జునుడు ఉత్తరకుమారునితో " ఉత్తరకుమారా! కొంచం సేపు రధాన్ని ఆపు. మనముందు మొహరించిన సైన్యాలను చూడు. కర్ణుని ముందు రధాన్ని ఆపు వాడి పొగరు అణిస్తే కాని సుయోధనుని పొగరు అణగదు " అన్నాడు. ఉత్తరకుమారుడు రధాన్ని కర్ణుని ముందుకు పోనిచ్చాడు. కర్ణుని వైపు శరవేగంతో దూసుకు వెళుతున్న అర్జునుని చూసి చిత్రాంగధుడు, చిత్రరధుడు, సంగ్రామ చిత్తుడు, వివిశంతి, దుష్ప్రహుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శంత్రుంతపుడు, దుశ్శాసనుడు మొదలైన కురు కుమారులు అర్జునినిపై ఒక్క సారిగా ఉరికారు. ముందుగా వికర్ణుని విల్లు విరిచాడు వికర్ణుడు పారిపోయాడు. తరువాత శత్రుంతపుని చంపాడు. దానితో కురుకుమారులు పారి పోయారు. తరవాత కర్ణుని తమ్ముడు సంగ్రామ జిత్తుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఒక బల్లెంతో వాడిని పొడిచి చంపాడు. కర్ణుడు కోపంతో అర్జునినిపై బాణం వేసాడు. ఈ విధంగా అర్జునుడు కర్ణుడు తలపడ్డారు. కౌరవ సేనంతా యుద్ధం చేయడం ఆపి వీరిని చూస్తూ నిలబడ్డారు. అర్జునుడు కర్ణుని చూసి " కర్ణా నిడు సభలో నాకు ఎదురు లేదని పలికావు ఇదిగో యుద్ధం వచ్చింది సభలలో ప్రగల్భాలు పలకడం కాదు ఇప్పుడు నీ ప్రతాపం చూపు నీ తమ్ముని చావు కనులార చూసావు కదా ఇంత దాకా వచ్చి పారిపోవడానికి ప్రయత్నించ వద్దు. ద్రౌపదిని నిండు సభలో అవమానించినందుకు ఫలితం అనుభవించాలి కదా. ఆ రోజు ధర్మరాజు మాటకు కట్టుబడి నిన్ను వదిలాను ఇప్పుడు చిక్కావు తప్పించుకోలేవు " అన్నాడు. కర్ణుడు " అర్జునా! అన్నగారి మీద పెట్టి తప్పుకుంటావా! అంత వీరుడివా? ఎలాగైనా అడవులలో తిరిగితే రాజ్యం వస్తుందిలే అని అడవులలో తిరిగిన పిరికిపందలు మీకు ధైర్యసాహసాలు ఉన్నాయా? నీవు ఏమేమో చేసావని అన్నారు నిన్ను చూస్తుంటే అవి అన్నీ అసత్యాలు అనిపిస్తున్నాయి " అంటూ అర్జునిపై బాణాలు సంధించాడు. అర్జునుడు బదులుగా బాణాలతో సమాధానం ఇస్తున్నాడు. కర్ణుని విల్లు విరగకొట్టాడు. కర్ణుడు శక్తి బాణాలను అర్జునినిపై ప్రయోగించాడు. అర్జునుడు దానిని తుత్తునియలు చేసాడు. కర్ణుడు విల్లు తీసుకునిఆర్జునిని సారధిపై ఆరు బాణాలు అర్జునినిపై పది బాణాలు వదిలాడు. అర్జునుడు కోపించి కర్ణినిపై బల్లెములు వర్షంలా కురిపించాడు. కర్ణుడు వాటి ధాటికి ఆగలేక పారి పోయాడు. అర్జునుడు విజయచిహ్నంగా దేవదత్తం పూరించాడు. అర్జునుడు " ఉత్తరకుమారా! కురుసేనలో ముఖ్యవీరుడు కర్ణుడు పారి పోయాడు. ఇక మనకు ఎదురు నిలిచేది ద్రోణాచార్యుఇలు మాత్రమే " అంటూ కురు సేనను చూసాడు. ఉత్తరకుమారుడు అర్జునినితో " అర్జునా! నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం, భయం, విహ్వల భావం కలుగుతున్నాయి. నీ ధైర్యం, నీ శౌర్యం చూస్తుంటే నాకు భయం కలుగుతంది. నా మనసు వశం తప్పుతుంది, కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి రధం నడప శక్యం కాకున్నది. ఇలాంటి యుద్ధం నేనిది వరకు చూడ లేదు. మనసు పరవశించి పోతుంది " అన్నాడు.

