వాడుకరి చర్చ:Nagaraju raveender
Nagaraju raveender గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (nowiki~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao-చర్చ 17:12, 27 ఫిబ్రవరి 2009 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 21
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
తెలుగు పద్యాలు వ్యాసం
[మార్చు]నాగరాజు గారూ! నమస్తే. మీకు పద్యాల మీద మంచి పట్టు ఉన్నట్టున్నది, అలాగే పద్యాల మీద మంచి మమకారం ఉన్నట్టున్నది. వ్యాసంలో దయచేసి, తెలుగు పద్యాల లక్షణాలు, పద్యాలలో రకాలు,ఛందోబద్ధమైన పద్యాలు, కొత్త కొత్తగా వస్తున్న ఛందస్సు వాడని పద్యాలు, తెలుగు పద్య ప్రత్యేకత ఇలా ఈ వ్యాసాన్ని విస్తరిస్తే బాగుంటుందని నా సూచన. ఒక సారి ఆలోచించి విస్తరణ మొదలు పెట్టగలరు.--S I V A 16:06, 1 మార్చి 2009 (UTC0
జవాబు: శి వ గారూ ! మీ సూచనకు ధన్యవాదములు.
పద్యాలు గురించి
[మార్చు]నాగరాజు గారూ! మీరు ఉత్సాహంగా రచనలు మొదలు పెట్టడం చాలా సంతోషం. పద్యాలు వ్రాయడం ఆపి ఇతర వ్యాసాలపై దృష్టి సారించమని కోరుతున్నాను. ఎందుకంటే కేవలం "పద్యాలు" వ్యాసాలుగా పరిగణింపబడవు గనుక అవి తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికి మీరు వ్రాసిన పద్యాలను ఇతర వ్యాసాలలో కలుపుతాను. దయచేసి నిరుత్సాహపడకుండా ఇతర విషయాలపై వ్యాసాలు వ్రాయగలరు. ఉదాహరణగా కొన్ని ఇతర వ్యాసాలను మీరు పరిశీలిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఒకమారు తెలుగు సాహిత్యం కూడా చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:03, 1 మార్చి 2009 (UTC)
జ. కాసుబాబు గారూ! మీరిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదములు.
శ్లోకాల గురించి
[మార్చు]శ్లోకం ఒక లైను తరువాత వాడవలసినది ఆశ్చర్యార్ధకం కాదు(!). వాడవలసిన | బాక్‌స్పేసుకు పక్కనే ఉన్న కీని షిప్ట్ నొక్కితే | ఇది వస్తుంది. ఆ తరువాత, శ్లోకాలు వ్యాసంలో మీకు తెలిసిన ఒకటి రెండు శ్లోకాలు ఉదాహరణ గా ఇచ్చి, అసలు శ్లోకం అంటే ఏమిటి, శ్లోక ప్రత్యేకత, సాహిత్యంలో శ్లోక విశిష్టత విషయాలమీద మీ రచనా శక్తిని కేంద్రీకరించమని నా మనవి.--S I V A 16:16, 1 మార్చి 2009 (UTC)
జవాబు : కాసుబాబు గారూ! నేనిప్పుడిప్పుడే ఈ వెబ్ సైట్లోకి ప్రవేశించాను. మీ అమూల్యమైన సలహాలకు ధన్యవాదములు.ఇప్పటి నుండి నేనలాగే చేస్తాను.
మీ కృషి కొనసాగించండి
[మార్చు]నాగరాజు గారు! మీరు పద్యాలు, శ్లోకాలు మాత్రమే కాదు ఏ రంగంలోనైనా మీ కృషిని కొనసాగించవచ్చు. మీకు ఇష్టమైన ఏ వస్తువు గురించి అయీనా, ఏ ప్రాంతం గురించి అయినా, ఏ వ్యక్తి గురించి అయీనా, ఏ రంగంలోనైనా రచనలు చేయవచ్చు. మీ రచనలను సరిదిద్దడానికి, తగు సలహాలు ఇవ్వడానికి కూడా తోటి సభ్యులున్నారు. మీరు ఎలాంటి సంకోచం లేకుండా తెవికీ కృషికి తోడ్పడండి. -- C.Chandra Kanth Rao-చర్చ 15:34, 6 మార్చి 2009 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
- ఇతరులు వ్రాసిన పుస్తకాలు, వ్యాసాలనుండి ఏవైనా వివరాలను తీసుకొన్నప్పుడు ఏం చేయాలి?
