వేప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ne:नीम
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sa:निम्बः
పంక్తి 75: పంక్తి 75:
[[pt:Neem]]
[[pt:Neem]]
[[ru:Ним (дерево)]]
[[ru:Ним (дерево)]]
[[sa:निम्बः]]
[[simple:Neem]]
[[simple:Neem]]
[[so:Geed Hindi]]
[[so:Geed Hindi]]

09:31, 24 ఏప్రిల్ 2012 నాటి కూర్పు

వేప
వేప చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Order:
Family:
Genus:
Azadirachta

వేప (ఆంగ్లం Neem) ఎన్నో సుగుణాలున్న చెట్టు.

వేప చెట్టు

వేప (లాటిన్ Azadirachta indica, syn. Melia azadirachta L., Antelaea azadirachta (L.) Adelb.) చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్త కు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిళ్ళు సమ శీతోష్ణ దేశాలయిన బంగ్లాదేశ్, భారతదేశం, మ్యాన్ మార్ , మరియు పాకిస్తాన్. ఇతరదేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాద్ డిరఖ్త (పర్షియ), డొగొన్ యార్లొ (నైజీరియా), మార్గోస, నీబ్ (అరబిక్), నిమ్ వృక్షము, నింబ (సంస్కృతము), వేపు, వెంపు, బేవు (కన్నడ), వెప్పం (తమిళము), ఆర్య వెప్పు (మళయాళము), భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో దీనినే మ్వారోబైని (కిస్వాహిలి) అంటారు. దీని అర్థం 'నలభై చెట్టు'. వేప నలభై వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు.

స్వరూపము

వేప త్వరత్వరగా పెరిగి, 15 నుంచి 20 మీటర్లు, కొన్ని సార్లు 35 నుంచి 40 మీటర్ల వరకు కూడా పెరగ గలిగే చెట్టు. ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే వేప తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలవరకు ఆకులను రాల్చుతుంది. దీని కొమ్మలు బాగా విస్తరించి ఉంటాయి. దట్టంగా ఉండే దీని శీర్షం గుండ్రంగా లేదంటే కోడి గుడ్డు ఆకారంలో ఉండి బాగా స్వతంత్రంగా పెరిగిన చెట్లలో 15 నుంచి 20 మీటర్ల వ్యాసం వరకు ఉంటుంది.

మొత్తం మీద చూస్తే కాండము కురచగా నిటారుగ ఉండి, 1.2 మీటర్ల వ్యాసం వరకు పెరుగుతుంది. బెరడు గట్టిగా, పగుళ్ళతో లేక పొలుసులతో ఉండి, పాలిపోయిన బూడిదరంగు లేక ఎరుపుకలసిన ఊదా రంగులో ఉంటుంది. బెరడు వెనుకనుండే చెక్క (sapwood) బూడిదరంగు కలసిన తెలుపులోను ఉంటుంది. చెట్టుకు మధ్యన ఉన్న చెక్క (heartwood) గాలి తగలక ముందు ఎర్రగా ఉండి, క్రమేపి ఎరుపు కలసిన ఊదారంగులోకి మారుతుంది. వేరు వ్యవస్థలో బలమైన తల్లివేరు, బాగా అభివృద్ధిచెందే మిగిలిన వేళ్ళూ ఉంటాయి.

20-40 సెం.మీ. పొడవైన రెమ్మలు, వాటికి అటు-ఇటు 20-31 ఒక మాదిరినుండి, ముదురు ఆకుపచ్చ రంగు గల 3-8 సెం.మీ. పొడవైన ఆకులు కలిగి ఉంటుంది. ఈ రెమ్మలలో చివరి ఆకు చాలా తక్కువగా ఉంటుంది. ఆకుల తొడిమెలు చిన్నవిగా ఉంటాయి. లేత ఆకులు ఎర్రాకుపచ్చ(ఎరుపు, ఊదారంగుల మధ్య)రంగులో ఉంటాయి. ముదురు ఆకుల అంచులు నొక్కులు, నొక్కులుగా ఉంటాయి. ఈ నొక్కులు ఆకు తొడిమె నుండి కొంత దూరం తరువాత మొదలవుతాయి. ఆకులు ఈనెకు అటు-ఇటు సమానంగా ఉండవు (asymmetric).

ఉపయోగాలు

వేపకాయ
  • భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు.
  • వేపపువ్వు ను హిందువులు (ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు)ఉగాది పచ్చడి లో చేదు రుచికోసం వాడతారు.
  • వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.
  • వేపనూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది.
  • వేపనూనె ను క్రిమిసంహారి గా కూడా ఉపయోగిస్తారు. ఈ నూనెను వేపగింజల నుండి తయారు చేస్తారు.
  • అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు.
  • వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు.
  • ఈ చెట్టు నుండి లభించే కలప, తక్కువ ధరలో తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు.
"https://te.wikipedia.org/w/index.php?title=వేప&oldid=713882" నుండి వెలికితీశారు