అర్జునుడు ద్రోణునితో తలపడుట

అర్జునుడు నవ్వి " ఉత్తరకుమారా! భయం వలదు నేనున్నాను నిర్భయంగా రధాన్ని ద్రోణుని వపు మళ్ళించు ఎర్రని గుర్రాలు పూన్చిన రధాన్ని అధిరోహించి వాడే ద్రోణుడు గురు నాకు హితుడు క్స్త్రకోవిధుడు రాజ ధర్మంగా ఇప్పుడు నేను ఆయనతో పోరాడవలసి వచ్చినది " అన్నాడు. ఉత్తరుడు అలాగే చేసాడు. అర్జునుడు గురువును చూసి " గురుదేవా! నమస్కారం. అడవులలో పన్నేండేళ్ళు , అజ్ఞాతంలో ఒక ఏడు గడిపి ఎన్నో బాధలుపడ్డాము. ఇది మంచి తరుణం అని ఎంచి మీ ముందుయ్కు వచ్చాను.నా మీద కోపగించకండి ముందుగా మీ పై బాణప్రయోగం చేయలేను ముందుగా మీరే నాపై బాణప్రయోగం చెయ్యండి " అని వేడుకున్నాడు. అతని మాటలకు సంతోషపడి ద్రోణుడు అర్జునినిపై పది బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వేసాడు. ఇప్పుడు అర్జునినికి ద్రోణుడికి ద్వంధ యుద్ధం ఆరంభమైంది. అతిరధులు, అస్త్రకోవిదులు, పరాక్రమోపేతులైన వీరి యుద్ధాన్ని కౌరవ సేనలు కుతూహలంతో చూస్తున్నాయి. ద్రోణుని అస్త్రాలను సమర్ధంగా ఎదుర్కొని అర్జునుడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. కురుసేనను తనుమాడుతున్న అర్జునిని చూసి ద్రోణుడు ఆశ్చర్యచకితుడౌతున్నాడు. కురు సేనలు తరిగి పోతున్నాయి. అర్జునిని గెలవడం అసాధ్యమని అనుకున్నాడు. అర్జునుడు ద్రోణుని శరీరాన్ని, కేతనాన్ని, సారధిని ఒక్క సారిగా బాణాలతో కొట్టాడు. కురు సైన్యాలుహాహాకారాలు చేసాయి. తండ్రి పరిస్థితి చూసి అశ్వథ్థామ అతనికి సాయం వచ్చాడు.

అశ్వథ్థామ కృపాచార్యులతో అర్జునిని యుద్ధం

అశ్వథ్థామ విల్లందుకుని అర్జునిని గాండీవంలోని అల్లెత్రాటిని కొట్టాడు. అల్లెత్రాటిని బిగిస్తున్న అర్జునినిపై అశ్వథ్థామ ఎనిమిది బాణాలు ప్రయోగం చేసాడు. అర్జునుడు అల్లెత్రాటిని బిగించి అశ్వథ్థామ బాణాలను మధ్యలోనే త్రుంచాడు. అశ్వథ్థామపై అర్జునుడు శరపరంర సంధించాడు. అశ్వథామకు అర్జునిలా అక్షయతుణీరం లేదు కనుక అర్జునిపై బాణప్రయోగం చేయలేక పోయాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వథ్థామకు సాయంగా వచ్చాడు. అర్జునుడు కృపాచార్యునిపై బాణప్రయోగం చేసాడు. కృపాచార్యుడు విజృంభించి అర్జుని కపిధ్వజాన్ని కొట్టి జయధానాలు చేసాడు. అర్జునుడు కోపించి కృపాచార్యుని రధాన్ని విరగకొట్టి, గుర్రాలను చంపాడు. విరధుడైన కృపాచార్యుడు ధైర్యంగా శక్తి ఆయుధాన్ని అర్జునినిపై విసిరాడు. అర్జునుడు శక్తి ఆయుధాన్ని ముక్కలు చేసాడు. కృపుడు చేసేది లేక కత్తిడాలు తీసుకుని అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృపుని కత్తి విరిచాడు. కృపుడు అశ్వథ్థామ రధం ఎక్కాడు.

కురుసేనలను ఛేదిస్తూ అర్జునుడు భీష్మునితో తలపడుట

కృపాచార్యునికి పట్టిన గతి చూసి కురు సేనలు భీష్ముని వెనుక చేరాయి. ఇది చూసి వృషసేనుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు బల్లెం తీసుకుని వృషసేనుని విల్లు విరిచి అతని గొడెలపై పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు పారి పోయాడు. పక్కనే ఉన్న దుర్ముఖుడు, వివిశంతి, దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని ఒక్క సారిగా అర్జునిని చుట్టుముట్టారు. అర్జునుడు వారి రధాలను, విల్లును విరిచాడు. అర్జునిని ధాటికి తాళ లేక వారంతా పారిపోయారు. అర్జునుడు " ఉత్తరకుమారా! ఇక మా తాతగారైన భీముడు మాత్రమే మిగిలి ఉన్నాడు. తాళవృక్ష కేతనమున్న భీష్ముని వైపు రధాన్ని పోనిమ్ము " అన్నాడు. ఉత్తరుడు భీష్ముని వైపు రధం పోనిచ్చాడు. అర్జునుని చూసి భీష్ముడు శంఖం పూరించాడు. రెండు వృషభముల వలె వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. భీష్ముడు బాణాలతో కపిధ్వజాన్ని, దాని వెంట ఉన్న భూతములను, రధసారధిని కొట్టాడు. ఆ బాణముల్సన్నిటిని మధ్యలోనే అర్జునుడు తుంచేసాడు. అర్జునుడు తన బాణాలతో భీష్ముని కప్పాడు. అర్జునుడువేసే ప్రతి బాణాన్ని భీష్ముడు తునాతునకలు చేసాడు. అర్జునుడు తన అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తుంటే వారు బాగున్నాయి ఇంకా చూపించు అన్నట్లుంది వారి యుద్ధం. అర్జునుడు కోపించి తాతా విల్లు విరుగకొట్టాడు. తాతగారికి కోపం వచ్చి మనుమడిపై శరపరంపరను కురిపించారు. అర్జునుడు తాతగారి బాణాలను అన్నీ తుంచి భీష్ముని ఆయన రధాన్ని, సారధిని, గుర్రాలను కొట్టాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకునే లోపు అర్జునుడు భీష్ముని గుండెలపై కొట్టాడు. భీష్ముడు రధంపై సోలి పోయాడు. సారధి రధాన్ని పక్కకు తొలిగించాడు.