నిజానికి వికీలో వ్యాసాలకు స్వంత అభిప్రాయాలకంటే ఇంతకు ముందు ప్రచురించిన విషయాలే సముచితమైనవి. అలాంటి విషయాలు తీసుకొన్నపుడు వాటికి "in-text citation" ఇవ్వడం సరైన పద్ధతి. ఉదాహరణకు మీరు "ఫలాని పుస్తకం, ఫలాని రచయిత" చెప్పిన విషయాలను ఇక్కడ ఉట్టంకిస్తున్నారనుకోండి. అప్పుడు అక్కడ ఇలా వ్రాయాలి
<ref>ఫలాని పుస్తకం, ఫలాని రచయిత</ref>
అప్పుడు ఆ విషయం క్రింద "మూలాలు" సెక్షన్‌లో ఆటొమాటిక్‌గా వస్తుంది. ఉదాహరణగా నేను సౌందర నందము వ్యాసంలో కొన్ని రిఫరెన్సులను చేరుస్తాను. వాటిని పరిశీలించగలరు. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలు మరియు వికీపీడియా:మూలాలను పేర్కొనడం అనే మార్గదర్శక వ్యాసాలు (అసంపూర్ణం) చూడండి.
ఒకవేళ ఇదంతా గందరగోళంగా ఉంటే సింపుల్‌గా వాక్యం ప్రక్కన బ్రాకెట్టులో "(ఫలాని రచయిత, ఫలాని పత్రిక)" అని వ్రాసేయొచ్చు.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:54, 12 మార్చి 2009 (UTC)
గ్రహణం మొర్రి
[మార్చు]గ్రహణం మొర్రి పై ఇప్పటికే ఒక వ్యాసం ఉంది చూడండి --వైజాసత్య 15:56, 14 మార్చి 2009 (UTC)
వర్గంలో వ్యాసంపేరు
[మార్చు]నాగరాజు గారు, ఏదేని వర్గంలో వ్యాసాన్ని చేర్చాలంటే ఆ వ్యాసం చివరన వర్గం పేరు ఉంచాలి. ఉదా.కు వర్గం:వైద్యము లో ఒక వ్యాసం పేరు రావాలంటే [[వర్గం:వైద్యము]] ను వ్యాసం చివరగా ఉంచితే చాలు. మీరు వర్గం:వైద్యములో ఉంచిన [[చీలిక పెదవి]] వర్గాన్ని తొలిగించాను. చీలిక పెదవి వ్యాసంలో [[వర్గం:వైద్యము]] ఉంచితే సరిపోతుంది. వర్గాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు.-- C.Chandra Kanth Rao-చర్చ 16:01, 14 మార్చి 2009 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
- మధ్య మధ్య ఇంగ్లీషు పదాలను ఎలా టైపు చెయ్యాలో కాస్త వివరించండి.
- రవీందర్ గారూ, మీరు దిద్దుబాట్లు చేస్తున్నపుడు తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. ESC - భాషల మధ్య మారడానికి. IEలో ESC తరువాత ctrl+z కూడా నొక్కాలి. అనే పేరుతో ఒక పెట్టె (చెక్ బాక్స్ ) ఉన్నదా?, దానిని టాగుల్ చెయ్యడం(క్లిక్ చెయ్యడం) ద్వారా మధ్య మధ్యలో ఆంగ్లంలో రాయవచ్చు. ఇంకా ఏదైనా సందేహాలుంటే నిస్సందేహంగా అడగండి. రవిచంద్ర(చర్చ) 12:00, 17 మార్చి 2009 (UTC)
రవిచంద్ర గారూ, భాషల మధ్య మారడానికి పైన మీరు చెప్పిన పద్ధతి వికిపీడియాలో పనిచేస్తోంది. కాని విక్షనరీలో పనిచేయడం లేదు. దీనికి వేరే ఏమైన పద్ధతి ఉందా ? ------Nagaraju raveender 17:15, 31 మార్చి 2009 (UTC)
- నాగరాజు గారూ, విక్షనరీలోనూ మీరు ఇదే పద్దతి అనుసరించవచ్చు. ESC, ctrl+z లతో పని కాకుండా మౌజ్‌తో చెక్‌బాక్సులో టిక్కు పెట్టి చూడండి. -- C.Chandra Kanth Rao-చర్చ 17:43, 31 మార్చి 2009 (UTC)
కామన్స్ బొమ్మలు