అర్జునుడు సుయోధనుని ఎదుర్కొనుట

అర్జునుడు ఎవరు మిగిలి ఉన్నారా అని చూడగా అక్కడ కర్ణుడు, ద్రోణుడు, కృపుడు నిలబడి ఉండటం చూసి అర్జునుడు " ఉత్తరకుమారా! రధాన్ని వారి వైపు పోనివ్వు " అన్నాడు. అర్జునుడు తమవైపు రావ్సడం చూసి అశ్వథ్థామ " కర్ణా! అర్జునుడు మన వైపు వస్తున్నాడు. అతనిని ఎదుర్కొని ఓడించగలిగిన సమర్ధుడవు నువ్వే " అని కర్ణుని పరహాసంగా ముందుకు తోసాడు. కర్ణుడు " నేను ఇప్పుడే అర్జునిని ఎదుర్కొంటాను చూడు " అన్నాడు. అర్జునుడు కౌరవ వీరులందరినీ మట్టికరిపించాడు. ఒక్కొక్కరే వారంతా అలసి పోయి తొలగి పోయారు. ఇక్కడ ఉత్తరకుమారుని పరిస్థితి అలాగే ఉంది అతడు అర్జునితో " అర్జునా! నీవేమో అలుపు లేకుండా యుద్ధం చేస్తున్నావు. నాకు దాహం వేస్తుంది కనీసం నీళ్ళు త్రాగకుండా యుద్ధం చేయడమెలా? ఇక నేను సారధ్యం చేయలేను " అన్నాడు. అర్జునుడు " ఉత్తరకుమారా! ఓపిక పట్టు ఇక సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అభిమాన ధనుడు నాతో యుద్ధానికి సిద్ధం ఔతున్నట్లు ఉంది. రధం నడపడంలో నీకు నేను సాయం చేస్తాను. భయపడకు " అన్నాడు. సుయోధనుని వైపు రధాన్ని నడిపించాడు అర్జునుడు. అర్జునుడు ఆకలిగొన్న పులి వలె సుయోధనునిపై విరుచుకు పడ్డాడు. బదులుగా సుయోధను గుండెలపై రెండు బాణాలు వేసాడు. అర్జునిని నుదిటిపై రెండు బాణాలు వేసాడు సుయోధనుడు. వాటిని సునాయాసంగా విరిచి సుయోధనునుపై శరపరంపరను వేసాడు అర్జునుడు. సుయోధనుకి సాయంగా వికర్ణుడు ఏనుగుమీద ఎక్కి రాగా అర్జునుడు ఏనుగు కుంభ స్థల్సంపై పిడికిలితో కొట్టాడు. ఆదెబ్బకు ఏనుగు కూలబడింది. వికర్ణుడు ఏనుగు మీద నుండి పడి పక్కనే ఉన్న వివిశంతి రధంపై ఎక్కాడు. అర్జునుడు మరలా సుయోధనుని గొడెలను గురి పెట్టి పది బాణాలను వేసాడు. సుయోధనుడు గాయపడ్డాడు. సాయంగా వచ్చి వారందరిని అర్జునుడు గాయపరచగా విధి లేక సుయోధనుడు వెను తిరిగాడు. అర్జునుడు సుయోధనుని తరిమాడు. అది చూసి కర్ణుడు భీష్మునితో " అర్జునుడు తరుముకొస్తుండగా సుయోధనుడు పారి పోతున్నాడు. మనం అతనిని కాపాడాలి " అన్నాడు. కర్ణిని మాటలను భీష్మ ద్రోణ, కృపాచార్యులు లెక్క చెయ్య లేదు. సుయోధనుడు దీనంగా " అదేమిటి ఇలా ఒంటరిగా రాజైన నన్ను వదిలి పోవడం ధర్మమా? రాజైన నేను పరాజయం చెందుతున్నప్పుడు నన్ను ఆదుకోవడం మీ ధర్మం కాదా? " అన్నాడు. అందరూ సుయోధనుని మాటలకు ఆగారు. భీష్ముడు సుయోధనుని ఓదార్చాడు. అర్జునుడు సుయోధనుని చూసి " ఏమిటి సుయోధనా అలా పారి పోతున్నావు. ఇది క్షత్రియ ధర్మమా? నేను ఒక్కడిని కుంతీ పుత్రులలో చిన్న వాడిని ఒంటరిని నీవో గాంధారి పుత్రులలో అగ్రజుడవు అపార సేనా వాహినితో వచ్చావు మితులు సాయం ఉన్నారు ఇలాంటి నీవు ఇలా పారిపోతే సాటి వారు ఎగతాళి చేయరా? కౌరవేశ్వరా ఇక నీవు హస్థినా పురంలో ఏనుగు మీద ఎలా ఊరేగగలవు. మణిమయ భూషణములు ధరించి నిండు సభలో ఎలా సింహాసనాధిష్టుడివి కాగలవు? కర్పూర చందన సుగంధ ద్రవ్యాలను సేవిస్తూ భోగభాగ్యములను ఎలా అనుభవించగలవు? సుందరీ మణులతో ఎలా క్రీడించగలవు? సుయోధనా నా మాట విను యుద్ధమున మరణిస్తే స్వర్గ సుఖాలు గెలిస్తే ఇహలోక సుఖాలు అనుభవించవచ్చు కాని వెను తిరిగి పారిపోవండం తగునా? ఇది రణరంగం జూదం ఆడి గెలుచుట సాధ్యం కాదు. నీలాటి రారాజు పారిపోవడమేమిటి చీ సిగ్గుగా లేదా? " అని అధిక్షేపించాడు.