[మార్చు]వికిపీడియా కామన్స్ లోని బొమ్మలను కాపీ(copy) చేసి నా వ్యాసంలో ఎలా పేస్ట్(paste) చేయాలో తెలియడం లేదు.దయ చేసి వివరించండి. --Nagaraju raveender 10:11, 22 మార్చి 2009 (UTC)
- నాగరాజు గారు, కామన్స్ బొమ్మలను కాపీ చేసే అవసరం లేదు. వాటిని అదే ఫైలు పేరుతో మన తెవికీలో ఉపయాగించవచ్చు. ఉదాహరణకు [[ఫైలు:abcd.jpj|200px|right|thumb|వ్యాఖ్య]] ప్రయత్నించండి. -- C.Chandra Kanth Rao-చర్చ 10:52, 22 మార్చి 2009 (UTC)
- మరింత సమాచారం కొరకు చూడండి వికీపీడియా:వికీమీడియా కామన్స్. -- C.Chandra Kanth Rao-చర్చ 10:57, 22 మార్చి 2009 (UTC)
రజతాక్షి
[మార్చు]రజతాక్షి పక్షి బొమ్మ చాలా బాగుంది. ఇంగ్లీషులో పేరు తెలిపితే దాని గురించి సమాచారాన్ని సేకరించవచ్చును.Rajasekhar1961 14:26, 23 మార్చి 2009 (UTC)
బొమ్మలు
[మార్చు]నాగరాజు గారు, మీరు కేవలం బొమ్మల కొరకు మాత్రమే కొత్త వ్యాసపు పేజీలు సృష్తిస్తున్నారు. అలా చేయకండి. మీరు బొమ్మలు చేర్చాలంటే ఉన్న వ్యాసాలలో మాత్రమే చేర్చండి. లేదంటే బొమ్మతో సహా వ్యాసంలో సమాచారం కూడా చేర్చండి. కేవలం బొమ్మ మాత్రమే ఉన్న పేజీలు తొలిగించబడతాయి. మీ శ్రమ వృధాకావచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 16:52, 23 మార్చి 2009 (UTC)
దారి మార్పు
[మార్చు]నాగరాజు గారు, మీరు కొత్త పేజీ సృష్టించి ఇదివరకు ఉన్న పేజీకి దారి మార్పు ఇవ్వాలంటే #REDIRECT [[వ్యాసం పేరు]] ఉపయోగించండి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:22, 24 మార్చి 2009 (UTC)
శ్రీకాకుళం బొమ్మ
[మార్చు]నాగరాజు గారూ! మీరు శ్రీకాకుళం (ఘంటసాల)లో శ్రీకాకుళం జిల్లా బొమ్మ పెట్టారు. కాని ఈ శ్రీకాకుళం కృష్ణా జిల్లాలో ఉన్నది గదా? సరిచేయగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:50, 26 మార్చి 2009 (UTC)
- పొరపాటును సరిదిద్దాను.--Nagaraju raveender 18:07, 26 మార్చి 2009 (UTC)
అభినందనలు
[మార్చు]నాగరాజు గారూ! ఇటీవల మీరు కూర్చుతున్న వ్యాసాలు చాలా విజ్ఞానదాయకంగా ఉంటున్నాయి. వీటివలన తెలుగు వికీ పరిధి మరింత విస్తృతమౌతున్నది. అభినందనలు. మీ కృషిని ఇలాగే కొనసాగించగలరు.
ఈ వ్యాసాలకు చెందిన కొన్ని బొమ్మలను వికీకామన్స్‌లో అప్‌లోడ్ చేశారు. వాటిని పరిశీలించిన తరువాత కొన్ని వ్యాఖ్యలను మీ దృష్టికి తీసుకురావడం మంచిదనిపింది. అవి మీకు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాను.
(1) I hope you have taken care of giving correct licnse tag in the files you uploaded to wiki commons. for example - thr files of Gond woman, man, priest - they are from a book. You have to take explicit permission from the author before uploading them as free images. Or you should mention that they qualify to be in public domain even without author's permission.
(2) Please give a clear and brief description of the subject of the image in english. For example - "Photograph of a Tribal woman belonging to GOND Tribe. The tribe lives in central India - especially in the borders of Andhra Pradesh and Madhya Pradesh States. Photographed by (person) on (date). Published in the book (Name) by (author). Uploaded by (user) with permission from (person)"
(3) Images of Book covers (Vaithalikulu, Sulakshana Saramu etc.,) do not qualify as "free images". Hence they are most likely to be deleted from wikicommons. It is better to upload them in telugu wiki as "Fair Use Image"
Without such full information and satisfactory copy rights criteria, the images may be deleted from wikicommons by reviewers in future. This will make your effort a wasteful exercise.
మరియు మీకు ఫొటోగ్రఫీలో ఆసక్తి ఉన్నందున నేను వికీపీడియా:రచ్చబండ లో ఎలక్షను బొమ్మల గురించి వ్రాసిన అభ్యర్ధన చూడండి. మీకు వీలైనన్ని ఎలక్షన్ ఫొటోలు కూడా సేకరిస్తారని ఆశిస్తున్నాను
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:08, 3 ఏప్రిల్ 2009 (UTC)
స్వాగతం
[మార్చు]నాగరాజు గారూ! తెలుగు వికీపీడియాకు మరొకసారి స్వాగతం. తెలంగాణాకు సంబంధించిన చాలా ఊర్ల పేర్లలో తప్పులున్నాయి, లేదా అతి కొద్ది సమాచారం మాత్రమే ఉంది. మీరు ఒకసారి తెలంగాణాకు సంబంధించిన వ్యాసాలను రివ్యూ చేయాలని కోరుతున్నాను. δευ దేవా 15:25, 3 ఏప్రిల్ 2009 (UTC)
అభినందనలు
[మార్చు]నాగరాజుగారికి అభినందనలు. మీరు చేరుస్తున్న సమాచారం బాగుంది. కానీ వికీపీడియాలో కొంత సమాచారం ఇదివరకే చేర్చబడినది. ఉదాహరణకు రెడ్ క్రాస్ మీద వ్యాసం ఉండగా మిరు మరొక వ్యాసం చేర్చారు. అలాగే కులాలు మరియు తెగల గురించి నరంతుల్లా ఇది వరకే కొన్నివ్యాసాలు రచించారు. దీనిమూలంగా మీ విలువైన సమయం వృధా అవుతున్నది. అందువలన నా సలహా ఏమంటే మీరు కొత్తపేజీ మొదలుపెట్టే ముందు అక్షరాల సూచీ ప్రకారం అమర్చిన వికీపీడిలా వ్యాసాలను చూసి తర్వాతనే మొదలుపెట్టండి. తెగలు కులాల వ్యాసాలన్నింటినీ వాటికి సంబంధించిన జాబితాలో నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కొత్తవి మొదలుపెట్టండి. ఇప్పటికే డూప్లికేట్ వ్యాసాలను విలీనం చేయండి. మీ శ్రేయోభిలాషిగా ఇదొక సలహా; మరోలా భావించవద్దని మనవి.Rajasekhar1961 10:07, 5 ఏప్రిల్ 2009 (UTC)
- మీ అమూల్యమైన సలహాకు నా ధన్య వాదములు. ఇప్పటినుండి అక్షరాల సూచీ ప్రకారం వ్యాసాలను చూసి తర్వాతనే మొదలుపెడతాను.