అర్జునుని సమ్మోహనాస్త్ర ప్రయోగము

ఈ మాటలు విన్న సుయోధనుడు రోషంతో భీష్మద్రోణ కృపాచార్యులను యుద్ధసన్నద్ధులను చేసి ఒక్కసారిగా అర్జునిని మీద దాడి చేసాడు. వారంతా సుయోధనుని రక్షిస్తూ అర్జునినితో యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు సారధిని కాపాడుకుంటూ వారందిరితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు మనసులో " సుయోధనుని ఇప్పుడు చంపడం భావ్యం కాదు అది భీమసేనుని ప్రతిజ్ఞ. కువీరులందరితో యుద్ధం చేయడమైంది. ఇక వీరోచితంగా తప్పుకోవడం ఉచితం. ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు తీసుకు వెళ్ళాలి. కురువీరుల తలపాగాలు పట్టుకెళ్ళడం అంటే వారందరిని జయించినట్లే. అందుకని కుబేరుడిచ్చిన సమ్మోహనాస్త్రాన్ని వీరిపై ప్రయోగిస్తాను " అనుకుని కురుసైన్యంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్ర ప్రభావానికి కురు సైన్యమంతా నిస్తేజంగా పడి పోయింది. ఆ అస్త్రానికి అధి దేవత ఇంద్రుడు. అర్జునుడు " ఉత్తరకుమారా! కౌరవులంతా స్పృహతప్పి పడిపోయారు. నీవు పోయి సుయోధనుడు, అశ్వథ్థామ, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణాది వీరుల తపాగాలు తీసుకురా. భీష్ముని జోలికి మాత్రం పోవద్దు. అతడిని ఈ అస్త్రం ఏమాత్రం ప్రభావితం చేయజాలదు అతడు నిద్ర నటిస్తున్నాడంతే " అన్నాడు.ఉత్తరకుమారుడు అర్జునుడు చెప్పినట్లే తపాగాలు తీసుకుని రధం ఎక్కాడు. ఉత్తరకుమారునితో చెప్పి అర్జునుడు రధాన్ని కొంచందూరం యుద్ధరంలో నుండి తీసుకు పోయి ఆగాడు. ఇంతలో కురువీరులందరికి తెలివి వచ్చింది. సుయోధనుడు అర్జునినితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. భీష్ముడు " సుయోధనా! జరిగినది నీవు ఎరుగవు. మీరంతాస్త్రప్రభావానికి తెలివి తప్పారు అర్జునుడు మీ తలపాగాలు మాత్రమే తీసుకు వెళ్ళాడు. మీ తలలు నరికి తీసుకు వెళితే ఏమయ్యేది అర్జునిని కరుణ నిన్ను రక్షించింది. తిరిగి యుద్ధానికి సిద్ధం అయితే పూర్ణాహుతి ఇప్పుడే జరుగుతుంది. విడిపించిన గోవులు విరాటనగరానికి చేరాయి.జరిగినది చాలు వెనుకకు మరలుము " అన్నాడు. ఆ మాటలకు సుయోధనుడు నిట్టూర్ఛాడు. అర్జునిని వదలాలని లేకున్నా తాతాగారి మాటకు తలవంచాడు. కురుసైన్యం కూడా సుయోధనిని అర్జునుని బారి నుండి రక్షించాలంటే యుద్ధ విరమణ మంచిది అనుకున్నారు. కురు సైన్యం వెనుతిరిగింది.

అర్జునుడు కురుసేనకు వీడ్కోలు పలుకుట

ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జునుడు దేవదత్తం పూరించాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించాడు. ఒక్క బాణంతో సుయోధనుని కిరీటంలోని మణులను ఊడగొట్టాడు. ఇక నేను పోయివస్తానని పెద్దగా అరచి చెప్పాడు. ఉత్తరకుమారుని చూసి " కుమారా! మనం కురుసేనను జయించాము, గోవులను మరలించాము, ఉత్తరకుమారికి బొమ్మపొత్తికలు సేకరించాము ఇక రాజధానికి మరలి వెడతాము " అన్నాడు.ఉత్తరుడు రధాన్ని వెనుకకు మరల్చాడు.అర్జునుడు " కుమారా! కురుసేనలను నీవే జయించావని చెప్పు " అన్నాడు. ఊత్తరుడు నవ్వి " అర్జునా! కురుసేనలను నేను జయించలేనని అక్కడవారందరికి తెలుసు. నిజం దాచడం కష్టం కాని నీ మాట కాదనలేను. నీవు చెప్పమన్నప్పుడే నిజం చెప్తాను " అన్నాడు. రధం శమీవృక్షాన్ని చేరుకుంది. గాండీవం మొదలైన ఆయుధాలను తిరిగి శమీవృక్షం మీద దాచారు. అర్జునుడు బృహన్నల వేషం ధరించి సారధ్యం చేపట్టాడు. ఉత్తరుడు రధాన్ని అధిరోహించాడు. అర్జునుడు " కుమారా! మన విజయ వార్తను ముందొగా వెళ్ళి విరాటునికి తెలుపమని గోపాలురకు చెప్పు " అన్నాడు. వార్తాహరులు అలాగే వెళ్ళారు.