వ్యాసాలను విలీనం ఎలా చేయాలో వివరించగలరని నా మనవి. ----Nagaraju raveender 12:20, 5 ఏప్రిల్ 2009 (UTC)
వాహ్ ఉస్తాద్ వాహ్
[మార్చు]నాగరాజుగారూ! నమస్కారం, శాస్త్రీయ సంగీతం పట్ల మీ అభిరుచి బహుచక్కగా వున్నది, వాహ్, అభినందనలు. :-) అహ్మద్ నిసార్ 19:45, 6 ఏప్రిల్ 2009 (UTC)
- అహ్మద్ నిసార్ గారూ , మీరిస్తున్న ప్రోత్సాహానికి నా ధన్యవాదములు.--Nagaraju raveender 01:33, 7 ఏప్రిల్ 2009 (UTC) ---
- రవీందర్ గారూ! మీకు శాస్త్రీయ సంగీతం పట్ల అవగాహన ఉంటే, కర్ణాటక సంగీతం వ్యాసాన్ని ఓ పట్టు పట్టగలరా? ఈ వ్యాసాన్ని విశేష వ్యాసంగా చూడాలని నా ఆకాంక్ష. కానీ చాలా పదజాలం కొత్తగా ఉండటంతో విస్తరించలేకున్నాను. మీరు ఒకసారి వ్యాసాన్ని పరిశీలించగలరు.-- రవిచంద్ర(చర్చ) 04:47, 7 ఏప్రిల్ 2009 (UTC)
- ప్రయత్నిస్తాను రవిచంద్ర గారూ! ----Nagaraju raveender 12:36, 7 ఏప్రిల్ 2009 (UTC)
ఒక సలహా
[మార్చు]వికీ నుంచి బయటకు లింకులు ఇచ్చేటప్పుడు. ఈ విధానాన్ని పాటించండి.
[http://website/somelink లింకులో ఏముంది సంక్షిప్తంగా]
-- రవిచంద్ర(చర్చ) 06:39, 14 ఏప్రిల్ 2009 (UTC)
- ఇంకొక విషయం. ఆంగ్లవికీ వ్యాసాన్ని తెవికీ వ్యాసానికి మూలంగా చూపలేము. ఆంగ్లవికీలో ఉన్న మూలాలనే ఇక్కడా మూలాలుగా చూపవలసి ఉంటుంది. -- రవిచంద్ర(చర్చ) 06:49, 14 ఏప్రిల్ 2009 (UTC)
లాగిన్ కాకుండా చేసిన మార్పు
[మార్చు]నాగరాజు గారూ! మీరు లాగిన్ కాకుండా చేసిన మార్పును సూచిస్తూ చర్చ:బిర్జూ మహరాజ్లో ఒక గమనిక ఉంచాను. ఇది సరిపోవచ్చును. పెద్దగా పట్టించుకోనవసరం లేదనుకొంటాను. ఇలా లాగిన్ చేయకుండా గనుక ఏమయినా వ్రాస్తే, తరువాత మరొక చిన్న దిద్దుబాటు చేసి, అప్పుడు "సారాంశము"లో "ఇంతకు ముందు ఫలాని ఐ.పి. నుండి చేసిన మార్పు కూడా నాదే" అని వ్రాయడం ఒక మార్గం. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:10, 18 ఏప్రిల్ 2009 (UTC)
కృతజ్ఞతలు
[మార్చు]విభిన్నమైన వ్యాసాలను తెలుగు వికీలో చేర్చి అందరికీ పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఆళ్వారుల గురించి, రామానుజుల గురించి విన్నాను కానీ యమునాచార్యుల గురించి నేనెప్పుడూ వినలేదు. --వైజాసత్య 04:07, 22 ఏప్రిల్ 2009 (UTC)
గిటార్ బాన్సురి వ్యాసాలు
[మార్చు]ధన్యవాదాలు రవీందర్ గారూ. ఇవి మీకు ఇష్టమైన సబ్జెక్టులు, మీరూ కొంచెం చెయ్యి వెయ్యరాదూ. అహ్మద్ నిసార్ 18:24, 26 మే 2009 (UTC)
హైదరాబాదులో తెవికీ సమావేశం
[మార్చు]నాగరాజు రవీందర్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 05:45, 13 మార్చి 2013 (UTC)
భాస్కర్ ప్రైవేటు మెడికల్ కళాశాల వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]భాస్కర్ ప్రైవేటు మెడికల్ కళాశాల వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- దీనిని వ్యాసంగా పరిగణించలేము. 2009 నుండి మొలక. మూలాలు లేవు.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భాస్కర్ ప్రైవేటు మెడికల్ కళాశాల పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 16:04, 11 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 16:04, 11 మే 2020 (UTC)
అయ్యా ! నేను భాస్కర్ మెడికల్ కాలేజ్ గురించి ఏ వ్యాసం వ్రాయలేదు.అది ఏలా వచ్చిందో నాకే తెలియదు. దయచేసి దానిని తొలగించండి. 2405:201:C810:56EE:4546:266B:20A3:52A7 03:13, 12 మే 2020 (UTC)