విజయవార్తను విరాటునికి తెలుపుట

దక్షిణగోగ్రహణంలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన విరాటుని ఉత్తర గోగ్రహణం విషయం కలవరపరచింది. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణాది మహా వీరులతో దండెత్తి వచ్చిన సుయోధనుని ఎదిరించడానికి బృహన్నల సారధ్యంలో వెళ్ళిన ఉత్తరుని తలచుకుని పరితపించాడు. వెంటనే సేనలను ఉత్తరకుమారునికి సహాయంగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఉత్తరకుమారుని క్షేమం తెలుసుకుని రమ్మని వార్తాహరులను పొమ్మని ఆజ్ఞాపించాడు. అంతలో అక్కడకు వచ్చిన వార్తాహరులు ఉత్తరకుమారుని విజయవార్త చేరవేసారు. విరాటుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కళ్ళవెంట ఆనంద బాష్పాలు రాలాయి. "ఏమి మన ఉత్తరుడు కురుసైన్యాలను గెలిచాడా. వెంటనే నగరమంతా చాటింపు వేయించండి. సువాసినులను, బ్రాహమణులను ఉత్తరునికి స్వాగతం చెప్పటానికి పంపండి " అని విరాటుడు ఉత్సాహంగా చెప్పాడు. కంకుభట్టుని చూసి " కంకా! ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడదామా " అన్నాడు. ధర్మరాజు " మహారాజా! తమరు ఆనందంలో ఉన్నారు. నేను ఈ రోజు మీతో ఆడి గెలవగలనా " అన్నాడు. విరాటుడు పెద్దగా నవ్వి " సైరంధ్రీ! పాచికలు తీసుకురా " అని అక్కడ ఉన్న ద్రౌపదిని ఆజ్ఞాపించాడు. ఆట ప్రారంభం అయింది విరాటుడు ధర్మరాజుతో " కంకా! అశేషమైన కురుసైన్యాలను జయించి నా కుమారుడు మా వంశ ప్రతిష్ఠ కాపాడాడు. అతని బాహుబలం ఎంత గొప్పదో కదా " అన్నాడు. ధర్మరాజు " సుయోధన, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణులతో కూడిన కురు సైన్యాలను జయించి గోవులను మరల్చాడంటే అతను లోక ప్రసిద్ధుడు కదా " అన్నాడు. విరాటుడు ఆ మాటలకు ఆగ్రహించి " కంకుభట్టా! నా కుమారుని విజయాన్ని సందేహిస్తున్నావా? ఇంత వరకు నీవు ఏమి మాట్లాడినా సహించాను ఇక మీదట అలా కాదు " అన్నాడు. కాని కంకుభట్టు అంతంటితో వదల లేదు " ఒక్క కౌరవ సేనే కాదు. దేవతలు, రాక్షసులు కలసి వచ్చినా బృహన్నల రధ సారధ్యం వహిస్తుండగా ఊత్తరుని జయించడం ఎవరికి సాధ్యం కాదు " అన్నాడు. విరాటుడు కోపం పట్ట లేక పోయాడు " కంకూ! ఇక చాలు నీవు ఎన్నో వింతలు చెప్పగా విన్నాను. ఒక పేడి అదియూ సారధి శత్రువులను జయించడమా! నా కుమారుని విజయాన్ని ఎందుకు అంగీకరించవు. ఇక నీ మూర్ఖపు మాటలు కట్టి పెట్టు విప్రుడా " అన్నాడు. కాని ధర్మరాజు ఆపకుండా " అవును విరాటరాజా! బృహన్నలకు యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉంటుంది. ఉత్తరుని సారద్ఝిగా చేసి కౌరవసేనను జయించి గోవులను మరలించాడు. నా మాట అసత్యం కాదు. బృహన్నల విజయవార్తను నగరంలో చాటించు " అన్నాడు. విరాటుడిక ఆగలేక " ఆ పేడిని నా ముందు పొగుడుతావా " అంటూ పాచికలను ధర్మరాజుపై విసిరాడు. అందులో ఒక పాచిక ధర్త్మరాజు నుదిటిపై బడి గాయం చేసింది. ధర్మరాజు అక్కడే నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి తల వంచాడు. ద్రౌపది వెంటనే పరుగున వచ్చి ధర్మరాజు నుదిటి మీద స్రవిస్తున్న రక్తాన్ని తన పైట కొంగుతో అదిమింది. పక్కనే బంగారు కలశంలో ఉన్న నీటితో తన పైట తడిపి తుడిచింది. ఇదిచూసి విరాటుడు " సైరంధ్రీ! అతని రక్తం నేలపై పడకుండా అలా తుడుస్తున్నావేంటి అన్నాడు. " మహారాజా! ఉన్నత వంశ సంజాతుడైన ఈ బ్రాహ్మణుని రక్తం ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని రోజులు ఈ దేశంలో వర్షాలు పడవు. మన దేశానికి కలుగబోయే కీడుని నివారించడానికే అలా చేసాను " అన్నది సైరంధ్రి.

ఉత్తరకుమారునికి నగరం స్వాగతం పలుకుట

ఉత్తరకుమారుని విజానికి ఆనందపడి ఉత్తర తన చెలికత్తెలతో అన్నయ్యకు ఎదురు వెళ్ళి వారిరువురి మీద చందనం, కుంకుమ, పూవులు చల్లి స్వాగతం పలికింది. మిగిలిన వారు కూడా ఊత్తరునికి ప్రంశల జల్లు గురిపించారు. ఉత్తర కుమారునికి ప్రశంశలకు తట్టుకోలేక బృహన్నల సహకారంతో ఈ విజయం సాధించానని నర్మగర్భంగా చెప్పాడు. ఇంతలో ఊత్తర కుమారుడు విజయుడై వస్తున్నాడన్న వార్త విరాటునికి చేరింది. విరాటుడు ఆనందంగా వారిని రమ్మని చెప్పమని సేవకులను ఆజ్ఞాపించాడు. ఊత్తర కుమారుడు తండ్రికి నమస్కరించాడు. పక్కనే ఉన్న కంకుభట్టును చూసి నమస్కరించాడు. కంకుభట్టు నుదుటి మీద గాయాన్ని చూసి ఎలా జరిగిందని అడిగాడు. విరాటుడు " నేను నీ విజయాన్ని పొగుడుతుంటే విజయం నీది కాదు బృహన్నలది అన్నాడు. అందుకని నాకు కోపం వచ్చి పాచికలు విసిరాను. కంకుభట్టుకు గాయ్సం అయ్యింది " అన్నాడు ఉత్తరునితో. ఊత్తరుడు తండ్రితో " తండ్రీ మహాపరాధం చేసారు. ఇలాంటి మహాత్ములను అగౌరవపరిస్తే మనకు ఆయువు, ఐశ్వైర్యం క్షీణిస్తాయి. ముందు వారిని క్షమాపణ అడగండి " అన్నాడు. విరాటుడు కుమారుని మాట పాటించి కంకుభట్టును క్షమాపణ కోరాడు. కంకుభట్టు నవ్వి ఉత్తరకుమారునితో " అసలు నాకు కోపమే రాలేఉ. ఇక క్షమాపణలతో పని ఏమి. విరాటుడు ఉత్తముడు. ఏదో చెడు ఘాడియలో అలాచేసాడు " అన్నాడు. విరాటుని మనస్సు కుదుట పడింది.

విరాటుడు ఊత్తరకుమారుని వద్ద యొద్ధవిశేషాలు వినకోరుట

విరాటుడు కుమారుని చూసి " కుమారా భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్యుల వంటి మహారషులున్న సుయోధన సైన్యాలను నువ్వు ఒక్కడివే ఎలా గెలిచావు. ఒక్కడు పరశురాముని గెలిచిన వాడు. ఒకడు శివుని వరాన పుట్టిన వాడు. ఒకడు అర్జునినికి యుద్ధ విద్యలు నేర్పిన ఆచార్యుడు. దృతరాష్ట్ర కుమారులు ఒక్కొక్కరు ఈ భూమిని గెలువగల సమర్ధులు. అలాంటి వారిని నీవు ఒక్కడివే ఒక్క గాయం కూడా పడకుండా ఎలా గెలిచావు ఆవులను ఎలా మరలించావు. ఒక్కరిని కొడితే పది మంది చుట్టుముడుతారు కదా. సుయోధనుడిని ఎలా పలాయనం చేయించావు. వినాలని కుతూహలంగా ఉంది చెప్పు " అన్నాడు. అత్తరుడు " తండ్రీ! కౌరవ సేనలను నేను గెలవ లేదు, గోవులను నేను మరల్చ లేదు. దైవాధీనంగా ఒక దైవాంశ సంభూతుడు వచ్చి కౌరవ సేనలను గెలిచి గోవులను మరల్చి సుయోధనుని పలాయన గతుని చేసాడు. అసలు యుద్ధం ఎలా జరిగిందో చెబుతాను వినండి " అని ఉత్తరుడు చెప్పనారంభించాడు. " బృహన్నలను సారధిగా చేసి నేను యుద్ధానికి వెళ్ళాను. కురు సేనలను చూడగానే నాకు కాళ్ళు చేతులు ఒణకసాగాయి. రధం దిగి పోయాను అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి నాకు ధైర్యం చెప్పి నన్ను సారధిగా చేసి కౌరవ సేనలను ఓడించి గోవులను మరలించాడు. సుయోధనుని అడ్డగించి అతనితో ఘోరంగా పోరాడాడు. కౌరవ సేనలను చిత్తు చేసాడు. కర్ణుని తమ్ముని చంపాడు. భీష్మునిపై బాణ ప్రయోగం చేసాడు. ద్రోణుని ఎదిరించాడు. రణ రంగంలో వీరవిహారం చేసాడు " అని చెప్పాడు. విరాటుడు ఆ మహాను భావుని చూపించమని అడుగగా ఉత్తరుడు అతడు అంతర్ధాన మయ్యాడని నేడో రేపో కనపడగలడని చెప్పాడు. కంకు భట్టు తన గాయాన్ని బృహన్నల చూడకుండా ఊత్తరీయాన్ని గాయంపై కప్పుకుంటూ జాగ్రత్త పడుతూ అంతా అర్జునిని పరాక్రమే అని ఆనంద పడ్డాడు.

ధర్మజుని మందిరంలో పాడవుల ద్రౌపది సహిత సమావేశం

బృహన్నల ఉత్తరుని సమయస్పూర్తికి మెచ్చుకున్నాడు. వారిరువురు సుధేష్ణ వద్దకు వెళ్ళి ఆమె ఆశీర్వాదం పొందారు.ఊత్తర కొరకు నర్తన్సశాలకు వెళ్ళారు. ఉత్తరుడు బొమ్మపొత్తికలను ఉత్తరకు ఇచ్చాడు. ఆమె అన్నయ్య పరాక్రమానికి మురిసి పోయింది. ఆ తరవాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి ధర్మరాజు మందిరంలో రహస్యంగా సమావేశమయ్యారు. అర్జునుడు జరిగినదంతా చెప్పాడు. తల వంచుకుని ఉన్న ధర్మజుని చూసి భీమునితో అర్జునుడు అన్నయ్య నావైపు ఎందుకు చూడటం లేదని అడిగాడు. ఇక దాచడం కుదరదని ధర్మరాజు " అర్జునా! విరాటుడు తన కుమారుని పొగుడుతుంటే నేను బృహన్నల ఉండగా ఊత్తరుడు విజయం సాధించడం లో విశేషమేమిటని అన్నాను. విరాటుడు కోపించి ఒక పేడిని పొగుడుతావా అని వివేకం నశించి పాచికలు నాపై విసిరాడు. నాకు చిన్న గాయం అయింది " అన్నాడు. ఆమాటలకు భీముడు ఉగ్రుడై " ఆ దురాత్ముని సకుంటుంబంగా యమపురికి పంపి వాని రాజ్యం మనం కైవశం చేసుకుంటాము " అన్నాడు. ధర్మరాజు వారిరువురిని వారించి " కష్టకాలంలో మనకు ఆశ్రయం ఇచ్చిన విరాటుని చంపడం భావ్యము కాదు. అతని పట్ల మనం కృతజ్ఞత మాత్రమే చూపాలి. మనమెవ్వరమో అతనికి వివరిస్తాము. ఆతరవాత కూడా అతడు మనపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే అప్పుడు మీ ఇష్టం అన్నాడు.

పాండవులు తమను తాము బహిరంగ పరచుకొనుట

మరునాటి ఉదయం పాండవులు ద్రౌపది తమ నిజరూపాలు తెలిసేలా వస్త్రధారణ చేసి సభా ప్రవేశం చేసారు. ధర్మరాజు విరాటుని సింహాసనాన్ని అధిష్టించాడు. విరాటుడు కొలువుకు రాగానే సింహాసనంపై కూర్చున్న ధర్మరాజుని చూసి " ఏమిటిది కంకా మా సింహాసనం అధిష్టించింది చాలక మమ్ములను చూసి కూడా లేవకుండా కూర్చున్నాను ఇంతటి అహంకారమా? " అన్నాడు. అర్జునుడు " విరాటా! ఈయన ధర్మరాజు ఎంతో మంది సామంతులను కను సన్నలతో శాసంచగల చక్రవర్తి. భూమిని నాలుగు చెరగులా జయించి రాజసూయాన్ని నిర్వహించిన మహాను భావుడు. అజాతశత్రువు, సత్యవ్రతుడు, ధర్మమూర్తి అయిన ఇతడు దేంద్రుని సింహాసనాన్ని అధిష్టించడానికి కూడా అర్హుడు నీ ఇంత చిన్న సింహాసనాన్ని అధిష్టించడానికి తగడా? " అన్నాడు. అది విన్న విరాటునికి ఆశ్చర్యం, ఆనందం, అనుమానం ఒకేసారి కలిగింది. " మరి ఈయన ధర్మరాజైతే మిగిలిన వారు ఎవరు. ద్రౌపది ఎక్కడ? " అని అడిగాడు. అర్జునుడు " మహారాజా! ఇప్పటి వరకు నీ వంట శాలలో రుచికరమైన వంటలు చేసి, మల్లయుద్ధాలు చేసి నిన్ను మెప్పించిన వలలుడే భీముడు. అతడు బకాసురుడు, కిమ్మీరులను వదించిన బలశాలి. నీ అశ్వశాలలో అశ్వాలను రక్షిస్తూ నిన్ను సేవించే తంత్రీ పాలుడే మాతల్లి మాద్రి పెద్ద కుమారుడు నకులుడు. గోశాలలో గోవులను కాపాడుతూ సేవిస్తున్న దామ్రగంధి మాద్రి చిన్న కుమారుడు సహదేవుడు. అంతఃపురంలో సైరంధ్రిగా సుధేష్ణను సేవించే మాలినియే ద్రౌపది. ఆమెను అవమానించినందుకే భీముడు కీచకుని, ఉపకీచకుని వధించాడు " అనగాగానే భీముడు అందుకుని " నర్తనశాలలో అంతఃపురకామ్టలకు నాట్యం నేర్పే బృహన్నల అర్జునుడు. ఇంద్రలోకంలో ఊర్వశి ఇచ్చిన శాపం అర్జునినికి ఇలజ్ఞాతవాస సమయంలో సహాయపడింది. ఖాండవవనాన్ని దహించి ఇంద్రుని జయించిన మహా వీరుడు. కాలకేయులను చంపిన ఘనుడు. అతడే " అన్నాడు. ఇదంతా కలా నిజమా అని విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలుచున్న సమయంలో ఊత్తరకుమారుడు " అవును తండ్రీ! నేను చెప్పిన దైవాంశ సంభూతుడు ఇతడే. భయంతో వణుకుతున్న నాకు ధైర్యం చెప్పి యుద్ధం చేసి మనలను గెలిపించిన దివ్యపురుషుడు ఇతడే.

ఉత్తరకుమారుడు అర్జునిని గురించి వర్ణించుట

అంత ఘోరయుద్ధం నేను ఇంతవరకు చూడ లేదు. రధాన్ని నడపటానికి కూడా నడపలేకపోయిన నాకు ధైర్యం చెప్పి కురు సైన్యాలను చిత్తు చేసిన మహా వీరుడు. అతని అభ్యర్ధన వలన నేను నిన్న ఇతని పేరు వెల్లడించ లేదు. విరాటుడు పరవశించి పోయాడు. అర్జునిని గట్టిగా కౌగలించుకున్నాడు. ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. భీమ నకుల సహదేవులను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. అర్జునుడు తన తమ్ములను ఉత్తర కుమారునికి పరిచయం చేసాడు. విరాటుడు తన తమ్ములను, కుమారులను, మంత్రులను పాండవుల దర్శనానినికి పిలిపించాడు. ద్రౌపదిని గురించి చెప్పి తగురీతిన గౌరవించమని సుధేషణకు వర్తమానం పంపాడు. అర్జునుడు " విరాటరాజా! దుస్తరమైన అజ్ఞాతవాసాన్ని మీతో నిర్భయంగా గడిపాము " అన్నాడు. విరాటుడు " అర్జునా! నేను పరాయి వాడినా. మీ అజ్ఞాతవాసం మా వద్ద గడపటం నా పూర్వజన్మ సుకృతం. ఇక ఈ మత్స్యదేశం మీది. మేమంతా మిమ్మలిని సేవించుకుంటాము. కౌరవుల మీదికి దండెత్తి రావలసి వస్తే మేము మీతో యుద్ధం చేస్తాము " అన్నాడు. ఉత్తరుడు " అదేమిటి తండ్రీ మన్స్కంటూ ఒక రాజ్య్సం ఉందా? కౌరవులతో యుద్ధం చేసి మనలను గెలిపించి మన రాజ్యాన్ని గెలిపించింది వీరే కదా. ఇక ఇది వీరి రాజ్యం. వారి రాజ్యం వారికి ఇవ్వడం హాస్యాస్పదం కాదా. ఇంత కాలం నివురు కప్పిన నిప్పులా ఉన్న వీరిని మనం కూడా అవమానించి అనరాని మాటలన్నాం. వీరిని క్షమాపణ అడగడం మన ధర్మం. ఈ సంపద ఈ సామ్రాజ్యం వీరిదే కనుక వీరికి కానుక ఇవ్వాలంటే ఊత్తరకుమారిని పిలిపించండి " అని తండ్రితో చెప్పాడు.

అర్జునుడు విరాటునితో వియ్యమందుటకు అంగీకరించుట

ఉత్తరకుమారుని పలుకులు విన్న విరాటుడు ఉత్తరను తీసకురమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. వారు సుధేష్ణ అనుమతితో ఉత్తరను సర్వాలంకార భూషితను చేసి తీసుకు వచ్చారు. ఉత్తరకు ఎదురు వెళ్ళి విరాటుడు ఆమను చేయి పట్టి ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చి ధర్మరాజుతో " ధర్మరాజా! అజ్ఞానంతో నీ పట్ల చేసిన అపరాధాలు మన్నించి మమ్ము క్షమించమని ప్రార్ధిస్తును. మీతో బంధుత్వం మాకెంతో శ్రేయస్కరం మా కుమార్తె ఉత్తరను అర్జునునికిచ్చి వవాహం చేయడం మాకు సమ్మతం. మీ అంగీకారం తెలుపితే ఆనందం " అన్నాడు. ఇదంతా గమనిస్తున్న అర్జునుడు ధర్మరాజు వైపు చూసి అతని చూపులలో అర్ధం గ్రహించి విరాటునితో " విరాటరాజా! నేను ఉత్తరకు గురువును గ్రువు తండ్రితో సమానం. కాబట్టి ఈమెను కోడలిగా స్వీకరిస్తాను. నా కుమారుడు అభిమన్యుడికిచ్చి వవాహం చెయ్యండి. అభిమన్యుడు శ్రీకృష్ణుని మేనల్లుడు సుభద్ర కుమారుడు సఒందర్యవంతుడు, విద్యావంతుడు, బాహుబలం కలిగిన వీరుడు, ఉదారుడు, శర్యపరాక్రమం కలిగిన వాడు, గుణవంతుడు, పెద్దలమన్నలను పొందిన వాడు " అని కుమారుని గుణగణాలను వివరించాడు. ఆ మాటలకు విరాటుడు సంతోషించాడు. " అర్జునా నీతో వియ్యమందడం కంటే కావలసినదేముంది. అన్నగారు కార్య నిర్ణయం చేసి చెపితే దానిని మేము ఆచరిస్తాము " అన్నాడు. ధర్మరాజు " అర్జునుడు మాట్లాడినది ఎంతో సముచితంగా ఉంది. ఇది నాకు సమ్మతమే. మన బందుమిత్రులకు ఈ విషయం తెలియచేయండి " అన్నాడు. విరాటుడు మీ కురువంశంతో వియ్యమందడంతో మా మత్స్యదేశం పావనం అయింది అని ఉత్తరకుమారిచే భీమ, అర్జున, నకులసహహదేవులకు ప్రణామము చేయించాడు. వారాంతా ఉత్తరను మనసారా దీవించారు. ఉత్తరకుమారి అంతఃపురానికి వెళ్ళింది. పురోహితులను పిలిపించి సుమూహూర్తం నిర్ణయించారు. ఇరు పక్షాలవారికి వివాహఆహ్వాన పత్రిక పంపించారు. ధర్మరాజు విరాటుని కౌగలించుకుని " విరాటా! అజ్ఞాతవాస సమయంలో మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. మాకు శ్రీకృష్ణుడెంతో ఇకపై మీరూ అంతే " అని అభినందనలు తెలిపాడు.

సుయోధనుని సందేహం

విరాటరాజు కొలువులో పెళ్ళి సంరంభం జరుగుతుండగా హషినకు తిరిగి వెళుతున్న సుయోధనునికి ఇంకా సందేహం నివృత్తి కాలేదు. అతనికి కర్ణుడు, శక్లుని మాటల మీద ఉన్న నమ్మకం భీష్మునిని పలుకులపై లేదు. సందేహ నివృత్తి కొరకు ధర్మరాజు వద్దకు ఒక దూతను పంపి " ధర్మరాజా! మీ అజ్ఞాతవాసం ముగియక ముందే అర్జునుడు బయట పడ్డాడు. నీవు లెక్క చూసి ఏది ఉచితమో అది చెయ్యి " అని చెప్పించాడు. ఆ మాటలలో ఉన్న అంతరార్ధం గ్రహించి ధర్మరాజు నవ్వి " మేము సమ్మతించినట్లు పదమూడు సంవత్సరాలు నిండాయి. ఇది నిజం ఈ మాట నీవు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వింటుండగా సుయోధనునికి తెలియ చెయ్యి " అని దూతతో చెప్పాడు. దూత ఆవిషయాన్ని అలానే చెప్పాడు. సుయోధనుడు తాను దూతను పంపిన విషయం దాచి " తాతాగారూ, ఆచార్యా! మనం మోసపోయి అనవసరంగా అర్జునినితో యుద్ధం చేసాము. అర్జునుడు పదమూడేళ్ళు నిండిన తరవాత బయటకు వచ్చాడా లేదా అన్న విషయం మనం సరిగా విచారించ లేదు " అన్నాడు. భీష్ముడు " సుయోధనా! జరిగింది చాలు ప్రతిజ్ఞా భంగం కాలేదు నీ మాటకు ఇక కట్టి పెట్టు ఎవరైనా వింటే నవ్వగలరు. మారు మాటాడక హస్థినకు పద " అన్నాడు. చేసేది లేక సుయోధనుడు హష్తినకు మరలి వెళ్ళాడు.

పాండవులు ఉపప్లావం చేరుట బంధుమిత్రుల రాక

పాండవులు శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి ఆయుధాలకు తగినట్లు పూజించి తమ వెంట తీసుకు వెళ్ళారు. పాడవులు అంతా ఊపప్లావ్యం చేరుకున్నారు. విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుక్సలు సమర్పించారు. విరాటుడు కలిగించిన సౌకర్యాలతో పాండవులు ఉపప్లావ్యంలో సుఖంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు

ఉత్తరాభిమన్యుల వివాహం